- బాబా ఆశీస్సులతో మొదలైన వీసా అప్లికేషన్ ప్రాసెసింగ్
- మ్రొక్కుకున్న కొన్ని గంటల్లోనే నా కోరిక తీర్చిన బాబా
- కోపాన్ని నియంత్రించిన బాబా
బాబా ఆశీస్సులతో మొదలైన వీసా అప్లికేషన్ ప్రాసెసింగ్
సాయిభక్తురాలు శ్రీమతి భావన తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
అందరికీ నమస్కారం. ఇంతకుముందు నేను ఈ బ్లాగులో పంచుకున్న అనుభవంలో(https://saimaharajsannidhi.blogspot.com/2020/12/621.html?m=1 సచ్చరిత్ర ద్వారా బాబా సందేశం) మావారు ఇండియా రావడానికి బాబా ఎలా సహాయం చేశారో చెప్పాను. బాబా ఆశీర్వదించినట్లే మావారు ఏ సమస్యా లేకుండా ఇండియా వచ్చారు. బాబా అనుగ్రహంతో మొదటి సంవత్సరం పెళ్లిరోజున మేమిద్దరం కలిసి ఉన్నాము.
పెళ్లయిన మొదటిరోజు నుండే మేమిద్దరం కలిసి ఉండాలని వీసా కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాము. మొదటి రెండుసార్లు టెంపరరీ వీసా కోసం ప్రయత్నిస్తే అది విఫలమైంది. ఆ తర్వాత పర్మనెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాము. కరోనా వల్ల వీసా ప్రాసెస్ చాలా ఆలస్యం అయింది. నా పర్మినెంట్ రెసిడెన్స్ అప్లికేషన్‌ను మే నెలలో పంపగా, అనుకోని కారణాలవల్ల ఆ అప్లికేషన్ ప్రాసెస్ చేయకుండా త్రిప్పి పంపబడింది. అది నవంబరులో జరిగింది. తిరిగి మళ్ళీ మేము డిసెంబరులో అప్లై చేసుకున్నాము. మొదటి పర్మినెంట్ రెసిడెన్స్ అప్లికేషన్ తిరస్కరింపబడటం వల్ల మేము చాలా సమయం నష్టపోయాము. అంతేకాకుండా, కొత్త అప్లికేషన్ ఓపెన్ అవడానికి చాలా నెలల సమయం పడుతూ ఉంది. దాంతో నాకెంతో బాధవేసి, నా బాధనంతా బాబాకు చెప్పుకుని, మొదటి పెళ్లిరోజు (ఫిబ్రవరి 26) కంటే ముందే అప్లికేషన్ ప్రాసెసింగ్ మొదలయ్యేలా చేయమని వేడుకుని, అలా జరిగితే నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటానని మ్రొక్కుకున్నాను. బాబా ఆశీస్సులతో నేను అడిగినదానికంటే త్వరగానే, అంటే ఫిబ్రవరి 11వ తారీఖున మా అప్లికేషన్ ఓపెన్ అయి ప్రాసెసింగ్ మొదలైంది. అప్లికేషన్ ప్రాసెసింగ్ త్వరగా పూర్తయి, మే లేదా జూన్ కల్లా వీసా రావాలని బాబాను మనసారా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
మ్రొక్కుకున్న కొన్ని గంటల్లోనే నా కోరిక తీర్చిన బాబా
సాయిభక్తురాలు సాయిలక్ష్మి తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
అందరికీ నమస్కారం. నా పేరు సాయిలక్ష్మి. ముందుగా ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయిబంధువులకు నా కృతజ్ఞతలు. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన అనుభవాన్ని మీతో పంచుకోబోతున్నాను. దాదాపు ఒక సంవత్సరం నుండి నాకు నెలసరి విషయంలో సమస్యలు వస్తున్నాయి. దానివల్ల ఎంతో ఆందోళన చెందాను. ఎన్ని మందులు వాడినప్పటికీ ఆ సమస్యలు తగ్గలేదు. దాంతో నాకు PCOD (PolyCystic Ovarian Disease) ఉందేమో అని చాలా భయపడ్డాను. ‘అమ్మాయికి త్వరలో వివాహం కావలసి ఉంది, ఇప్పుడు ఈ సమస్య వచ్చిందే’ అని నా విషయంలో మా అమ్మ చాలా భయపడింది. ఇటీవల మూడు నెలలైనా నెలసరి రాకపోవడంతో మా హాస్పిటల్లోనే గురువారంరోజున గైనకాలజిస్టుకి చూపించుకున్నాను. ఆవిడ నన్ను స్కానింగ్ చేయించుకోమని చెప్పారు. నేను స్కానింగ్ చేయించుకున్నాను. ఆ స్కానింగ్ రిపోర్టు పరిశీలించిన డాక్టర్, ‘PCOD సమస్య ఏమీ లేద’ని చెప్పారు. దాంతో నేను చాలా సంతోషించాను. ఆ తరువాత నెలసరి సరిగ్గా రావటానికి డాక్టర్ మందులు రాసిచ్చింది. అవి వాడటం ప్రారంభించి పదిరోజులు అవుతున్నప్పటికీ నెలసరి రాలేదు. నేను ఎప్పుడూ బాబాను నా ఆరోగ్యం కోసం కోరుకోలేదు. కానీ ఈసారి మాత్రం బాబాకు నమస్కరించుకుని, “బాబా! నాకు నెలసరి వచ్చేలా అనుగ్రహించు. నీ దయవల్ల నాకు నెలసరి వస్తే నా అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అని వేడుకున్నాను. సాయి నిజంగా తమ మహిమను చూపి నేను మ్రొక్కుకున్న కొన్ని గంటల్లోనే నా కోరిక తీర్చారు. “సాయీ! పిలిచిన వెంటనే పలుకుతావు. నీ భక్తురాలిని అయినందుకు నేను చాలా అదృష్టవంతురాలిగా భావిస్తున్నాను. ధన్యవాదాలు తండ్రీ!” నా అనుభవాన్ని పంచుకునే అవకాశాన్ని నాకిచ్చిన సాయిబంధువులందరికీ నా కృతజ్ఞతలు.
కోపాన్ని నియంత్రించిన బాబా
ఒక అజ్ఞాత సాయి భక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
ఇటీవల ఒకరోజు రాత్రి నేను నాకు చాలా ఇష్టమైన వ్యక్తికి కొన్ని కారణాల వలన చాలా మొరటుగా బాధ కలిగించే సందేశాలను పంపించాను. నిజానికి అప్పటికీ మూడురోజుల ముందు నుండి నేను క్వశ్చన్&ఆన్సర్ సైట్ లో ఆ సందేశాలను పంపాలా వద్దా అని బాబాను అడుగుతున్నాను. నేనలా అడిగిన ప్రతిసారీ బాబా వద్దనే సమాధానం ఇచ్చారు. కానీ నాల్గవరోజున నన్ను నేను నియంత్రించుకోలేక బాబాను అడగకుండా ఆ సందేశాలను పంపించేసాను. కానీ వాటిని పంపిన తరువాత, తను ఆ సందేశాలను మరుసటిరోజు ఉదయం చూసి ఖచ్చితంగా నాపై కోపం తెచ్చుకుంటాడని, ఏదైతే తనకు అస్సలు నచ్చదో, అటువంటి బాధించే సందేశాలను పంపినందుకు తను నాతో చాలారోజులు మాట్లాడకపోవచ్చని నేను చాలా భయపడ్డాను. దాంతో "తన కోపం నుండి నన్ను రక్షించమ"ని బాబాను ప్రార్థించడం ప్రారంభించాను. "నేను తనని నిజంగా ప్రేమిస్తున్నాను బాబా. అతనితో మాట్లాడకుండా ఉండలేను. దయచేసి నేను భయపడినట్లు ఏదీ జరగకుండా చూడమ"ని ఆ రాత్రంతా నేను బాబాని ప్రార్థించాను. బాబా అనుగ్రహించారు. మరుసటిరోజు ఉదయం ఒక అద్భుతం జరిగింది. ఎటువంటి కోపం లేకుండా తన నుండి నాకు చాలా సాధారణమైన సందేశం వచ్చింది. తన కోపం గురించి తెలిసిన నేను ఆ సందేశం చూసి ఆశ్చర్యపోయాను. ఇది బాబా దయవల్లే జరిగింది. "ధన్యవాదాలు బాబా. నేను పొరపాటు చేసినా మీరు నన్ను రక్షించారు. ఇకపై ఇలా చేయను. దయచేసి నన్ను క్షమించండి. కోవిడ్ 19 కారణంగా చాలా సమస్యలు, సందేహాలు తలెత్తుతున్నాయి. దయచేసి అన్నీ పరిష్కరించండి బాబా. నేను చాలా బాధపడుతున్నాను. కోవిడ్ 19 కారణంగా నేను ఉద్యోగం కోల్పోయాను. నాకు ఉద్యోగం చాలా అవసరమని మీకు తెలుసు. మీరు ఖచ్చితంగా అవసరమైనవి చేస్తారని, నాకొక ఉద్యోగాన్ని ఇచ్చి ఆర్థికంగా సహాయం చేస్తారని మీమీద నాకు నమ్మకం ఉంది. నేను కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను, నాకు అవకాశం ఇవ్వండి. దయచేసి సహాయం చేయండి బాబా".
ఓం సాయిరామ్.
Source: http://www.shirdisaibabaexperiences.org/2020/05/shirdi-sai-baba-miracles-part-2729.html
Sairam I'm feel happy. Sai laxmi gari experience naaku answer iendi, Nenu kuda same problem lo unna. Nenu hospital ki vella ledu, baba udi ni tisukuntuna. Jai sairam. E experience naaku answer anukuntana. Sai pls bless me in health issues. Pls bless to all
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
679 days
ReplyDeletesairam
Om sai ram baba amma Arogyam bagundela chudu thandri
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATHAYA NAMAH..OM SAI RAM
ReplyDelete