ఈ భాగంలో అనుభవాలు:
- బాబా ఆశీర్వాదములు
- బాబా అనుగ్రహం - ఊదీతో ఇన్ఫెక్షన్ మాయం
బాబా ఆశీర్వాదములు
యు.ఎస్. నుండి ఒక సాయిభక్తురాలు తన అనుభవాలనిలా పంచుకుంటున్నారు:
నేను చాలాకాలం నుండి సాయిభక్తురాలిని. నేను ఏ ఆహారాన్ని తీసుకున్నా ముందుగా బాబాని తలచుకుని తీసుకుంటాను. నేను ఒకసారి శిరిడీకి వెళ్లాను. అది నా జీవితంలోనే అద్భుతమైన యాత్ర. బాబా దయవలన నా జీవితం చాలా సున్నితంగా సాగిపోతోంది. సాధారణంగా నేను ఇంటిలోనే బాబాను ప్రార్థిస్తాను. అయితే గత సంవత్సరకాలంగా బాబా మందిరంలో స్వయంసేవకురాలిగా సేవ చేసుకునే అవకాశం దక్కింది. మా ఇంటినుండి కొద్ది దూరంలోనే ఉన్న బాబా మందిరానికి వెళ్లి నాకు చేతనైన సహాయం చేసి వస్తుంటాను. ఒకసారి ఆ మందిర ప్రాంగణంలో పార్కింగ్ ప్రారంభ పూజ సందర్భంగా 101 కుండాలతో హోమం తలపెట్టారు. ఆ సందర్భంగా నేను శనివారం వంటలో సహాయం చేసేందుకు ఒప్పుకున్నాను. అందుకు నన్ను ఉదయం 8 లోపల రమ్మని చెప్పారు. ఆ సమయంలోగా మందిరానికి చేరుకోవడానికి అవసరమైన ప్రణాళిక వేసుకున్నాను. గురువారంరోజు నేను నాలుగవ వారం సాయిదివ్యపూజ చేసుకుని మందిరానికి వెళ్ళాను. బాబా దర్శనం చేసుకున్నాక ప్రసాదం కోసం నేను నిలబడ్డాను. అప్పుడు ఒక పూజారి(నేను అతనిని చాలాసార్లు చూసాను కానీ అంతగా ఎప్పుడూ మాట్లాడలేదు.) మరుసటిరోజు స్వచ్ఛంద సేవలో పాల్గొనడానికి రమ్మని నన్ను అడిగారు. నేను శనివారం రావడానికి సంతకం చేశానని చెప్పాను. కానీ అతను కనీసం ఒక్కగంట కోసమైనా వచ్చి వెళ్ళమని పదేపదే అడిగారు. సాధారణంగా అతనెప్పుడూ నాతో మాట్లాడరు. అలాంటిది నన్ను అంతగా అభ్యర్థిస్తుండటంతో 'సరే, వస్తాన'ని చెప్పాను. మరుసటిరోజు వెళ్లి నేనిచ్చిన మాట ప్రకారం ఒక గంట సమయం సహాయం చేశాను. అక్కడినుండి ఇంటికి వచ్చేసరికి నా నెలసరి మొదలైంది. నా మొదటి ప్రణాళిక ప్రకారం శనివారం సేవ చేయాలనుకుంటే నెలసరి సమస్య కారణంగా మందిరానికి వెళ్ళలేకపోయేదాన్ని. ఆ విషయం తెలిసిన బాబా శుక్రవారం నేను సేవ చేసుకునేలా ఏర్పాటు చేశారు. పూజారి ఒక్కసారే నన్ను అడిగివుంటే నేను శనివారం వెళ్లే ఆలోచనలోనే ఉండి బాబా సేవను కోల్పోయేదాన్ని. పూజారి చేత పదేపదే అడిగించి మరీ కనీసం గంటసేపు సేవ చేసుకునేలా బాబా నన్ను ఆశీర్వదించారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!"
అదే సమయంలో జరిగిన మరో అనుభవం:
2019, ఫిబ్రవరిలో నా భర్త ఉద్యోగంలో మార్పుకోసం ప్రయత్నాలు చేస్తూ చాలా ఇంటర్వ్యూలకి హాజరయ్యారు. కానీ ఏదీ సానుకూలంగా కనపడలేదు. నేను నా భర్త ఉద్యోగం గురించి ప్రశ్న&జవాబు వెబ్‌సైట్‌లో సాయిని అడిగినప్పుడు, 'రామనవమికి ముందు తనకు ఉద్యోగం వస్తుంద'ని సమాధానం వచ్చింది. రామనవమి ఎప్పుడు ఉందని నేను గూగుల్‌లో చూస్తే, అది ఏప్రిల్‌లో ఉంది. ఫిబ్రవరికి ఏప్రిల్‌కి మధ్య చాలా సమయం ఉన్నందున ఇప్పుడేం చేయాలా అని బాగా అలోచించి సాయి దివ్యపూజ చేయాలని నిర్ణయించుకున్నాను. అనుకున్నట్లుగానే 5 వారాల పూజ చేశాను, కానీ ఏమీ ఫలితం కనపడలేదు. చివరి గురువారం నేను బాబా మందిరానికి వెళ్లి బాబాకు కిచిడీ నైవేద్యంగా పెట్టి, "బాబా! నేను మళ్ళీ 5 వారాలు దివ్యపూజ చేస్తాను. ఈసారి మీరు నన్ను ఖచ్చితంగా ఆశీర్వదించాలి. నా భర్తకు ఆఫర్ లెటర్ వచ్చాక నేను నా అనుభవాన్ని బ్లాగులో పోస్టుచేస్తాను" అని బాబాను ప్రార్థించాను. మొదటివారం నేను పూజ చేశాక మరుసటిరోజు శుక్రవారం మావారు ఒక ఉద్యోగ ప్రకటనను చూసి, దరఖాస్తు చేశారు. సోమవారంనాడు 'బుధవారం టెలీఫోనిక్ ఇంటర్వ్యూ' ఉన్నట్లుగా మెయిల్ వచ్చింది. రెండవ గురువారం దివ్యపూజ చేశాక, 'సీఈఓ తో ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుంద'ని మెయిల్ వచ్చింది. మంగళవారం మావారు ఆఫీసుకు వెళ్లి వచ్చారు. మూడవ గురువారం దివ్యపూజ అయ్యాక, 'త్వరలో మరిన్ని చర్చలు జరుగుతాయ'ని మరొక మెయిల్ వచ్చింది. 4వ వారంలో మంగళవారంనాడు నేను Q&A వెబ్‌సైట్‌లో నా భర్త ఉద్యోగం విషయం గురించి సాయిని అడిగితే, "రేపు మీకు కాల్ వస్తుంది(బుధవారం)" అని వచ్చింది. అలాగే బుధవారంనాడు మావారికి ఆఫర్ లెటర్ పంపుతామని ఫోన్ వచ్చింది. తరువాత నేను మళ్ళీ వెబ్‌సైట్ ద్వారా బాబాను అడిగితే, "గురు, శుక్రవారాలలో మీకు సమాధానం లభిస్తుంది" అని వచ్చింది. ఆ విధంగానే గురు, శుక్రవారాలలో వివిధ ఒప్పందాలకు, పేపర్ వర్కుకు సంబంధించిన మెయిల్స్ వచ్చాయి. చివరికి దివ్యపూజ 5వ వారంలోని సోమవారంనాడు మెయిల్ ద్వారా ఆఫర్ లెటర్ వచ్చింది.
మహాపారాయణలో భాగంగా సచ్చరిత్ర పఠనం, క్వశ్చన్&ఆన్సర్ వెబ్‌సైట్ మరియు రోజూ ఉదయాన్నే సాయిభక్తుల అనుభవాలను చదవడం వంటివి ఆశను కోల్పోకుండా నన్ను కాపాడాయి. నేను అనుకున్నది జరుగుతుందని నాకు విశ్వాసం ఉన్నప్పటికీ, 'అది ఎప్పుడు?' అనే ప్రశ్న నన్ను కలవరపెట్టేది. కానీ బాబాను ప్రార్థిస్తూ సహనంతో ఉన్నందుకు ఆయన ప్రేమను ఆశీర్వాదంగా పొందాము. మందిరంలో అడుగుపెట్టిన ప్రతిసారీ నాలో కొన్ని ప్రకంపనలను అనుభూతి చెందుతున్నాను. దాన్ని ఎలా వివరించాలో నాకు తెలియదు. కానీ నేను బాబా భక్తురాలిని కావడం, బాబా గురించి తెలుసుకోవడం మాత్రం చాలా అదృష్టంగా భావిస్తున్నాను.
source: http://www.shirdisaibabaexperiences.org/2019/09/shirdi-sai-baba-miracles-part-2473.html

బాబా అనుగ్రహం - ఊదీతో ఇన్ఫెక్షన్ మాయం
తెలంగాణా నుండి ఒక అజ్ఞాత సాయిభక్తుడు తనకు బాబా ప్రసాదించిన మరో అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
ఓం సాయి! ముందుగా సాయిమహరాజ్ సన్నిధి బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. సాయి నాకు ప్రసాదించిన అనుభవాన్ని సాటి సాయిబంధువులతో పంచుకోవడానికి అవకాశం కల్పించిన మీకు నా ధన్యవాదాలు.
మా అబ్బాయి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు. అక్కడ నీళ్ల సమస్య వల్ల మా అబ్బాయికి ఫంగల్ ఇన్ఫెక్షన్ అయ్యింది. తనని మంచి మంచి డాక్టర్లకు చూపించాము. కానీ అది తగ్గలేదు సరికదా రానురానూ ఇంకా ఎక్కువవుతూ వచ్చింది. చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్ ఎలా తగ్గుతుందో అర్థంకాక మేమంతా చాలా ఆందోళనపడ్డాము. కొద్ది రోజుల తరువాత నేను నా కుటుంబంతో కలిసి శిరిడీ వెళ్లాను. బాబాను దర్శించుకొని, మా అబ్బాయి ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గించమని బాబాను మనసారా వేడుకుని, బాబా ఊదీని మా అబ్బాయి చర్మంపై రాశాను. ఆశ్చర్యం! డాక్టరు వ్రాసి ఇచ్చిన ఏ మందులకూ తగ్గని ఇన్ఫెక్షన్ వారంలోగా బాబా ఊదితో పూర్తిగా తగ్గిపోయి, మా అబ్బాయి చర్మం మునుపటిలా ఆరోగ్యంగా అయింది. బాబాకు మా కుటుంబం మీద ఉన్న ప్రేమకు నా ధన్యవాదాలు. “సాయీ! నీ చల్లని చూపు మాపై ఎల్లవేళలా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను”.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!
om sai ram om sai ram om sai ram
ReplyDeleteOm sainathaya namaha om sai ram
ReplyDeleteom sairam
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాధయ నమః
ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః'
ఓం సాయిరాం...🌹🙏🏻🌹
ReplyDelete