సాయి వచనం:-
'ఈ ప్రపంచం చాలా వింతైనది. అందరూ నా ప్రజలే. అందరినీ నేను సమానంగా చూస్తాను. కానీ, వారిలో కొందరు దొంగలవుతారు. వారికి నేను చేయగలిగిందేముంది?'

'బాబా తలచుకొంటే మనమెక్కడున్నా సమాధానమివ్వగలరు' - శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 711వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా మీద భారం వేస్తే అంతా ఆయన చూసుకుంటారు
  2. సాయిని నమ్మితే మనకు భయమెందుకు? అన్నిటికీ సాయినాథుడే రక్షణ!

బాబా మీద భారం వేస్తే అంతా ఆయన చూసుకుంటారు


నా పేరు అంజలి. నేను విద్యుత్తు డిపార్ట్‌మెంటులో పనిచేస్తున్నాను. ఈమధ్య మా ఆఫీసులో బ్యాటరీ ఛార్జర్ కావలసివచ్చింది. ఒక సబ్‌స్టేషన్లో అది చాలా ముఖ్యమైనది. కానీ ఎన్నిసార్లు చెప్పినా మా పైఅధికారులు 'చూద్దాం' అంటూ ఛార్జర్ తెప్పించకుండా ఆలస్యం చేస్తూ వచ్చారు. నేను వాళ్ళకు ఎంతగానో చెప్పి చెప్పి విసిగిపోయి చివరికి బాబా మీద భారం వేశాను. మన బాబా అద్భుతం చేశారు. బాబా వేరే సబ్‌స్టేషన్లో సమస్య సృష్టించి, ఆ ఛార్జర్ యొక్క ఆవశ్యకత ఎంతగా ఉందో మా పైఅధికారులకు తెలియజేశారు. దాంతో వెంటనే మా సబ్‌స్టేషన్‌కి కొత్త ఛార్జర్ వచ్చింది. బాబా మీద భారం వేస్తే అంతా ఆయన చూసుకుంటారు


ఇటీవల మా అమ్మకి మూడురోజులపాటు ఆరోగ్యం అస్సలు బాగాలేదు. అమ్మ ఆరోగ్యం బాగుండేలా అనుగ్రహించమని బాబాకు చెప్పుకొని, ఊదీ కలిపిన నీళ్లను అమ్మకి ఇచ్చాను. మన దయగల తండ్రి బాబా కృపవల్ల మరునాడు ఉదయానికల్లా అమ్మ లేచి కూర్చుంది


అలాగే, ఈమధ్య ఫిబ్రవరి 16న నా పుట్టినరోజు వచ్చింది. ఆ సమయంలో మా ఊరిలో గాయత్రి హోమం జరుగుతోంది. పుట్టినరోజు సందర్భంగా అక్కడికి వెళ్లాలనిపించి ‘సెలవు దొరుకుతుందో, లేదో; వెళ్లగలనో, లేదో’ అని ఆందోళనచెంది బాబాకు చెప్పుకున్నాను. బాబా నాకు ఆఫీసులో సెలవు ఇప్పించి, ఏ సమస్యా లేకుండా గాయత్రి హోమానికి వెళ్లి వచ్చేలా అనుగ్రహించారు. అలాగే నా పుట్టినరోజు కానుకగా బంగారం కూడా ఇచ్చారు. 


నా ఉద్యోగానికి సంబంధించి ఒక వార్త వినాలని ఎదురుచూస్తున్నాను. నాకేది క్షేమమో బాబాకు తెలుసు గనక ఆ విషయం కూడా బాబానే చూసుకుంటారని ఆయనకే అప్పగించాను. ఉద్యోగంలో బదిలీ అయితే మరలా నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటాను.


సాయిని నమ్మితే మనకు భయమెందుకు? అన్నిటికీ సాయినాథుడే రక్షణ!


సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. నేను సాయినాథుని పాదధూళిని. నా పేరు గోపాలకృష్ణ. ప్రస్తుతం నేను బెంగళూరులో ఉంటున్నాను. 2021, ఫిబ్రవరి 10వ తేదీన మా చిన్నబ్బాయికి విపరీతమైన జలుబు, దగ్గు, జ్వరం వచ్చాయి. జ్వరం తగ్గటానికి డోలో-650 మరియు జలుబు తగ్గటానికి కోల్డ్ యాక్ట్ టాబ్లెట్లు వేసుకున్నాడు. కానీ రెండు రోజులైనా కాస్త కూడా తగ్గలేదు. దాంతో మా అబ్బాయిని దగ్గరలో ఉన్న అపోలో హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళాము. తనను పరీక్షించిన డాక్టర్, “ఇవి టైఫాయిడ్‌కు సంబంధించిన లక్షణాలుగా అనిపిస్తోంది, కోవిడ్ కూడా అయివుండవచ్చు. కొన్ని టెస్టులు చేసి చూద్దాం” అని చెప్పి, మా అబ్బాయికి బ్లడ్ టెస్ట్, కోవిడ్ టెస్ట్ చేశారు. తరువాత కొన్ని రకాల మందులిచ్చి, “ప్రస్తుతానికి ఈ మందులు వాడండి. రేపు టెస్ట్ రిపోర్టులు వచ్చిన తరువాతే ఏదైనా నిర్ధారించుకోగలము. అప్పటివరకు ఇంటిలోనే జాగ్రత్తగా ఉండమ”ని చెప్పారు. డాక్టర్ చెప్పింది విని మాకు చాలా భయమేసింది. ఎలాంటి సమస్యా లేకుండా మా అబ్బాయి ఆరోగ్యంగా ఉండేలా అనుగ్రహించమని నేను బాబాకు విన్నవించుకున్నాను. బాబా దయవల్ల మరుసటిరోజు ఉదయం తనకు టైఫాయిడ్ లేదని రిపోర్టు వచ్చింది. కోవిడ్ రిపోర్టు మాత్రం ఆరోజు సాయంత్రం వస్తుందని చెప్పారు. అప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! కోవిడ్ రిపోర్టు కూడా నెగిటివ్ వచ్చేలా చేయి తండ్రీ. మా అబ్బాయికి ఏ సమస్యా లేకుండా చూడండి” అని చెప్పుకున్నాను. మన సాయి అద్భుతం చేశారు. ఆ సాయంత్రం వచ్చిన కోవిడ్ టెస్ట్ రిపోర్టులో మా అబ్బాయికి నెగిటివ్ వచ్చింది. ఎంతో సంతోషంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ప్రార్థించినంతనే మాకు రక్షణగా నిలిచిన శ్రీసాయినాథునికి శతకోటి వందనాలు. మన సాయి తనను నమ్మినవారినందరినీ రక్షిస్తారు.


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.



7 comments:

  1. Om Sai ram 🙏🏽🙏🏽🙏🏽❤️👍

    ReplyDelete
  2. Kothakonda SrinivasMarch 13, 2021 at 5:29 AM

    జై సాయిరాం జై గురుదత్త

    ReplyDelete
  3. Om sai ram please amma pyna daya chupinchayya thandri

    ReplyDelete
  4. ఓంసాయి శ్రీసాయి జయజయసాయి

    ReplyDelete
  5. Baba Kalyan ki marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi.house lo.problem solve cheyandi pl

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo