ఈ భాగంలో అనుభవాలు:
- మా అబ్బాయికి రక్షణనిచ్చిన సాయి
- బాబాని నమ్మి ప్రార్థిస్తే తప్పక కరుణిస్తారు
మా అబ్బాయికి రక్షణనిచ్చిన సాయి
యు.కె. నుండి సాయిభక్తురాలు శ్రీమతి సుధ తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
నేను గత 9 సంవత్సరాలుగా బాబా భక్తురాలిని. నేను నా జీవితంలోని చాలా సందర్భాలలో బాబా ఉనికిని అనుభూతి చెందాను. నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడల్లా రక్షకుడిలా నా దగ్గరకు వస్తారు నా ప్రియమైన బాబా. నేను కాస్త బిడియస్తురాలినైనందున ఇప్పటివరకు నా అనుభవాలను ఎప్పుడూ బహిర్గతం చేయలేదు. కానీ నాపై ఎంతో ప్రేమను చూపే ఆ గొప్ప తండ్రిపట్ల కృతజ్ఞతతో ఈరోజు నా అనుభవాన్ని మీతో పంచుకోవడానికి మొదటిసారి ప్రయత్నిస్తున్నాను.
2018, అక్టోబరులో నేను ఇంటర్నెట్‌లో బ్రౌజింగ్ చేస్తుండగా అనుకోకుండా 'సాయి యుగ నెట్‌వర్క్' నా దృష్టిలో పడింది. తద్వారా నాకు బాబా దయవల్ల మహాపారాయణ, సాయి దివ్యపూజ గురించిన సమాచారం లభించింది. అదంతా చాలా ఆశ్చర్యకరంగా జరిగింది. అప్పటినుండి నేను మహాపారాయణ చేస్తున్నాను. ఇటీవల సాయి దివ్యపూజ ఏడువారాలు చేస్తానని మ్రొక్కుకుని ఆ పూజను కూడా మొదలుపెట్టాను. ఆ 7 వారాలలో చాలా అద్భుతాలు జరగడం నేను గమనించాను. నా పిల్లల చదువుకు సంబంధించిన కోరికలు నెరవేరాయి. చాలాకాలంగా అమ్ముడుకాని మా భూమి సమస్య పరిష్కారమైంది. ముఖ్యంగా ఒక గురువారంనాడు నేను మహాపారాయణ, సాయి దివ్యపూజ చేస్తున్న సమయంలో జరిగిన ఒక అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
ఆరోజు మా అబ్బాయి తన స్నేహితుడితో కలిసి బయటకు వెళ్ళాడు. నేను ఇంట్లో సాయి దివ్యపూజ చేస్తూ, "ఆరతి మొదలుకావడానికి ముందే మా అబ్బాయిని ఇంటికి తీసుకుని రండి బాబా!" అని ప్రార్థించాను. నేను కోరుకున్నట్లే వాడు ఆరతి సమయంలో వచ్చి ఆరతి తీసుకున్నాడు. నా కోరిక మన్నించారని నేను సంతోషంగా బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. కానీ బాబా మా అబ్బాయిని ఎంత పెద్ద సమస్య నుండి కాపాడి ఆరతి సమయానికి తీసుకుని వచ్చారనేది నాకు మరుసటిరోజు మా అబ్బాయి చెపితే తెలిసింది. విషయమేమిటంటే, బయటికి వెళ్లిన పిల్లల్ని అనుకోకుండా 12మంది గ్యాంగ్‌స్టర్స్ చుట్టుముట్టారు. ఒక సమూహం వాళ్ళు నా కొడుకుని ర్యాగింగ్ చేస్తుండగా, మరో సమూహం వాళ్ళు తన స్నేహితుడిని ర్యాగింగ్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు మా అబ్బాయి స్నేహితుడిని ర్యాగింగ్ చేసి తన పర్సుని, బ్యాంక్ కార్డులను తీసుకుని, బ్యాంకులో ఉన్న డబ్బంతా తమకి డ్రా చేసి ఇవ్వమని ఒత్తిడి చేశారు. కానీ మా అబ్బాయిని ర్యాగింగ్ చేస్తున్న వాళ్ళు మా అబ్బాయి వద్ద ఉన్న డబ్బులు, బ్యాంక్ కార్డులు ఇవ్వమని అడిగారే గాని, తన పర్సుని తీసుకోలేదు. మా అబ్బాయి తనవద్ద కేవలం 5 పౌండ్లు ఉన్నాయని, బ్యాంక్ కార్డులు లేవని చెప్పాడు. వాళ్ళు ఆ 5 పౌండ్లను తీసుకుని మళ్ళీ తిరిగి మా అబ్బాయికి ఇచ్చేసి, "ఈ ప్రాంతానికి మళ్ళీ ఎప్పుడూ రాకండి" అని వార్నింగ్ ఇచ్చి పంపేశారు. ఆ వివరాలన్నీ చెప్పి మా అబ్బాయి, "అమ్మా! నేను చాలా అదృష్టవంతుడిని" అని చెప్పాడు. నేను తనతో, "ఇదంతా బాబా దయ నాన్నా. అదే సమయంలో నేను పూజచేస్తూ, 'ఆరతి సమయానికల్లా నా బిడ్డని ఇంటికి తీసుకునిరండి' అని బాబాకు చెప్పుకున్నాను. ఆయన కృపవల్లనే మీరు రక్షింపబడ్డారు" అని చెప్పాను. ఈ అనుభవం ద్వారా బాబా చూపిన ప్రేమ మా కుటుంబంలోని అందరి హృదయాలను హత్తుకుంది. "బాబా! చాలా చాలా ధన్యవాదాలు".
spurce: http://www.shirdisaibabaexperiences.org/2019/09/shirdi-sai-baba-miracles-part-2475.html

బాబాని నమ్మి ప్రార్థిస్తే తప్పక కరుణిస్తారు
గుంటూరు నుండి ఒక అజ్ఞాత సాయిసేవకురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు:
ఓం సాయిరాం! సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. సాయినాథుని ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబా నా జీవితంలోకి వచ్చినప్పటినుంచి ప్రతి క్షణమూ నాకు రక్షణగా ఉండి ఆశీస్సులు అందిస్తున్నారు. బాబా నాకు చాలా అనుభవాలు ప్రసాదించారు. వాటిలో ఒక అనుభవాన్ని ప్రస్తుతం మీతో పంచుకుంటాను. ఒకసారి మా పెద్దక్కకు బాగా నీరసంగా ఉన్నందువల్ల ఆరోగ్య పరీక్షలు చేయించటానికి డాక్టర్ వద్దకు వెళ్ళాలనుకున్నారు. వాళ్ళు ఆసుపత్రికి వెళ్లే ముందు, మా అక్కకు ఏ సమస్యా లేకుండా కాపాడమని, అన్ని టెస్టులూ నార్మల్ గా రావాలని నేను బాబాని ప్రార్థించాను. అలా జరిగితే మీ కృప మాపై వున్నదన్న సంతోషాన్ని నేను ‘సాయిమహరాజ్ సన్నిధి బ్లాగు’ ద్వారా సాటి సాయిభక్తులతో పంచుకుంటానని బాబాకు చెప్పుకున్నాను. బాబా నా ప్రార్థనను విన్నారన్న దానికి నిదర్శనంగా, డాక్టర్ అక్కను పరీక్షించి, తనకే ప్రాబ్లమూ లేదని, అది కేవలం నీరసం మాత్రమేనని చెప్పారు. బాబాని నమ్మి ప్రార్థిస్తే తప్పక మనల్ని కరుణిస్తారు, కాపాడుతారు. “బాబా! మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తండ్రీ! ఇలాగే ప్రతి విషయంలో మా కుటుంబసభ్యులందరినీ కాపాడుతూ ఉండండి బాబా!”
ఓం శ్రీ సాయిరాం జీ 🙏🙏🙏.
ReplyDeleteOm sai sadguru sainathmaharajuki jai omsairam
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాధయ నమః🙏
ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏
ఓం సాయిరాం...🌹🙏🏻🌹
ReplyDelete