సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 489వ భాగం...



ఈ భాగంలో అనుభవం:
  • శిరిడీ దర్శనానికి బాబా అనుమతించాక విధి ఏమి చేయగలదు?

సాయిభక్తుడు సాయిశరణ్ తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

అమ్మ, నాన్న, నేను, నా సోదరితో కూడుకున్న సాదాసీదా కుటుంబం మాది. నా తల్లిదండ్రులు, సోదరి మా సొంత ఊరిలో నివాసముంటున్నారు. నేను ఇంటర్న్‌షిప్ శిక్షణ నిమిత్తం మా వాళ్ళకి దూరంగా వేరే ఊరిలో ఉన్నాను. నాన్న స్కూల్ టీచర్.

2013, మే 14 వరకు మామూలుగానే రోజులు గడిచాయి. మరుసటిరోజు అకస్మాత్తుగా నాన్న ఆరోగ్యం బాగాలేదని నాకు ఇంటినుండి ఫోన్ వచ్చింది. సాధారణంగా నాన్న ప్రతిరోజూ తెల్లవారుఝామున 5 గంటలకు మేల్కొంటారు. అలాగే ఆరోజు ఉదయం లేచినప్పుడు ఆయన క్రింద పడిపోయారు. ఎడమకాలు సహకరించక ఆయన సరిగా నడవలేకపోయారు. అయినప్పటికీ, ఆయన శక్తిని కూడదీసుకుని మంచం వరకు నడవగలిగారు. కొంత సమయం విశ్రాంతి తీసుకున్నారు. అమ్మకి, నా సోదరికి ఏమి చేయాలో తెలియక చాలా ఆందోళన చెందారు. తరువాత వాళ్ళు పొరుగువారి సహాయంతో సమీపంలోని ఆసుపత్రికి నాన్నను తీసుకుని వెళ్లారు. అవసరమైన సమయంలో సహాయం చేయడానికి మా చుట్టూ మంచివాళ్ళు ఉన్నారని తెలిసి మేమెంత అదృష్టవంతులమో నాకు అర్థమైంది. ఆసుపత్రికి వెళ్ళే మార్గంలో నాన్న నోరు ఒకవైపుకు లాగేస్తున్నట్లు మావాళ్లు గమనించారు. వాళ్ళు ఆసుపత్రికి చేరుకున్న వెంటనే డాక్టర్ ఇంజెక్షన్లు ఇచ్చి పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నించారు. దాంతో పరిస్థితి బాగానే ఉంది. అయితే, నాన్నని సమీపంలోని సిటీ ఆసుపత్రికి తీసుకెళ్లడం మంచిదని డాక్టర్ సూచించారు. దాంతో మా వాళ్ళు సిటీలోని హాస్పిటల్‌కి నాన్నను తీసుకుని బయలుదేరారు. అంతలో నేను కూడా బయలుదేరి నేరుగా న్యూరో హాస్పిటల్‌కి వెళ్ళాను. అక్కడి డాక్టర్ పరీక్షించి, "బ్రెయిన్‌లో రక్తం గడ్డకట్టడం వలన పక్షవాతం వచ్చిందని, మూడురోజుల వరకు ఏమీ చెప్పలేమ"ని చెప్పారు. ఒక్కసారిగా మా గుండె ఆగినంత పనైంది. అందరం చాలా ఆందోళన చెందాము. మా తాతగారు మమ్మల్ని ఓదార్చడానికి ప్రయత్నిస్తూ అన్న ఒక మాట మాకు ధైర్యాన్ని ఇచ్చింది. ఆయన గత నెలలో మేము బుక్ చేసుకున్న శిరిడీ ప్రయాణ టిక్కెట్ల గురించి మాకు గుర్తు చేశారు.

చిన్నప్పటినుండి మేము బాబాను పూజిస్తున్నప్పటికీ మాకంత భక్తి లేదు. మా అమ్మగారి తల్లిదండ్రులు సాయిబాబాకు గొప్ప భక్తులు. మా తాతగారు బాబా దర్శనానికి రమ్మని మా కుటుంబసభ్యులందర్నీ చాలాసార్లు అడిగారు. కానీ మేము సమయం కేటాయించలేకపోయాము. చివరికి మేము ఆగస్టు నెలలో శిరిడీ ప్రయాణం కోసం ఏప్రిల్ నెల మొదటి వారంలో టిక్కెట్లను బుక్ చేశాము. అయితే నాన్న సెలవుల విషయంలో సరైన స్పష్టత లేనందువల్ల ఆయనకు టికెట్ బుక్ చేయలేదు. కానీ అకస్మాత్తుగా ఏప్రిల్ నెల రెండవ వారంలో నాన్న పాఠశాల నుండి తిరిగి వస్తూ తనంతట తానే టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే అప్పటికీ ఆయన సెలవుల విషయంలో స్పష్టత లేదు. అయినా మేము సాయిపై విశ్వాసం ఉంచాము. సాయిబాబా తరచూ, "నా భక్తులు వేల మైళ్ళ దూరంలో ఉన్నప్పటికీ కాలికి దారంకట్టి ఈడ్చునట్లు వారిని శిరిడీకి లాగుతాన"ని చెప్పేవారు. కాబట్టి ఆయన దర్శనానికి టిక్కెట్లు బుక్ చేసుకునేలా మమ్మల్ని ఆశీర్వదించడం మొదటి అద్భుతం

రెండవ విషయం, "ద్వారకామాయి దర్శనానికి అనుమతి లభించినవారెవరైనా దేనికీ భయపడాల్సిన అవసరం లేదు, వారి బాధలు అంతమవుతాయ"ని బాబా అన్నారు. "మీ భారం నాపై పడవేయుడు, నేను మోసెదన"ని కూడా చెప్పారు. అందువల్ల, మేము బాబా పవిత్ర పాదాలనే ఆశ్రయించాము. శిరిడీ సందర్శనానికి బాబా అనుమతిస్తే, విధి భిన్నంగా ఉంటుందా? బాబా వాక్కును ఎవరైనా మార్చగలరా? లేదు! అలా జరగదు. బాబా అనుగ్రహంతో మా నాన్న ఆరోగ్యం నెమ్మదిగా కుదుటపడటం మొదలైంది. మేము మొదటిసారి బాబా దర్శనం కోసం శిరీడీ వెళ్ళాము. ఇది రెండవ అద్భుతం. ఇది మా జీవితకాలం గుర్తుండే అద్భుతమైన అనుభవం.

శిరిడీ దర్శనానికి అనుమతి లభించిన వారెవరైనా గుర్తుంచుకోండి, ఎటువంటి అడ్డంకులకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సాయితల్లిపై విశ్వాసం ఉంచండి, అంతా ఆయనే చూసుకుంటారు. "సాయిదేవా! మీకు వేలవేల ప్రణామాలు"

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

source:http://www.shirdisaibabaexperiences.org/2020/02/shirdi-sai-baba-miracles-part-2622.html


5 comments:

  1. 🙏💐🙏 ఓం సాయి రామ్ 🙏💐🙏

    ReplyDelete
  2. అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  3. Om Sai Ram 🙏🌹🙏🌹
    ఓం శ్రీ సాయినాథాయ నమః!🙏
    ఓం ఆరోగ్య క్షేమదాయ నమః!🙏

    ReplyDelete
  4. Om Sri Sai Ram thaatha 🙏🙏
    Bhavya sree

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo