- ప్రేమతో ఎంతగానో అనుగ్రహించిన బాబా
- అనుభవాన్ని పంచుకున్నంతనే ఆస్తి రిజిస్ట్రేషన్ జరిపించిన బాబా
ప్రేమతో ఎంతగానో అనుగ్రహించిన బాబా
విశాఖపట్నం నుండి సాయిభక్తుడు ఎస్.పరశురాము తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
సాయిభక్తులకు నమస్కారం. నా పేరు పరశురాము. మాది విశాఖపట్నం. ఇంతకుముందు బాబా నాకు ప్రసాదించిన అనుభవాన్ని మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవాన్ని పంచుకోబోతున్నాను.
మా ఊరికి 30 కిలోమీటర్ల దూరంలోని మరో గ్రామంలో మాకు కొంత వ్యవసాయ భూమి ఉంది. అక్కడికి వెళ్లే దారిలో ఒక కొండపైన సాయిబాబా మందిరం ఉంది. నేను మా పొలానికి వెళ్ళేటప్పుడుగానీ లేదా వచ్చేటప్పుడుగానీ అప్పుడప్పుడు ఆ మందిరానికి వెళ్లి బాబా దర్శనం చేసుకుని వచ్చేవాడిని. ఒకరోజు ఉదయం నా స్నేహితునితో కలిసి మా పొలానికి వెళుతున్నప్పుడు మందిరం వద్దకు రాగానే, “ఒక్కసారి బాబా గుడికి వెళదాము” అని అన్నాను. అందుకు నా స్నేహితుడు, “ఇప్పుడు కాదు, తిరిగి వచ్చేటప్పుడు వెళదాం” అంటూ నన్ను నేరుగా పొలానికి తీసుకెళ్ళాడు. తిరుగు ప్రయాణంలో, సరదాగా హోటల్లో మాంసాహారం తిందామని నా స్నేహితుడు పట్టుబట్టేసరికి నేను అంగీకరించాను. ఇద్దరం హోటల్లో మాంసాహారం భుజించి ఇంటికి బయలుదేరాము. మందిరం దగ్గరకు రాగానే నేను నా స్నేహితునితో, “ఉదయం గుడికి వెళ్ళలేదు కదా! ఇప్పుడు వెళ్లి బాబా దర్శనం చేసుకొని, కొంతసేపు అక్కడే గడిపి తరువాత ఇంటికి వెళదాం” అని చెప్పి గుడికి వెళ్లే మార్గంలోకి బండిని మళ్ళించాను. మందిర ముఖద్వారాన్ని (ఆర్చి) దాటాము. ఇంతలో ఏమైందో తెలియదు, ఒక్కసారిగా బండి ప్రక్కకు పడిపోయింది. నేను క్రింద పడబోతుండగా ఎవరో నన్ను చెయ్యి పట్టుకుని ప్రక్కకు నెట్టినట్లుగా అనిపించింది. అంతలోనే నేను స్పృహ కోల్పోయాను. నాకు దెబ్బలేమీ తగల్లేదుగాని నా స్నేహితునికి దెబ్బలు తగిలాయి. మాకు సహాయం చేయడానికి సమీపంలో ఎవ్వరూ లేరు. తనే నన్ను పట్టుకుని గట్టిగా కుదుపుతూ, “అసలేమైంది? బండి పడిపోయింది. నాకు దెబ్బలు తగిలాయి. నీకు ఏమైందో చెప్పు?” అంటూ నన్ను లేపాడు. దాంతో నాకు స్పృహ వచ్చి కళ్ళు తెరచి నా స్నేహితుడిని చూసి ఆశ్చర్యపోతూ, “ఏమైంది? ఈ దెబ్బలేమిటి? నన్ను చెయ్యి పట్టుకుని ప్రక్కకు నెట్టింది ఎవరు?” అని తనను ప్రశ్నించాను. “ఇక్కడ ఎవ్వరూ లేరు. మనం ఎందుకు పడిపోయామో నాకే తెలియటం లేదు. ఉదయం నువ్వు బాబా గుడికి వెళదామంటే నేను వద్దన్నాను. ఇప్పుడేమో హోటల్లో మాంసాహారం భుజించి గుడికి వెళ్ళబోయాము. అందుకే ఇలా జరిగిందేమో! ఉదయం నేను గుడికి వద్దన్నాను, అందుకే నాకు ఈ దెబ్బలు. నీకు మాత్రం ఏమీ కాలేదు. అందుకే ఇప్పుడు వద్దు, మరోరోజు గుడికి వద్దాము” అని చెప్పి నన్ను మందలించాడు. తరువాత ఇద్దరం కలిసి ఇంటికి వచ్చేశాము.
నెలరోజుల తరువాత ఒకరోజు అర్జంటుగా మళ్ళీ పొలానికి వెళ్లవలసివచ్చి కంగారుగా బయలుదేరి బండి దగ్గరకు వచ్చాను, ఇంతలో నా భార్యతో పాటు మా ఇంట్లోవాళ్ళు నా దగ్గరకు వచ్చి, “ఈరోజు మీ పెళ్లిరోజు, నీకు గుర్తు లేదా?” అని అన్నారు. “అయ్యో, ఇప్పుడెలా? అవతల అర్జంటు పని వుంది” అని వాళ్ళతో చెప్పాను. ఇంతలో మావాళ్ళు పువ్వులు, కొబ్బరికాయ ఉంచిన ఒక కవరు తెచ్చి, “త్రోవలో ఉన్న బాబా మందిరానికి ఈరోజు వెళ్తావు కదా” అని చెప్పి ఆ కవరును నాకు ఇచ్చారు. తరువాత నేను నా అర్జెంటు పని చూసుకుని బాబా గుడి దగ్గరకు వస్తూ, “ఇప్పుడు సమయం మధ్యాహ్నం ఒంటిగంట అయింది. ఈ సమయంలో గుడి మూసేస్తారు. అందువల్ల ఫ్రెండ్ వద్దకు వెళ్ళి కాసేపు గడిపి గుడి తెరిచే వేళకు వద్దాం” అనుకుని మా ఫ్రెండ్ షాపు వద్దకు వెళ్ళి నా ఫ్రెండుకి విషయం చెప్పాను. అందుకతను, “ఈరోజు మన ఫ్రెండ్స్ అంతా బాబా గుడి దగ్గరున్న మామిడితోటలో భోజనాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు అందరూ అక్కడే ఉన్నారు. అందరికీ భోజనం అక్కడే” అని చెప్పాడు. ఇంతలో అక్కడకు రమ్మని కబురు వచ్చింది. నన్ను కూడా రమ్మని పిలిచారుగాని నేను ముందు బాబా దర్శనానికి వెళ్తానని, వెంటనే బయలుదేరి నేరుగా బాబా గుడి వద్దకు వెళ్ళాను. గుడికి తాళం వేసివుంది. కాళ్ళు, చేతులు కడుక్కుని గుడి ముందున్న గేటు వద్ద నేను తెచ్చిన కొబ్బరికాయను కొట్టి, మనసులోనే బాబాకు నమస్కరించుకుని అక్కడే కూర్చున్నాను. ఇంతలో పూజారి వచ్చి నన్ను చూసి, “ఇక్కడున్న పూజసామాగ్రి ఎవరివి?” అని అడిగారు. ‘అవి నావే స్వామీ!’ అంటూ వెళ్లి వాటిని చేతిలోకి తీసుకున్నాను. పూజారి గుడి తలుపు తీసి, “లోపలికి రండి, బాబా మీ కోసమే నన్ను వెనక్కు పిలిచారు” అంటూ నన్ను లోపలికి తీసుకుని వెళ్లి, బాబాకు పూజ చేసి, ఎవరితోనో ఒక ఆకుని తెప్పించి, బాబా పాదాల వద్ద ఉంచిన నైవేద్యాన్ని, అక్కడ ఉన్న మిగిలిన ప్రసాదాలను తీసి ఆ ఆకులో పెట్టి, “బాబా కోసం ప్రేమతో వండి తెచ్చినవాళ్లకు దక్కని ప్రసాదం ఈరోజు నీకు దక్కింది. బయట ఎండ ఎక్కువగా ఉంది. అందువల్ల ఇక్కడే కూర్చుని ప్రశాంతంగా బాబా ప్రసాదం తిని ఇక్కడే ఉండు. ఈరోజు బాబా అనుగ్రహం నీపై సంపూర్ణంగా ఉంది” అని చెప్పి ఆ ప్రసాదాన్ని, ఒక పాత్రలో మంచినీళ్ళని నా చేతిలో పెట్టి గుడికి తాళం వేసి వెళ్లిపోయారు. ఇంతలో మళ్ళీ ఎవరో వచ్చి, “నీకు నేను తోడున్నాను. నా డ్యూటీ ఇక్కడే. ఏం ఫరవాలేదు, కొంతసేపు ఇక్కడే పడుకో!” అని చెప్పి అక్కడున్న తన ఆఫీసులో నేను పడుకోవటానికి ఏర్పాటు చేశారు. నన్ను ఇంతగా అనుగ్రహించిన బాబా ప్రేమకు చెప్పలేని ఆనందంతో మనసారా బాబాకు కృతజ్ఞతలు అర్పించుకున్నాను. బాబా ప్రసాదం స్వీకరించిన తరువాత అక్కడే విశ్రాంతి తీసుకుంటూ, బాబా లీలలను స్మరించుకుంటూ అంతులేని సంతోషంలో మునిగిపోయాను.
గమనిక: మనం ఒక పరిధిలో ఆలోచించి కొన్ని అనుకుంటాం. కానీ వాస్తవమెప్పుడు మన ఊహకు అతీతంగా ఉంటుంది. మాంసం తిన్నంత మాత్రాన ఆయన తమ దర్శనానికి రానివ్వకుండా చేసే ప్రశ్నేలేదు. ఎందుకంటే బాబా స్వయంగా మాంసాహారాన్ని వండి, భక్తులకు వడ్డించారు. ఇకపోతే, ఉదయం గుడికి వెల్దామంటే ఆపినందుకు దెబ్బలు తనకి తగిలాయని అనుకోవడమూ సమంజసం కాదు. ఎందుకంటే, బిడ్డలు అజ్ఞానంతో చేసే పనులకు తండ్రి ఎప్పుడైనా శిక్షిస్తాడా? కాబట్టి కర్మానుసారం ఏదో పెద్ద ప్రమాదమే జరగాల్సి ఉండొచ్చు. దయామయములైన సాయి అదృశ్య రూపాన కిందకి పడబోయే సమయంలో బండి నడుపుతున్న అతని చేయి పట్టుకొని పక్కకి నెట్టి పెద్ద ప్రమాదం జరగకుండా కాపాడి ఉండొచ్చు. లేదా అంతకు మించిన కారణమే ఉండొచ్చు. అది ఆ సద్గురు సాయినాథునికే ఎరుక!
అనుభవాన్ని పంచుకున్నంతనే ఆస్తి రిజిస్ట్రేషన్ జరిపించిన బాబా
పేరు వెల్లడించని ఒక సాయిభక్తుడు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:
సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి చాలా ధన్యవాదాలు. నేను మొదటిసారి నా అనుభవాన్ని మీతో పంచుకున్న రెండవరోజే మా ఆస్తి రిజిస్ట్రేషన్ జరిగింది. నిజంగా ఇది బాబా చేసిన చమత్కారం. సమస్యలు ఉన్నప్పటికీ మా స్థలం కొనాలనుకున్న ఆయన (ఆయన కూడా బాబా భక్తుడే) ఆస్తిని రిజిస్టర్ చేయమని అడిగారు. బాబానే అతనితో అలా చెప్పి చేయించారని ఎంతో ఆనందించాము. మమ్మల్ని మోసం చేసినవారిని ధైర్యంగా ఎదుర్కొనేలా చేశారు బాబా. ఆ సమస్యలు కూడా త్వరగా పరిష్కారం కావాలని బాబాను కోరుకుంటున్నాను. “మా మీద నమ్మకంతో రిజిస్టర్ చేయించుకున్నవారికి ఎలాంటి ఇబ్బందులూ కలుగకుండా చూడు బాబా. మా సమస్యలన్నీ తొందరగా పరిష్కారమై అప్పులన్నీ తీరేలా అనుగ్రహించు బాబా. అన్ని సమస్యలూ తీరిన తర్వాత ఆ అనుభవాలను ఈ బ్లాగులో పంచుకుంటాను. నీ మీదే పూర్తి నమ్మకం పెట్టుకుని ఉన్నాం, మమ్మల్ని కాపాడు బాబా!”
Om sai ram yesterday my hole family spend very happily. This is your blessings sai i believe in you. You can do anything that is your power sai
ReplyDeleteజై సాయిరాం! జై గురుదత్త!
ReplyDeleteOm Sai ram
ReplyDeleteOm sairam
ReplyDelete🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏
ReplyDeleteఓం సాయిరాం!!ఓం సాయిరాం!!
🌟🌷🌟🌷🌟🌷🌟🌷🌟🌷🌟
Baba amma problem tondarga cure cheyi thandri pleaseeee
ReplyDelete