సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 710వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  1. తొలిచూపులోనే బాబా ప్రేమలో పడ్డాను!
  2. బాబాను వేడుకున్న 10 నిమిషాలకే తగ్గిన జ్వరం


యు.ఎస్.ఏ నుండి పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

సాయిబంధువులకు నమస్కారం. నేను సాయిభక్తురాలిని. నేను నా భర్త, హైస్కూల్ చదువుతున్న ఇద్దరు పిల్లలతో యు.ఎస్.ఏ.లో నివాసముంటున్నాను. నేను ప్రస్తుతం చాలా సమస్యలను ఎదుర్కొంటూ బాబా దయకోసం ఆశగా ఎదురుచూస్తున్నాను. భక్తుల విశ్వాసం, ఆశ కొనసాగేందుకు దోహదం చేసేలా మాకోసం బ్లాగును నిర్వహిస్తూ ఎంతో కృషి చేస్తున్న అడ్మిన్ మరియు బృందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతిరోజూ ఉదయాన్నే నేను ఇష్టంగా చేసే మొదటి పని - మీరు ప్రచురించే బాబా అద్భుత లీలలను చదివి ఆనందించడం. అది నా ఆశను కోల్పోకుండా ఉండేలా నాకు ప్రేరణనిస్తుంది. నేను నా అనుభవాలను పంచుకోవడం గురువారంనాడు ప్రారంభించాలనుకున్నాను. అనుకున్నట్లుగానే గురువారంనాడు నేను నా మొదటి అనుభవాన్ని వ్రాస్తున్నాను. "బాబా! దయచేసి నేను సరైన రీతిలో నా అనుభవాన్ని వ్రాసేలా ఆశీర్వదించండి. అలాగే ఇతరులకు కూడా తమ అనుభవాలు వ్రాయడంలో సహాయం చేయండి".

నేను చిన్నప్పటినుండి శివభక్తురాలిని. బహుశా మా అమ్మ, అక్క మరియు సమీపంలోని శివాలయం నుండి బిగ్గరగా వినిపించే భక్తిగీతాలు నేను శివభక్తురాలినయ్యేలా నన్ను ప్రభావితం చేశాయి. ప్రత్యేకించి నేను లింగాష్టకం వింటూ మైమరచిపోయేదాన్ని. నేను 8వ తరగతిలో ఉన్నప్పుడు నాన్న నన్ను శిరిడీ సాయిబాబాకు పరిచయం చేశారు. అదెలా జరిగిందంటే, ఆ సమయంలో మా కుటుంబం సెలవులు గడపడానికి యూరప్ వెళ్తున్నప్పుడు కేవలం నా వీసా విషయంలో సమస్య వచ్చింది. మేము పలు ప్రదేశాలు సందర్శిస్తున్నప్పటికీ నాన్న ఆ విషయమై చాలా టెన్షన్ పడుతున్నారు. నాన్న స్నేహితుడు తనతో, "బాబాను ప్రార్థించండి. ఆయన వెంటనే సమస్యను పరిష్కరిస్తారు" అని చెప్పారు. ఆ సమయంలో మాకు బాబా గురించి ఏమీ తెలియదు. అయినప్పటికీ నాన్న తన స్నేహితుడు చెప్పినట్లు చేశారు. ఆశ్చర్యకరంగా వెంటనే వీసా సమస్య పరిష్కారమైంది. ఇండియా తిరిగి వచ్చిన వెంటనే నాన్న తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి నన్ను తీసుకొని బాబా మందిరానికి వెళ్లారు. నాకు తెలిసినంతవరకు అప్పట్లో వైజాగ్‌లో ఉన్న ఏకైక బాబా మందిరం అదే. నిజానికి ఆరోజు నేను కొన్ని సబ్జెక్టులలో మంచి మార్కులు రాలేదని చాలా బాధలో ఉన్నాను. 8వ తరగతి చదువుతున్న నాకు ఆ సమయంలో అంతకంటే ఇతర సమస్యలేముంటాయి? మందిర ప్రవేశద్వారంలో నేను నా కుడిపాదాన్ని మోపిన మరుక్షణంలో ఎవరో నాలోని అన్ని బాధలనూ తక్షణమే తొలగించిన అనుభూతి నాకు కలిగింది. నా కళ్ళకు అది మందిరంలా కాక ఒక అద్భుత ప్రదేశంలా కనిపించింది. ఆ సమయంలో నాకు బాబా ఎవరో కూడా తెలియదు. కానీ ఆయనను చూసిన క్షణంలో నేను బాబా ప్రేమలో పడ్డాను. తక్షణమే నేను ఆయనకు శాశ్వత భక్తురాలినయ్యాను. స్కూలు లేని రోజుల్లో నేను తాజా పువ్వులను తెచ్చి ఎంతో ఇష్టంగా బాబాను పూజించేదాన్ని. నేనే కాదు, బాబా ప్రసాదించిన తొలి అనుభవంతో మా కుటుంబంలోని అందరూ బాబా భక్తులయ్యారు. అప్పటినుండి నాకు, నా కుటుంబానికి సర్వమూ బాబా అయ్యారు.

బాబా నాకు రెండుసార్లు స్వప్నదర్శనమిచ్చారు. ఒకసారి కలలో బాబా మా బంధువులతోపాటు మంచం మీద కూర్చొని కనిపించారు. మరొకసారి తెల్లని కఫ్నీ ధరించి నిలుచొని నన్నే చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత కొన్ని రోజులపాటు నేను అనుభవించిన అపారమైన ఆనందాన్ని వ్యక్తపరచలేకపోతున్నాను. కాలేజీ, ట్యూషన్లు ఉన్నప్పటికీ కూడా ప్రతి గురువారం నేను బాబా మందిరానికి వెళ్తుండేదాన్ని. నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు బాబాపట్ల నాకున్న గౌరవాన్ని వ్యక్తపరచడానికి అప్పుడప్పుడు గురువారంనాడు ఉపవాసం ఉండేదాన్ని. అప్పటికి నేను సచ్చరిత్ర చదవనందున బాబాకు ఉపవాసం ఇష్టముండదని నాకు తెలీదు. అప్పట్లో ఒకసారి శివరాత్రి శుక్రవారంనాడు వచ్చింది. ఆ రాత్రి జాగరణతో పాటు వరుసగా రెండు రోజులు (గురు, శుక్రవారాలు) నేను ఉపవాసం ఉన్నాను. బాబా, శివుడు అంటే నాకు అంత ప్రేమ. 2013, నవంబరు 18, కార్తీక సోమవారం సాయంత్రం బాబా దర్శనం ఇచ్చేవరకు వారిద్దరూ ఒకటేనని నేను గ్రహించలేదు.

సాధారణంగా నేను కార్తీకమాసంలో ప్రతి సోమవారం ఉపవాసం ఉంటాను. ఎప్పుడైనా కుదరని పక్షంలో కనీసం నాకు వీలైనంతవరకు ప్రయత్నం చేస్తాను. 2013, నవంబరు 18, కార్తీక సోమవరం సాయంత్రం నేను ఇంటికి వచ్చి, సుమారు 6 గంటల ప్రాంతంలో పూజ చేస్తూ హారతి ఇచ్చాను. నా పూజ పూర్తయినా హారతి వెలుగుతూనే ఉంది. కింద చెక్కబల్ల ఉన్నందున ఏ ప్రమాదమూ జరగకూడదని అది ఆగేవరకూ నేను నిరీక్షించాను. అయితే అది చాలాసేపటి వరకు వెలుగుతూనే ఉంది. దాంతో, అంతసేపు వెలగడానికి హారతి పళ్లెంలో నెయ్యి ఏమైనా ఉందా అని నేను దగ్గరకి వెళ్లి చూశాను. నా దృష్టి పళ్లెం మీద పడిన మరుక్షణం హారతి మంట ఆగి, పళ్ళెంలో చాలా స్పష్టంగా బాబా ముఖం కనిపించింది. బూడిదతో ఆయన మీసం, గడ్డంలా ఏర్పడ్డాయి, ఇంకా మంట వలన వచ్చిన నల్లని చారలతో ఆయన ముఖాకృతి దిద్దబడి ఉంది. అది చూసి నన్ను నేను నమ్మలేకపోయాను. ఆ వివరాలేవీ నేను నా భర్త, పిల్లలతో చెప్పనప్పటికీ వాళ్ళు హారతి పళ్లాన్ని చూసి చాలా స్పష్టంగా బాబా ముఖంగా కనిపిస్తోందని చెప్పారు. నేను తీసిన ఫోటోను కింద జతపరుస్తున్నాను, మీరు కూడా చూడండి. ఆ అనుభవంతో బాబా, శివుడు వేరువేరు కాదనీ, ఒక్కరేననీ తెలుసుకున్నాను. అంత స్పష్టంగా కానప్పటికీ అప్పుడప్పుడు హారతి పళ్లెం‌లో బాబా దర్శనం నాకు లభిస్తూ ఉంటుంది. నా కుటుంబసభ్యులు నేను ఊహించుకుంటున్నానని అనుకుంటుంటారు. కానీ అందులో నిజం ఏమిటో నాకు తెలియదు. ఆ భగవంతునికే తెలుసు! నేను కలలో లేదా నిజజీవితంలో బాబా దర్శనం కోసం నిరీక్షిస్తున్నాను. కానీ అందుకు నాకు అర్హత ఉందో, లేదో నాకు తెలియదు. అయినప్పటికీ ఏదో ఒకరోజు అది నెరవేరుతుందని ఆశిస్తున్నాను. నేను బాబాను నా స్నేహితునిలా భావిస్తాను, ప్రతిదీ ఆయనతో పంచుకుంటాను. ఆయన నా మాటను వింటున్నారన్న భావనతో నా హృదయంలో కొలువైయున్న ఆయనతో నేను నిరంతరం మాట్లాడుతూ ఉంటాను. ఇప్పటివరకు నాకు తోడుగా ఉన్నందుకు మరియు ఈ అవకాశం ఇచ్చినందుకు బాబాకు నా ధన్యవాదాలు.
ధన్యవాదాలు..
సాయిభక్తురాలు.

బాబాను వేడుకున్న 10 నిమిషాలకే తగ్గిన జ్వరం

 

పేరు వెల్లడించని ఒక సాయి భక్తురాలు ఇటీవల బాబా తనకి ప్రసాదించిన ఒక చిన్న అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:


సాయిబాబా భక్తులకు నా నమస్కారం. బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని సాటి సాయిభక్తురాలిగా మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఈమధ్యకాలంలో ఒకరోజు రాత్రిపూట ఉన్నట్టుండి మావారికి తీవ్రమైన చలిజ్వరం వచ్చింది. జ్వరం తగ్గడానికి మందులు వేసుకున్నప్పటికీ జ్వరం ఏమాత్రం తగ్గకపోగా ఇంకా ఎక్కువైంది. తన ఒంటిమీద చేయి వేసి చూస్తే ఒళ్ళు విపరీతమైన వేడిగా ఉంది. దాంతో నాకు ఏమి చేయాలో పాలుపోక బాబాకు నమస్కరించుకుని, “బాబా! మావారికి జ్వరం చాలా ఎక్కువగా ఉంది. తన జ్వరాన్ని త్వరగా తగ్గించండి బాబా! తెల్లవారేలోపు మావారి జ్వరం తగ్గిపోతే నేను సాయిసత్యవ్రతం చేస్తాను” అని మ్రొక్కుకున్నాను. ప్రార్థించిన కొంతసేపటికే బాబా తమ అనుగ్రహాన్ని నాపై చూపించారు. నేను బాబాను వేడుకున్న 10 నిమిషాల తర్వాత మావారి ఒంటిపైన చేయి వేసి చూసి, తన శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి రావటం గమనించి ఆశ్చర్యపోయాను. జ్వరం పూర్తిగా తగ్గిపోయి మావారు ఆరోగ్యంగా ఉండటం చూసి బాబా అనుగ్రహం నా మీద వున్నదని ఎంతో సంతోషించాను. “సాయిబాబా! మీ చల్లని చూపు మా అందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను”. నా అనుభవాన్ని మీ అందరితో పంచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.




6 comments:

  1. Kothakonda SrinivasMarch 11, 2021 at 7:15 AM

    జై సాయిరాం; జై గురుదత్త!

    ReplyDelete
  2. Om sai ram 1st sai leela is very nice. She is lucky devotee of baba. Baba's presence in harati is very nice leela. I liked it very much. Some devotees are very lucky having baba's darshan in dreams. I am not lucky to have darshan darshan in dreams. Please bless my baba sai. Om sai baba������❤

    ReplyDelete
  3. Om sai ram baba please bless us

    ReplyDelete
  4. OM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH..Om Sai Ram

    ReplyDelete
  5. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤🤗🌸😃🌹🥰🌺😀🌼💕

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo