సాయి వచనం:-
'ఎంతోకాలం నుండి నాతో కలిసివున్నప్పటికీ నేను ప్రతి చీమ, ఈగ మొదలైన ప్రాణులలోనూ ఉంటానన్న సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు.'

'పారాయణ ఒక మొక్కుబడి తంతుగా చేయరాదు. బాబాలో వ్యక్తమయ్యే తత్త్వం ఏమిటి? బాబా ఏం చెప్పారు? ఒక లీల జరిగినప్పుడు ఆ భక్తుని స్థానంలో నేనుంటే ఎలా ఫీలవుతాను? - ఇలా ప్రతి విషయాన్ని తరచి తర్కించుకుంటూ చదవాలి. బాబా లీలను చదివినప్పుడు ఆ సందర్భంలో అక్కడున్న భక్తులలో ఒకడివై ఆ సన్నివేశాన్ని చూడగలగాలి. ఆ లీలావిలాసంలో మైమరచి ఆనందిస్తూ మమేకమవగలగాలి. అలా పరాయణత్వం కలిగించినప్పుడే అది పారాయణ అవుతుంది' - శ్రీబాబూజీ.

శ్రీగణపతిరావు బోడస్




బాబా సశరీరులుగా ఉన్నపుడు ఆయనను దర్శించిన అదృష్టవంతులలో శ్రీగణపతిరావు బోడస్ ఒకరు. ఈ మరాఠీ నటుని గురించి శ్రీసాయి సచ్చరిత్ర 14వ అధ్యాయంలో ‘దక్షిణ మీమాంస’ అనే శీర్షికలో ప్రస్తావించబడి ఉంది. గణపతిరావు 1940లో తన ఆత్మకథ "మాఝీ భూమిక(My Role)" లో బాబాతో తనకు కలిగిన అనుభవాన్ని పొందుపరిచారు. ఆ వివరాలను మీ ముందు ఉంచుతున్నాము.

గణపతిరావుకు మహాత్ములన్నా, సాధువులన్నా అస్సలు ఇష్టముండేది కాదు. ఆ అయిష్టం ఎంతగా ఉండేదంటే, తన స్నేహితులెవరైనా మహాత్ములను దర్శిస్తే వారిని హేళన చేసేవాడు. ఒకసారి గణపతిరావు అహ్మద్‌నగర్‌లో కొంతకాలం ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో అతనికి శిరిడీ వెళ్లాలనే తీవ్రమైన తపన కలిగింది. గణపతిరావు స్నేహితుడైన బాలాసాహెబ్ మిరీకర్ ఆ సమయంలో కోపర్‌గాఁవ్‌లో మామల్తదారుగా పనిచేస్తున్నాడు. బోడస్ మిరీకర్‌ను కలుసుకొని శిరిడీకి వెళ్ళాలన్న తన కోరికను అతనికి తెలియచేశాడు. ఇద్దరూ కలిసి ఒక ఆదివారంనాడు శిరిడీకి వెళ్ళారు. బాబా దర్శనానికి మసీదుకు వెళ్లి, బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసుకున్నారు. బోడస్ బాబాకు కొబ్బరికాయను, పొగాకును సమర్పించాడు. బాబా అతనిని దక్షిణ ఇమ్మని అడిగారు. బోడస్ ఒక రూపాయిని బాబాకు దక్షిణగా సమర్పించాడు. బాబా తమ చిలిమును పొగాకుతో నింపమని బోడస్‌కి చెప్పారు. ఎంతో అదృష్టవంతులకు మాత్రమే ఇంతటి మహద్భాగ్యం లభిస్తుంది. తరువాత బాబా తమ విశిష్ట ధోరణిలో బోడస్ క్షేమసమాచారాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత బాబా, "ప్రజలు తమలో తాము తగవులాడుకుంటుంటే మనం ఏం చేయగలం?" అన్నారు. ఆ సమయంలో బోడస్ తన సహాయకునితో గొడవపడి ఉన్నాడు. తరువాత బాబా బోడస్‌ని భోజనం చేయమని చెప్పారు.

బాబా ఆదేశం ప్రకారం బోడస్ భోజనం చేయటానికి భోజనశాలకి వెళ్లాడు. అక్కడ ఒక వ్యక్తి బోడస్‌ను, “బాబాకు దక్షిణగా ఎంత సమర్పిద్దామని అనుకుంటున్నారు?” అని అడిగారు. బోడస్ జవాబిచ్చే లోపలే మళ్ళీ, "బాబా మిమ్మల్ని దక్షిణ కోరితే మీ దగ్గర ఉన్న ధనం మొత్తం దక్షిణగా సమర్పించాలి" అని అన్నాడు. బోడస్‌కు ఆ వ్యక్తి చెప్పిన సలహా ఎంతగానో నచ్చి, ఈసారి బాబా తనను దక్షిణ కోరితే తన వద్ద ఉన్న ధనమంతా బాబాకు దక్షిణగా సమర్పించాలని నిర్ణయించుకున్నాడు. తరువాత బోడస్ శిరిడీ నుంచి బయలుదేరేముందు బాబా అనుమతి కోసం మసీదుకు వెళ్లాడు. బాబా అతనికి అనుమతిని ప్రసాదించి, దక్షిణ ఇమ్మని అడిగారు. బోడస్ ఈ అవకాశాన్ని వదులుకోకుండా ఎంతో సంతోషంతో తన పర్సులో ఉన్న ధనమంతా బాబాకు దక్షిణగా సమర్పించాడు. బాబా బోడస్ నుదుటిపై ఊదీపెట్టి, "నువ్వు ఎలా అయితే నాకు దక్షిణ సమర్పించావో, అలాగే ఆ నారాయణుడు నీకు సమృద్ధిగా సంపదను ప్రసాదిస్తాడు" అని ఆశీర్వదించారు.

బోడస్ శిరిడీ సందర్శించిన తరువాత బాబా అనుగ్రహంతో మంచి నటుడిగా ఎంతో పేరుప్రఖ్యాతులు సంపాదించాడు. పేరుతో పాటు అతనికి సిరిసంపదలు కూడా సమృద్ధిగా లభించాయి. బోడస్ తన స్మృతులలో ఇలా అంటాడు: “శిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకున్న తరువాత నాకు డబ్బు విషయంలో ఎలాంటి లోటూ రాలేదు. బాబాకు సమర్పించిన దక్షిణకు లక్షల రెట్లు బాబా నాకు తిరిగి ఇచ్చారు” అని.

శ్రీ గణపతిరావు బోడస్ 1965లో తుదిశ్వాస విడిచారు.

సమాప్తం.


14 comments:

  1. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  2. 🙏🌺🙏ఓం సాయిరాం🙏🌺🙏

    ReplyDelete
  3. సాయినాథ్ మహారాజ్ కి జై 💐💐💐💐💐💐💐💐🙏 చాలా మంది

    ReplyDelete
  4. Om Sai Ram 🙏🌹🙏🌹
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  5. 🌸🌸🌸🙏🙏🙏🙏🙏🌸🌸🌸

    ReplyDelete
  6. 🌺🌸🌸🌺🙏🙏🙏🌺🌸🌸🌺

    ReplyDelete
  7. ఓం సాయిరాం!

    ReplyDelete
  8. Please joined me im tamilnadu

    ReplyDelete
  9. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤😀🌼😃🥰🌸🌺

    ReplyDelete
  10. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  11. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  12. Om sai ram, e roju anta bagunde la chayandi tandri pls, naaku stomach pain tagginchi manchi arogyanni prasadinchandi baba, andaru kshanam ga arogyam ga ye problems lekunda prashantam ga unde la chudandi pls.ofce lo situations nenu anukunnattu change ayye la chayandi baba pls.

    ReplyDelete
  13. Om sai ram, e roju anta bagunde la chayandi tandri pls, naaku stomach pain tagginchi manchi arogyanni prasadinchandi baba, andaru kshamam ga arogyam ga ye problems lekunda prashantam ga unde la chudandi pls.ofce lo situations nenu anukunnattu change ayye la chayandi baba pls.

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo