సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 273వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. ఉద్యోగం ప్రసాదించిన బాబా 
  2. 36 గంటల్లో బాబా చూపిన అద్భుతం

ఉద్యోగం ప్రసాదించిన బాబా 

సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు మంకు కృష్ణ. నేను శ్రీకాకుళం జిల్లాలోని గెద్దలపాడు గ్రామ నివాసిని. బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేను ఇప్పుడు మీతో పంచుకుంటాను. సుమారు పది సంవత్సరాల క్రితం నాకు బాబాపై భక్తిశ్రద్ధలు ఏర్పడ్డాయి. మా గ్రామానికి కాస్త దూరంలో ఉన్న పిట్టవానిపేట గ్రామ పరిధిలో బాబా మందిరం ఉంది. అక్కడ జరిగే కార్యక్రమాలకు నా వంతు సహాయాన్ని నేను చందాలరూపంలో ఇస్తూ, వీలైనప్పుడల్లా బాబా కార్యక్రమాలలో పాల్గొంటుండేవాడిని. అలా బాబా గురించి తెలుసుకునే అవకాశం లభించింది, ఈ జన్మకిది చాలు. నా జీవితంలో మంచి మార్పుకు కారణం బాబానే. కొన్ని రోజులకి నేను బాబా అనుగ్రహంతో బాబా మందిర కమిటీలో ఒక సభ్యుడినయ్యాను.

కొన్నిరోజులుగా నేను ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాను. కానీ, నేను చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. నాకు ఉద్యోగం ప్రసాదించమని పరిపరివిధాల బాబాను ప్రార్థించసాగాను. ఒకరోజు ఒక ఇంటర్వూకి పిలుపు రావడంతో బాబాను ప్రార్థించి ఆ ఇంటర్వ్యూకి హాజరయ్యాను. వెల్డింగుకి సంబంధించిన టెస్టింగ్‌ ఇంటర్వ్యూ జరిగింది. ఆ టెస్ట్ పూర్తి చేశాక నేను ఇంటికి తిరిగి వచ్చాను. కానీ నేను చేసింది సంతృప్తికరంగా అనిపించక ఈ ఉద్యోగం కూడా నాకు రాదని నేను చాలా నిరాశపడ్డాను. అయితే కరుణామయుడు, సమర్థ సద్గురువు అయిన సాయినాథుని అనుగ్రహంతో రెండు రోజుల తరువాత "మీరు ఉద్యోగానికి ఎంపికయ్యారు" అని ఫోన్ కాల్ వచ్చింది. నా ఆనందానికి అవధులు లేవు. తమను నమ్ముకున్నవారు కోరుకున్నది కచ్చితంగా నెరవేరుతుందని నిరూపించారు బాబా. ఇప్పుడు నేను సౌదీ అరేబియాలో ఉద్యోగం చేస్తున్నాను. నా కుటుంబసభ్యులంతా ఎంతో ఆనందంగా ఉన్నారు. దీనికి కారణం బాబానే. "చాలా చాలా ధన్యవాదాలు బాబా! ప్రాపంచిక జీవితంలోనే  కాకుండా ఆధ్యాత్మిక మార్గంలో కూడా నన్ను నడిపించవయ్యా! ఈ జన్మంతా నీ సేవ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించు సాయీ!".

36 గంటల్లో బాబా చూపిన అద్భుతం

నేను ఒక సాయిభక్తురాలిని. సాయిబాబా పట్ల నేను ఎంతో కృతజ్ఞత కలిగివున్నాను. ఆయన అనుగ్రహం లేనిదే నేను లేను. నేను ఎన్నో తప్పులు చేసినప్పటికి ఆయన ప్రేమతో నన్ను క్షమించారు. నేను బాబాకి ఇచ్చిన మాటప్రకారం, ఉద్దేశపూర్వకంగా ఎవరినీ బాధపెట్టకూడదని నిర్ణయించుకున్నాను. ఒకవేళ ఎవరైనా నన్ను గాయపరచినా ఆ స్థలాన్ని వదిలి వెళ్ళిపోతాను, మిగిలినది ఆయన చూసుకుంటారు.

నేను నా భర్త, 4 సంవత్సరాల కొడుకుతో USAలో నివసిస్తున్నాను. నేను హెచ్1బి వీసా మీద ఇక్కడ ఉంటున్నాను. 2019, జూన్‌లో నా వీసా గడువు ముగియనుండటంతో నేను 2019, ఫిబ్రవరి 14న వీసా పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకున్నాను. నేను గత 10 సంవత్సరాలుగా ఒక ఇండియన్ ఎం.ఎన్‌.సి సంస్థలో పనిచేస్తున్నాను. చాలా కంపెనీలు హెచ్1బి వీసాలను దుర్వినియోగం చేస్తుండటంతో కంపెనీ పేరు చూస్తూనే చాలావరకు హెచ్1బి దరఖాస్తులు తిరస్కరించబడుతున్నాయి. నాకున్న టైమ్ తక్కువ కాబట్టి అలాంటివేమైనా జరిగితే పరిస్థితి ఏంటని నేను భయపడ్డాను. ఫలితం తెలుసుకోవడానికి 5 - 6 నెలలు వేచి ఉండటానికి బదులుగా ప్రీమియం వీసా (వీసా 15 రోజుల్లోపు ఆమోదించబడుతుంది లేదా తిరస్కరించబడుతుంది) కోసం దరఖాస్తు చేద్దామని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఫలితం ఏదైనా, దాన్నిబట్టి తరువాత ఏమి చేయాలన్నది ప్లాన్ చేయవచ్చు. అందువలన ఇతరులు వద్దంటున్నా 2019, ఏప్రిల్ 16, మంగళవారంనాడు నేను ప్రీమియం వీసాకు మార్చుకునేందుకు USCISకి దాఖలు చేసుకున్నాను. ఫలితం ఎలా వస్తుందోనన్న భయంతో 2019, ఏప్రిల్ 17న నేను సాయిబాబా క్వశ్చన్&ఆన్సర్ వెబ్‌సైటులో బాబాని అడిగాను. '36 గంటలు వేచి ఉండు, మీకు అద్భుతం కనిపిస్తుంది' అని వచ్చింది. ఆ సందేశాన్ని చూసిన నేను, "ఒక్క రోజు క్రితమే నేను దాఖలు చేసుకున్నాను. 36 గంటల్లో ఏమద్భుతం జరుగుతుంది? బాబా ఏదో సరదాగా చెప్తున్నారు" అని అనుకున్నాను.

మరుసటిరోజు ఏప్రిల్ 18, గురువారం ఉదయం 8 గంటలకు నా భర్త నన్ను పిలిచి, "ఈరోజు గురువారం కదా! మందిరానికి వెళుతున్నావా?" అని అడిగారు. నాకు నెలసరి సమస్య ఉన్నందున నేను వెళ్లనని చెప్పాను. అందుకు తను సరేనని, "నీ వాట్సాప్‌లోని సందేశాలను ఒకసారి చూసుకో" అని చెప్పారు. నేను వాట్సాప్ తెరిచి, నా వీసా ఆమోదింపబడిందన్న సందేశాన్ని చూసి ఆశ్చర్యపోయాను. 'కేవలం రెండు రోజుల్లో వీసా ఆమోదింపబడటం ఎలా సాధ్యమైంద'ని నేను అవాక్కైపోయాను. కానీ సాయి తనకి ఏదైనా సాధ్యమేనని మరోసారి ఋజువు చేశారు. ఆయన చెప్పినట్లుగానే 36 గంటల్లో అద్భుతాన్ని నాకు చూపించారు. "థాంక్యూ! థాంక్యూ సో మచ్ బాబా!" సాయిపై నమ్మకం ఉంచండి. శ్రద్ధ, సబూరీ కలిగి ఉండండి. ఆయన మన ప్రతి కదలికను గమనిస్తూ ఉంటారు. దయచేసి ఎవరినీ మీ మాటలతో లేదా ప్రవర్తనతో బాధపెట్టవద్దు.

source : http://www.shirdisaibabaexperiences.org/2019/09/shirdi-sai-baba-miracles-part-2485.html

4 comments:

  1. Sri sainath maharajuki Jai om sai ram

    ReplyDelete
  2. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  3. ఓం సాయిరాం...🌹🙏🏻🌹

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo