సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుడు - బాలకృష్ణ ఖపర్డే


నమ్ముకున్న వారిపై బాబా అనుగ్రహం ఎంతగా ఉంటుందో తెలియజేసే అద్భుతలీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

బాలకృష్ణ ఖపర్డే అలియాస్ బాబాసాహెబ్ ప్రసిద్ధ “శిరిడీ డైరీ” రచించిన శ్రీదాదాసాహెబ్ ఖపర్డే కుమారుడు. బాబా సమాధి చెందిన తరువాత అతనికి జరిగిన ఈక్రింది సాయిలీలను దాదాసాహెబ్ ఖపర్డే మనుమడైన శ్రీ కేశవ్ ఖపర్డే ఇలా చెప్తున్నాడు:

ఒకప్పుడు బాలకృష్ణ ఖపర్డే భోపాల్ నుండి పచ్మడికి కారులో ప్రయాణిస్తున్నాడు. కొండప్రాంతంలో ఉన్న ఆ మార్గం బాగా ఒంపులతో నిటారుగా ఉంది. మరోవైపు బాగా లోతైన లోయలు ఉన్నాయి. కారు పైకి ఎక్కుతూ ఒకచోట మలుపు తిరుగుతున్న సమయంలో ఎదురుగా వస్తున్న మరో కారు బలంగా ఢీకొట్టింది. అంతే! ఉన్నపళాన అతని కారు లోతైన లోయలోకి పడిపోయింది. అటువంటి నిస్సహాయస్థితిలో నిరాశా నిస్పృహలతో అతడు తమని రక్షించమని బాబాను ఆర్తిగా పిలిచాడు. అంతలో తెల్లని కఫ్నీ ధరించిన ఒక వ్యక్తి చేయి ఆ కారు తలుపు తెరవడం అతడు చూశాడు. మరుక్షణంలో అతను, డ్రైవర్ ఇద్దరూ ఒక బండమీద ఉన్నారు, కారు లోతైన అగాధంలో పడిపోయింది. ఇద్దరూ తమ నుదుటిపై చిన్నగా గీసుకుపోవడం తప్ప తీవ్రమైన గాయాలేమీ లేకుండా అంత పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డారు. సాయిబాబాయే కారు తలుపులు తెరచి, వారిని సురక్షితంగా కాపాడారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

సమాప్తం.

మూలం: విన్నీ చిట్లూరి రచించిన బాబా అనురాగ్.

8 comments:

  1. sai baba saved car not to fall in the dich.they are very lucky.with sais grace they saved from accident.

    ReplyDelete
  2. ఓం శ్రీ సాయి నాథ్ మహారాజ్ కీ జై

    ReplyDelete
  3. Kothakonda SrinivasMay 18, 2021 at 12:57 PM

    ఓం సాయిరాం

    ReplyDelete
  4. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha ��������❤

    ReplyDelete
  5. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo