సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 502వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

    1. బాబా సందేశం - మనవరాలికి పునర్జన్మ


    2. ఎల్లప్పుడూ మాతో ఉంటున్న బాబా


బాబా సందేశం - మనవరాలికి పునర్జన్మ

గుంటూరు నుండి శ్రీమతి నాగమల్లేశ్వరి తన మనవరాలిని పెద్ద ప్రమాదం నుండి బాబా కాపాడిన లీలను మనతో పంచుకుంటున్నారు.

బాబా సర్వాంతర్యామి. తన బిడ్డలు ఎన్ని యోజనాల దూరంలో ఉన్నప్పటికీ వారు ఆపదలో ఉంటే తన ఒడిలోనికి తీసుకుని తప్పకుండా కాపాడుతారని తెలియజేసే ఈ అనుభవాన్ని ఈ బ్లాగు ద్వారా సాయిబంధువులతో పంచుకొనే అవకాశం ఇచ్చిన నా అన్న సాయిబాబాకు నా పాదాభివందనాలు. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా హృదయపూర్వక నమస్కారాలు.

నా పేరు నాగమల్లేశ్వరి. నేను గుంటూరు వికాస్‌నగర్ 9వ లైన్లో ఉంటాను. మా అమ్మాయి రాజశ్రీని మా తమ్ముడు శ్రీనివాస్‌కి ఇచ్చి వివాహం చేశాము. బాబా అనుగ్రహంతో వాళ్ళకు ఒక పాప పుట్టింది. తనకు ఏ పేరు పెట్టాలా అని ఎంతో ఆలోచించారు. ఒకరోజు బాబా గుడిలో పూజ చేసుకుని లేవగానే సాయి పాదాలు చూసి పాపకు ‘సాయిచరణి’ అని పేరు పెట్టారు. పాపతో కలిసి వాళ్లిద్దరూ ప్రతి సంవత్సరం క్రమంతప్పకుండా శిరిడీకి వెళ్ళేవారు. వారితో కలిసి నేను కూడా వెళ్ళేదాన్ని. ప్రతి గురువారం ఇద్దరూ కలిసే బాబాకు పూజ చేసేవారు. ఇరవై సంవత్సరాల తర్వాత సాయిచరణికి అమెరికాలో ఉండే ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీరుతో వివాహమైంది. బాబా దయవల్ల అక్కడే వారు ఇల్లు కొనుక్కుని స్థిరపడ్డారు.

నా దైనందిన జీవితంలో బాబా పూజ, సేవ ఒక భాగం. ప్రతిరోజూ వాట్సాప్‌లో ఆ సాయినాథుని సేవకులు పెట్టే బాబా మెసేజ్‌లు, బాబా ఫోటోలు చూసి అప్పుడు నిద్రపోతాను. 2020, జూన్ నెల 18వ తారీఖు గురువారంరోజు రాత్రి చూసిన మెసేజ్‌లో, “నీవు భయానికి గురైతే నేను ధైర్యాన్నవుతాను” తో మొదలై, “నేను నీకిచ్చే హామీ ఒకటే, నేను నీ చెంతనే ఉంటా, ఇక నీకు భయం ఎందుకు?” అని ఉంది. దాని పైన ఉన్న ఫోటోలో బాబా ఒక పాపని తన ఒడిలోకి తీసుకుని ముద్దుచేస్తున్నారు. అది చూసి నేను కన్నీళ్లు కారుస్తూ, “బాబా! మీ పాదాలను మర్చిపోకుండా నా మనవరాలికి సాయిచరణి అని పేరు పెట్టాము. తను మా అందరికీ దూరంగా అమెరికాలో ఉంటోంది. తనకేమైనా ఆపద వచ్చినప్పుడు ఆ బిడ్డను ఇలాగే మీ ఒడిలోకి తీసుకుని కాపాడండి” అని బాబాతో చెప్పుకుని, బాబాకు సాష్టాంగనమస్కారం చేసుకుని పడుకున్నాను. 

జూన్ 27వ తారీఖున సాయిచరణి పుట్టినరోజు. ఆ సందర్భంగా వాళ్ళమ్మ క్రొత్త చీర, జాకెట్ కొరియర్లో పంపింది. జాకెట్ లూజుగా ఉందని టైలర్ వద్ద అడ్జస్ట్ చేయించడానికి ఇవ్వమని తన భర్తని అడిగితే, తను మీటింగులో ఉండి వెళ్ళలేకపోయాడు. అందువల్ల జూన్ 19వ తారీఖున గూగుల్ మ్యాప్ సహాయంతో సాయిచరణి తనే స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ బయలుదేరింది. దారిలో గూగుల్ మ్యాప్ రాంగ్ రూట్ చూపించిందని నెమ్మదిగా కారుని వెనక్కి తీస్తుండగా హైవే మీద నుండి ఒక కారు వేగంగా వచ్చి సాయిచరణి కారుని గుద్దింది. ఆ దెబ్బకి తన కారు 5 రౌండ్లు తిరుగుతుండగానే వెనకనుండి వేరే కారు గుద్దింది. వెంటనే సాయిచరణి కారులోని ఎయిర్ బ్యాగ్స్ తెరచుకున్నాయి. సాయిచరణి స్పృహతప్పి లోపలే ఉండిపోయింది. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు, జనం అందరూ “కారు ఇంజన్ ఆపుచేయండి, లేకపోతే మంటలు వస్తాయ”ని కారుపై శబ్దం చేస్తూ అరవసాగారు. కాసేపటికి చరణి ఎవరో లేపినట్లే నిదానంగా లేచి బయటికి వచ్చి తన భర్తకు ఫోన్ చేసింది. అతను అంబులెన్సుకి ఫోన్ చేసి, తన కారులో యాక్సిడెంట్ అయిన చోటికి వచ్చి అంబులెన్సులో సాయిచరణిని హాస్పిటల్‌కి తీసుకువెళ్లాడు. చరణిని పరీక్షించిన డాక్టర్, “అంత పెద్ద యాక్సిడెంట్ జరిగితే, ఎటువంటి దెబ్బలు తగలకుండా ఉండటం చాలా ఆశ్చర్యంగా ఉంది” అన్నారు. ఇదంతా బాబా చేసిన అద్భుతమే! 18వ తారీఖు గురువారంనాడు వాట్సాప్ మెసేజ్‌లోని ఫోటో చూసి, “బాబా! నా మనవరాలికి ఆపద వచ్చినప్పుడు ఆ బిడ్డను మీ ఒడిలోకి తీసుకోండి” అని నేను కన్నీటితో బాబాకు చేసిన సాష్టాంగనమస్కారానికి ప్రతిఫలమే ఈ లీల. నా మొర ఆలకించి 19వ తారీఖున శుక్రవారం జరిగిన యాక్సిడెంటులో సాయిచరణిని తన ఒడిలోకి తీసుకొని, తనకు పునర్జన్మనిచ్చిన బాబా సర్వాంతర్యామి. నా సర్వస్వం నా అన్న సాయి. ఆయన భూమిపై నడయాడు దైవం. నమ్మి కొలిస్తే కంటికి రెప్పలా కాపాడుతారు. ఆయన లేక మనం లేము. ఇదే సత్యం.

ఎల్లప్పుడూ మాతో ఉంటున్న బాబా

ముందుగా ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి చాలా కృతజ్ఞతలు. నా పేరు బి.శోభారాణి. నేను కర్నూలు నివాసిని. సాయిబాబా భక్తురాలినైనందుకు నేను చాలా అదృష్టవంతురాలిని. బాబా ఎప్పుడూ నాకు అండగా ఉంటూ ప్రతి విషయంలో తమ సహాయాన్ని అందిస్తున్నారు. ప్రతి అమ్మాయి జీవితంలో పెళ్లి అనేది అత్యంత కీలకమైన విషయం. ఆ విషయంలో నిర్ణయం తీసుకోవడంలో బాబా నాకు ఎంతో సహాయం చేశారు. అది నా మొదటి అనుభవం. నా రెండవ అనుభవం నా తండ్రి శస్త్రచికిత్సకు సంబంధించినది. ఆ సమయంలో బాబా మాకెంతో సహాయం చేసి, తమ ఆశీస్సులు ఎల్లప్పుడూ మాకు అండగా ఉన్నాయని నిదర్శనమిచ్చారు. బాబా అనుగ్రహంతో నాన్న ఆరోగ్యం ఇప్పుడు బాగుంది. ఇక మూడో అనుభవానికి వస్తే, మా తాతగారి ఆరోగ్యం విషయంలో కూడా బాబా తమ సహాయాన్ని అందించారు. "బాబా! ఎల్లప్పుడూ మాతో ఉంటున్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు".


7 comments:

  1. 🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏
    నా కన్నులలో వెలుగై నిలిచీ...
    చిరు వెన్నెలగా... బ్రతుకే మలిచీ
    నిట్టూర్పుగున్న గుండెకీ
    ..ఓదార్పు చూపినావురా
    నాది పేద మనసురా ..
    కాంచలీయలేనురా..కనుల నీరె కాంచరా
    సాయి వడికి చేరువైన వేళలో...🙏🙏🙏

    ReplyDelete
  2. om sai ram i love you baba.take care of my family be with us.bless us

    ReplyDelete
  3. I want to join mahaparayana group

    ReplyDelete
  4. Plz contact 9866547524 to join mahaparayana

    ReplyDelete
  5. Om srisairam Om srisairam Om srisairam thankyou sister.

    ReplyDelete
  6. ఓం సాయిరాం...🌹🙏🏻🌹

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo