సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 714వ భాగం....



ఈ భాగంలో అనుభవాలు:
  1. సాయి ఉండగా ఏ సమస్యకీ మనం భయపడాల్సిన అవసరం లేదు
  2. గులకరాయితో వచ్చిన కష్టం నుండి విముక్తినిచ్చిన బాబా

సాయి ఉండగా ఏ సమస్యకీ మనం భయపడాల్సిన అవసరం లేదు


పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు  తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో ఇలా పంచుకుంటున్నారు:


సాయిబంధువులకు నా నమస్కారాలు. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా ప్రణామాలు. ఒకరోజు మా మరిదికి ఏమైందో తెలియదుగానీ ఉన్నట్టుండి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. దాంతో తను చాలా మానసిక ఆందోళనకు గురై, “ఇక నేను చనిపోతాను, బ్రతకను” అని అనసాగాడు. తన పరిస్థితి చూసి మాకు చాలా భయం వేసింది. “ఏంటి సాయీ, ఇంత చిన్నవయసులో తనకెందుకు ఇంత సమస్య వచ్చింది” అని చాలా బాధపడ్డాము. వెంటనే తనను తీసుకుని హాస్పిటల్‌కి బయలుదేరాము. కానీ దారిమధ్యలో తను, “వద్దు, నేను హాస్పిటల్‌కి రాను. నన్ను ఇంటికి తీసుకువెళ్ళండి” అని గొడవ చేశాడు. అయినా సరే మేము వినకుండా తనను హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాము. కానీ అక్కడ డాక్టర్ లేరు. డాక్టర్ వచ్చేసరికి చాలా సమయం పడుతుందన్నారు. దాంతో మేము మా మరిదిని తీసుకుని ఇంటికి వచ్చేశాము. కానీ తన పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేదు. రాత్రిళ్ళు నిద్రపోయేవాడు కాదు. తన పరిస్థితిని చూసి తట్టుకోలేక నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! మా మరిది శారీరకంగానూ, మానసికంగానూ ఆరోగ్యంగా ఉండేలా అనుగ్రహించండి. మీ అనుగ్రహంతో తనకు నయమైతే నా అనుభవాన్ని సాయి మహారాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అని ప్రార్థించి భారాన్నంతా బాబా మీద వేశాను. బాబా దయవల్ల రెండు రోజుల్లో మా మరిదికి నయమైంది. తనిప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. మన సాయి మనతో ఉండగా ఏ సమస్యకీ మనం భయపడాల్సిన అవసరం లేదు. “థాంక్యూ సో మచ్ బాబా!” 


మా నాన్నగారు మా ఇంట్లో సత్యనారాయణవ్రతం చేయాలనుకున్నారు. వ్రతం ఏ ఆటంకం లేకుండా జరిగితే నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటానని సాయిని ప్రార్థించాను. నేను కోరుకున్నట్టుగానే ఏ ఆటంకం లేకుండా బాబానే దగ్గరుండి వ్రతాన్ని చక్కగా జరిపించారు. “థాంక్యూ సో మచ్ బాబా!”


గులకరాయితో వచ్చిన కష్టం నుండి విముక్తినిచ్చిన బాబా

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

ఒకసారి మా అబ్బాయి ఒక పెద్ద గులకరాయిని మింగేసాడు. తరువాత వాడికి ఏమనిపించిందో ఏమోగానీ వెంటనే నీళ్ళు తాగుతూ నా దగ్గరకి వచ్చి, “అమ్మా! నేను గులకరాయిని మింగేసాను. అది ఎక్కడా ఇరుక్కున్నట్లు అనిపించలేదు. కానీ నాకు భయంగా ఉంది. ఏదైనా జరుగుతుందా?” అని అడిగాడు. అది వింటూనే కలిగిన భయంతో నేను వాడిని తిట్టాను. దాంతో వాడు ఏడవడం ప్రారంభించాడు. వాడిని ఓదార్చి, నా భర్తకి ఫోన్ చేసి మాట్లాడుతున్నాను. అంతలో వాడు మళ్ళీ వచ్చి, “అమ్మా నేను చీటీలు వేసి, 'మీరు నాకు నయం చేస్తారా బాబా?' అని బాబాను అడిగాను. దానికి బాబా, 'చేస్తాన'ని చెప్పార"ని అన్నాడు. నాకు ఎలా స్పందించాలో తెలియలేదు. నేను వాడికి ఏదో సర్ది చెప్పి అరటిపండు తినడానికి ఇచ్చాను. తరువాత కొద్దిసేపట్లో వాడు వాంతి చేసుకున్నాడు. తరువాత మేము మా అబ్బాయిని డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్ళాము. డాక్టర్ ఎక్స్-రే, సోనోగ్రఫీ చేయించి, ఆ రిపోర్టులను పరీశిలించి "ఇలాంటివి మింగేటప్పుడు మన శరీరంలో మూడు చోట్ల అడ్డుకునే అవకాశం ఉంది. రెండింటిని దాటింది కాబట్టి అది మలవిసర్జన ద్వారా బయటకు వచ్చే అవకాశముంది, కానీ మలద్వారం ద్వారా రావడం కాస్త కష్టతరమైన విషయం. కాబట్టి కాస్త గమనిస్తూ ఉండండి. వేరే దారి లేదు" అని చెప్పారు. అప్పుడు నేను, "15 రోజుల తరువాత మళ్ళీ ఎక్స్-రే తీసి చూద్దామ"ని అడిగాను. అందుకు డాక్టర్, "వద్దు, ఎక్స్-రే లు చాలా హానికరమైనవి. అందువలన మీరు ఖచ్చితం గమనిస్తూ ఉండండి" అని చెప్పారు. ఏడు సంవత్సరాల పిల్లాడైనందున వాడికి ఎంత కష్టం కలుగుతుందో అని భయంవేసి, "సహాయం చేయమ"ని బాబాని ప్రార్ధించడం మొదలుపెట్టాను.

నేను నా భర్తతో, "ఆ రాయి గురువారం బయటకు వస్తుందని నేను భావిస్తున్నాను. కానీ నేను దానిని గమనించలేనేమో" అని అన్నాను. నా భర్త, "నేను చూస్తానులే" అన్నారు. మరుసటిరోజు నా భర్త లేని సమయంలో మా అబ్బాయి వాష్ రూమ్ కి వెళ్తానన్నాడు. డాక్టర్ వేరే మార్గం లేదని చెప్పినందువల్ల చాలా కష్టపడి పరిశీలించాను. కాని ఏమీ కనిపించలేదు. మరుసటిరోజు ఆదివారం కూడా అదే పరిస్థితి. నేను నిరాశతో దానిని ఫ్లషవుట్  చేయబోతూ, “బాబా! గురువారం ఇంకా నాలుగు రోజులుంది. అంతవరకు నేను ఈ బాధను భరించలేను. దయచేసి ఏదైనా చేయండి” అని మనసులో అనుకున్నాను. హఠాత్తుగా, "మళ్ళీ ఒకసారి పరిశీలనగా చూడు" అని ఏదో స్వరం నన్ను మార్గనిర్ధేశం చేస్తున్నట్లుగా నాకనిపించింది. సరేనని మళ్ళీ పరిశీలించాను. ఆశ్చర్యం! కర్రకు గులకరాయి తగిలింది. వెంటనే ఆనందంతో బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. బాబా మా అబ్బాయికి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చారు. బాబా నిజంగా చాలా గ్రేట్. గులకరాయిని నా కళ్ళతో చూడాలనుకున్న నా ప్రార్థనకు అనుగుణంగా బాబా మా అబ్బాయి వాష్‌రూమ్‌కు వెళ్లాలనుకున్న సమయంలోనే నా భర్త బయటకు వెళ్ళేలా చేసి నా కళ్ళకు దాన్ని చూపించారు. నా మేనల్లుడు నాణేలను మింగినప్పుడు అది బయటకు రావడానికి 14 రోజులు పట్టింది. కానీ ఆయన నా కష్టాన్ని చూడలేక తొందరగానే దయచూపారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".



7 comments:

  1. 🙏🌺🙏ఓం సాయిరాం🙏🌺🙏

    ReplyDelete
  2. Om sai ram 2nd sai anubhavamu very great. If we trust sai baba he will take care with love and affection. His love to all is great����

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. Om sai ram baba nuvve maku dikku thandri one month lopu amma ki problem toligipovali thandri anta manchiga kavali thandri sainatha

    ReplyDelete
  5. OM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH..Om Sai Ram

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo