సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 721వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. తండ్రిలా ఎంతో సహాయం చేసిన బాబా
  2. 'నా బాబా నన్ను విడిచిపోలేదు, ఎప్పటికీ నన్ను విడిచివెళ్ళరు కూడా!'

తండ్రిలా ఎంతో సహాయం చేసిన బాబా


సాయిభక్తురాలు శ్రీమతి భాగ్య తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.


అందరికీ నమస్కారం. నా పేరు భాగ్య. నేను ఇంతకుముందు బాబా నాకు ప్రసాదించిన రెండు అనుభవాలను మీ అందరితో పంచుకున్నాను. సాయిలీలల గురించి తెలుసుకోవడానికి, నన్ను నేను మార్చుకోవడానికి ఈ బ్లాగ్ ఎంతో ఉపయోగపడుతోంది. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి శతకోటి ధన్యవాదాలు. నేను గత  కొన్ని సంవత్సరాలుగా ఒక సమస్యకు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాను. బాబా దయవల్ల ఆ సమస్య 75 శాతం పరిష్కారమైంది. “ధన్యవాదాలు బాబా!” గత ఎనిమిది నెలలుగా ఎన్నో ఒడిదుడుకులు, కష్టనష్టాల మధ్య ఆ సమస్య పరిష్కారం అయింది. బాబా ఆశీస్సుల వలన ప్రతికూల పరిస్థితులు కూడా మాకు అనుకూలంగా మారాయి. ఈ సందర్భంలో బాబా చూపిన కొన్ని లీలలను మీతో పంచుకోబోతున్నాను. 


మా మామగారు సాయిబాబాకు అంకిత భక్తులు. 2020, ఏప్రిల్ నెలలో ఆయన పరమపదించారు. కేవలం బాబా చూపిన అద్భుతం వలన ఆ రాత్రి సమయంలో ఎటువంటి అనుమతులూ తీసుకోకుండా మేము హైదరాబాదు నుంచి మా సొంత ఊరికి వెళ్లి మా మామగారికి జరగవలసిన కార్యక్రమాలన్నీ ఎటువంటి ఆటంకం లేకుండా జరపడం జరిగింది. కరోనా ప్రభావం వలన ఊరికి వెళ్లడానికి ఆటంకం వచ్చినట్లయితే నా భర్త జీవితాంతం బాధపడుతూనే ఉండేవారు. “థాంక్యూ సో మచ్ బాబా!” 


నా భర్త అన్నదమ్ముల మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో కొన్ని గొడవలు ఉన్నాయి. మా మామగారు తన రిటైర్మెంట్ సొమ్మును ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. ఆ సమయంలో మా మామగారు నామినీని మెన్షన్ చేయనందువల్ల బ్యాంకువారు డబ్బును  తిరిగి మాకు చెల్లించే విషయంలో చాలా సమస్యలు వచ్చాయి. ఈ విషయమై క్వశ్చన్ అండ్ ఆన్సర్ వెబ్‌సైట్లో బాబాను ఎప్పుడూ అడుగుతూ ఉండేదాన్ని. నా ప్రశ్నలకు సమాధానంగా, ‘అంతా సవ్యంగా ఉంటుంది’, ‘వివాదాలు పరిష్కారమవుతాయి’, ‘స్నేహితుల సహాయం ఉంటుంది’, ‘మీరు అనుకున్నదానికంటే ఎక్కువ లాభం పొందుతారు’ అనే సందేశాలతో సానుకూల సంకేతాలు ఇచ్చారు బాబా. బాబా చెప్పింది అక్షరసత్యం. బాబా చెప్పిన ప్రతిదీ జరిగింది. బాబా దయవలన అన్నదమ్ములు ఎటువంటి గొడవలు లేకుండా, బయటి వ్యక్తుల ప్రమేయం లేకుండా, గొడవలు పడకుండా డబ్బును సమానంగా పంచుకున్నారు. అంతేకాదు, ఈ విషయంలో మా స్నేహితులు మాకు చాలా సహాయం చేశారు. నామినీ లేనందున, పత్రాలు సక్రమంగా లేనందున పెద్దమొత్తంలో డబ్బును తమ అకౌంట్లో జమ చేసుకుంటామని చెప్పారు బ్యాంకువారు. కానీ, బాబా దయవలన చాలా చిన్నమొత్తాన్ని మాత్రమే కట్ చేసుకొని మిగిలిన మొత్తాన్ని మాకు చెల్లించారు. “థాంక్యూ సో మచ్ బాబా!” అన్నీ బాబా చెప్పినట్లుగానే జరిగాయి. కుటుంబపెద్దను కోల్పోయిన మాకు బాబానే తండ్రిలా ఎంతో సహాయం చేశారు. మా మామగారి నుండి ఎంతో సహాయం పొందినప్పటికీ మా చుట్టాలందరూ మాకు మొహం చాటేశారు. అటువంటి సమయంలో కూడా బాబానే తండ్రిలాగా ఎవరి సాయం లేకుండా మా అంతట మేమే అన్నీ సక్రమంగా చేసుకునేలా చేశారు. “థాంక్యూ సో మచ్ బాబా!”  


ఇది చాలా చిన్న అనుభవం. గత రెండు సంవత్సరాలుగా మా పాత ఫర్నిచర్ అమ్మాలనుకుంటున్నాం. బాబా దయవలన మంచి ధరకు పాత ఫర్నిచర్ అమ్మి, అదే డబ్బుతో క్రొత్త ఫర్నిచర్ తీసుకున్నాము. “నా అనుభవాలను కొంత ఆలస్యంగా పంచుకుంటున్నందుకు నన్ను క్షమించండి బాబా!” పిలిస్తే పలికే దైవమైన బాబా అండగా ఉండగా నాకు నా భవిష్యత్తు గురించి భయంగానీ, ఆందోళనగానీ ఏమీ లేవు. నాకు, నా కుటుంబానికి ఏది ఎప్పుడు అవసరమో, ఏది మంచిదో అది ఇవ్వడానికి బాబా ఎల్లప్పుడూ ఉంటారని నాకు జరిగిన సంఘటనల ద్వారా పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఎప్పుడు ఎవరికి ఏది మంచిదో దాన్ని ఇవ్వడానికి బాబా ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. “బాబా! మీ చల్లని దీవెనలు మా పిల్లలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. థాంక్యూ సో మచ్, థ్యాంక్యూ ఫర్ ఎవ్రీథింగ్ బాబా!”


'నా బాబా నన్ను విడిచిపోలేదు, ఎప్పటికీ నన్ను విడిచివెళ్ళరు కూడా!'


సాయిభక్తురాలు సాయి ఇటీవల తనకు బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:


సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ నిర్వాహకులకు, తోటి సాయిబంధువులకు నా నమస్కారములు. ప్రతిరోజూ ఈ బ్లాగ్ తెరచి బాబా సందేశాన్ని మరియు సాయిభక్తుల అనుభవాలను చదివి బాబా ఆశీస్సులు పొందుతుంటాను. ఇలాంటి అవకాశం కలిగించినందుకు ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా కృతజ్ఞతలు. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటాను.


నేను చదువుకునే రోజుల నుండి నా మెడలో బాబా లాకెట్ ఉండేది. ఈమధ్య కొన్ని కారణాల వల్ల ఆ లాకెట్ తీసి నేను రోజూ పూజించే బాబా విగ్రహం దగ్గర పెట్టాను. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు మా అమ్మ, “బాబా లాకెట్ ఎందుకు తీసేశావు?” అని నన్నడిగింది. అప్పుడు ఆ లాకెట్‌ను బాబా విగ్రహం వద్ద పెట్టిన సంగతి నాకు గుర్తొచ్చి, “ఒకవేళ నేను రోజూ బాబా వద్దనుండి పువ్వులు తీసేటప్పుడు చూసుకోకుండా ఆ లాకెట్టుని కూడా పువ్వులతో పాటు బయట పారేయలేదు కదా?” అని భయపడ్డాను. ఎందుకంటే, నేను కొన్ని రోజులనుండి ఆ లాకెట్టుని అంతగా గమనించలేదు. అది బంగారు లాకెట్. సాధారణంగా అది ఎప్పుడూ నా మెడలోనే ఉంటుంది. కేవలం కొద్దిరోజుల పాటు దాన్ని తీసి బాబా దగ్గర పెట్టి మళ్ళీ వేసుకోవాలి అనుకున్నాను. నేను అప్పుడు ఆ లాకెట్ కోసం బాబా దగ్గర వెతికే పరిస్థితిలో లేను. అందువల్ల వెంటనే నేను మనసులోనే బాబాకు నమస్కరించుకుని, “తండ్రీ! లాకెట్ దొరికితే సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాను” అని మ్రొక్కుకున్నాను. కొంతసేపటి తరువాత బాబా దగ్గర చూస్తే లాకెట్ అక్కడే భద్రంగా ఉంది. “నా బాబా నన్ను విడిచిపోలేదు, ఎప్పటికీ నన్ను విడిచివెళ్ళరు కూడా” అనుకుని ఎంతో సంతోషించాను. “థాంక్యూ, థాంక్యూ వెరీమచ్ ఫర్ ఎవ్రీథింగ్ బాబా!”



6 comments:

  1. Kothakonda SrinivasMarch 22, 2021 at 8:23 AM

    Om Sairam!

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. Om sai ram baba amma ki manchi medicine epinchi tondarga cure cheyi baba pleaseeee

    ReplyDelete
  4. With baba blessings we went to Tirupati and had Balaji darshan on my birthday is March 22nd and took Shivas blessings also.This birthday is memorable.I have darshan of baba in photo..I felt very happy to see Sai baba. Om Sai ram 🙏🏽🙏🏽🙏🏽❤️🌹👏❤️

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo