ఈ భాగంలో అనుభవాలు:
- సాయినాథుడు నమ్ముకున్నవారిని ఎల్లప్పుడూ చల్లగా చూస్తారు
- మరచిపోయినా గుర్తుచేసి నైవేద్యం పెట్టించుకున్న బాబా
సాయినాథుడు నమ్ముకున్నవారిని ఎల్లప్పుడూ చల్లగా చూస్తారు
దుబాయ్ నుండి పేరు వెల్లడించని ఒక సాయి భక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
సాయిబంధువులకు నా నమస్కారం. మేము దుబాయిలో ఉంటున్నాము. నా చిన్నప్పటినుండి నేను బాబాకు భక్తురాలిని. బాబా ఎల్లప్పుడూ తండ్రిలా నన్ను ఆదుకుంటూనే ఉన్నారు. అలాంటి ఎన్నో అనుభవాలలో ఒకదానిని ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
ఇటీవలి కాలంలో కరోనా ప్రతి ఒక్కరి జీవితాన్ని ఎంతో భయాందోళనలకు గురిచేసింది. ఆ కరోనా భయం నుండి బయటపడినవారిలో మేము కూడా ఉన్నాము. 2020, మే నెలలో మావారికి ఒళ్ళునొప్పులతో పాటు కొద్దిగా జ్వరం కూడా వచ్చింది. ఆయనకి జ్వరం వచ్చిన మరుసటిరోజు మా అమ్మకి కూడా అచ్చం మావారికి వచ్చినట్లుగానే జ్వరం వచ్చింది. ఆ తరువాత నాకు కూడా జ్వరం వచ్చింది. ఇలా మా ముగ్గురికీ ఒకే లక్షణాలతో జ్వరం వచ్చింది. బాబా దయవల్ల మా బాబు ఒక్కడూ ఈ బాధనుండి తప్పించుకున్నాడు. రెండు మూడు రోజుల తరువాత మేము ముగ్గురం నార్మల్ అయ్యాము. కానీ మేమంతా రుచి, వాసన కోల్పోయాము. ఆ లక్షణాలను చూసి మాకు చాలా భయమేసింది. దాంతో ముందుగా మావారు కోవిడ్ టెస్ట్ చేయించుకోవటానికి వెళ్ళారు. మా ప్రక్కింటివాళ్ళు మాతో చాలా సన్నిహితంగా ఉండటం వల్ల వాళ్ళు కూడా మాలాగే ఇబ్బందిపడ్డారు. మేమంతా మావారి టెస్ట్ రిజల్ట్ ఏమి వస్తుందా అని ఎదురుచూడసాగాము. మూడు రోజులైనా తన టెస్ట్ రిపోర్టు రాకపోయేటప్పటికి తనకి కోవిడ్ నెగిటివ్ అయివుంటుందని మేమంతా రిలాక్స్ అయిపోయాము. ఉన్నట్టుండి ఒకరోజు మావారికి కోవిడ్ పాజిటివ్ అని టెస్టింగ్ సెంటర్ నుండి కాల్ వచ్చింది. ఆ వార్త విని ఏం చేయాలో, ఎలా ప్రతిస్పందించాలో తెలియని గందరగోళంలో పడ్డాము మేము. మా మూలంగా మా ప్రక్కింటివాళ్ళు కూడా ఇబ్బందిపడుతున్నారని చాలా బాధపడ్డాము. నేను బాబాను స్మరించుకుని, “బాబా! తొందరగా ఈ విపత్తు నుండి మమ్మల్ని బయటపడెయ్యి తండ్రీ. ఇండియా వచ్చాక మా కుటుంబమంతా కలిసి నీ దర్శనానికి శిరిడీ వస్తాము” అని మ్రొక్కుకున్నాను. మరుసటిరోజు నేను, మా పిల్లలు, ఇంకా మా ప్రక్కింటివాళ్ళు అందరం కోవిడ్ టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళాము. నేను, పిల్లలు టెస్ట్ కోసం శాంపిల్స్ ఇచ్చి ఇంటికి వచ్చాక మావారు నాతో, “నన్ను క్వారంటైన్ సెంటరుకి తీసుకెళ్తామని కాల్ చేశారు” అని చెప్పారు. నేను, మావారు ఆరోజు ఎంతగా ఏడ్చామో! ‘నిజంగా జీవితంలో ఇలాంటి పరిస్థితి ఇంక ఎప్పుడూ రాకూడదు, ఒక్కసారి అన్నీ మారిపోతే బాగుండు’ అనుకుంటూ ఎంతో ఏడ్చాము. నేను, పిల్లలు ఎలా ఉంటామోనని ఆయన ఎంతగానో బాధపడ్డారు. కాసేపటికి క్వారంటైన్ సెంటర్ వాళ్ళు వచ్చి మావారిని తమతో తీసుకెళ్ళారు. ‘మావారికి అక్కడ ఎలా ఉంటుందో’ అని నేను ఎంతో దిగులుపడుతూ ఉన్నాను. ఒక రెండు గంటలు గడిచాక మావారు నాకు ఫోన్ చేసి, “క్వారంటైన్ సెంటర్లో బెడ్స్ ఖాళీ లేవట, నన్ను ఇంటికి తిరిగి తీసుకొస్తున్నారు” అని చెప్పారు. ఆ మాట విని పట్టలేని ఆనందంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. నా బాబా మాతోనే ఉన్నారు, ఉంటారు. మనందరికీ ఇదే పెద్ద అనుభవం. తరువాత మావారు ఇంటికి వచ్చి సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నారు. తరువాత మావి, మా ప్రక్కింటివాళ్ళవి టెస్ట్ రిపోర్టులు వచ్చాయి. నాకు, పిల్లలకి నెగిటివ్ వచ్చింది. మా ప్రక్కింటివాళ్ళలో కూడా ఒకరికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. మిగతా అందరికీ నెగిటివ్ వచ్చింది. కానీ, పాజిటివ్ వచ్చినాయనకి డయాబెటిస్ ఉండటం వల్ల మేము కాస్త భయపడ్డాము. కానీ బాబా అనుగ్రహంతో మావారికి, ఆయనకి కూడా ఒక నెలరోజుల్లో కోవిడ్ నెగిటివ్ వచ్చింది. ఎంతో సంతోషంతో అందరం బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాము.
సాయినాథుడు మమ్మల్ని ఇంతటి విపత్తు నుండి కాపాడినందుకు కృతజ్ఞతగా ఇప్పుడు నేను, మా ప్రక్కింటావిడ ప్రతి పౌర్ణమికి ఒక్కొక్కరి ఇంట్లో బాబా వ్రతం చేసుకుంటున్నాము. సాయినాథుడు తనను నమ్ముకున్నవారిని ఎల్లప్పుడూ చల్లగా చూస్తారు. అనుక్షణం బాబాను స్మరిస్తే ఆయన మనతోనే ఉంటారు.
ప్రస్తుతం నేను గత 3 నెలలుగా కాలినొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్ సలహా మేరకు ఎక్స్-రే తీయించుకుంటే అందులో అంతా నార్మల్‌గా ఉంది. కానీ కాలినొప్పి ఏమాత్రం తగ్గకపోయేసరికి MRI స్కాన్ చేయించుకోమని డాక్టర్ సూచించారు. నేను ఆ టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళాలి. ఆ టెస్ట్ చేసే సమయంలో నా బాబా నాకు తోడుగా ఉండి అంతా మంచిగా ఉండేలా చూసుకుంటారని ఆశిస్తున్నాను. బాబా అనుగ్రహంతో అంతా బాగున్నాక ఆ అనుభవాన్ని కూడా మీతో పంచుకుంటాను. “తెలిసీ తెలియక ఏమైనా తప్పులు చేస్తే నన్ను మన్నించు బాబా!”
2 sai leelas are very nice sai. 2nd one I liked it. Sai please change me please make me think positively. I am doing sin please reduce my depression. Be with me and bless me. Om sai baba������
ReplyDeleteసాయి నీ లీలలు అమోఘం అపురూపం అనిర్వచనీయం. ఏ విధంగా తీర్చుకోగలం అయ్యా నీ రుణం. నీ సహాయం లేని క్షణం మేము ఊహించుకోలేం .సదా మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ తండ్రి
ReplyDeleteOm sairam 🙏🙏🙏
ReplyDeleteజై సాయిరాం! జై గురుదత్త!
ReplyDeleteOm sai ram baba amma ki problem tondarga cure cheyi baba
ReplyDeleteOm Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha ❤🕉🙏😊
ReplyDeleteBaba Bless me with a good, healthy, luckiest beautiful child.. please baba.. help me throughout my delivery and throughout my life.. bless my husband to get good job with more than 7 LPA package.. bless my MIL and FIL with good health, healthy relationship. Bless my amma nanna with good health and prosperity. Please help my brother to get marry soon and to live happy life forever and ever.. Om Sairam. And please bless all of us to be your devotees. Make sure we shouldn't forget you at any situation. Om Sairam Om Sairam Om Sairam Om Sairam Om Sairam Om Sairam Om Sairam Om Sairam Om Sairam Om Sairam Om Sairam Om Sairam Om Sairam Om Sairam Om Sairam
Kapadu thandri samayam degara paduthumdi alage naku bayamesthumdi.okavaipu naa thandri vunnaru dhairyam twaraga naa samasya nundi kapadu thandri..Om Sai Ram
ReplyDelete