సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 723వ భాగం...



ఈ భాగంలో అనుభవాలు:

  1. సాయి చూపిన అనుగ్రహం
  2. బాబా అనుగ్రహంతో చేకూరిన ఆరోగ్యం

సాయి చూపిన అనుగ్రహం


సాయిభక్తురాలు ఉమ తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.


ఓం శ్రీ సాయినాథాయ నమః 


నేను సాయిభక్తురాలిని. ముందుగా ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా ధన్యవాదాలు. ఈ బ్లాగు ద్వారా నేను సాయినాథునికి మరింత దగ్గరయ్యాను. నా పేరు ఉమ. మాది నిజామాబాద్ జిల్లా. 2019 ఫిబ్రవరి నెలలో నేను మొట్టమొదటిసారి 'సాయి సచ్చరిత్ర' సప్తాహపారాయణ చేశాను. ఆ పారాయణతో నేను సాయికి చాలా చేరువయ్యాను. ఆ సంవత్సరంలోనే బాబా నాకు చాలా అనుభవాలను ప్రసాదించారు. అందులోని రెండు అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. "బాబా! నా ఆరోగ్యానికి సంబంధించిన ఒక సమస్య గురించి ముందుగా బ్లాగులో పంచుకోవాలన్న ఉద్దేశ్యంతో వేరే అనుభవాలను పంచుకోకుండా నిర్లక్ష్యం చేసినందుకు నన్ను క్షమించండి".


మొదటి అనుభవం:


నేను నా సాయి ఆదేశం మేరకు ప్రతిరోజూ సచ్చరిత్రలోని ఒక అధ్యాయం పారాయణ చేస్తుంటాను. సాధారణంగా నేను పొద్దున్నే దేవుని ముందు దీపాలు వెలిగించి, ఇంట్లో అందరూ అల్పాహారం పూర్తిచేశాక పారాయణ చేస్తాను. అలాగే 2019, నవంబరు నెలలో ఒకరోజు ఉదయం కూడా పారాయణ మొదలుపెట్టబోతుండగా బాబా ముందున్న ప్రమిదల్లో నూనె 75% అయిపోయి, 25% మాత్రమే మిగిలివుండటం చూశాను. 'పారాయణ ముగిసేవరకు నూనె సరిపోతుందా? లేదా?' అని అనుకుంటూనే 'సరిపోతుందిలే' అని పారాయణ ముగించాను. అప్పుడు సమయం పదిన్నర అవుతోంది. తర్వాత నేను ఇంట్లో పనులన్నీ ముగించుకొని కాసేపు విశ్రాంతి తీసుకుంటుండగా నా దృష్టి అనుకోకుండా బాబా ముందున్న దీపం మీద పడి ఆశ్చర్యపోయాను. కారణం, ఇంకా దీపం వెలుగుతూనే ఉంది. అప్పుడు సమయం మధ్యాహ్నం రెండున్నర అయింది. ఉదయం 10:30 సమయంలో ప్రమిదలో నూనె ఎంత ఉందో మధ్యాహ్నం 2:30కి కూడా అంతే ఉంది. చూశారా, మన సాయి చేసిన అద్భుతం!


రెండవ అనుభవం:


2019 డిసెంబరు నెలలో నా మెడ, నడుము భాగాలలో ఎర్రటి మచ్చలు వచ్చాయి. నాకు చాలా భయం వేసింది. రెండు రోజులలో తగ్గిపోతుందిలే అనుకున్నాను కానీ, తగ్గలేదు. అప్పుడు నేను సాయినాథుని ప్రార్థించి, ఆ మచ్చలపై బాబా ఊదీ రాసి, "మచ్చలు తగ్గిపోతే, నా అనుభవాన్ని సాయిబంధువులందరితో పంచుకుంటాన"ని అనుకున్నాను. అద్భుతం! మరుసటిరోజునుండే ఆ మచ్చలు తగ్గడం ప్రారంభించి తొందరలోనే పూర్తిగా తగ్గిపోయాయి. "ఇంతటి అనుగ్రహాన్ని కురిపించిన నా సాయీ, మీకు సర్వస్య శరణాగతి చెందేలా నన్ను ఆశీర్వదించండి తండ్రీ!".


బాబా అనుగ్రహంతో చేకూరిన ఆరోగ్యం


యు.ఎస్.ఏ నుండి సాయిభక్తురాలు సౌజన్య ఇటీవల తనకు బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:


సాయిభక్తులందరికీ నా నమస్కారం. నా పేరు సౌజన్య. మేము అమెరికాలో నివసిస్తున్నాము. బాబా నాకు చాలా అనుభవాలను ప్రసాదించారు. ఈమధ్యకాలంలో బాబా నాకు మరొక అనుభవాన్ని ప్రసాదించారు. ఆ ఆనందాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. ఈమధ్య ఒకసారి మా పాప కడుపునొప్పితో చాలా బాధపడింది. బాబాకు చెప్పుకొని, కొద్దిగా ఊదీని పాప కడుపుపై రాసి, మరికొంత ఊదీని నీళ్లలో కలిపి తనచేత త్రాగించాను. అప్పటికి కడుపునొప్పి తగ్గినప్పటికీ మరలా రాసాగింది. అలా తనకు నొప్పి వస్తున్న ప్రతిసారీ నాకు చాలా భయమేసేది. ఆ తర్వాత ఒకరోజు తనకు జ్వరం కూడా వచ్చింది. అయితే అదేరోజు తను బయట ఆడుకుంటూ ఉండగా తనను దోమలు బాగా కుట్టడంతో నాకు లేనిపోని అనుమానాలెన్నో వచ్చాయి. వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళలేని పరిస్థితి, ఎందుకంటే ఇక్కడ అమెరికాలో అనుకున్నంతనే హాస్పిటల్‌కి వెళ్ళలేము. ముందుగా అపాయింట్‌మెంట్ తీసుకోవాలి. అది కూడా ఎప్పటికి దొరుకుతుందో తెలీదు. పాప ఒకపక్క కడుపునొప్పి, మరోపక్క జ్వరంతో బాధపడుతుంటే తల్లిగా నా బాధ ఏమని చెప్పను? ఏమి చేయాలో నాకు అర్థంకాక బాబాకు చెప్పుకొని చాలా బాధపడ్డాను. తరువాత బాబా అనుగ్రహం వల్ల హాస్పిటల్‌కి వెళ్ళగలిగాము. అక్కడికి వెళ్లగానే నేను నా మనసులో, “నువ్వే వచ్చి నా కూతుర్ని చూడాలి బాబా” అని అనుకున్నాను. ఎంతో ఆశ్చర్యంగా వయసు పైబడిన ఒక పెద్దాయన నవ్వుతూ వచ్చారు. ఆయన నాకు బాబాలానే అనిపించారు. నేను పొందిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఆయన నా కూతుర్ని పరీక్షించి, “ఏమీ కాదు. ఇది మామూలుగా వచ్చే కడుపునొప్పే” అని చెప్పి మందులు ఇచ్చారు. ఆ మందులు వాడగానే ఒక్కరోజులోనే మా పాప కడుపునొప్పి తగ్గిపోయింది. జ్వరం మాత్రం కేవలం సాయంత్రం వేళల్లో వస్తుండేది. దోమల వలననేమో అని నాకు భయమేసింది. అసలే చిన్నపాప, ఇలా రోజూ జ్వరం వస్తే ఎలా తట్టుకుంటుంది? పాపకు జ్వరం తగ్గించమని బాబాను వేడుకుని, నిరంతరం బాబానే ధ్యానిస్తూ, ఆయన నామస్మరణ చేయసాగాను. ‘ఓం ఆరోగ్య క్షేమదాయ నమః’ అనే మంత్రాన్ని 11 సార్లు జపించి, బాబా ఊదీని పాపకు రాసి, “మీ దయతో పాపకు నయమైతే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన”ని బాబాకు మ్రొక్కుకున్నాను. ఆ క్షణంనుండి అంతా అనుకూలంగా మారిపోయింది. రెండు రోజుల్లో పాప పూర్తిగా కోలుకుంది. బాబా పైన నాకున్న ప్రేమ ఎన్నో రెట్లు పెరిగింది. “చాలా చాలా కృతజ్ఞతలు బాబా.  అంతా నీ దయవల్లనే. నాకు తల్లివి, తండ్రివి, అన్ని బంధాలూ నీవే. అన్ని దేవతారూపాలను నేను నీలోనే చూసుకుంటున్నాను. కరోనా మహమ్మారి నుండి మమ్మల్నందరినీ కాపాడండి. నేను ఎప్పటినుండో మిమ్మల్ని అడుగుతున్న కోరికను కూడా దయచేసి నెరవేర్చండి బాబా. థాంక్యూ బాబా! లవ్ యు బాబా!”



9 comments:

  1. Om sai ram 1st sai leela is very nice. Oil in diya never ends up. This miracle is very good. She is lucky devotee. My desire didn't got happen. I want to see baba in dream. When my desire happens sai knows. Please bless my son with long life. ������������❤��

    ReplyDelete
  2. ఓం సాయిరాం🙏🌺🙏

    ReplyDelete
  3. Kothakonda SrinivasMarch 24, 2021 at 2:06 PM

    Om Sairam

    ReplyDelete
  4. ఓం శ్రీ సాయినాథాయ నమః

    ReplyDelete
  5. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  6. Om sai ram baba please amma arogyam bagundali thandri

    ReplyDelete
  7. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATHAYA NAMAH..OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo