సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 248వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. ఈ సంవత్సరం బాబా నాపై కురిపించిన అనుగ్రహం
  2. అన్నీ రుగ్మతలకు ఊదీ తిరుగులేని ఔషధం

ఈ సంవత్సరం బాబా నాపై కురిపించిన అనుగ్రహం

పేరు వెల్లడించని  ఒక సాయిభక్తురాలు తన అనుభావాన్ని ఇలా పంచుకుంటున్నారు:

ముందుగా 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదాలు. ఈ సంవత్సరంలో బాబా నాకు ప్రసాదించిన అనుభవాన్ని ఈ బ్లాగ్ ద్వారా నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. నేను చిన్నప్పటినుంచి సాయిని పూజిస్తున్నాను. ప్రతి సంవత్సరం శిరిడీ వెళ్తున్నాను. కానీ ఈ సంవత్సరం చాలా ప్రత్యేకమైనదని చెప్పాలి. ఎందుకంటే, బాబా ఈ సంవత్సరంలో నాలుగుసార్లు శిరిడీ రప్పించుకుని నన్ను ఎంతగానో అనుగ్రహించారు. అద్భుతమైన దర్శనభాగ్యాన్ని ప్రసాదించారు. కాకడ ఆరతికి హాజరయ్యే అవకాశాన్నిచ్చారు. ఆరతి అయ్యాక అభిషేకజలాన్ని ప్రసాదించారు. మధ్యాహ్నం ఆరతి తర్వాత తమకు నివేదించిన ప్రసాదాన్నిచ్చారు. ధూప్ ఆరతి తరువాత తీర్థం కూడా నాకు ఇచ్చారు. ఇంకా గురుస్థాన్ వద్ద నాకు చాలా వేపాకులు కూడా ప్రసాదించారు బాబా.

మరో విషయం: ఐదేళ్లుగా నేను గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నాను. ఈ ఐదేళ్ళలో నేను శిరిడీ వెళ్లిన ప్రతిసారీ బాబాని అడుగుతున్న మొదటి కోరిక, "బాబా! నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వండి" అని. అంతలా నేను ఎదురుచూస్తున్న ఆ కోరికను కూడా ఈ సంవత్సరమే తీర్చారు బాబా. అయితే ఎందుకోగానీ నాకు ఆ ఉద్యోగం అస్సలు నచ్చలేదు. 2019, నవంబర్ 12, కార్తీక పౌర్ణమినాడు మేము శిరిడీలో ఉన్నాము. ఆరోజు బాబా దర్శనానికి వెళ్లినప్పుడు, "బాబా! నేను నా ఉద్యోగ విషయంలో సంతోషంగా లేను. ఐదు సంవత్సరాలుగా నేను ఎంతో ఆత్రంతో ఎదురుచూస్తే, నాకు అస్సలు నచ్చని ఉద్యోగం వచ్చింది" అని మాటల్లో చెప్పలేనంతగా ఏడ్చాను. తరువాత మళ్ళీ, "బాబా! నాకు ఎందుకు ఇలాంటి ఉద్యోగాన్నిచ్చారు? ఇలా అడిగినందుకు నన్ను క్షమించండి. మీరు ఏది చేసినా దానిలో ఏదో మంచి ఉంటుంది. కానీ నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. దయచేసి నన్ను క్షమించండి బాబా" అని కూడా చెప్పుకున్నాను. మేము నవంబరు 15 వరకు శిరిడీలోనే ఉన్నాము. అక్కడ ఉన్నప్పుడే ఒకరోజు నా స్నేహితురాలు ఫోన్ చేసి, "నీకు బాబా ఇన్నిసార్లు శిరిడీ దర్శించే భాగ్యాన్ని ఇస్తున్నారు. నువ్వు చాలా చాలా లక్కీ" అని చెప్పింది. నేను తనతో, "నేను లక్కీ కాదు. బాబా నాకు మంచి ఉద్యోగం ఇవ్వలేదు" అని అన్నాను. అందుకు తను, "అలా అనుకోకు. బాబా ఏది చేసినా దానిలో ఏదో అర్థం దాగివుంటుంది. తర్వాత నీకు నచ్చింది ఇస్తారేమో, మనకేమి తెలుసు?" అని చెప్పి ఫోన్ పెట్టేసింది. నిజంగా ఆ అమ్మాయి ఫోన్ చేసి మాట్లాడటం ఒక అద్భుతమని చెప్పాలి. ఎందుకంటే, తను ఎవరితోనూ అంతగా మాట్లాడదు. అలాంటి తను నాకు ఫోన్ చేయటమంటే అద్భుతమే! బాబానే ఆ ఫోన్ కాల్ చేయించారు. అయినా నా మనసు కుదుటపడక బాధలో ఉన్న నేను చాలా ఏడ్చాను. తరువాత శిరిడీ నుంచి వచ్చినరోజు నాకు చాలా జ్వరం వచ్చింది, జ్వరం తగ్గేసరికి మైగ్రేన్ తలనొప్పి వచ్చింది. ఎందుకిలా అవుతుందో నాకు అర్థం కావట్లేదు. "ప్లీజ్ బాబా! నన్ను క్షమించండి. నేను లక్కీనే, ఎందుకంటే నాకు తోడుగా మీరున్నారు. నేను మీ చర్యలను పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నాను. దయచేసి నా తప్పులు ఏవైనా ఉంటే క్షమించి నాకు పూర్తి ఆరోగ్యం ఇవ్వండి బాబా!"

అన్నీ రుగ్మతలకు ఊదీ తిరుగులేని ఔషధం.

కెనడా నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మాతో ఇలా పంచుకుంటున్నారు: 


నేను ఒక టీచరుని. నా వయసు 40 సంవత్సరాలు. నేను కొంతకాలంగా నా శరీరంలో ఉన్న కణుతుల మూలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. రెండేళ్ల క్రితం నా గొంతుమీద ఒక గడ్డ ఉన్నట్టు గమనించాను. డాక్టరు సలహాతో అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకున్నాను. రిపోర్టులో గొంతుభాగంలో మరికొన్ని గడ్డలు ఉండడం గమనించిన డాక్టరు వాటిని బయాప్సీ చేయించమని చెప్పారు. ఆరోజు నుండి బయాప్సీ చేయించుకునేరోజు వరకు ప్రతిరోజూ బాబాను ప్రార్థించి, బాబా ఊదీని కొంత నుదుటికి పెట్టుకొని మరికొంత ఊదీని నీళ్లలో కలుపుకుని త్రాగేదాన్ని. బాబా అనుగ్రహంతో రిపోర్టులు నార్మల్ అని వచ్చాయి. ఎంతో ఆనందంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను.

మూడు నెలల క్రితం నేను అనారోగ్యానికి గురయ్యాను. నా రొమ్ము భాగంలో విపరీతమైన నొప్పితో బాధపడ్డాను. చాలా ఏళ్లుగా నా రొమ్ములో ఒక గడ్డ ఉంది. నాకెందుకో అవన్నీ రొమ్ముక్యాన్సర్ లక్షణాలని అనిపించింది. నేను చాలా భయపడిపోయి వెంటనే గైనకాలజిస్టుని సంప్రదించాను. ఆవిడ మొదట అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఆ తర్వాత మామోగ్రామ్ చేశారు. రొమ్ములో నొప్పి భరించలేనంతగా ఉండేది. నేను ప్రతిరోజూ బాబాను ప్రార్థించి, బాబా ఊదీని రొమ్ము భాగంలో రాసుకుని, బాబా ఊదీ కలిపిన నీళ్లను త్రాగేదాన్ని. నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించమని కన్నీటితో బాబాను వేడుకునేదాన్ని. ఎందుకంటే, నాకు రెండు సంవత్సరాల పాప ఉంది. తను మా వివాహమైన 14 సంవత్సరాలకు బాబా వరప్రసాదంగా మాకు కలిగిన సంతానం. నాకేమైనా జరిగితే పాప పరిస్థితి ఏమౌతుందో అని చాలా దిగులుపడేదాన్ని. కొన్ని రోజుల తర్వాత మామోగ్రామ్ ప్రోగ్రాం రిపోర్టు వచ్చింది. అందులో గడ్డలు ఉన్న ఛాయలే లేవు. అంతా నార్మల్ గా ఉంది. "థాంక్యూ, థాంక్యూ సో మచ్ బాబా! నా జీవితంలో మీరు ఎన్నో అద్భుతమైన అనుభవాలను ప్రసాదించారు. మీరే నా సంరక్షకులు. జన్మజన్మలకూ మీకు కృతజ్ఞురాలినై ఉంటాను". 
శ్రీ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

source: http://www.shirdisaibabaexperiences.org/2019/11/shirdi-sai-baba-miracles-part-2541.html

5 comments:

  1. sai your leelas arevery nice.i am happy to be your devotee.i took chance to be a maha parayan group mem ber.it's a luck sai choose me as his devotee.thank you sai for your love on me

    ReplyDelete
  2. Sri sachchidananda sadguru sainathmaharajuki jai omsairam

    ReplyDelete
  3. శ్రీ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  4. Om sairam. Great experience and super babaji's miracle.

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo