సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 490వ భాగం...


ఈ భాగంలో అనుభవాలు:

  1. బాబాకి ప్రార్థనే సమస్యలకు పరిష్కారం
  2. నమ్మినవారిని తప్పక కాపాడుతారు మన సాయినాథుడు

బాబాకి ప్రార్థనే సమస్యలకు పరిష్కారం

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

ఓం సాయిరాం! సాయిభక్తులందరికీ నమస్కారం. ఈ బ్లాగును నడిపిస్తున్న సాయికి చాలా కృతజ్ఞతలు. మేము అమెరికాలో ఉంటాము. మాకు ఇద్దరు పిల్లలు. నాకు బాబా ప్రసాదించిన అనుభవాలలో కొన్నిటిని ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

ఒకసారి నాకు బాబా సచ్చరిత్ర పారాయణ చేయాలనిపించింది. మరునాడు గురువారం. అందుకే వెంటనే గురువారం రోజున పారాయణ ప్రారంభించాను. పారాయణ చేయాలనే ఉత్సాహంలో అది నాకు నెలసరి వచ్చే సమయమనే విషయం ఆలోచించలేదు. ఆ విషయం గుర్తురాగానే బాబాకు నమస్కరించి, “బాబా! నెలసరి ఆటంకం లేకుండా నేను పారాయణ పూర్తిచేసేలా అనుగ్రహించండి. ఏ ఆటంకమూ లేకుండా పారాయణ పూర్తయితే నా అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అని చెప్పుకున్నాను. బాబా అనుగ్రహంతో ఏ ఆటంకమూ లేకుండా పారాయణ పూర్తయింది. నా మనసుకు చాలా సంతోషంగా అనిపించింది. పారాయణ పూర్తయ్యాక ఇంటిలో ఎప్పుడూ లేని పాజిటివ్ ఎనర్జీ కనిపించింది. “చాలా చాలా థాంక్స్ బాబా!”

మరొక అనుభవం: 

ఈమధ్య ఒకరోజు నాకు ఉన్నట్టుండి ఒళ్ళునొప్పులతో కూడిన జ్వరం వచ్చింది. అసలే కరోనా సమయం, దాంతో నాకు చాలా భయమేసింది. కానీ, ‘బాబా నాతో ఉన్నారు, బాబా తన బిడ్డలను ఎప్పుడూ బాధపడనివ్వర’ని నా మనసుకు తెలుస్తోంది. వెంటనే బాబాకు నమస్కరించి బాబా ఊదీ నీళ్ళలో కలుపుకుని త్రాగాను. ఒక్కరోజులోనే నాకు చాలా తేడా కనిపించింది. నా జ్వరం పూర్తిగా పోయింది. “బాబా! మీకు ఎలా కృతజ్ఞతలు తెలపుకోవాలో నాకు అర్థం కావట్లేదు. మా తల్లి, తండ్రి అంతా నీవే. మీ కరుణ అందరిపై ఇలాగే ఉండేలా అనుగ్రహించండి బాబా!”

మరొక చిన్న అనుభవం: 

ఒకసారి నాకు నెలసరి ఆలస్యంగా రావడంతో ఏమైనా ఆరోగ్య సమస్యేమోనని చాలా భయపడ్డాను. ఏ సమస్యా లేకుండా చూడమని బాబాను ఆర్తిగా ప్రార్థించాను. బాబాను ప్రార్థించిన తరువాత నెలసరి వచ్చింది. నా సమస్య తీరిపోయింది. నేను సాయి స్తవనమంజరి పారాయణ చేశాను. ఆ పారాయణ వల్ల ఎంతగానో మనోబలం చేకూరుతుంది. మీరూ సాయి స్తవనమంజరి పారాయణ చేయండి. బాబా నాకు ప్రసాదించిన ప్రేమ, కృప నాకు ఎంతో బలాన్ని చేకూర్చాయి. “చాలా థాంక్స్ బాబా! నీ కృప ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి. అందరినీ చల్లగా చూడు తండ్రీ! ఈ కరోనా నుండి త్వరగా విముక్తులను చేయి తండ్రీ!”.

నమ్మినవారిని తప్పక కాపాడుతారు మన సాయినాథుడు

సాయిభక్తురాలు భారతి తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు భారతి. నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలిని. బాబా నాకు ప్రసాదించిన ఎన్నో అనుభవాలనుండి ఒక అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటాను. ఒక సమస్య కారణంగా ఈమధ్య నాకు చిన్న ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఆపరేషన్‌తో ఆ సమస్య పరిష్కారం అయిందనుకునేలోపు గతంలో ఉన్న కిడ్నీ నొప్పి తిరిగి ప్రారంభమైంది. నొప్పి దానంతటదే తగ్గుతుందని ఒక వారం రోజులు అలాగే వేచి చూశాను, కానీ తగ్గలేదు. ఇక హాస్పిటల్‌కి వెళ్లి స్కానింగ్ తీయించుకుందామని పాఠశాలకు సెలవు పెట్టాను. కానీ ఆరోజు తప్పనిసరి పరిస్థితులలో పాఠశాలకు వెళ్ళవలసి వచ్చింది. ఎంతో నొప్పి ఉన్నప్పటికీ ఆ బాధతో అలాగే పాఠశాలకు వెళ్లడానికి తయారయ్యాను. ప్రతిరోజూ బయటకు వెళ్ళేముందు బాబాకు నమస్కారం చేసుకొని బాబా ఊదీని నుదుటన ధరించడం నాకు అలవాటు. అలాగే ఆరోజు కూడా బాబాకు నమస్కరించి, “బాబా! ఇంత నొప్పితో బయలుదేరుతున్నాను. నాకు ఎక్కడా ఏ సమస్యా రాకుండా చూసే బాధ్యత నీదే తండ్రీ!” అంటూ చాలా ఆర్తిగా బాబాను వేడుకుని ఊదీని నుదుటన పెట్టుకున్నాను. మా ఇంటినుండి మెయిన్ రోడ్డుకు చేరుకోవడానికి అర కిలోమీటరు పైగా నడవాలి. ఇంత నొప్పితో ఎలా నడవగలనో అని భయపడుతూ బయలుదేరాను. ఆశ్చర్యం! బాబా ఎంత అద్భుతం చేశారంటే, నడుస్తున్నంతసేపూ అసలు నాకు అలాంటి నొప్పి ఒకటి ఉందన్న సంగతి కూడా గుర్తుకు రాలేదు. బాబా నా వెంటే ఉన్నట్లుగా అనిపించింది. బాబా అనుగ్రహంతో ఆరోజు నుండి నా నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. నేనిక హాస్పిటల్‌కి కూడా వెళ్లలేదు. తనను నమ్మినవారిని తప్పక కాపాడుతారు మన సాయినాథుడు. నమ్మకం, ఓర్పు వుంటే ఎంతటి కష్టంనుంచైనా గట్టెక్కిస్తారు.

సాయినాథ్ మహరాజ్ కీ జై!


6 comments:

  1. 🙏💐🙏 ఓం సాయిరాం 🙏💐🙏

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. ఓం సాయిరాం...,🌹🙏🏻🌹

    ReplyDelete
  4. Om Sai Ram 🙏🌹🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః!🙏
    ఓం ఆరోగ్య క్షేమదాయ నమః!🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo