సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 514వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా అనుగ్రహంతో తీరిన చింతలు
  2. సాయిపూజకు చిగురించిన తమలపాకుల తీగ 

బాబా అనుగ్రహంతో తీరిన చింతలు

నా పేరు అంజలి. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన అనుభవాన్ని మీతో పంచుకుంటాను. 2020, జూలై 23వ తారీఖున ఆఫీసులో ఒక క్రొత్త వర్క్ పూర్తయింది. ఆరోజు ఆఫీసుకి మా ఆఫీసర్లందరూ వచ్చారు. తరువాతిరోజు ఉదయం మా ఆఫీసులో పనిచేసే ఉద్యోగి నాకు ఫోన్ చేసి, “నాకు డెట్టాల్ వాసన రావటం లేదు, కోవిడ్ పరీక్ష చేయించుకుంటాను” అని చెప్పాడు. అంతకుముందు రోజు ఆఫీసులో అందరం ఒకేచోట కలిసి పనిచేశాము. ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. దాంతో నాకు చాలా ఆందోళనగా అనిపించి, “బాబా! అతనికి కోవిడ్ నెగిటివ్ వచ్చేలా చేయండి, లేదంటే అతని వలన అందరం ఎఫెక్ట్ అవుతాము” అని బాబాను కోరుకున్నాను. మన బాబా లీల చూపించారు. అతను కోవిడ్ పరీక్ష చేయించుకోగా రిపోర్టు నెగిటివ్ వచ్చింది. అంతా బాబా దయ. ఆయన తలుచుకుంటే కానిది ఏముంది? అందరం హాయిగా ఊపిరి పీల్చుకున్నాం. నా ప్రార్థన మన్నించినందుకు బాబాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను.

మరో అనుభవం: 

నేను ప్రతి నెలా మొదటి తారీఖున ఆఫీస్ లాప్ టాప్ లో రీడింగ్స్ తీయాలి. అలాగే ఈసారి కూడా రీడింగ్ తీస్తుంటే ఒకచోట మధ్యలో ఆగిపోతోంది. ఎంత ప్రయత్నించినా రీడింగ్ రావటం లేదు. దాంతో నేను బాబాను వేడుకున్నాను, ‘ఎలాగయినా ఈ రీడింగ్ వచ్చేలా చూడు బాబా’ అని. అప్పటివరకు రాని రీడింగ్స్ నేను బాబాను కోరుకున్న వెంటనే వచ్చాయి. అంతా బాబా అనుగ్రహమే. సంతోషంగా బాబాకు ధన్యవాదాలు తెలుపుకున్నాను.

మరో అనుభవం: 

ఈ సంవత్సరం శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మీవ్రతం చేసుకున్నాను. బాబా దయవలన వ్రతం బాగా జరిగింది. ప్రతి సంవత్సరం బంగారపు లక్ష్మీరూపుని పూజలో పెట్టుకొని, పూజ పూర్తయిన తరువాత మెడలో వేసుకుంటాను. ఈసారి కూడా అలాగే వేసుకున్నాను. మరుసటిరోజు ఆఫీసుకి వెళ్ళేటప్పుడు ఆ లక్ష్మీరూపు మెడలోనే వుంది. సాయంత్రం ఆఫీసునుండి వచ్చి స్నానం చేసి కూర్చొని మెడలో చూసుకుంటే లక్ష్మీరూపు కనపడలేదు. చాలా బాధపడ్డాను. ఎంత వెతికినా ఎక్కడా కనపడలేదు. ‘నా పూజలో ఏం లోపం జరిగిందో ఇలా అయింది’ అని అనుకున్నాను. బాబాకు చెప్పుకుని బాధపడ్డాను. బాబా తన భక్తుల బాధ చూడలేరు కదా. బాబాకు చెప్పుకున్న తరువాత నేను హాల్లోకి వెళ్లి కుర్చీలో కూర్చోబోతుంటే అదే కుర్చీలో లక్ష్మీరూపు కనపడింది. అంతా బాబా దయ. ఆయన దయ మా కుటుంబం మీద, ఇంకా అందరి మీదా ఇలాగే ఎల్లప్పుడూ వుండాలని కోరుకుంటున్నాను. “లవ్ యు సో మచ్ బాబా! మీరు ఎల్లప్పుడూ మాతో ఉండండి” 

ఈ అనుభవాలన్నింటినీ ఈ బ్లాగులో పంచుకుంటానని బాబాతో చెప్పాను. “కాస్త ఆలస్యంగా ఈ అనుభవాలను పంచుకుంటున్నందుకు నన్ను క్షమించండి బాబా!” మరలా మరికొన్ని అనుభవాలతో త్వరలోనే మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. 

ధన్యవాదాలు బాబా...
ప్రేమతో మీ భక్తురాలు.

సాయిపూజకు చిగురించిన తమలపాకుల తీగ 

సాయిభక్తురాలు శ్రీమతి విజయ ఇటీవల తనకు కలిగిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

ముందుగా బాబా మాకు ప్రసాదించిన అనుభవాలను, తద్వారా మేము పొందిన ఆనందాన్ని తోటి సాయిభక్తులతో పంచుకునే అవకాశం కల్పిస్తున్న 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వాహకులకు నా కృతజ్ఞతలు.

నేను చాలా వారాలుగా నవగురువార వ్రతం చేస్తున్నాను. ప్రతి గురువారం వ్రతం చేసి బాబాకు పాలకోవాతోపాటు కేసరి లేదా ఇంకేదైనా స్వీట్ నైవేద్యంగా పెడుతున్నాను. వాటితోపాటు బాబాకు తాంబూలం కూడా సమర్పిస్తున్నాను. ఇదివరకు మేము బెంగళూరులో ఉన్నప్పుడు బయట షాపులో తమలపాకులు కొని బాబాకు తాంబూలం సమర్పించేదాన్ని. అలా బయట తీసుకొస్తున్న ప్రతిసారీ, 'ప్రొద్దుటూరులో అత్తవారింట ఉంటే ఎంత బాగుండేది! ఇంటిలోనే తమలపాదు ఉంది కాబట్టి ఎంచక్కా తాజా తమలపాకులు బాబాకు సమర్పించుకొనేదాన్ని కదా!' అని అనుకుంటూ ఉండేదాన్ని. అయితే కోవిడ్ కారణంగా ఎటూ వెళ్లలేక 11 వారాల పూజ బెంగళూరులోనే చేశాను. తరువాత ప్రొద్దుటూరుకి వచ్చేశాము. కానీ ఇక్కడికి వచ్చాక చూస్తే, తమలపాదు తెగులు పట్టి పూర్తిగా ఎండిపోయి కనిపించింది. దాంతో నేను, "తాజా తమలపాకులతో మనసారా మీకు తాంబూలం సమర్పించుకుందామంటే ఇలా అయ్యిందేమిటి బాబా" అని చాలా బాధపడ్డాను. భక్తులు ప్రేమతో ఏదైనా చేయాలనుకుంటే బాబా తప్పక అనుగ్రహిస్తారని మనకు తెలిసిందే కదా! ఆయన అద్భుతం చూపించారు. శనివారంనాడు పూర్తిగా ఎండిపోయి కనిపించిన తమలపాకుల తీగ మరుసటి గురువారానికి, అంటే సరిగ్గా 5 రోజుల్లోనే తీగనిండా ఆకులతో దర్శనమిచ్చింది. నా సంతోషానికి అవధులు లేవు. తాజా తమలపాకులతో ప్రేమగా బాబాకు తాంబూలం సమర్పించి చాలా ఆనందించాను. తీసివేయాలనుకున్న తమలపాకుల తీగ మళ్లీ బాబా కోసమే చిగురించిందని నా విశ్వాసం. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు".


7 comments:

  1. om sai ram when we wish baba comes and helps us.om sai ram to day is thrusday i am doing m.p.parayan.i am feeling very glad to do parayan

    ReplyDelete
  2. 🙏🌺🙏సాయి లీలా విన్యాసం🙏🌺🙏
    సర్వేజనా సుఖినోభవంతు! సర్వే సుజనా సుఖినోభవంతు!!
    🙏🌺🙏ఓం సాయిరాం🙏🌺🙏

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. Sai maa ammaki edo aidi anipistundi
    kani nenu telusukoleni paristitilo unnanu
    please help her sairam

    ReplyDelete
  5. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  6. సాయి బoదువులకు నమస్కారములతో "ఓం సాయిరాం " గత కొoతకాలముగా నేను న్యూరో ప్రాబ్లంతో చాలా బాదపడి చివరకు ఆపరేషన్ చెన్నయ్ విజయా hospetelలో చేయించుకున్నాను.నేను 20.04.2021 కోవిడ్ vaccine(టీకా) వేసుకోవాలని వెలితే . అక్కడి Doctor చెప్పినట్లు ముoదు 2రోజులు ముoదు తదుపరి 4 రోజులు పెయిన్ ట్యాబ్లెట్స వాడకుడదని అన్నారు. అదేవిదముగా ఉoడి 22 తేదిన టీకా వేసుకున్నాను. నేను టీకా వేసుకున్నప్పటినుoచి నాపాత న్యూరో ప్రాబ్లమ్ ఎక్కువైనది కారణం తెలియక doctor కు పోన్ చేద్దామని అనుకుoటె doctor పోన్ తీయరు whatsapp పెట్టాను . నేను పూర్తిగా సహనo కోల్పోయాను. అప్పుడు గుర్తుకు వచ్చినది నెల్లూరు సిoహపురి ఆసుపత్రి లో గతoలో చూపిoచుకున్నా doctor కు పోను చేసినాను ఆ doctors కూడా పోను తీయలేదు whats app చేసాను, నేను ఇoటిలోని అoదరిపై కోపడుచున్నాను. అప్పటికి ముందులు మాని 4 రోజులు అయినది రోజు 2 గoటలుకూడా నిద్ర పట్టుటలేదు నాకేదో అయిపోతుoది చనిపోతానేమో అని భయము ఇoటి ఆర్థికస్థితి బాగలేదు doctor మoదులు ఎట్టి
    పరిస్థితి లోను ఆపరాదు అని గతoలో అన్నారు పోన్ చేసి అడుగుదామoటె నాకు తమిల్ రాదు నా english వారికి అర్దం కాదు ఇక లాభం లేదు అనుకొని సాయిని తలుచుకొని నీవే దిక్కు అని అనుకున్నాను శరణం చెప్పుకున్నాను నేను అవి వేకుడను నా తప్పులు క్షమిoచు నాకు ఏమైనా దారి చూపు అనుకొని గమ్ముగా పడుకొని పోన్ చూస్తూ ఉన్నాను అప్పుడు కనిపిoచినది సిoహపురి doctors whats app చేసి ఉన్నారు ఏమికాదు మoదులు కటిన్యూ చేయవచ్చు అని. నాకు అర్థం కాక మాపాప కు చూపెట్టాను అవును డాడీ మందులు వాడుకో అని మందులు తెచ్చియిచ్చినది. అప్పుడు సాయికి కృతజ్ఞతలు తెలుపుకొని మoదులు వేసుకొని సాయి ధ్యానం లొ ఉoటూ తెల్లా వారు జామున 3.50 నిదరలోకి జారుకొని 7.30 లేచాను. మరుసటి రోజు నుoచి మoదులు వాడుకొoటూ మoచిగా నిద్ర పోగలిగాను ఆరోగ్యం బాగున్నది. ఓo సాయిరాo.🙏
    🌺🙏



    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo