ఈ భాగంలో అనుభవాలు:
- సాయి కృప అపారం
- శస్త్రచికిత్స అవసరం లేకుండా కాపాడిన బాబా
సాయి కృప అపారం
నా పేరు తులసీరావు. బాబా కృపవలన నా కోరికలు 2019, నవంబరు నెలలో నెరవేరాయి. ఆ కోరికలు తీర్చిన వెంటనే ఈ బ్లాగ్ ద్వారా నా అనుభవాలను పంచుకుంటానని బాబాకు వాగ్దానం చేశాను. అందుకే ఆ అనుభవాలను మీతో పంచుకోవాలని మీ ముందుకు వచ్చాను.
నా మొదటి కోరిక:
మా అబ్బాయి బీటెక్ చదివాడు. దాని తర్వాత తను వి.ఎల్.ఎస్.ఐ ఫిజికల్ డిజైన్ కోర్సు చేశాడు. ఆ కోర్సు పూర్తయ్యాక ఆ కోర్సుకి సంబంధించిన ఒక చిన్న కంపెనీలో తనకు ఉద్యోగం వచ్చింది. ఆ కంపెనీ కంటే మెరుగైన కంపెనీలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఒక కంపెనీలో ఖాళీలు ఉన్నాయని తెలిసింది. దానికోసం మొదట 8 రౌండ్లు క్లియర్ చేయాల్సి ఉండగా అవి క్లియర్ చేసిన వాళ్లందరికీ ఉద్యోగం ఇస్తామని ఆ కంపెనీవాళ్ళు చెప్పారు. అందుకోసం మా అబ్బాయి చాలా కష్టపడి ప్రయత్నిస్తున్న సమయంలో ఒకరోజు నాకు ఫోన్ చేసి, "అమ్మా! నాకు ఈ ఉద్యోగం వస్తుందో, రాదోనని భయంగా ఉంది" అన్నాడు. నేను భారమంతా బాబాపైనే వేశాను, ఎంతైనా ఆయనే నా తండ్రి కదా!! నేను మా అబ్బాయితో, "బాబాను మనస్ఫూర్తిగా ప్రార్థించి నీ వంతు ప్రయత్నం చేయి, మిగిలినదంతా బాబానే చూసుకుంటారు" అని చెప్పాను. కానీ ఎక్కడో ఒకచోట నాలోనూ భయం మొదలైంది. బాబాను తలచుకుంటూ ఈ బ్లాగ్ ఓపెన్ చేశాను. అందులో, "ప్రశాంతంగా ఉండు, అంతా నేనే చూసుకుంటాను" అని ఒక మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్ చూసిన వెంటనే మా అబ్బాయికి ఉద్యోగం వచ్చినంత సంతోషంగా అనిపించింది. తర్వాత మా అబ్బాయి నాకు ఫోన్ చేసి, "పరీక్ష అంతంతమాత్రంగానే రాశాను, ఏమవుతుందో తెలియదమ్మా" అని చెప్పాడు. బాబా మీద అపారమైన నమ్మకం ఉన్న నేను తనతో, "ఏమీ అధైర్యపడకు, బాబా అనుగ్రహంతో నువ్వు ఆ ఉద్యోగానికి సెలెక్ట్ అవుతావు" అని ధైర్యం చెప్పాను. అనుకున్న విధంగానే మరుసటిరోజు సాయంత్రం తను నాకు కాల్ చేసి, "ఏడు రౌండ్లూ విజయవంతంగా పూర్తిచేశాను. ఇంకొక్క రౌండ్ వుంది, అది చాలా కష్టమైనది. ఏం జరుగుతుందో, ఏమో మరి!" అన్నాడు. ఆ తరువాత మా అబ్బాయి ఆ చివరి రౌండ్ కూడా చాలా బాగా చేశాడు. బాబా అనుగ్రహంతో తనకి ఆ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఇదంతా బాబా కృపే.
నా రెండవ కోరిక:
ఇది మా అమ్మాయికి సంబంధించినది. తన ఆధార్ కార్డు చాలారోజులపాటు అప్డేట్ కాలేదు. ఇది అందరికీ వింతగా అనిపించవచ్చు కానీ, అది నిజం. ఒకరోజు నేను, "బాబా! అన్ని ప్రూఫులూ ఉన్నప్పటికీ మా అమ్మాయి ఆధార్ కార్డ్ అప్డేట్ అవ్వడం లేదు. నువ్వే చూసుకోవాలి బాబా!" అని బాబాను మనస్ఫూర్తిగా ప్రార్థించి బాబాపైనే భారం వేశాను. అంతే! ఎన్నో రోజుల నుంచి అప్డేట్ కాని ఆధార్ కార్డు ఏదో మ్యాజిక్ జరిగినట్లు మరుసటివారం నుంచి చకచకా అప్డేట్ అవ్వడం ప్రారంభమై, మా అమ్మాయి ఆధార్ కార్డు మొత్తం అప్డేట్ అయ్యింది. ఇదంతా కేవలం బాబా దయవలనే జరిగింది.
మూడవ కోరిక:
మావారికి మెడికల్ లీవుకి సంబంధించిన డబ్బు గవర్నమెంట్ నుంచి రావాల్సి ఉండగా మూడేళ్ళు గడిచినా రాలేదు. ఆ డబ్బు మాకు వచ్చేలా చూడమని నేను బాబాను ప్రార్థించేదాన్ని. బాబా అనుగ్రహంతో 2019, నవంబరు నెలలోనే ఆ డబ్బు మొత్తం మావారి అకౌంట్లో జమ అయింది. ఈ మూడు కోరికలూ 2019, నవంబరు నెలలోనే ఒకటి తర్వాత ఒకటి ఏదో అద్భుతంలాగా నెరవేరాయి. "ధన్యవాదాలు బాబా".

శస్త్రచికిత్స అవసరం లేకుండా కాపాడిన బాబా
నేను బాబా బిడ్డలలో ఒకదాన్ని. నేను ప్రతిరోజూ ఆయన ఆశీస్సులు పొందుతున్నాను. బాబా ఎల్లప్పుడూ నా పక్షాన నిలబడి, జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టదశను దాటేందుకు నాకు సహాయం చేసున్నారు. 2018, మే నెలలో నేను ఎండోమెట్రియోసిస్(గర్భాశయంలో తిత్తి)తో బాధపడ్డాను. నేను డాక్టర్ని సంప్రదించినప్పుడు ఆమె, పొత్తికడుపు స్కానింగ్ చేయించుకోమని, ఒకవేళ తిత్తి 5సెం.మీ. కంటే ఎక్కువగా ఉంటే శస్త్రచికిత్స చేయాలని చెప్పింది. చాలా చిన్నవయస్సులో ఉన్న నాకు శస్త్రచికిత్స అనేసరికి మేమంతా(మా కుటుంబసభ్యులు) భయపడిపోయాము. నేను కూడా శస్త్రచికిత్స చేయించుకోవటానికి ఇష్టపడలేదు. 6 నెలల ముందు స్కానింగ్ తీసినప్పుడు తిత్తి పరిమాణం 4.2 సెం.మీ. ఉంది. అది గనక 5 సెం.మీ వరకు పెరిగితే ఖచ్చితంగా శస్త్రచికిత్స చేయాలన్నారు. డాక్టర్ సరిగ్గా 7వ రోజున స్కానింగ్ చేయడానికి అపాయింట్‌మెంట్ ఇచ్చారు. నేను భయంతో, ఆందోళనతో, "బాబా! నాకు శస్త్రచికిత్స వద్దు. దయచేసి తిత్తి పరిమాణం పెరగకుండా ఉండేలా చూడండి" అని బాబాను ప్రార్థించి, భక్తివిశ్వాసాలతో సాయిసచ్చరిత్ర చదివి ఒక వారంలో పారాయణ పూర్తిచేశాను. తరువాత చాలా భయపడుతూ స్కానింగ్ చేయించుకున్నాను. అంతకన్నా ఎక్కువ భయంతో ఫలితం కోసం వేచిచూశాను. అద్భుతం! బాబా దయవలన తిత్తి పరిమాణం పెరగలేదు, మునుపు ఎంత పరిమాణముందో అంతే ఉంది. ఇక శస్త్రచికిత్స అవసరం లేదని డాక్టర్ చెప్పారు. స్కానింగ్ రిపోర్ట్ చూసిన క్షణంలో నేను పొందిన ఆనందం నాకిప్పటికీ గుర్తుంది. "ప్రతిసారీ నన్ను కాపాడుతున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు బాబా!"
Sai please bless me om sainathaya namaha subam bhavat
ReplyDeleteఓం శ్రీ సాయిరాం జీ 🙏🙏🙏
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏
ఓం సాయిరాం...🌹🙏🏻🌹
ReplyDeleteOm sai ram
ReplyDelete