సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 246వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. అమ్మకు ప్రాణభిక్ష పెట్టిన బాబా
  2. బాబా ఊదీ

అమ్మకు ప్రాణభిక్ష పెట్టిన బాబా

సాయిభక్తుడు సాయి సుధీంద్ర భరణి తమకు బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

నా పేరు సాయి సుధీంద్ర భరణి. మాది పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు. మా కుటుంబమంతా సాయిభక్తులం. నేనిప్పుడు 2019, ఆగష్టులో బాబా ఇచ్చిన అద్భుతమైన అనుభవాన్ని మీ అందరితో పంచుకుంటాను. 

మా అమ్మగారికి ఆగష్టు 11న తీవ్రంగా చెవిపోటు వచ్చింది. రాత్రి పదిగంటల సమయంలో ఆమెకు హర్ట్‌ఎటాక్ కూడా వచ్చింది. కానీ మాకది హార్ట్‌ఎటాక్ అని అర్థం కాలేదు. ఉదయం కూడా అమ్మ ఆరోగ్యం బాగాలేకపోవడంతో మేము తనని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళాం. అప్పుడు తనకి హార్ట్‌ఎటాక్ వచ్చిందని తెలిసి మేము నిర్ఘాంతపోయాము. అయితే బాబా దయవలన ఆమె క్షేమంగా ఉన్నారు. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాక కూడా ఆమె పూర్తిగా కోలుకోలేదు. హార్ట్ ఫెయిల్యూర్ సంభవించి అది ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌కి కూడా దారితీసింది. తనని మేము విజయవాడ రమేష్ హాస్పిటల్లో చేర్చాము. డాక్టర్స్ ఆశలేదని చెప్పారు. మేమంతా చాలా బాధపడుతూ ఉండగా మా అమ్మగారికి కలలో బాబా దర్శనమిచ్చి, "కుక్కకు మూడు రొట్టెలు పెట్టు" అని ఆదేశించారు. మేము అలానే చేశాము. అద్భుతం! కుక్కలకు రొట్టెలు పెట్టాక ఆమె పూర్తిగా కోలుకున్నారు. ఇదంతా మా కుటుంబంపై ఉన్న బాబా కృప, దయ వల్లనే సాధ్యమైంది. "బాబా! మీరు మాపై చూపుతున్న అనుగ్రహానికి చాలా చాలా కృతజ్ఞతలు".

బాబా ఊదీ

ఆస్ట్రేలియా నుండి ఒక అజ్ఞాత సాయిభక్తుడు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు:

రెండేళ్ల క్రితం బాబా నా జీవితంలోకి ప్రవేశించి నన్ను తన భక్తునిగా మలచుకున్నారు. నేను ఇప్పుడు బాబా ఊదీ మహిమను మీతో పంచుకుంటాను.

ఆస్ట్రేలియాలో ప్రతి సంవత్సరం చలికాలంలో ఫ్లూ వ్యాధి బాగా విజృంభిస్తుంటుంది. అయినా నేను మాత్రం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఆ వ్యాధి బారిన పడుతుండేవాడిని. ఒక చలికాలంలో ఉదయం నిద్రలేస్తూనే గొంతు నొప్పిగా అనిపించింది. ఇదే ఫ్లూ వ్యాధి మొదలవుతుంది అనడానికి మొదటి సూచన. ఇంకెప్పుడైనా ఈ సమస్య వస్తే అంతగా ఆందోళనపడేవాడిని కాదు. కానీ, ఈసారి మరో 24 గంటల్లో నాకు డెంటిస్ట్ అపాయింట్‌మెంట్ ఉంది. అపాయింట్‌మెంట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు, కానీ మరో అపాయింట్‌మెంట్ దొరకడానికి కొన్ని వారాల సమయం పడుతుంది. అది మాత్రమే కాదు, అపాయింట్‌మెంట్ క్యాన్సిల్ చేసుకోవాలంటే కనీసం 24 గంటల ముందు వాళ్లకు తెలియజేయాల్సి ఉంటుంది. నేను జలుబు, జ్వరం తగ్గడానికి మందులు వేసుకున్నాను. అలాగే గొంతునొప్పి తగ్గడానికి స్ట్రెప్సిల్స్ తీసుకున్నాను. కానీ, గొంతునొప్పి అలానే ఉంది. ఆరోజు రాత్రి నేను మంచంమీద పడుకుని ఉన్నప్పుడు బాబా ఊదీ గుర్తుకొచ్చింది. నేను బాబాతో, "బాబా! నేను మీ ఊదీని తీసుకుంటున్నాను, రేపు డెంటిస్ట్ అపాయింట్‌మెంట్ సమయానికి నా ఆరోగ్యం బాగుండేలా అనుగ్రహించండి. డెంటిస్టుని కలిసిన తర్వాత మళ్ళీ జ్వరం వచ్చినా పర్వాలేదు" అని చెప్పుకున్నాను.

క్రితం సంవత్సరం నా  స్నేహితురాలు శిరిడీ నుండి చిన్న ఊదీ ప్యాకెట్, అలాగే వేరు వేరు సాయిమందిరాల నుండి కొంత ఊదీని నాకు పంపి అన్నిటినీ కలుపుకుని ప్రతిరోజూ పెట్టుకోమని చెప్పింది. అప్పటినుండి ఆ ఊదీలన్నీ కలిపి ఒక భరణెలో పెట్టుకుని రోజూ పెట్టుకుంటున్నాను. బాబాను ప్రార్థించి, ఆ భరిణెలోంచి చిటికెడు ఊదీ తీసుకొని నోట్లో వేసుకుని కొద్దిగా మంచినీళ్లు తాగి పడుకున్నాను. కొద్దిసేపట్లోనే నేను విపరీతమైన చలితో వణకడం మొదలుపెట్టాను. నాలుగు మందపాటి దుప్పట్లు కప్పుకున్నప్పటికీ వణుకు తగ్గలేదు. ఇక మరుసటిరోజు డెంటిస్ట్ దగ్గరకు వెళ్లే అవకాశం లేదని అనుకుని, ఉదయం లేచాక హాస్పిటల్‌కి ఫోన్ చేసి పరిస్థితి వివరించాలని నిర్ణయించుకున్నాను. తర్వాత నాకు తెలియకుండానే నిద్రపట్టేసింది. అర్థరాత్రి మెలకువ వచ్చి లేచి చూసుకుంటే వణుకు తగ్గిందన్న సంగతి గమనించాను. నాకు వేడిగా అనిపించి దుప్పట్లు తీసి ఫ్యాన్ ఆన్ చేసుకున్నాను. ఆ రాత్రంతా వేడివల్ల నేను ప్రక్కమీద అటూ ఇటూ పొర్లుతున్నప్పటికీ నా ఆరోగ్యం కాస్త మెరుగ్గానే అనిపించింది. శిరిడీ నుంచి తెచ్చిన ఊదీని వేరే సాయిమందిరాల నుండి తెచ్చిన ఊదీతో కలిపినప్పటికీ అది చాలా శక్తివంతమైనది. మరుసటిరోజు ఉదయం నా ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడింది. నేను డెంటిస్ట్ వద్దకు వెళ్లాను కూడా. "థాంక్యూ బాబా! మీకు మాట ఇచ్చిన ప్రకారం నా ఈ అనుభవాన్ని సాటి సాయిభక్తులతో పంచుకున్నాను".

source: http://www.shirdisaibabaexperiences.org/2019/11/shirdi-sai-baba-miracles-part-2535.html?m=0

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo