సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 492వ భాగం....



ఈ భాగంలో అనుభవాలు:


  1. బాబాకి చెప్పుకుంటే చాలు - ఆయన చల్లగా చూసుకుంటారు
  2. సాయి నామజపం మహత్యం

బాబాకి చెప్పుకుంటే చాలు - ఆయన చల్లగా చూసుకుంటారు

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!

జై సాయిరాం! నా పేరు రఘు. నేను సాయినాథునికి చాలా చిన్న భక్తుడిని. బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 

2020 మార్చి నెలలో లాక్‌డౌన్ మొదలయిన తరువాత నేను ఇంటినుంచి వర్క్ చేయడం ప్రారంభించాను. ఒకరోజు నా భార్య తనకు గొంతులో నొప్పిగా ఉందని అన్నది. నేను చాలా భయపడిపోయాను. ఎందుకంటే ఇవి కరోనా రోజులు కదా. నేను వెంటనే మెడికల్ షాపుకి వెళ్లి గొంతునొప్పికి మెడిసిన్ తీసుకొచ్చి తనకు ఇచ్చాను. తను ఆ మెడిసిన్ వేసుకుంది. నేను బాబాకు నమస్కరించి, “బాబా! మీ దయవల్ల రేపు ఉదయానికల్లా తన గొంతునొప్పి తగ్గితే ఈ అనుభవాన్ని సాయిమహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అని ప్రార్థించాను. బాబా అనుగ్రహంతో మరుసటిరోజు ఉదయానికల్లా నా భార్య గొంతునొప్పి తగ్గిపోయింది. బాబా పాదపద్మాలకు నమస్కరించుకుని మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. “మమ్మల్ని దీవించండి బాబా! ఎల్లప్పుడూ మీమీదనే మా దృష్టి నిలిపేలా మమ్మల్ని దీవించండి” 

మరొక అనుభవం:

నేను ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. లేటెస్ట్ టెక్నాలజీలో ట్రెయినింగ్ కోసం మా టీమ్‌ని నామినేట్ చేయమని ఇ-మెయిల్ వచ్చింది. నా టీమ్‌లో ముగ్గురిని నామినేట్ చేశాను. ఆ తరువాత ట్రైనింగ్ ఆర్గనైజర్ నాకు ఫోన్ చేసి, “ఇంకొంతమందికి కూడా అవకాశం ఉంది. మిగిలిన టీమ్ మెంబెర్స్‌‌ని కూడా నామినేట్ చేస్తాను” అని చెప్పాడు. నేను సరేనన్నాను. కానీ నేను ఆ విషయంలో మా మేనేజర్ అనుమతి తీసుకోలేదు. ఈలోపే టీమ్ మెంబర్స్ అందరూ ట్రెయినింగ్ కోసం రిజిస్టర్ చేసుకున్నారు. ఆ విషయం గురించి మా మేనేజర్ నన్నేమన్నా అంటాడేమోనని భయపడుతూ, “బాబా, మా మేనేజర్ నన్నేమీ అనకుండా ఉంటే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అని బాబాను ప్రార్థించాను.

ట్రైనింగ్ ముందురోజు మా మేనేజర్ నాకు ఫోన్ చేసి ప్రాజెక్ట్ గురించి చర్చించాడు. నేను అప్పుడు చెప్పాను, “టీం అంతా ట్రైనింగ్ కోసం రిజిస్టర్ చేసుకున్నారు” అని. ఆ విషయం తనకు తెలుసన్నాడు మా మేనేజర్. ఆ విషయం గురించి ఇంకేమీ అనలేదు. నాకు చాలా ఆనందం వేసింది. సంతోషంగా బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను.

“ఈ అనుభవాలను ఇంత ఆలస్యంగా పంచుకుంటున్నందుకు నన్ను క్షమించండి బాబా. నా ఆరోగ్య సమస్యలేమిటో మీకు బాగా తెలుసు. వాటిని తొలగించి నన్ను, నా కుటుంబాన్ని కాపాడండి బాబా! ఈ కరోనా బారినుండి అందరినీ కాపాడండి తండ్రీ!”

సాయి నామజపం మహత్యం

సాయిభక్తురాలు శిరీష తనకు ఇటీవల బాబా ప్రసాదించిన ఒక చిన్న అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

సాయిభక్తులకు సాయిరామ్! ఇదివరకు నేను కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. 2020, జులై 16న జరిగిన ఒక చిన్న అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆరోజు సాయంత్రం నేను భరించలేని తలనొప్పితో చాలా బాధపడ్డాను. నేను తలనొప్పికి మందులు వేసుకోవాలనుకోలేదు. మందులకు బదులుగా 'ఓం సాయి' అంటూ పదినిమిషాలు నామజపం చేశాను. పదినిమిషాలు పూర్తవుతూనే అకస్మాత్తుగా తలనొప్పి నుండి నాకు ఉపశమనం లభించింది. బాబా చేసిన అద్భుతానికి ఆశ్చర్యపోయాను. నామజపం యొక్క మహత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. "అద్భుతమైన అనుభవాన్ని ప్రసాదించినందుకు ధన్యవాదాలు బాబా!"


7 comments:

  1. 🙏🌹🙏 ఓం సాయిరాం 🙏🌹🙏

    ReplyDelete
  2. అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  3. OM SAIRAM
    SAI ALWAYS BE WITH ME

    ReplyDelete
  4. Om Sri Sai Ram thaatha 🙏🙏🙏
    BHAVYA sree

    ReplyDelete
  5. ఓం సాయిరాం...🌹🙏🏻🌹

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo