సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 700వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా మాట వినక చేసిన తప్పు - వింటే మంచే జరిగుండేది
  2. తలచుకుంటే చాలు, మనసుకి ప్రశాంతత చేకూర్చే బాబా

బాబా మాట వినక చేసిన తప్పు - వింటే మంచే జరిగుండేది


ఓం శ్రీ సాయినాథాయ నమ:


ముందుగా, సాయినాథుని మార్గంలో ఈ ‘సాయి మహరాజ్ సన్నిధి’ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సాయి భక్తజనులకు నా నమస్కారాలు. నా పేరు చండీశివప్రియ. నేను ఎల్లప్పుడూ “సాయినాథా” అని జపిస్తుంటాను. ఏ కష్టం వచ్చినా నేను బాబాకే చెప్పుకుంటాను. “నీకు నేను ఉన్నాను” అని బాబా ఎన్నోసార్లు నాకు ఋజువు చేశారు. బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేను ఇదివరకు మీతో పంచుకున్నాను. దానికి సంబంధించిన లింక్‌ను ఇక్కడ జతపరుస్తున్నాను.


https://saimaharajsannidhi.blogspot.com/2020/12/610.html?m=1


నా సాయినాథుని ప్రేమను తెలుసుకోలేక నేను చేసిన తప్పును ఇప్పుడు మీకు తెలియచేస్తాను. నా ఇంటర్మీడియట్ చదువు పూర్తయిన తర్వాత మా నాన్నగారు మరణించారు. ఇంటర్లో నాకు మంచి మార్కులు వచ్చినా, ఎంట్రన్స్ పరీక్షలో మంచి ర్యాంక్ వచ్చినప్పటికీ, ఇంట్లోని పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఒక చిన్న కాలేజీలో బి.టెక్ లో చేరాను. బి.టెక్ లో ఎన్నో బాధలు అనుభవించాను. నేను ఆ కాలేజీలో చేరడానికి వెళ్ళినప్పుడు నాకు కాలేజీ ఫీజు ఎక్కువగానే వేశారు. కానీ, నేను కాలేజీ యాజమాన్యంతో ఎంతో పోరాడి మరీ కేవలం బస్సు ఫీజు మాత్రమే కట్టాను. ప్రతి సెమిస్టరులో 80 శాతానికి పైనే మార్కులు తెచ్చుకునేదాన్ని. నాకు ‘కాలేజీ టాపర్’ అనే ట్యాగ్ లైన్ ఉంది. కానీ ఏం లాభం? కాలేజీ నుండి బయటకి వచ్చాక తెలిసింది, యాప్టిట్యూడ్ మరియు రీజనింగ్ ఎంత ముఖ్యమో. అందుకని ఆ కోర్సులో జాయిన్ అయ్యాను. కానీ లాభంలేకపోయింది. మొదటి ప్రయత్నంలో నాకు ప్రభుత్వోద్యోగం రాలేదు. ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్‌లో కూడా ఏ ఉద్యోగమూ రాలేదు. నాకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగమంటే బాగా ఇష్టం. అందులోనూ ఒక ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీ అంటే బాగా ఇష్టం. కానీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు సంబంధించిన అన్ని ఇంటర్వ్వూలలోనూ మొదటి రౌండులోనే ఫెయిలయ్యేదాన్ని. ఆ సమయంలోనే నేను బాబాకు బాగా చేరువయ్యాను. కొన్నాళ్ళ తరువాత ఉద్యోగం ప్రయత్నాల కోసం హైదరాబాదుకి వెళ్లాను. ఇక్కడ నా బాబా నా కోసం చేసిన లీల ఒకటి ఉంది. బి.టెక్ పూర్తయిన వెంటనే నాకు ఉద్యోగం రాకపోవటంతో నేను మా ఫ్రెండ్స్‌తో కాంటాక్ట్‌లో లేను. కానీ ఒక ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్‌లో తొలిరోజే నా ఫ్రెండ్స్‌ని కలిశాను. నేను (ఉద్యోగం కోసం) ఇంటినుంచి బయటికి వెళ్లడం అదే మొదటిసారి కావటంతో ఇంట్లో తమ్ముడు, అమ్మ, అమ్మమ్మ చాలా భయపడ్డారు. కానీ నేను హైదరాబాదులో నా ఫ్రెండుతోనే ఉన్నానని చెప్పడంతో వాళ్ళంతా ఎంతో సంతోషించారు. తరువాత వాక్-ఇన్ ఇంటర్వూలు ప్రారంభమయ్యాయి. సరిగ్గా ఆ ఇంటర్వ్యూలకు హాజరవడం ప్రారంభించిన నెలరోజులకు నాకు ఉద్యోగం వచ్చింది. కానీ అది నాన్-టెక్నికల్ ఉద్యోగం కావడంతో బాబా వద్దంటున్న నేను ఆ ఉద్యోగం వదిలేసి టెక్నికల్ కోర్సుల కోసం ప్లేస్‌మెంట్ అండ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యాను. కానీ కరోనా కారణంగా ఆ ఇన్‌స్టిట్యూట్‌ క్లోజ్ చేశారు. దాంతో నేను ఇంటికి తిరిగి వచ్చాను. అదే నేను బాబా మాట వినివుంటే ఇంటి వద్ద నుండే ఆ నాన్-టెక్నికల్ ఉద్యోగం చేస్తుండేదాన్ని. టెక్నికల్ కోర్స్ అయిపోయిన తరువాత కూడా ఆ ఇన్‌స్టిట్యూట్‌ వాళ్ళు నాకు ఏ ఉద్యోగమూ చూపించలేదు. 


అయితే లాక్‌డౌన్ సమయమంతా నేను బాబాతోనే గడిపాను. సాయి దివ్యపూజ, నవగురువారవ్రతం మొదలైనవి చేశాను. ‘ఏదో ఒకరోజు నా బాబా నాకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇవ్వకపోతారా’ అని అనుకునేదాన్ని. కొంతకాలం తరువాత అంతకుముందు హైదరాబాదు వెళ్ళిన తేదీల్లోనే మళ్ళీ హైదరాబాదుకి వెళ్ళాను. బాబా అనుగ్రహంతో ఈసారి కూడా మళ్ళీ ఒక నెలలోనే నాకు టెక్నికల్ ఉద్యోగం వచ్చింది. ఇంకా నాకు ఆఫర్ లెటర్ ఇవ్వనప్పటికీ, నేను కంపెనీకి వెళ్తున్నాను, జీతం తీసుకుంటున్నాను. కానీ ఈ కంపెనీ నాకు నచ్చట్లేదు. బి.టెక్‌లో 83% తెచ్చుకున్న సర్టిఫికెట్స్ పెట్టుకున్నప్పటికీ ఈ కంపెనీలో నాకు జాబ్ అప్రైజల్స్ లాంటివేమీ లేవు. అలాగని ఈ ఉద్యోగాన్ని కూడా వదులుకుంటే ఇంట్లోవాళ్ళు నన్ను కోప్పడతారు. 


“బాబా! నాకు ఈ ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. కానీ ఒకసారి నీ మాట వినకుండా ఒక ఉద్యోగాన్ని వదిలేశాను. ఇప్పుడు ఈ ఉద్యోగం కూడా వదులుకుందామంటే భయం వేస్తోంది. నేను బాగా కష్టపడతానని నీకు తెలుసు సాయినాథా! నాకు ఇష్టమైన కంపెనీలో ఉద్యోగం వచ్చేలా అనుగ్రహించు. నా జీవితంలో అన్నీ నాకు ఇష్టం లేనివే జరుగుతున్నాయి. కనీసం ఉద్యోగమైనా నాకు ఇష్టమైనది ప్రసాదించు తండ్రీ!” 


చివరిగా ఒక మాట, మనమంతా బాబాను శ్రద్ధ, సబూరిలతో పూజించి ఆయన అనుగ్రహం కోసం ఎదురుచూస్తుంటే బాబా తప్పకుండా మన కోరికలు తీరుస్తారు.


తలచుకుంటే చాలు, మనసుకి ప్రశాంతత చేకూర్చే బాబా


పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!


సాయిభక్తులకు నా హృదయపూర్వక నమస్కారములు. 'ఏమిటబ్బా, 'బాబా' అని అనుకున్నంతనే బాబా నాకున్న సమస్యను తీర్చేస్తారు!' అని నాలో నేను అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే, అలా నాకు ఎన్నోసార్లు జరిగింది. ఈ మధ్యనే జరిగిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. 


ఇటీవల మా అబ్బాయికి ఒక అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. ఇద్దరూ హైదరాబాదులో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇద్దరూ తరచూ మాట్లాడుకుంటూ వారివారి ఇష్టాయిష్టాలు, అభిప్రాయాలు ఒకరితో ఒకరు పంచుకోవడం ప్రారంభించారు. ఒకసారి మాటల మధ్యలో, ఆ అమ్మాయి తనకు విదేశాలకు వెళ్లాలని ఉందని చెప్పింది. అది మా అబ్బాయికి నచ్చలేదు. దాంతో ఇద్దరికీ మధ్య కొంచెం అలజడి కలిగేసరికి, "సరేలే, అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాం" అని తను చెప్పింది. నిజానికి మేము ముందే చెప్పాము, "అమ్మాయి ఖచ్చితంగా హైదరాబాదులోనే ఉద్యోగం చేయాలి, వేరే చోట ఉద్యోగం చేయడం మాకు ఇష్టం లేదు" అని. అప్పుడు వాళ్ళు, "విదేశాలకు కాదు కదా, ప్రక్కన ఉన్న వేరే నగరానికి కూడా పంపము" అని అన్నారు. జరిగిన విషయం మా అబ్బాయి నాతో చెప్పగా నేను, "బాబా! ఇద్దరికీ ఎలాంటి బాధ కలిగించకు" అని అనుకున్నాను. బాబా దయవలన ఆ సాయంత్రానికి ఇద్దరూ సమాధానపడ్డారు. ఏది ఏమైనా, నేను 'బాబా' అని తలచుకుంటే చాలు, బాబా నా మనసుకి ప్రశాంతత చేకూరుస్తారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!"



5 comments:

  1. SaiNadha 🙏🌹🌺🌺🌺🌺🙏🌺🥀

    ReplyDelete
  2. Kothakonda SrinivasMarch 1, 2021 at 3:43 PM

    ఓం సాయిరాం!

    ReplyDelete
  3. Om sai ram baba amma arogyani rakshinchu thandri sainatha

    ReplyDelete
  4. ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!

    ReplyDelete
  5. OM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH..Om Sai Ram

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo