సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 707వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబానే నన్ను రక్షించారు
  2. బేషరతుగా ప్రేమించే బాబా

బాబానే నన్ను రక్షించారు


సాయిభక్తురాలు శ్రీమతి లావణ్య తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:


నేను సాయిబాబాకు సాధారణ భక్తురాలిని. నా పేరు లావణ్య. మాది ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలోని ఒక గ్రామం. ఈమధ్యకాలంలో నేను మావారి ఫోనులో సాయిభక్తుల అనుభవాలు చదవడం మొదలుపెట్టాను. ఈ బ్లాగు నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదాలు. మాకు ఒక పాప వుంది. నేను రెండవసారి గర్భవతినైనప్పుడు 5వ నెలలో గర్భస్రావం అయ్యింది. అప్పటినుండి నేను సంతానం కోసం ఎన్నో పూజలు చేశాను. కొన్నిరోజులకి సాయి దివ్యపూజ గురించి తెలిసి ఆ పూజను ప్రారంభించాను. బాబా దయవలన పూజ ప్రారంభించిన రెండు వారాలలోనే నేను గర్భవతినని నిర్ధారణ అయ్యింది. అందరం చాలా ఆనందించాము. అయితే దురదృష్టవశాత్తూ ఈసారి కూడా గర్భస్రావమైంది. కరోనా కారణంగా నన్ను ఏ హాస్పిటల్లోనూ చేర్చుకోలేదు. అప్పుడు నేను, "ఇలా ఎందుకు చేస్తున్నారు బాబా? మేము ఏ తప్పు చేశామో మాకు తెలియడం లేదు. బిడ్డ దక్కలేదు, కనీసం నాకైనా ఏ ఇబ్బందీ లేకుండా కాపాడండి. దయచేసి ఏదో ఒక దారి చూపండి బాబా" అని పదేపదే వేడుకున్నాను. దయామయుడైన బాబా తెలిసిన బంధువుల రూపంలో దారి చూపించారు. నాకు ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది. ఆపరేషన్ జరుగుతున్నంతసేపూ నేను బాబానే స్మరిస్తూ ఉన్నాను. ఆ కష్ట పరిస్థితిలో బాబానే నన్ను రక్షించారు. "ధన్యవాదాలు బాబా. బాబు రూపంలో మీరు మా ఇంట్లో పుడతారనుకున్నాను. కానీ అది జరగలేదు. తెలిసీ తెలియక మేము ఏదైనా తప్పు చేస్తే మమ్మల్ని క్షమించండి బాబా. మీ చల్లని ఆశీస్సులు మాపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. నన్ను, నా కుటుంబాన్ని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతూ ముందుండి మమ్మల్ని మంచి మార్గంలో నడిపించండి బాబా".


సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


బేషరతుగా ప్రేమించే బాబా

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

అందరికీ సాయిరామ్. నన్ను నేను సాయిబాబా భక్తురాలిగా పరిచయం చేసుకుంటున్నాను. ప్రతిజన్మలోనూ ఆయనతో అనుబంధాన్ని కలిగి ఉండాలని ఆశపడుతున్నాను. "బాబా! మేమంతా మీ బిడ్డలం. బేషరతుగా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటాం. మా అందరినీ ఆశీర్వదించండి". 

పుస్తకాలు చదివే విషయంలో నేను చాలా సోమరిని. అలాంటి నేను ఒకరోజు ఎటువంటి కారణం లేకుండా బాబాకి సంబంధించిన పుస్తకం చదవాలని అనుకున్నాను. వెంటనే నేను ఆన్లైన్లో మూడు పుస్తకాలను మా అమ్మ అకౌంట్ ద్వారా ఆర్డర్ చేశాను. వాటిలో ఒకటి జయవాహి రచించిన “బాబా ఈజ్ స్టిల్ అలైవ్”. మా అమ్మ ఆ పుస్తకాలు వారంలో వస్తాయని చెప్పింది. తరువాత ఒక సెలవుదినాన నేను ఇంట్లో ఉన్నాను. ఆరోజు అమ్మ ఈరోజు ఒక పుస్తకం వస్తుందని నాతో చెప్పింది. అమ్మ అది, "బాబా ఈజ్ స్టిల్ అలైవ్" అన్న పుస్తకం అని కాకుండా వేరే పుస్తకం అని చెప్పింది. నేను తనతో, " 'సాయిబాబా ఈజ్ స్టిల్ అలైవ్' పుస్తకం వస్తుంది, అది నా జీవితాన్ని మారుస్తుంద"ని భావిస్తున్నాను అని అన్నాను. అదే జరుగుతుందని నేను పూర్తిగా అనుభూతి చెందాను. తరువాత నేను ఏదైతే అనుకున్నానో అదే పుస్తకం రావడంతో నేను ఆశ్చర్యానందాలకు లోనయ్యాను.

ఇక రెండురోజులుపాటు పగలు రాత్రి చూడకుండా నిరంతరాయంగా నేను ఆ పుస్తకాన్ని చదివాను. ఆ పుస్తకంలో కొన్ని వాక్యాలు నన్ను తీవ్రంగా ఆలోచింపజేశాయి. అవేమిటంటే, "బాబా మన కోరికలను నెరవేర్చినా, లేకున్నా మనం ఆయనను బేషరతుగా ప్రేమించాలి", "బాబాపై మనకున్న ప్రేమకు సంబంధించి మన విశ్వాసాన్ని మనం ప్రశ్నించుకోవాలి". వాటి విషయంలో సాధ్యమైనంతవరకు నేను ఖచ్చితంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. నేను బాబాతో, "నాకు తెలుసు బాబా, మీ ప్రేమ షరతులు లేనిదని, కాని నా ప్రేమ అనుమానమే. బాబా! నా ప్రేమ షరతులతో కూడుకున్నదని మీరు అనుకుంటున్నారా?" అని అడిగాను. తరువాత నేను బాబాపట్ల నా ప్రేమ గాఢమైనది కాదని ఆలోచిస్తూ ఏడవడం మొదలుపెట్టి బాబాతో, “ఏమో! నాకేమి తెలియదు బాబా. నా ప్రేమ షరతులు లేనిదైతే మీ నుండి నాకు ఊదీ ప్యాకెట్ కావాలి” అని చెప్పుకుని, అదే ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాను.

అప్పుడు నాకొక కల వచ్చింది. అది జరిగి మూడు సంవత్సరాలు అయినప్పటికీ నాకు ఆ కల చాలా స్పష్టంగా గుర్తు ఉంది. ఆ కలలో నేను నా చెల్లెలితో కలిసి వేరొకరి ఇంట్లో ఆడుతున్నాను. అకస్మాత్తుగా డోర్ బెల్ మ్రోగింది. నేను పరుగున వెళ్లి తలుపు తెరిచాను. అద్భుతాలలోకి అద్భుతం! టివి, ఫ్రిడ్జ్ ప్యాక్ చేసే అంత పెద్ద అట్ట పెట్టెతో బాబా తలుపు వద్ద ఉన్నారు. నేను ఆయనను సరిగా గుర్తుపట్టక ఆశ్చర్యంతో చూస్తున్నాను. ఆయన ఆ పెట్టెను అక్కడ పడేశారు. నేను ఆ పెట్టెను తెరిచి చూస్తే, ఆ పెట్టె నిండుగా బాబా ఊదీతో నిండి ఉంది. దాంతో నాకు మెలుకువ వచ్చింది. కలలో దర్శనమిచ్చినందుకు బాబాకు ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఆయన ప్రేమను చూడండి. నేను కాస్త కన్నీళ్లు పెట్టుకోగానే ఆయన నాకోసం వచ్చారు. ఆయన ప్రేమ గురించి మనం ఏమి చెప్పగలం? నిజంగా చెప్పాలంటే మాటలు లేవు.

బాబాను విశ్వసించండి. బేషరతుగా ఆయనను ప్రేమించండి. ఆయన ఎప్పుడూ మన ప్రార్థనలను వింటారు. నా అనుభవం వ్రాయడానికి నాకు బాబాయే ప్రేరణనిచ్చారు. నా వ్రాయడంలో ఏవైనా తప్పులు ఉంటే క్షమించండి. బాబాకి ప్రేమ అనే ఆకలి. నేను ఎప్పుడూ బాబాను 'పిచ్చి ఆయన' అని పిలుస్తాను. ఎందుకంటే, భక్తులు అపరిమితమైన కోరికలను తననుండి ఆశిస్తుంటే, ఆయన ఎప్పుడూ వారి వెనుక నడుస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని ప్రేమించడం ఆపరు.



6 comments:

  1. Om sai ram 2nd sai leela is fine. She is lucky such dream she got. Happy womens day to all woman devotees. May baba bless all woman with happiness. In world there are great womens. My congrats to them ��❤✌��

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. Om sai ram baba amma problem tondarga cure cheyi thandri pleaseeee

    ReplyDelete
  4. OM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH..Om Sai Ram

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo