సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

బాబూరావు ఔరంగాబాద్‌కర్



శిరిడీ యాత్రలోని ప్రత్యేకత ఏమిటంటే, ఎవరైనా బాబా అనుమతి లేకుండా తమ ఇంటికి తిరుగు ప్రయాణమైనా లేదా బాబా అనుమతి ఇచ్చిన తరువాత కూడా శిరిడీలో ఉన్నా తమకు తామే అనుకోని కష్టాలను ఆహ్వానించుకోవడమే. మరొకవైపు, బాబా సలహాననుసరించి వారు చెప్పిన సమయానికి బయలుదేరిన సందర్భాలలో (ఉదా: రైలు వేళ మించిపోతున్నప్పటికీ బాబా చెప్పినట్లు భోజనం చేశాకే బయలుదేరడం) భక్తులు ఆలస్యమైనట్లు కనిపించినప్పటికీ బాబా అనుగ్రహంతో పరిస్థితులు అనుకూలంగా మారి, భక్తులకు ప్రమాదాలు తప్పిపోవడం, వేళకాని వేళలో రైలు అందుకొని సౌకర్యవంతమైన ప్రయాణాన్ని సాగించడం జరిగేది. ఇటువంటి అనేక లీలలు శ్రీసాయిసచ్చరిత్రలో ఇవ్వబడ్డాయి. అటువంటి వాటిలో బాబా అనుమతి లేకుండా తన ఇంటికి తిరుగు ప్రయాణమైన ఒక భక్తుని అనుభవం:

బాబా సశరీరులుగా ఉండగా వారిని దర్శించిన భాగ్యవంతుడు బాబూరావు ఔరంగాబాద్‌కర్. ఒకసారి అతను శిరిడీ వెళ్లి బాబాను దర్శించుకున్నాడు. తరువాత ఇంటికి తిరిగి వెళ్ళడానికి బాబాను అనుమతి అడిగితే, బాబా అనుమతించలేదు. అయినా అతను పదేపదే అనుమతినిమ్మని అడుగుతూ బాబాను విసిగించసాగాడు. చివరికి బాబా అతనితో, "నీకు నచ్చినట్లే చేయి. జరిగే పరిణామాలకు నేను బాధ్యుడిని కాను" అని అన్నారు. అతను బాబా మాటలను సరిగా అర్థం చేసుకోక బాబా తన ప్రయాణానికి అనుమతించినట్లుగా భావించి ఆత్రంగా శిరిడీ నుండి బయలుదేరాడు. ఒక మైలు దూరం ప్రయాణించేవరకు వాతావరణమంతా బాగానే వుంది. ఆపైన భీకరమైన తుఫాను ప్రారంభమైంది. దాంతో అతను నడిమధ్యలో చిక్కుకుపోయాడు. వర్షానికి తడిసిపోయి నిలువ నీడలేక, తినడానికి తిండిలేక చలికి వణుకుతూ ఒంటరిగా గడపవలసి వచ్చింది. మరుసటిరోజు మాత్రమే అతను అక్కడినుండి ముందుకు సాగగలిగాడు. ఆ అనుభవం ద్వారా అతను బాబా మాట జవదాటినందుకు తగిన గుణపాఠం నేర్చుకున్నాడు.

సోర్సు: అంబ్రోసియా ఇన్ శిరిడీ బై విన్ని చిట్లూరి.

9 comments:

  1. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai🙏🙏🙏

    ReplyDelete
  2. జై సాయిరాం! జై గురుదత్త!

    ReplyDelete
  3. 🙏🙏🙏Om srisairam Om srisairam Om srisairam thank you sister.

    ReplyDelete
  4. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha ❤🙏🕉😊

    ReplyDelete
  5. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  6. Om Sai Sree Sai Jaya Jaya Sai

    ReplyDelete
  7. Om shri sachidhanda sadguru sainath Maharaj ki Jai



    ReplyDelete
  8. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo