సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 706వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. ‘బాబా నాతో ఉంటారు, ఉంటున్నారు’
  2. అడగటం ఆలస్యం అనుగ్రహించే సాయితండ్రి

‘బాబా నాతో ఉంటారు, ఉంటున్నారు’


పేరు వెల్లడించని ఒక సాయి భక్తురాలు బాబా తనకి ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:


సాయిబంధువులకు నా నమస్కారం. ఇంతకుముందు బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని ఈ బ్లాగ్ ద్వారా మీ అందరితో పంచుకున్నాను. ఆ సాయినాథుని ఆశీస్సులతో ఇప్పుడు మరో అనుభవాన్ని పంచుకోబోతున్నాను. ఇంతకుముందు నేను చెప్పిన అనుభవంలో నా కాలినొప్పి గురించిన అనుభవాన్ని మీతో చెప్తానన్నాను. అదే ఇప్పుడు చెప్పబోతున్నాను. 3 నెలల నుంచి నేను కాలినొప్పితో బాధపడుతున్నాను. అంతకాలమైనా కాలినొప్పి తగ్గకపోవడంతో డాక్టరుని సంప్రదిస్తే, డాక్టర్ ఎక్స్-రే తీసి, ‘సమస్యేమీ లేద’ని చెప్పి, నొప్పి తగ్గటానికి మందులిచ్చారు. ఆ మందులు వాడిన తరువాత కూడా నా కాలినొప్పి తగ్గకపోవడంతో మళ్ళీ డాక్టర్ వద్దకు వెళ్ళాను. ఈసారి డాక్టర్ MRI స్కానింగ్ చేయాలని చెప్పారు. ఆ స్కానింగ్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు మనసులో ఏదో తెలియని భయం. కానీ, బాబా నా ప్రక్కనే ఉండి నడిపించినట్టుగా, బాబానే స్వయంగా చెప్పినట్టుగా, నేను చాలాకాలంగా వినాలని అనుకుని కూడా అంతవరకు వినలేకపోయిన సాయి గాయత్రి మంత్రాన్ని 108 సార్లు వినాలని నా మనసుకు అనిపించింది. దాంతో సాయి గాయత్రి మంత్రాన్ని వింటూ హాస్పిటల్‌కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక కూడా అదే మంత్రాన్ని వింటూ ఉన్నాను. డాక్టర్ నన్ను స్కానింగుకి పిలిచినప్పుడు నేను సాయి గాయత్రి మంత్రాన్ని 45వ సారి వింటూ ఉన్నాను. ఏదైనా సమస్య వచ్చినప్పుడు సాధారణంగా బాబా సమాధానం కోసం ‘సాయి ఆన్సర్స్ యాప్’ చూడటం నాకు బాగా అలవాటు. ఆ యాప్‌లో బాబా స్వయంగా నాకు సమాధానం ఇస్తున్నట్లే ఉంటుంది. అందువల్ల ఈసారి కూడా బాబా సమాధానాన్ని ఆ యాప్‌లో చూద్దామనుకున్నాను. డాక్టర్ పిలిచినప్పుడు నేను వింటున్న సాయి గాయత్రి మంత్రం 45వ నెంబర్ దగ్గర ఆగటంతో, ఆ నెంబరుకి నాకు ‘సాయి ఆన్సర్స్ యాప్’ నుండి బాబా ఇచ్చే సమాధానాన్ని బాబా ఆశీస్సులుగా స్వీకరిద్దామనుకున్నాను. ఆ యాప్‌లో 45వ నెంబరు చూస్తే బాబా నాకు ఇచ్చిన సమాధానం...


"Very soon you will get a chance to Shiridi and have Darshan of Shri Saibaba. You will get success." ("అతి త్వరలో నీకు శిరిడీ వెళ్లే అవకాశం, శ్రీసాయిబాబా దర్శనం లభిస్తుంది. నీకు విజయం సిద్ధిస్తుంది")


అది చూసి నాకు కొండంత ధైర్యం వచ్చింది. బాబా నాతోనే ఉన్నారని నేను ధైర్యంగా స్కానింగ్ చేయించుకున్నాను. బాబా అనుగ్రహంతో స్కానింగ్ జరుగుతున్నంతసేపూ నేను సాయి గాయత్రి మంత్రాన్ని జపిస్తూనే ఉన్నాను. స్కానింగ్ రిపోర్టు వచ్చినరోజు బాబాకు నమస్కరించుకుని, “బాబా, రిపోర్టులో నాకు ఏ సమస్యా లేకుండా అనుగ్రహించండి. మీదే భారం తండ్రీ” అని చెప్పుకుని, బాబాను స్మరించుకుంటూ హాస్పిటల్‌కి వెళ్ళాను. ఇంతకుముందు నేను ఆ డాక్టర్ దగ్గరకు రెండు మూడుసార్లు వెళ్ళాను. అప్పుడంతా నాకు కనిపించని బాబా ఫోటో ఆరోజు డాక్టర్ దగ్గర కనిపించింది. బాబాను చూడగానే చాలా సంతోషంగా అనిపించింది. MRI స్కానింగ్ రిపోర్టును పరిశీలించిన డాక్టర్, “పెద్ద సమస్యేమీ లేదు. కొంచెం డిస్క్ ప్రాబ్లమ్ ఉంది. ఫిజియోథెరపీతో అది నయమైపోతుంది” అన్నారు. ఆ మాటలు వినగానే ఎంతో భారం దిగిపోయినట్టు అనిపించింది. ‘బాబా నాతో ఉంటారు, ఉంటున్నారు’ అనడానికి ఇంతకన్నా ఋజువేం కావాలి? బాబా నాపై చూపుతున్న ప్రేమను వర్ణించడానికి నాకు మాటలు రావట్లేదు. “బాబా! నిన్ను మనస్ఫూర్తిగా నమ్మిన నీ బిడ్డలను నువ్వు ఎప్పటికీ వదిలిపెట్టవు. సాయినాథా! నీ చరణాల చెంతనే ఎల్లప్పుడూ ఉండే భాగాన్ని ప్రతి జన్మలోనూ నాకు ప్రసాదించు తండ్రీ!”


సాయి గాయత్రి మంత్రం


ఓం శిరిడీవాసాయ విద్మహే 

సచ్చిదానందాయ ధీమహి 

తన్నో సాయి ప్రచోదయాత్


అడగటం ఆలస్యం అనుగ్రహించే సాయితండ్రి


పేరు వెల్లడించని ఒక సాయి భక్తురాలు బాబా తనకి ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు:


నేనొక సాయిభక్తురాలిని. ఇటీవల నాకు ఉద్యోగంలో ట్రాన్స్‌ఫర్ సమస్య వచ్చింది. ట్రాన్స్‌ఫర్ అంటూ జరిగితే నేను చాలా సుదూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది. శారీరకంగా నాకు బాగా కష్టమవుతుంది. అప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, ఈ సమస్యకు పరిష్కారం చూపమని వేడుకున్నాను. అప్పుడు ఒక సందేశం ద్వారా ‘తాను తప్పక రక్షిస్తాన’ని బాబా నాకు తెలియజేశారు. ఆ తరువాత ఒక నెలరోజుల్లోనే నా సమస్య పూర్తిగా పరిష్కారం అయింది. నాకసలు ట్రాన్స్‌ఫరే ఉండదని తెలిసింది. ఇది కేవలం బాబా అనుగ్రహం వల్లనే జరిగింది. ఎంతో సంతోషంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. నేను సాయిలీలను కళ్లారా చూశాను. బాబాకు నేనెంతో ఋణపడివున్నాను.


ఇంకొక అనుభవం:


ఇది నా నెలసరి సమస్యకు సంబంధించినది. నేను దాదాపు ఒకటిన్నర సంవత్సరం నుండి నెలసరికి సంబంధించిన సమస్యతో బాధపడుతూ ఉన్నాను. ఎంతోమంది డాక్టర్లకు చూపించి మందులు వాడినప్పటికీ ఫలితం లేకపోయింది. నా నెలసరి సమస్యను పరిష్కరించమని బాబాను మనసారా ప్రార్థించాను. బాబాను ప్రార్థించిన ఒక నెలలోనే నా నెలసరికి సంబంధించిన సమస్య పూర్తిగా పరిష్కారమైంది. సాయికి శతకోటి వందనాలు.



8 comments:

  1. జై సాయిరాం! జై గురుదత్త!

    ReplyDelete
  2. Kothakonda SrinivasMarch 7, 2021 at 8:34 AM

    జై సాయిరాం! జై గురుదత్త!

    ReplyDelete
  3. Sai ki sthakoti vandanalu. Two devotees are very lucky to have sai blessings to them. When we trust him hole heartly he blesses us. That is power of sai. Om sai ram��������

    ReplyDelete
  4. Sai Gayatri is very powerful mantra. Om sai baba blessings������

    ReplyDelete
  5. Om sai ram baba amma arogyam bagundela chudu thandri shatakoti dandalu sai

    ReplyDelete
  6. OM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH..Om Sai Ram

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo