సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 702వ భాగం....



ఈ భాగంలో అనుభవాలు:

  1. బాబాను శరణువేడినవారికి ఏనాడూ చెడు జరగదు
  2. బాబా అనుగ్రహంతో తక్కువ వ్యవధిలో వచ్చిన ఉద్యోగం

  3. బాబా ఇచ్చిన అమూల్యమైన బహుమతి

బాబాను శరణువేడినవారికి ఏనాడూ చెడు జరగదు


పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:


సాయిబంధువులందరికీ నమస్కారం. నేను ఒక సాయి పిచ్చుకను. ముందుగా ఈ బ్లాగును నిర్వహిస్తున్న బృందానికి నా నమస్కారాలు. ఇదివరకు నా అనుభవాలు కొన్ని ఈ బ్లాగ్ ద్వారా మీ అందరితో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. ముందుగా బాబాకు క్షమాపణలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే, ఈ అనుభవాలు జరిగి చాలా రోజులు అయింది.


మొదటి అనుభవం:


మా అబ్బాయి విదేశాలలో మెడిసిన్ పూర్తిచేసి వచ్చాడు. ఇక్కడ హౌసి చేయడానికి పరీక్ష ఒకటి వ్రాశాడు. కానీ ఆ పరీక్షలో మా అబ్బాయి సెలెక్ట్ కాలేదు. రెండవసారి తను పరీక్ష వ్రాసేముందు నేను, "బాబా! అబ్బాయి పరీక్షలో ఈసారి ఉత్తీర్ణుడైతే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకు చెప్పుకున్నాను. బాబా దయవలన మా అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు. ఇప్పుడు తను హౌసి చేస్తున్నాడు.


రెండవ అనుభవం:


మా అమ్మాయికి నెలసరి క్రమంగా వచ్చేది కాదు. మందులు వాడినా ప్రయోజనం లేకపోయింది. ఆ విషయమై నేను రోజూ బాబాకు చెప్పుకుంటూ ఉండేదాన్ని. దయామయులైన బాబా మాపై కరుణ చూపించారు. ఇప్పుడు మా అమ్మాయి సమస్య తీరిపోయి నార్మల్‌గా వుంది. కృతజ్ఞతగా మా అమ్మాయితో నవగురువార వ్రతం చేయించాను. మిగిలిన సమస్యలు కూడా త్వరలోనే తీరుతాయని బాబాపై పూర్తి నమ్మకంతో ఉన్నాను. అవి నెరవేరిన తరువాత బ్లాగులో పంచుకుంటానని బాబాకు చెప్పుకొని బాబా దయకోసం ఎదురుచూస్తున్నాను. బాబా కృపతో త్వరలోనే వాటిని కూడా మీతో పంచుకుంటాను. బాబాను శరణువేడినవారికి ఏనాడూ చెడు జరగలేదు. ఈ విషయం సాయిభక్తుల అనుభవాలతో స్పష్టంగా తెలుస్తుంది. "బాబా! ఇలాగే మీ కరుణ, దయ, ప్రేమానురాగాలు ఎప్పుడూ మాపై చూపించండి తండ్రీ. మీరే మాకు దిక్కు, మమ్మల్ని అనుగ్రహించండి బాబా!"


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.


బాబా అనుగ్రహంతో తక్కువ వ్యవధిలో వచ్చిన ఉద్యోగం


సాయినాథునికి మరియు సాయిభక్తులకి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు నాగమణి. నేను మొదటినుండి బాబా భక్తురాలిని కాదు. ఇటీవలే బాబాకు భక్తురాలినయ్యాను. 2020 సంవత్సరంలో నేనొక పెద్ద సమస్యలో ఉన్నప్పుడు, జీవితం మీద ఆశలన్నీ వదిలేసుకున్న సమయంలో నేను బాబాకు దగ్గరయ్యాను. నా జీవితంలో అదొక పెద్ద అద్భుతం. అప్పటినుండి నా జీవితంలో చాలా మార్పు వచ్చింది. బాబా అద్భుతాలు చేస్తారని అందరూ అంటుంటే విన్నాను. అది నూటికి నూరుశాతం నిజం. నా జీవితంలో కూడా బాబా అలాంటి అద్భుతాలను చేశారు. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన ఒక చిన్న అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను. 


ఒకరోజు నేను ఉద్యోగం చేస్తున్న కంపెనీ యాజమాన్యం నన్ను పిలిపించి, “ఆఫీసు మూసివేస్తున్నాం, మీరు వేరే ఉద్యోగం చూసుకోండి” అని చెప్పారు. అప్పటికే నేను నా వ్యక్తిగత జీవితంలో చాలా సమస్యలలో ఉన్నాను. వాటికి తోడు ఉద్యోగం కూడా లేకపోయేసరికి ఏం చేయాలో దిక్కుతోచలేదు. దాంతో నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా, మీరే నాకు ఒక దారి చూపించాలి” అని వేడుకున్నాను. ఒక వారం రోజుల్లో నాకు ఒక కంపెనీ నుండి ఇంటర్వ్వూ కాల్ వచ్చింది. బాబా దయవల్ల ఇంటర్వ్యూ చక్కగా పూర్తిచేయగలిగాను. ఇంటర్వ్యూ అయిన తరువాత కంపెనీవాళ్ళు నాతో, “మీరు ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యారు. ఆఫర్ లెటర్‌తో పాటు మిగతా సమాచారమంతా మీకు మెయిల్‌లో పంపిస్తాము” అని చెప్పారు. కానీ 2,3 రోజులైనా నాకు వాళ్ళనుంచి మెయిల్ రాలేదు. దాంతో నేను చాలా ఆందోళనపడి బాబాతో చెప్పుకున్నాను. 3 రోజుల తరువాత ఆ కంపెనీ నుండి ఆఫర్ లెటర్‌తో నాకు మెయిల్ వచ్చింది, అది కూడా గురువారంరోజు! ఎంతో ఆనందంతో మనసులోనే బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. బాబా నాకు ప్రసాదించిన మరో అనుభవంతో త్వరలోనే మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ ధన్యవాదాలు.


బాబా ఇచ్చిన అమూల్యమైన బహుమతి పిల్లలు ఉంటేనే ఆ ఇంటికి శోభ. పిల్లలు లేని ఇంటి గురించి ఏమి చెప్పేది. దురదృష్టవశాత్తు నా కుమార్తె ఈ విషయంలో పరీక్షించబడింది. పిల్లలు కలగక తను చాలా నిరాశకు గురైంది. తన జీవితంలో విచారం అలుముకుంది. పిల్లలులేక తన సంసారం అంధకారమైపోతుంటే నేనేమి చేయగలను? అందువలన నేను చాలా బాధపడ్డాను. కానీ నేను సహనాన్ని కోల్పోలేదు. నాకు బాబాపై దృఢమైన నమ్మకం ఉంది. ఏదో ఒకరోజు బాబా నా బాధను తెలుసుకుంటారని అనుకున్నాను. నేను నా కూతురికి చదవమని సాయి సచ్చరిత్ర గ్రంథాన్ని ఇచ్చి, హృదయపూర్వకంగా బాబాను ఆరాధించమని చెప్పాను. తను అలాగే చేసింది. అద్భుతం జరిగినట్లు అంధకార జీవితంలో ఆశా కిరణం కనిపించింది. బాబా అనుగ్రహంతో తను గర్భం దాల్చింది. తమ పట్ల అంకితభావంతో ఉండే భక్తులకు బాబా ఎప్పుడూ విలువైన బహుమతినిస్తారు. - సౌ. ఉషా ప్రభాకర్, శిరిడీ. సోర్స్: సాయి లీలా పత్రిక, 1976.



10 comments:

  1. Kothakonda SrinivasMarch 3, 2021 at 10:19 AM

    జై సాయిరాం! జై గురుదత్త!

    ReplyDelete
  2. Very nice leelas. Last one I liked it. I am thinking bad about my husband. Please change my thoughts sai������

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. Om sai ram baba ne agna prakaram amma medicine vadtundhi tondarga cure cheyi baba

    ReplyDelete
  5. OM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH

    Om Sai Ram

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo