సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 494వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. వెంటే ఉండి సదా కాపాడుతారు బాబా
  2. సందేహాన్ని తీర్చిన బాబా

వెంటే ఉండి సదా కాపాడుతారు బాబా

సాయిబంధువులందరికీ ముందుగా నా నమస్కారాలు. నా పేరు శాంతి. బాబా నాకు ప్రసాదించిన అనుభవాలనుండి కొన్నిటిని ఇంతకుముందు ఈ బ్లాగులో పంచుకున్నాను. ఈమధ్య జరిగిన మరో అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటాను. ఈ బ్లాగ్ నడుపుతున్న సాయికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కరోనా సమయంలో మీరు పంచుతున్న ‘సాయిభక్తుల అనుభవమాలికలు’ మాకెంతో మనోధైర్యాన్ని ఇస్తున్నాయి.

నేను ఒక ప్రభుత్వ ఉద్యోగినిని. అందువల్ల నేను రోజూ నా విధులకు హాజరు కావాలి. నా విధులలో భాగంగా నేను అనేకమంది వ్యక్తులను కలవాల్సి ఉంటుంది. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక భయం మనలను వెంటాడుతుంటుంది. ఒకరోజు నాకు కాస్త గొంతునొప్పిగా అనిపించింది. నాకు భయమేసి వెంటనే, “ఏమిటి బాబా నాకు ఇలా ఉంది? ఇంట్లో పాప కూడా ఉంది. ఇలా అయితే ఎలా అయ్యా?” అని నా బాధను బాబాతో చెప్పుకున్నాను. తరువాత దానిగురించే ఆలోచిస్తూ బ్లాగ్ ఓపెన్ చెయ్యబోతూ, “బాబా! ఈ గొంతునొప్పి ఆ వ్యాధి(కరోనా) కారణంగా వచ్చిన నొప్పి కానట్లయితే ఈరోజు అనుభవమాలిక ప్రస్తుతం నేను ఎదుర్కొంటున్న సమస్యకు తగినట్లు ఉండాలి” అని మనసులో అనుకున్నాను. బ్లాగ్ ఓపెన్ చేయగానే, ఒక తల్లి తన కుమార్తెకు గొంతునొప్పి వస్తే బాబాను ప్రార్థించి బాబా ఊదీని తనకు రాయటం, బాబాపై భారం వేయటం, తెల్లవారేసరికి నొప్పి తగ్గిపోవటం అనే అనుభవం వచ్చింది. అది చదవుతూనే నాకు ఎక్కడలేని ఆనందం కలిగింది. “నాకు భయం లేదు, బాబా నా వెంటే ఉన్నారు” అనుకుని, ఇంటికి వెళ్లాక బాబాకు నమస్కారం చేసుకుని, బాబా ఊదీని పెట్టుకొని బాబాను స్మరిస్తూ ఉన్నాను. బాబా అనుగ్రహంతో తెల్లవారేసరికి నా గొంతునొప్పి పూర్తిగా పోయింది. ఎంతో సంతోషంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. “బాబా! మీరు మా వెంటే ఉండి మమ్మల్ని సదా కాపాడుతారు. కానీ, మేము మాత్రం మీరు మా వెంట ఉన్నారని మరచి అనవసరంగా ఆందోళన చెందుతూ ఉంటాము. నాలో మనోధైర్యాన్ని, మీ పట్ల భక్తి, విశ్వాసాలను పెంచి నా ఉద్యోగ విధులను సక్రమంగా నిర్వర్తించేటట్లు అనుగ్రహించండి బాబా!”

సందేహాన్ని తీర్చిన బాబా

ముందుగా ‘సాయి మహరాజ్ సన్నిధి’ బ్లాగ్ మరియు వాట్సాప్ గ్రూప్ నిర్వహిస్తున్న సాయి అన్నయ్యకు నా నమస్కారం. ఇంతకుముందు నేను నా అనుభవాలను కొన్నిటిని ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు ఇంకొక అనుభవాన్ని పంచుకోబోతున్నాను. నేను సాయిబిడ్డను. నా జీవితంలో ప్రతి ఒక్కటీ బాబా పెట్టిన భిక్షే. నా జీవితంలో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నా సాయితండ్రే కనిపిస్తాడు. ప్రతి చిన్న విషయంలో కూడా బాబా సలహా లేనిదే నేను ఏ నిర్ణయమూ తీసుకోను. అసలు బాబా లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను. ఆయన నాకు తల్లిగా ప్రేమను పంచుతున్నారు; తండ్రిగా నా బాధ్యతను స్వీకరించారు; ఒక గురువుగా, స్నేహితునిగా నాకు ప్రతి విషయంలోనూ మార్గనిర్దేశం చేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే బాబా లేని నా జీవితం శూన్యం. ఇక నా అనుభవంలోకి వస్తే...

బాబా దయతో నేను ఒక ఉద్యోగం చేస్తున్నాను. నాకు మొదటినుంచి నా జీతంతో ఒక బంగారు గొలుసు తీసుకోవాలని, దానికి బాబా డాలర్ వేసుకోవాలని కోరిక ఉండేది. బాబా ఆశీస్సులతో గొలుసైతే తీసుకున్నాను కానీ, డాలర్ మాత్రం తీసుకోలేదు. కారణం, మా ఇంట్లోవాళ్ళు నేను బాబా డాలర్ తీసుకోవటానికి ఒప్పుకోలేదు. “నువ్వు అమ్మాయివి, బాబా డాలర్ వేసుకోకూడదు, తప్పు” అన్నారు. సరేనని అయిష్టంగానే వేరే డాలర్ కొనుక్కున్నాను. ఒక గురువారంరోజు బాబా గుడికి వెళ్లేముందు మా పక్కింటి ఆంటీతో నా డాలర్ విషయం గురించి చెప్పి బాధపడ్డాను. ఆ ఆంటీ కూడా, “నిజమేనమ్మా, ఆడపిల్ల దేవుడి డాలర్ వేసుకోకూడదు. దేవుడికి అంటు తగులుతుందంటారు. వేసుకోవద్దులే” అంది. “అలా ఏమీ లేదు, బాబా నాకు తల్లిలాంటివారు” అని చెప్పి నేను గుడికి బయలుదేరాను. నాతోపాటు నా స్నేహితురాలిని కూడా గుడికి రమ్మని పిలిచాను. ఆ అమ్మాయి ముస్లిమ్. కానీ బాబా అంటే చాలా నమ్మకం, ఇష్టం. ఇంతకుముందు నాతో పాటు చాలాసార్లు బాబా గుడికి వచ్చింది. కానీ ఆరోజు తను నాతో, “ఎందుకులే, మావాళ్ళు ఎవరైనా చూస్తే ఏమైనా అంటారు. బాబా హిందువు కదా!” అంది. అందుకు నేను “అదేం లేదు, నువ్వు రా!” అని చెప్పి తనను నాతోపాటు గుడికి తీసుకెళ్ళాను. బాబా దర్శనం చేసుకున్న తరువాత కొద్దిగా బాబా ఊదీని ఇంటికి తీసుకెళ్దామని మేమిద్దరం పేపర్ కోసం వెతికాము. అక్కడ ఒక చిన్న పేపర్ పడివుంది. దానిని తీసుకుని తెరచి చూసిన నా ఆనందానికి, ఆశ్చర్యానికి అవధులు లేవు. ఆ పేపరులో బాబా నా సందేహానికి, నా స్నేహితురాలి సందేహానికి కూడా పరిష్కారం ఇచ్చారు. ఆ పేపరును ఇక్కడ జతచేస్తున్నాను. బాబా మన ప్రతి కదలికనూ గమనిస్తూ ఉంటారు. ఆయన మన గురించి వంద రెట్లు ముందుకు ఆలోచిస్తారు. మనం ఆయనపై పూర్తి నమ్మకముంచి ఓపికగా ఉంటే ఆయన మనకు అంతా మంచే చేస్తారు

శ్రీ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!



13 comments:

  1. 🙏🌷🙏పరమ పావన మూర్తి..దయా సిందో..కృపా సాగర కారుణ్య నిలయ..జగద్ రక్షక..ద్వారక నివాసా సాయేసా పాహిమాం రక్ష రక్ష🙏🌷🙏

    ReplyDelete
  2. శ్రీ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. Om Sri Sai Ram thaatha 🙏
    BHAVYA sree

    ReplyDelete
  5. ఓం సాయిరాం...🌹🙏🏻🌹

    ReplyDelete
  6. ఆహా ఎంత అద్భుతమైన సాయి అనుభవం. కంటికి రెప్పలా కాపాడుతున్న ఓసాయి నీ రుణం ఈ విధంగా తీర్చుకోగలం తండ్రి ప్రతిక్షణం మమ్మల్ని కాపాడుతూ మమ్మల్ని రక్షిస్తున్న మీకు సాష్టాంగ నమస్కారం ఓ సాయి

    ReplyDelete
  7. Om sri sainadaya namaha 🙏🌺🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo