- సాయినాథుని అద్భుతచర్యలు
- బాబా ఆశీస్సులతో లభించిన మనశ్శాంతి
సాయినాథుని అద్భుతచర్యలు
ఓం శ్రీ సాయి అద్భుతానంతచర్యాయ నమః
అనంతమైన అద్భుతచర్యలు చేసే సాయినాథుని దివ్యమంగళచరణాలకు నా ప్రణామాలు. నా సాయి చేసిన కొన్ని అద్భుతాలను మీ అందరితో పంచుకోవాలని నేను మీ ముందుకు వచ్చాను. వాటిలో, ఈ బ్లాగులో పంచుకుంటానని బాబాకు చెప్పినవీ ఉన్నాయి, బాబాకు చెప్పుకోకపోయినా మీతో పంచుకోవాలనిపించి పంచుకుంటున్నవీ కూడా ఉన్నాయి. వీలైనంత క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. కొంచెం పెద్దగా ఉన్నా దయచేసి కాస్త ఓపికగా చదవండి.
1. ఇది 2019లో జరిగింది. ఒకసారి మా మావయ్యకి ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. వెంటనే తనను ఒక హాస్పిటల్‌కి తీసుకెళ్ళాము. తనను పరీక్షించిన డాక్టర్లు, ‘పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది, అర్జెంటుగా హాస్పిటల్లో చేరి ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఆ రాత్రి కూడా గడవదు’ అని చెప్పేశారు. కానీ మా మావయ్య ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవటానికి ఒప్పుకోలేదు. తనను వేరే హాస్పిటల్‌కి తీసుకెళ్ళమని పట్టుపట్టారు. తను అడిగిన హాస్పిటల్‌కి వెళ్ళాలంటే 200 కిలోమీటర్ల పైనే ప్రయాణం చేయాలి. ఈ పరిస్థితిలో అది ఎంతో ప్రమాదంతో కూడుకున్నదని అందరం ఎంత చెప్పినా మావయ్య వినలేదు. ఆరోజు అర్థరాత్రి వరకు అందరం తనకు నచ్చజెబుతూనే ఉన్నాం. కానీ మావయ్య తన పట్టు విడవలేదు. దగ్గరలోనే మావయ్య కూతురి పెళ్ళి ఉంది. మావయ్య ఆరోగ్య పరిస్థితి ఇలా ఉండటంతో ఆ రాత్రి మేమెవ్వరం నిద్రపోలేదు. నేను బాబాకు నమస్కరించుకుని, “మావయ్య ఆరోగ్యం బాగై తను ఆనందంగా వాళ్ల అమ్మాయి పెళ్లి చేసేలా అనుగ్రహించండి” అని మ్రొక్కుకున్నాను. “అంతా బాగుంటుంది” అని బాబా ఆశీర్వదించారు. బాబా అనుగ్రహంతో త్వరలోనే మావయ్య ఆరోగ్యం నయమై, వాళ్ల అమ్మాయి పెళ్లి చాలా ఘనంగా చేశారు. ఆ పెళ్లి చూస్తుంటే బాబా చూపిన కరుణకు నా కళ్ళలో ఆనందభాష్పాలు వస్తూనే ఉన్నాయి. “ఎంతలా కరుణించావు తండ్రీ!” అని మనసులోనే బాబాకు ఎన్ని నమస్కారాలు చేశానో! వివరంగా రాస్తే చాలా పెద్దది అవుతుందని ఈ అద్భుతాన్ని నేను చాలా క్లుప్తంగా చెప్పాను.
2. సాయి ఆశీస్సులతో నేను మహాపారాయణ చేస్తున్నాను. నేను మహాపారాయణలో చేరిన కొన్ని నెలలోనే బాబా అందులో నాకు ఒక గొప్ప స్థానాన్ని ఇచ్చారు. అది ఎంత గొప్ప స్థానమో నాకు తర్వాత తెలిసింది. ‘మీ సేవకు సాయి ఇచ్చిన ప్రతిఫలం ఇది’ అని అందరూ అన్నారు. ఇప్పటికీ అది నాకు అద్భుతమే.
3. నా మేనల్లుడు మాకు బాబా ఆశీర్వాదం. అడుగడుగునా ఆ విషయం బాబా మాకు నిరూపిస్తూనే ఉన్నారు. బాబు రోజుల పిల్లాడిగా ఉన్నపుడు ఒకరోజు బాగా ఏడుస్తున్నాడు. ఎంతకీ తన ఏడుపు ఆగట్లేదు. నేను బాబాకు నమస్కరించుకుని, ‘బాబు ఏడుపు ఆగేలా చూడమ’ని ప్రార్థించాను. బాబాను ప్రార్థించిన కొద్దిసేపటికే శిరిడీ నుంచి బాబా ఊదీ, ప్రసాదం వచ్చాయి. ఊదీ పెట్టగానే బాబు చక్కగా నిద్రపోయాడు. మరోసారి, బాబుకి ఊయల కట్టటానికి చిన్న త్రాడు కోసం చూస్తుంటే అప్పుడే శిరిడీ నుంచి సచ్చరిత్ర పుస్తకాలు వచ్చాయి. ఆ పుస్తకాలకు కట్టిన త్రాడుతో బాబుకి ఊయల కట్టాము. మరోరోజు, బాబు తల్లిదండ్రులు బాబును తీసుకుని వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంటే, బాబాను వాళ్ళకు తోడుగా ఉండమని ప్రార్థించాను. సరిగ్గా వాళ్ళు గుమ్మం దాటేసరికి గుమ్మంలో ఒక పోస్టల్ కవర్ ఉంది. ఆ కవర్ మీద “With the blessings of Shirdi Saibaba” అని ఉంది. ఊదీ, ప్రసాదం రూపంలో బాబానే వాళ్ళకు ఎదురొచ్చి వాళ్ళకు తోడుగా వెళ్ళారు. అలాగే, బాబు అన్నప్రాశనకు రెండు రోజుల ముందు శిరిడీ నుండి బాబా ఊదీ, ప్రసాదం వచ్చాయి. ఆ ప్రసాదంతోనే బాబుకి అన్నప్రాశన చేశాము. ప్రతిసారీ సమయానుకూలంగా వచ్చి అద్భుతంగా ఆశీర్వదిస్తారు మన సాయి.
ఇవన్నీ సాయిబిడ్డలు కానివారికి కేవలం coincidences. కానీ సాయిబిడ్డలమైన మనకు మాత్రం ఇవి ‘sai’incidences. ఈ లీలలన్నీ జరిగినపుడు నేను ఎంత సంతోషించానో మాటల్లో చెప్పలేను. ఇప్పటికీ వాటిని తలచుకుంటుంటే ‘సాయి ఎంతలా మనల్ని ప్రేమిస్తున్నారో కదా!’ అనిపిస్తుంది. వివరంగా రాస్తే చాలా ఎక్కువగా అవుతుందని చాలా చాలా క్లుప్తంగా రాశాను. ఈ లీలలను రాస్తుండగా ఒక విషయం తెలిసింది, ఎప్పటినుంచో మా పొలంలో జరగకుండా ఉన్న ఒక పని ఇవాళ మొదలు కాబోతోంది అని. ఆ పని గురువారంనాడే మొదలుకావటం కేవలం బాబా అనుగ్రహమే తప్ప వేరొకటి కాదు. ఆ పని పూర్తి కాగానే ఆ అనుభవాన్ని కూడా మీతో పంచుకుంటాను.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!
శుభం భవతు!
బాబా ఆశీస్సులతో లభించిన మనశ్శాంతి
సాయిభక్తుడు సురేష్ ఇటీవల తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:
శ్రీసాయి శ్రీపాద దత్తాత్రేయ గురుభ్యోనమః
సాయిబంధువులందరికీ నా నమస్కారములు. ఈ బ్లాగు ద్వారా తోటి సాయిభక్తుల అనుభవాలను చదివే అవకాశం కల్పిస్తున్న శ్రీసాయిబాబాకు నా హృదయపూర్వక నమస్కారములు, ధన్యవాదములు. నా పేరు సురేష్. నేను విశాఖపట్నం నివాసిని. నేను ఇంతకుముందు రెండుసార్లు నా అనుభవాలను, బాబా నిదర్శనాలను ఈ బ్లాగు ద్వారా మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరొక అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 2020, అక్టోబరులో నాకు covid-19 వచ్చి, బాబా దయవలన తగ్గింది. కానీ ఆ తర్వాత నా మనసులో అనవసరమైన భయాలు, ఆందోళనలు చోటుచేసుకుని మనశ్శాంతి లేకుండా పోయింది. ఆ ప్రభావం నా ఆరోగ్యం మీద పడింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా నాకు నయం కాలేదు. ఒకటి, రెండు రోజులు బాగుంటే మూడవరోజు మళ్ళీ మొదలు. చివరికి నేను బాబాను ప్రార్థించి, వారి ఆశీస్సులతో 2021, జనవరి 14 నుండి ఫిబ్రవరి 23 వరకు 41 రోజులపాటు రోజుకు తొమ్మిదిసార్లు చొప్పున "శ్రీదత్త స్తవనం", "సిద్ధ మంగళ స్తోత్రం" పారాయణ చేశాను. పారాయణ పూర్తయిననాటినుండి బాబా నా మనశ్శాంతిని నాకు ప్రసాదించారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
నమో శ్రీసాయినాథాయ.
ఓం శాంతిః శాంతిః శాంతిః
Sai baba na bangaru tandri you are my favorite God. I love you dear tandri. You bless my family with long life. Be with us. Baba i am lucky I am your devotee. This is purva janam blessings of your love and affection on me. Every birth you must be with me and bless me. Om sai baba����❤ ����❤������
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
681 days
ReplyDeleteSairam
Om Sairam
ReplyDeleteOm sai ram 🙏🌹🙏🌹🙏🌹
ReplyDeleteఓం సాయిరాం🙏🌺🙏
ReplyDeleteOm sai ram,bless me baba
ReplyDeleteOm sai ram baba amma arogyam bagundela chudu thandri pleaseeee
ReplyDelete🙏🙏🙏Om srisairam Om srisairam Om srisairam thank you sister .
ReplyDelete