సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 511వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:


  1. బాబా అనుగ్రహంతో నయమైన శ్వాస సమస్య
  2. సాయిబాబా ఆశీర్వచనం వల్ల నయమైన తలనొప్పి

బాబా అనుగ్రహంతో నయమైన శ్వాస సమస్య

సాయిభక్తురాలు అనూష తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

సాయిభక్తులందరికీ నా నమస్కారం. నా పేరు అనూష. ఈ బ్లాగ్ గురించి నేను ఈమధ్యనే తెలుసుకున్నాను. బాబా లీలలు చదువుతూ ఉంటే అందరి జీవితాల్లోనూ ఏదో తెలియని ధైర్యం. ఈమధ్యనే నా జీవితంలో జరిగిన ఒక అనుభవాన్ని మీ అందరితో పంచుకుందామని మీ ముందుకు వచ్చాను. జూలై 17న నేను హైదరాబాద్ నుంచి మా ఊరికి వచ్చాను. మరుసటిరోజు నాకు శ్వాస సంబంధిత సమస్య వచ్చింది. శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బందిపడ్డాను. చికిత్స కోసం అర్థరాత్రివేళ అన్ని ఆసుపత్రులూ తిరిగాము. కరోనా వచ్చి ఉంటుందనే అనుమానంతో ఎవరూ చికిత్స చేయటానికి ముందుకు రాలేదు. "కరోనా రిపోర్టు ఉంటే తప్ప చికిత్స చేయము" అని చెప్పారు. నిరాశతో ఇంటికి తిరిగి వచ్చేశాము. తెలిసినవాళ్ళ ద్వారా ఒక డాక్టరుతో ఫోనులో మాట్లాడి, వారు సూచించిన మందులు వాడాను. మూడు రోజులైనా నా సమస్య తీరలేదు. శ్వాస సమస్యతో చాలా బాధపడ్డాను. నాకు ఇంతకుముందెప్పుడూ ఇలాంటి సమస్య రాలేదు. అప్పుడు, "నా సమస్యను తగ్గించమ"ని బాబాను వేడుకున్నాను. అప్పుడే నాకు బాబా ఊదీ గుర్తుకు వచ్చింది. బాబా ఊదీని నీళ్లలో కలుపుకొని బాబాకు నమస్కారం చేసుకుని త్రాగాను. అలా మూడు రోజులు త్రాగిన తర్వాత బాబా అనుగ్రహంతో నాకున్న శ్వాస సమస్య తగ్గిపోయింది. ఇప్పుడు నేను మళ్లీ మామూలుగా ఊపిరి తీసుకోగలుగుతున్నాను. కరోనా టెస్ట్ కూడా చేయించుకున్నాను. బాబా కృపతో కరోనా టెస్టులో కూడా నెగిటివ్ వచ్చింది. “చాలా చాలా ధన్యవాదాలు బాబా!” 

గత కొన్నేళ్లుగా నన్ను వేరే ఆరోగ్య సమస్య బాధపెడుతూ ఉంది. ఆ సమస్యను కూడా తొలగించమని బాబానే శరణు వేడుకుంటున్నాను. ఆ తండ్రే నన్ను కాపాడుతాడు. నాకు శ్రద్ధ, సబూరి ఇవ్వాలని ఆ సాయితండ్రిని కోరుకుంటున్నాను. త్వరలోనే నేను మళ్లీ నా సాయితండ్రి లీలను మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను.

అందరికీ ధన్యవాదాలతో...

సాయిభక్తురాలు అనూష

సాయిబాబా ఆశీర్వచనం వల్ల నయమైన తలనొప్పి

సాయిభక్తురాలు శరణ్య తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

ముందుగా బాబాకు నా శతకోటి వందనాలు. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి మరియు సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. నా పేరు శరణ్య. నేను ఈ బ్లాగులో ఎంతోమంది సాయిభక్తుల అనుభవాలను చదివాను. నేను గత ఆరు నెలల నుండి బాబాను నమ్మకంతో పూజిస్తున్నాను. బాబా కృపవల్ల నాకు కలిగిన ఒక చిన్న అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

నేను 2020, జులై 24న తీవ్రమైన తలనొప్పితో బాధపడ్డాను. ఇప్పుడున్న కరోనా సమయంలో హాస్పిటల్ కి వెళ్లలేని పరిస్థితి. తలనొప్పి మాత్రలు వేసుకున్నప్పటికీ  నా తలనొప్పి ఏమాత్రం తగ్గలేదు. అప్పుడు బాబాను మనసులో తలచుకుని నా తలనొప్పి తగ్గించమని ఆర్తిగా వేడుకున్నాను. “బాబా! మీరెలాగైనా నా తలనొప్పి వచ్చే గురువారం మధ్యాహ్న ఆరతి సమయంలోపు తగ్గించినట్లయితే, నాకు కలిగిన ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అని బాబాను ప్రార్థించాను. ఆ తరువాత పడుకునేముందు బాబాను తలచుకుని బాబా ఊదీని తలకు రాసుకుని పడుకున్నాను. ఇలా ప్రతినిత్యం బాబాను తలచుకుని వారంరోజులపాటు బాబా ఊదీని రాసుకున్నాను. ఊదీ ప్రభావంతో నా తలనొప్పి మెల్లమెల్లగా తగ్గుతూ బాబా అనుగ్రహంతో గురువారం మధ్యాహ్న ఆరతి సమయానికల్లా పూర్తిగా నయమైంది. ఈ అద్భుతమైన లీల నా మనసుకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఆనందంగా బాబాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఈ విధంగా బాబా నాపై చూపించిన కృపవల్ల తలనొప్పి నుండి పూర్తిగా ఉపశమనం పొందగలిగాను

ఇలాగే బాబా నాకు, నా కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే సాయిభక్తులందరిపై బాబా దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబాకు పాదాభివందనాలతో...

శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


4 comments:

  1. 🙏🌺🙏ఓం సాయిరాం🙏🌺🙏

    ReplyDelete
  2. 🙏🙏🌸🌷Om sri Sairam🌷🌸🙏🙏

    ReplyDelete
  3. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  4. ఓం సాయిరాం...🌹🙏🏻🌹

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo