- నేను ఎప్పుడూ నీ వెంటే ఉన్నాను
- బాబా ఊదీతో తెల్లవారేసరికి 80% తగ్గిన చేతినొప్పి
నేను ఎప్పుడూ నీ వెంటే ఉన్నాను
బాబా భక్తకోటి అందరికీ నా నమస్కారం. నా పేరు అంజలి. నేను విద్యుత్ విభాగంలో ఉద్యోగం చేస్తున్నాను. ప్రతినెలా మొదటివారంలో నేను నా ల్యాప్‌టాప్‌లో మా కార్యాలయానికి సంబంధించిన రీడింగులు తీయాలి. ఆ పనిమీద నేను ఇంతకుముందు పనిచేసిన సబ్‌స్టేషన్‌కి వెళ్ళాను. అక్కడ కొన్ని మీటర్ల రీడింగ్ రాలేదు. నేను సహాయం కోసం బాబాను తలచుకుంటే, 'అవి వస్తాయ'ని చెబుతున్నట్లు నా మనసుకి అనిపించింది. కానీ ఎంత ప్రయత్నించినా రాలేదు. ఇంక నేను తిరిగి వెళ్ళిపోయాను. తరువాత గురువారంనాడు నేను బాబా వ్రతం చేసుకొని ఆఫీసుకి వెళ్ళాను. రీడింగులు తీయడానికి వేరే వాళ్ళ ల్యాప్‌టాప్ తెప్పించారు. కానీ ఆ ల్యాప్‌టాప్‌లో కూడా చాలాసేపు రీడింగులు రాలేదు. ఇంక ల్యాప్‌టాప్ క్లోజ్ చేద్దామనుకునే సమయంలో వేరే మేడం ఫోన్ చేసి, "వేరే పద్ధతిలో ఒకసారి ప్రయత్నించి చూడండి" అని చెప్పారు. బాబానే ఆమెతో చెప్పించారేమో! ఆ పద్ధతిలో ప్రయత్నిస్తే వెంటనే రీడింగులు వచ్చాయి. సరేనని నా వద్దనున్న ల్యాప్‌టాప్‌లో కూడా ప్రయత్నిస్తే, అందులో కూడా వచ్చాయి. బాబా మాట అబద్ధమెలా అవుతుంది? కొంచెం ఆలస్యమైంది అంతే!
21, జనవరిలో మావారి వస్తువు ఒకటి కనపడకుండా పోయింది. అది మా అమ్మావాళ్ళింట్లో ఎక్కడో మిస్ అయ్యింది. దానికోసం చాలా వెతికాం కానీ, కనపడలేదు. దాంతో నేను బాబానే శరణువేడి, "ఎలాగైనా ఆ వస్తువు దొరికేలా చేయి తండ్రీ" అని ప్రార్థించాను. తరువాత మా అమ్మ ఇల్లంతా వెతికింది, అయినా కనపడలేదు. అది జరిగి చాలారోజులు గడిచాక ఫిబ్రవరి 4, గురువారంనాడు మా అమ్మ ఫోన్ చేసి, "వస్తువు దొరికింద"ని చెప్పింది. అమ్మ మాట విని చాలా సంతోషించాను. ఎందుకంటే, బాబాను వేడుకున్నా వస్తువు దొరక్కపోయేసరికి నేను, 'ఏంటి, బాబా నన్ను సరిగా పట్టించుకోవటంలేదా?' అని కొంచెం బాధపడ్డాను. కానీ, 'నేను ఎప్పుడూ నీ వెంటే వున్నాను' అని నిరూపించారు నా సాయితండ్రి. "థాంక్యూ సో మచ్ బాబా".
సబ్ కా మాలిక్ ఏక్ హై!
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
బాబా ఊదీతో తెల్లవారేసరికి 80% తగ్గిన చేతినొప్పి
సాయిభక్తులందరికీ నా నమస్కారం. నా పేరు సౌజన్య. మేము అమెరికాలో నివసిస్తున్నాము. నా చిన్నతనంనుండి నాకు బాబా అంటే చాలా ఇష్టం. నా సాయితండ్రి నన్ను ఎల్లవేళలా కాపాడుతూ ఉన్నారు. చాలారోజుల తర్వాత మావారు క్రికెట్ ఆడటానికి వెళ్ళినప్పుడు అక్కడ అనుకోకుండా తన చేతికి గాయం అయింది. రాత్రయ్యేసరికి ఆ గాయం మరింత ఎక్కువై విపరీతమైన నొప్పితో బాధపడ్డారు. కనీసం ఆ చేతిని పైకి లేపలేకపోయారు. ఆ రాత్రికి హాస్పిటల్‌కి వెళ్ళలేక, మరుసటి ఉదయం అర్జెంట్ కేర్‌కి వెళ్తానన్నారు. (అమెరికాలో అనుకున్నంత త్వరగా హాస్పిటల్‌కి వెళ్ళలేము.) పైగా నాకు కారు డ్రైవింగ్ రాదు. మావారిని నేను కనీసం హాస్పిటల్‌కి కూడా తీసుకెళ్ళలేను. అది కరోనా సమయం కాబట్టి ఎవరినీ సహాయం అడగలేము. అందువలన నేను బాబాకు నమస్కరించి, మావారు పడుతున్న బాధను వివరించి, “ప్లీజ్ బాబా! మావారి నొప్పిని తగ్గించండి. తెల్లవారేసరికి తన నొప్పి తగ్గేలా చూడండి” అని బాబాను వేడుకున్నాను. తరువాత కొద్దిగా బాబా ఊదీని నీళ్ళలో కలిపి మావారికి ఇచ్చి, కొంచెం ఊదీని ఆ గాయం పైన రాశాను. నా సాయితండ్రి నా బాధను అర్థం చేసుకున్నారు. తెల్లవారేసరికి మావారి చేతినొప్పి 80% తగ్గింది. అది కేవలం నా బాబా అనుగ్రహమే. ఏమని చెప్పను నా సంతోషాన్ని? నా బాబాపై ఇష్టం, ప్రేమ ఇంకా బలపడ్డాయి. ”లవ్ యు బాబా! థాంక్యూ సో మచ్ బాబా. నీకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే”.
Om Sairam
ReplyDeleteSai always be with me
654 days
ReplyDeleteSairam
Sab ka malik ek hya. I like this line. Sarvaa swarupaya namah. Om sai ram
ReplyDeleteOm sai ram baba amma arogyam bagundali thandri
ReplyDeleteOM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH..Om Sai Ram
ReplyDelete