సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

బాబాకు సమర్పించిన దక్షిణ చేసిన మేలు



ఒకప్పుడు ఔరంగాబాదుకి చెందిన ఒక సాయిభక్తునిపై ఎవరినో గాయపరిచాడనే నేరం ఆరోపించబడి పోలీసు వారెంట్ దాఖలైంది. దాంతో అతను 800 రూపాయలతో శిరిడీ చేరి, బాబా పాదాల చెంత ఆశ్రయం పొందాడు. అతను దీక్షిత్ వాడాలో బస చేసి, సగుణమేరు నాయక్ హోటల్లో భోజనం చేస్తూ ప్రతిరోజూ బాబా దర్శనం చేసుకుంటుండేవాడు. బాబా అతనిని ప్రతిసారీ 100 రూపాయలు దక్షిణ అడుగుతుండేవారు, అతను సమర్పిస్తూండేవాడు. తొందరలోనే అతని వద్ద ఉన్న డబ్బు అయిపోవడంతో వెయ్యిరూపాయలు కావాలని తన సోదరునికి జాబు వ్రాయమని సగుణమేరు నాయక్‌తో చెప్పాడు. ఆ జాబు అందుకున్న అతని సోదరుడు డబ్బుతో వచ్చి, బాబా దర్శనం చేసుకొని తన సోదరునికి డబ్బిచ్చి తిరిగి వెళ్లిపోయాడు. బాబా అతని వద్దనుంచి ఆ వెయ్యిరూపాయలు కూడా దక్షిణగా తీసేసుకున్నారు. ఇక అతని వద్ద పైసా కూడా లేదు. అంతలో అతను శిరిడీలో ఉన్నట్లు పోలీసులకి తెలిసి వారెంట్‌తో వచ్చి అతని కోసం గాలించసాగారు. ఈ విషయం ఆ భక్తునికి తెలిసి పరుగెత్తుకుంటూ మసీదుకి వెళ్లి బాబా ముందు కూర్చున్నాడు. పోలీసులు తమ విధులననుసరించి అతనిని గాలిస్తూ గాలిస్తూ మసీదుకి వచ్చారు. ఆశ్చర్యం! అతను బాబా ముందరే కూర్చొని ఉన్నప్పటికీ పోలీసులు అతన్ని చూడలేకపోయారు. దాంతో వాళ్ళు అక్కడినుండి వెళ్లిపోయారు. వాళ్ళు అలా వెళ్ళిపోగానే ఆ భక్తుడు బాబా పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు బాబా అతనితో, “నీ కష్టాలు ముగిశాయి. రేపు భోజనం చేసిన తరువాత నువ్వు ఇంటికి వెళ్లిపోవచ్చు” అని చెప్పారు. మరుసటిరోజు అతనిని నిర్దోషిగా ప్రకటిస్తూ ఒక లేఖ అతనికి చేరింది. అతను బాబాకు కృతజ్ఞతలు తెలుపుకొని, వారివద్ద సెలవు తీసుకొని సంతోషంగా తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. తరువాత అతను చాలా డబ్బు సంపాదించాడు. అతను బాబాకు సమర్పించిన దక్షిణ అతనికి మానసిక వేదన నుంచి ఉపశమనాన్ని, రక్షణను మరియు తరువాత కాలంలో మంచి ఆదాయాన్ని ప్రసాదించింది.

సమాప్తం...

మూలం: అంబ్రోసియా ఇన్ శిరిడీ బై విన్నీ చిట్లూరి.

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo