సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 705వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. ఊదీ మహిమ
  2. బాబా దయవల్ల భయం నుండి కోలుకున్న బామ్మ

ఊదీ మహిమ


పేరు వెల్లడించని ఒక సాయిభక్తుడు తనకు ఇటీవల బాబా ప్రసాదించిన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ చరణారవిందములకు శతకోటి నమస్కారాలు. భక్తులకు బాబా ప్రసాదించిన విశేష అనుభవాలను ప్రచురిస్తున్న ఈ ‘ఆధునిక సాయి సచ్చరిత్ర’ సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా మనఃపూర్వక అభినందనలు. గతంలో బాబా నాకు ప్రసాదించిన ఎన్నో అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా సాయి భక్తజన కుటుంబ పరివారంతో పంచుకోవడం జరిగింది. ఇప్పుడు వివరించబోతున్న ఈ చిన్ని అనుభవం బాబా పట్ల నా నమ్మకాన్ని మరింత దృఢపరచింది.


సాయినాథుని కృప వల్ల మాకు ఇద్దరు ఆడపిల్లలు సంతానం. మొదటి పాప వయసు నాలుగు సంవత్సరములు, రెండవ పాపకు నాలుగు నెలలు. రెండవ కాన్పు కోసం మా ఆవిడ పుట్టింటికి వెళ్ళి, పండంటి ఆడబిడ్డ జన్మించిన తర్వాత కొన్ని నెలల పాటు అక్కడే ఉంది. ఈమధ్యలో మా పెద్దపాప అమ్మ కోసం అప్పుడప్పుడు అక్కడికి వెళ్తూ వస్తూ ఉంది. 15 రోజుల క్రితం కూడా అమ్మను చూడాలని మా పెద్దపాప అక్కడికి వెళ్ళింది. మా ఇంటిలో సాయి ఆరతులు, పూజా కార్యక్రమాలు ప్రతినిత్యం క్రమంతప్పకుండా జరుగుతూ ఉంటాయి. మా పెద్దపాప కూడా సాయిభక్తురాలు. అలవాటుపడిన సాయిభక్తితో తను ఎక్కడికి వెళ్ళినా సాయినామం స్మరిస్తూనే ఉంటుంది. ప్రతిరోజూ సాయిపూజ ముగిసిన తర్వాత ‘సాయిసూక్తులు’ పుస్తకం చూడడం మాకు అలవాటు. అందులో వచ్చిన ఏ సూక్తినయినా బాబా ఆజ్ఞగా భావించి మేము తు.చ తప్పకుండా పాటిస్తాం. ఆ విశ్వాసమే మమ్మల్ని 30 సంవత్సరాలుగా కాపాడుతూ వస్తోంది. ఆరోజు సాయిసూక్తులలో, "ఆ కప్పను చావనివ్వడం లేదు, దానిని రక్షించుటకై నేను ఉన్నాను" అన్న సూక్తి వచ్చింది. అది చూడగానే నా మనసెందుకో కీడు శంకించింది. ఆ తర్వాత ఉదయం 10 గంటలకు మా పెద్దపాపకు విపరీతమైన వాంతులు అవుతున్నాయని నాకు ఫోన్ కాల్ వచ్చింది. అసలే మంచి కాలం కాదు, కరోనా రక్కసి నుంచి మనం ఇంకా పూర్తిగా బయటపడలేదు. అప్పటికే సాయిసూక్తులలో వచ్చిన సందేశంతో ఆందోళనగా ఉన్న నేను ఆ వార్త విని ఇంకా కంగారుపడిపోయాను. ఎందుకో తెలియదుగానీ, ఈ బ్లాగులో పంచుకుంటామని అనుకున్న వెంటనే బాబా దయవల్ల సమస్యలు తీరిపోవడం జరుగుతుంది. సాయి మహారాజ్ సన్నిధి బ్లాగ్ రూపంలో సాయికృప సంపూర్ణంగా లభించినందుకు ఎంతో మనోధైర్యంతో, విశ్వాసంతో ఎప్పటిలాగానే బాబాకు నమస్కరించుకుని, “ఓ సాయినాథా! ఈరోజు సాయంత్రంలోగా మా పాపకు ఎటువంటి ఆరోగ్య సమస్యలూ లేవనీ, తను ఆరోగ్యంగా ఉందనీ నాకు సమాచారం అందాలి. మీ అనుగ్రహంతో పాప ఆరోగ్యంగా ఉంటే మునుపటిలాగే నా అనుభవాన్ని సాయి మహారాజ్ సన్నిధిలో తోటి సాయిబంధువులతో పంచుకుంటానని సంకల్పం చేస్తున్నాను” అని చెప్పుకొని, చిటికెడు సాయి ఊదీని తీసుకుని, “బాబా! ఈ ఊదీ మహిమ నా బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడాలి. నేను మా పాప దగ్గరకు వెళ్లలేకపోతున్నందువల్ల మా పాప తరఫున నేను ఈ ఊదీని సేవిస్తున్నాను” అని సంకల్పం చెప్పుకుని, ఊదీని గ్లాసు నీళ్లలో వేసుకుని సేవించాను. తర్వాత మా అత్తగారింట్లోవాళ్ళు మా పాపను హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. పాపను పరీక్షించిన డాక్టర్, ‘ఫుడ్ పాయిజన్ వల్ల ఇలా జరిగింద’ని చెప్పి I.V ఫ్లూయిడ్స్ అవసరం లేకుండా కేవలం ఒక ఇంజక్షన్ చేసి, కొన్ని మందులు ఇచ్చారు. సంకల్పం చేసుకున్న కొద్ది గంటల్లోనే ముందురోజు రాత్రి నుంచి ఆగకుండా అవుతున్న వాంతులు బాబా దయవల్ల ఆగిపోయి పాప ఆరోగ్యం కుదుటపడింది. ఫోనులో పాప ఆరోగ్యం కుదుటపడిందన్న వార్త వినగానే ఎంతో సంతోషంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఈ అనుభవం బాబా పట్ల నా నమ్మకాన్ని మరింత దృఢపరచింది. ఇప్పుడున్న పరిస్థితులలో హాస్పిటల్లో అడ్మిట్ అయితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తలచుకుంటేనే భయం వేస్తుంది. ఇంక ఆలస్యం చేయకుండా బాబాకు మాటిచ్చినట్లు వెంటనే నా అనుభవాన్ని పంచుకుంటున్నాను. "మన నమ్మకం ఎంత బలంగా ఉంటే, మన విశ్వాసం సాయి పాదాల చెంత ఎంత దృఢంగా ఉంటే ఫలితాలు అంతే శీఘ్రంగా పరిష్కారం అవుతాయి” అన్న మాటకు నా అనుభవం ఒక చిన్న ఉదాహరణ.


మరో అనుభవంతో మళ్లీ కలుద్దాం..

సర్వేజనాః సుఖినోభవంతు!


బాబా దయవల్ల భయం నుండి కోలుకున్న బామ్మ


సాయిభక్తురాలు చందన తనకు ఇటీవల బాబా ప్రసాదించిన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:


నా పేరు చందన. మా స్వస్థలం అనంతపురం. బాబా నాకు కొన్ని అనుభవాలు ఇచ్చారు. వాటిలోనుండి ఒక అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటాను. 


2021, ఫిబ్రవరి 14 ఉదయం మా బామ్మ ఏ కారణం లేకుండా తీవ్రంగా భయపడసాగింది. తననలా చూసి నాకు చాలా కంగారుగా అనిపించి, "బాబా! బామ్మ భయం నుండి బయటపడితే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. సాయిమాత చాలా దయామయులు. వారి కృపవలన మా బామ్మ భయం నుండి చాలా తొందరగా కోలుకుంది. "థాంక్యూ సో మచ్ బాబా. ఒక పెద్ద సమస్య నుండి నన్ను రక్షించినందుకు మీకు చాలా ధన్యవాదాలు బాబా. మీ ఆశీర్వాదం వల్ల నేనిప్పుడు కోచింగ్‌కి వెళ్తున్నాను. అన్నివిధాలా నన్ను సంరక్షించండి. వీలైనంత త్వరగా నాకు ఉద్యోగం వచ్చేలా అనుగ్రహించండి బాబా".




5 comments:

  1. Om sai baba with udi any diseases can cure. That is baba's power. He protects all sai devotees. No fear there is baba to take care of us. ❤��������

    ReplyDelete
  2. 🙏🙏🙏Om sri sai ram🙏🙏🙏

    ReplyDelete
  3. Baba pleaseeee ma amma problem tondarga cure cheyi baba

    ReplyDelete
  4. OM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH..Om Sai Ram

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo