సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 257వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. సాయిబాబాయే అసలైన వైద్యుడు
  2. బాబా కృపతో రిపోర్టులు నార్మల్ గా వచ్చాయి

సాయిబాబాయే అసలైన వైద్యుడు

యు.ఎస్.ఏ. నుండి సాయిభక్తురాలు శైలజ తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను గత కొన్నేళ్లుగా సాయిబాబా భక్తురాలిని. మనకు అవసరమైనప్పుడు బాబా ఉనికిని చూపించే రెండు అనుభవాలను నేను పంచుకోవాలనుకుంటున్నాను.

2013 సంవత్సరాంతంలో మా అబ్బాయి ఒక నెలరోజులపాటు అనారోగ్యంతో ఉన్నాడు. రక్తపరీక్షలు చేసినప్పుడు హిమోగ్లోబిన్ తక్కువగా ఉందని తెలిసింది. తను అనారోగ్యం నుండి నెమ్మదిగా కోలుకున్నప్పటికీ హిమోగ్లోబిన్ సాధారణ స్థితికి రాలేదు. మేము వివిధ రకాల ఐరన్ కి సంబంధించిన ఔషధాలు వాడే ప్రయత్నం చేసినప్పటికీ అతడు వాటిని తట్టుకోలేకపోయాడు. 2014 మార్చిలో డాక్టరు ఐవి ఐరన్‌ను (సెలైన్ ద్వారా) సూచించారు. మేము వాటిని వాడటం మొదలుపెట్టాము. నేను బాబాను, "నా బిడ్డ క్షేమంగా ఉండేలా అనుగ్రహించండి" అని ప్రార్థించి నవగురువార వ్రతాన్ని ప్రారంభించాను. అద్భుతం! 9 వారాల వ్రతం పూర్తయ్యేసరికి బాబా అనుగ్రహంతో హిమోగ్లోబిన్ సాధారణ స్థితికి వచ్చింది

కొన్ని రోజుల క్రితం మా అబ్బాయి విరోచనాలతో బాధపడ్డాడు. నేను, "బాబా! మా అబ్బాయికి విరోచనాలు ఆగిపోయి తను క్షేమంగా ఉండేలా చేయండి. అలా జరిగితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల తను పూర్తిగా కోలుకున్నాడు. నాకే సమస్య వచ్చినా సచ్చరిత్ర ద్వారా సమాధానాలు పొందుతాను. "మీకు నా కృతజ్ఞతలు బాబా! మంచి ఆరోగ్యంతో ఉండేలా నా కొడుకును ఆశీర్వదించండి. ఇబ్బందుల్లో ఉన్న ప్రతి వ్యక్తికీ మీ సహాయాన్ని అందించండి బాబా!"

source : http://www.shirdisaibabaexperiences.org/2019/09/shirdi-sai-baba-miracles-part-2484.html

బాబా కృపతో రిపోర్టులు నార్మల్ గా వచ్చాయి

చెన్నై నుండి సాయిభక్తురాలు శ్రీవిద్య కణ్ణన్ తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నాకు 14 సంవత్సరాల వయస్సున్నప్పుడు, అంటే 1996లో నేను అండాశయ క్యాన్సర్‌తో చాలా బాధపడ్డాను. కేవలం బాబా ఆశీస్సులతోనే ఆ వ్యాధి పూర్తిగా నయమైంది. ఆయన కృపతో మంచి విద్య, ఉద్యోగం, ప్రేమించే భర్త, అందమైన కుమార్తెతో చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాను. ఇక నా అనుభవానికి వస్తే...

సాధారణంగా నేను సంవత్సరానికి ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకుంటాను. అలాగే ఈ సంవత్సరం చేయించినప్పుడు సోనోలజిస్ట్ నా ఎండోమెట్రియల్ మందం ఎక్కువగా ఉందని గుర్తించారు. దాంతో ఆమె D&C చేయించుకోమని చెప్పింది. వెంటనే నేను గైనకాలజిస్టుని సంప్రదించాను. ఆమె అంతా పరీక్షించి, నాకు గతంలో అండాశయ క్యాన్సర్ చరిత్ర ఉన్నందున తను కూడా 'D&C మరియు బయాప్సీ' చేయించడం మంచిదని చెప్పారు. నేను భయంతో చాలా కలతచెందాను. అదేరోజు 'D&C', బయాప్సీ చేయించుకున్నాను. ఆ రిపోర్టులు రావడానికి 5 రోజులు పడుతుందని చెప్పారు.

నన్ను నమ్మండి, ఆ ఐదురోజులు నా జీవితకాలంలోనే చాలా కఠినమైన రోజులు. ఒక్కసారిగా నాకు 14 సంవత్సరాలప్పటి బాధాకరమైన రోజులు కళ్ళముందు కదిలాయి. నాకు వచ్చిన వ్యాధి కారణంగా నా కుటుంబం ఆర్థికంగా పూర్తిగా నష్టపోవడం, డబ్బు లేనందున మా బంధువులు మాతో ప్రవర్తించిన తీరు, అప్పులు, మంచి బట్టలు, మంచి ఆహారం లేకుండానే నేను ఇంజనీరింగ్ చదవడం ఇలా ఎంతో దుర్భరమైన పరిస్థితులు అనుభవించాము. అప్పటి ఆ ఆర్థిక నష్టాన్ని అధిగమించడానికి చాలా సంవత్సరాలు పట్టింది. బాబా ఆశీర్వాదంతో నేనిప్పుడు చెన్నైలో ఒక కంపెనీకి డైరెక్టరుగా మంచి స్థితిలో ఉన్నాను. అలాంటిది మళ్ళీ ఆ పాత వ్యాధి నన్నెక్కడ బాధిస్తుందోనని నిరంతరం ఏడుస్తూ గడిపాను. ప్రతిక్షణం దీనంగా, "బాబా! రిపోర్టులు నార్మల్‌గా వచ్చేలా చేయండి" అని బాబాను ప్రార్థిస్తూ ఉండేదాన్ని. నేను బాబా ఆలయాన్ని సందర్శించి సాయి సచ్చరిత్ర చదువుతూ ఉండేదాన్ని. వాట్సాప్ గ్రూపులు, ఇంకా ఇతరమార్గాల ద్వారా బాబా నాకు మంచి సందేశాలను ఇస్తూ కాస్త ఊరట కలిగిస్తుండేవారు. ముఖ్యంగా వరుసగా రెండు రోజులు "టెస్ట్ రిపోర్టులు నార్మల్‌గా వస్తాయి" అని రెండు సందేశాలు వచ్చాయి. చివరికి బాబా కృపవలన సోమవారంనాడు బయాప్సీ ఫలితాలు నార్మల్ అని వచ్చాయి. గైనకాలజిస్ట్ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి, ఎప్పటిలానే సంవత్సరానికి ఒకసారి చెకప్ చేయించుకోమని చెప్పారు. అలా బాబా పెద్ద టెన్షన్ నుండి బయటపడేశారు. "బాబా! చాలా చాలా ధన్యవాదాలు. దయచేసి తీవ్రమైన ఆరోగ్య సమస్యలేవీ నన్ను తాకకుండా రక్షించండి. ఎప్పుడూ నాతో ఉండండి. నా భర్త, బిడ్డ సుదీర్ఘమైన ఆరోగ్యంతో సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను. నా ఇబ్బందులు మీకు తెలుసు, దయచేసి నా చేతులను వదిలివేయవద్దు. తోటి మానవాళికి సహాయపడేలా నన్ను అనుగ్రహించండి. మళ్లీ మళ్లీ మీకు కృతజ్ఞతలు బాబా!" 

5 comments:

  1. ఓం శ్రీ సాయిరాం జీ 🙏🙏🙏

    ReplyDelete
  2. Sadguru sainathaya namaha sugar bhavat

    ReplyDelete
  3. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo