ఈ భాగంలో అనుభవాలు:
- భక్తురాలి అవసాన సమయంలో బాబా అందించిన అమృతహస్తం
- ఊదీతో తగ్గిన చేయి నొప్పి
- బాబా ఎల్లప్పుడూ నాతో ఉన్నారు
నా పేరు N. సూర్యనారాయణమూర్తి. మాది విజయనగర్ కాలనీ, హైదరాబాద్. నేను ఇంతకుముందు ఈ బ్లాగులో నా అనుభవాలు కొన్ని పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని బాబా లీలలు ముచ్చటించుకుందాము. ముందుగా ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న ప్రత్యక్ష దైవం శ్రీసాయికి, పరోక్షంగా బాబా ఆజ్ఞలు పాటిస్తున్న ఈ సాయి మహారాజ్ సన్నిధి ముఖ్యసభ్యులందరికీ నమస్కరిస్తూ...
మొదటి లీల - భక్తురాలి అవసాన సమయంలో బాబా అందించిన అమృతహస్తం:
శిరిడీ సాయిబాబాకి పరమభక్తులు, 'ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి' నామ ప్రచారకులు అయిన కీ.శే. శ్రీ దూబగుంట శంకరయ్యగారి సతీమణి శ్రీమతి కృష్ణవేణిగారు 2020, జులై 16, గురువారం ఉదయం సాయిచరణాలలో ఐక్యమయ్యారు. ఆమె కూడా బాబాకు పరమభక్తురాలు. శిరిడీ సమాధిమందిరంలో బాబా విగ్రహ ప్రతిష్ఠాపనకు ముందే, అంటే సుమారు 1950-54 మధ్యకాలంలో ఆమె శిరిడీ సందర్శించి సాయిబాబా దర్శనం చేసుకున్నారు. తరువాత కాలంలో ఆమెకు శ్రీశంకరయ్యగారితో వివాహమైంది. శ్రీశంకరయ్యగారు ఆజన్మాంతం చేసిన సాయి సేవలో ఆమె పాత్ర శ్లాఘనీయం. బాబాపట్ల ఆమెకుండే భక్తి ఆమె భర్త కంటే ఒక మెట్టు ఎక్కువే. ఎన్నోసార్లు శిరిడీ, పండరిపురం, పెనుగొండలలో జరిగిన నామసప్తాహాలలో వారివురూ పాల్గొన్నారు. శంకరయ్యగారి మరణంతో ఆమె గత రెండేళ్లుగా ఒక రకమైన నిర్వేదంతో కాలాన్ని గడిపారు. ఈ సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో ఆమె కొన్ని రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. కరోనా పరిస్థితుల కారణంగా ఆమెను హాస్పిటల్లో చేర్చుకోకపోవడంతో ఇంటిలోనే వైద్యం కొనసాగించారు. ఆమెకు కరోనా లేకపోయినప్పటికీ ఏ ఒక్క హాస్పిటల్ వాళ్ళూ తగినంత శ్రద్ధ చూపలేదు. కానీ ఆమె దైవమైన బాబా ఆమె కుమార్తెలు, అల్లుళ్ళ రూపంలో పరోక్షంగా అన్నీ తానై ఆమెకు సేవ చేశారు. మరి ఆమె చేసిన ఎనలేని సేవలను బాబా మరువగలరా? అందుకనే ఆమెను జూలై 16, దక్షిణాయన సంక్రమణ దినాన, పరమపవిత్రమైన గురువారంనాడు ఏకాదశి ఘడియల్లో ఉదయం గం.6.28 నిమిషాలకు ప్రత్యక్షంగా ఆమెకు తమ చేయి అందించి తమలో చేర్చుకున్నారు. ఆమె నాకు గురుపత్ని. ఆమెకు నేను చేసిన ఉపకారమేమో గానీ, ఆరోజు నేను నా రోజువారీ అలవాటు ప్రకారం కుర్చీలో కూర్చొని బాబా పటం వైపు చూస్తున్నాను. సుమారు గం.6.15ని.ల నుండి గం.6.28ని.ల వరకు నా కళ్ళకు కట్టినట్లు, ఇంకా చెప్పాలంటే టీవీలో ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నట్లు - బాబా ప్రత్యక్షంగా ఆమెకు తమ అమృతహస్తాన్ని అందిస్తూ రమ్మని పిలుస్తున్నట్లు, ఆమె బాబా హస్తాలలోకి చేరుకున్న మరుక్షణం ఆమె తన దేహాన్ని విడిచినట్లు నాకు బాబా పటంలో దర్శనమైంది. ఇదంతా నాకు చూపించడం బాబాకు ఆమెపై ఉన్న ప్రేమకు సజీవ తార్కాణం. ఆమె ఎప్పుడూ 'సాయి చరణం, బాబా చరణం, శ్రీసాయి శరణం' అనే పాటను ఎంతో భక్తి భావంతో పాడుతుండేవారు. తమ చరణాల చెంత చేర్చుకోవటానికి అట్టి తల్లికి బాబా తమ అమృతహస్తాన్ని అందించటంలో వింతేముంది? ఈవిధంగా బాబా తన భక్తుల అవసాన కాలాన్ని ఆనందమయం చేస్తారని నిరూపణ అయింది. బాబాకు ప్రణామాలతో...
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి !!!
రెండవ లీల – ఊదీతో తగ్గిన చేయి నొప్పి:
2020, జూలై 22, బుధవారం ఉదయం నేను నిద్రలేవటానికి ముందే నా ఎడమ మోచేయి దగ్గర ఏదో ఒక నరం అస్తవ్యస్తంగా కొట్టుకోవడం మొదలైంది. అది ఏమిటో, ఎందుకలా జరుగుతోందో నాకు అర్థం కాలేదు. స్నానం చేసి శ్రీసాయి సచ్చరిత్ర పారాయణ చేస్తుండగా చేయి నొప్పి ఎక్కువైంది. నాకు భయమేసి నా ముందే ఉన్న బాబా పటం దగ్గర నిలుచుని, ఊదీ ధరించి, "బాబా! ఈ నొప్పి తగ్గి, మరలా ఎటువంటి ఇబ్బందీ లేదని నాకనిపిస్తే గనక ఆలస్యం చేయకుండా నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకు చెప్పుకున్నాను. ఆ క్షణం నుంచి నొప్పి తగ్గిపోయింది. ఇది వ్రాస్తున్న సమయానికి ఆ నొప్పి ఆనవాలు కూడా కనిపించలేదు.
చివరిగా ఒక మాట, 'బ్లాగులో చెప్పుకోవడమంటే బాబాకు కృతజ్ఞత చెప్పడమే!' ఈ బ్లాగ్ ప్రత్యక్ష నిర్వహకులైన బాబాకి ప్రణామాలతో...
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!!
బాబా ఎల్లప్పుడూ నాతో ఉన్నారు
సాయిభక్తురాలు శ్రీమతి ప్రశాంతి తనకు బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
సాయిబంధువులందరికీ నమస్కారం. బాబా నాకు ప్రసాదించిన ఒక చిన్న అనుభవాన్ని మీ అందరితో పంచుకుంటాను. 2005వ సంవత్సరంలో మా అబ్బాయి ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షలు వ్రాశాడు. బాబు ప్రతిరోజూ గుడికి వెళ్లి బాబా దర్శనం చేసుకొనే పరీక్షకి వెళ్తుండేవాడు. బాబా అనుగ్రహం వలన పరీక్షలు బాగా వ్రాసేవాడు. అయితే చివరి పరీక్ష రోజున గ్రహణం ఏర్పడింది. ఆ కారణంగా గుడులన్నీ ముసేస్తారు. అందువలన నేను, 'బాబా దర్శనం చేసుకుంటేగానీ బాబు పరీక్షకి వెళ్ళడు. మరి ఇప్పుడెలా?' అని ఆందోళనచెంది, "మీరే ఏదైనా అద్భుతం చేయాలి బాబా" అని బాబాను ప్రార్థించాను. తరువాత కూడా బాబాను స్మరిస్తూనే ఉన్నాను. హఠాత్తుగా టీవీలో, "రేపటి పరీక్ష వాయిదాపడింది" అని వార్త వచ్చింది. నేను ఆశ్చర్యపోయాను. అడిగినంతనే అనుగ్రహించిన బాబాకు మనసారా ధన్యవాదాలు తెలుపుకున్నాను. బాబా ఎల్లప్పుడూ నాతో ఉన్నారు. మళ్ళీ ఇంకో అనుభవంతో కలుద్దాము.
om sai ram 1st leela is very nice.sai came and blessed that women in her last stage and she merges in sai.she is very lucky.
ReplyDeleteభక్త వత్సలుడు- మన సాయి నాథుడు
ReplyDeleteశిష్య రక్షకుడు- మన గురు దేవులు
ముక్తి ప్రదాత శరణు శరణు సాయి దేవ🙏🌷🙏
Jai sairam
ReplyDeleteOM SAI SRI SAI JAYA JAYA SAI Thanks for your comments everything will be done OM SAIRAM
ReplyDeleteOm sai ram
ReplyDeleteJai sairam
ReplyDeleteఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
ఓం సాయిరాం...🌹🙏🏻🌹
ReplyDelete