ఈ భాగంలో అనుభవాలు:
- అంతా బాబా దయ
- బాబా తొలగించిన ఆరోగ్యసమస్యలు
అంతా బాబా దయ
నా పేరు అంజలి. బాబా నాకు ప్రసాదించిన అనుభవాలలో నుండి కొన్నిటిని ఇంతకుముందు మీతో పంచుకున్నాను. ఇటీవల జరిగిన మరో రెండు అనుభవాలను ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. 2018లో నేను బాబా అనుమతితో మా స్వంత ఊరిలో స్థలాలు కొన్నాను. కానీ వాటికి రిజిస్ట్రేషన్లు చేయటం బాగా ఆలస్యమైంది. రిజిస్ట్రేషన్లు ఆలస్యమయ్యేసరికి దానిగురించి బాబాను అడిగాను. “2020 జూన్ నెలలో రిజిస్ట్రేషన్లు అవుతాయి” అని బాబా సమాధానమిచ్చారు. బాబా చెప్పినట్లుగానే 2020లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలైంది. అయితే లాక్ డౌన్ వల్ల ఆలస్యంగా జులై 27న రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. అంతా బాబా ప్రణాళిక ప్రకారమే జరిగింది. మేము తెలంగాణా రాష్ట్రంలో ఉంటాము. బాబానే మాకు ఆంధ్రప్రదేశ్ కి వెళ్ళటానికి అనుమతిని ఇప్పించి రిజిస్ట్రేషన్ పూర్తిచేయించారు. అంతా బాబా దయే. ఆయన దయవుంటే సాధ్యం కానిది ఏముంది?
మా సబ్ స్టేషన్లో పని చేసే ఒక వ్యక్తికి కరోనా లక్షణాలు వున్నట్లు మాకు సందేహం వచ్చింది. అతనిని కోవిడ్ పరీక్షలు చేయించుకుని మూడు రోజుల్లో రిపోర్టులు తీసుకురమ్మని ఇంటికి పంపించాము. ఒకవేళ అతనికి కరోనా పాజిటివ్ వస్తే అతనితో పాటు నేను, మా కుటుంబం, నా పైఆఫీసర్లు, వాళ్ళ కుటుంబాలు కూడా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. దాంతో ఆందోళనచెంది, ఈ సమస్య నుండి మమ్మల్ని కాపాడమని నేను బాబాను చాలాసేపు ప్రార్థించాను. ఇక బాబా చేసిన అద్భుతం చూడండి. టెస్ట్ రిపోర్టులో అతనికి కరోనా నెగిటివ్ వచ్చింది. అంతా బాబా దయ. లేదంటే అందరం చాలా ఇబ్బందిపడేవాళ్లం. బాబా దయవల్ల అంతా సవ్యంగా జరిగింది. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన సాయినాథునికి నమస్సుమాంజలి.
బాబా తొలగించిన ఆరోగ్యసమస్యలు
సాయిబంధువులందరికీ నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. ఒకసారి నెలసరి సమయంలో నాకు కొన్ని సమస్యలు వచ్చాయి. దాంతో నేను భయపడి డాక్టర్ని సంప్రదించాను. నన్ను పరీక్షించిన డాక్టర్ నాకు హార్మోన్స్ సమస్య ఉందని చెప్పారు. దాంతో నేను భయపడి నా బాధను బాబాతో చెప్పుకుని, “మీ దయవల్ల నా సమస్య తీరితే నాకు ఇష్టమైన ఒక పదార్థాన్ని తినడం మానేస్తాను బాబా” అని మ్రొక్కుకున్నాను. ఆ మరుసటినెలలో ఏ సమస్యా లేకుండా సరైన సమయంలో నెలసరి వచ్చింది. బాబా నా సమస్యను చాలా సులభంగా తీసేశారు. “థాంక్యూ బాబా!”
మరోసారి నాకు గొంతులో కొద్దిగా ఇన్ఫెక్షన్ వచ్చింది. కరోనా సమయంలో ఇన్ఫెక్షన్ రావటంతో నాకు చాలా భయమేసి, "బాబా! ఈ గొంతు ఇన్ఫెక్షన్ సమస్యను తొలగించండి" అని బాబాతో చెప్పుకున్నాను. రెండు రోజులకల్లా నా సమస్య తీరిపోయింది. నా ఆరోగ్యం బాగైంది. "చాలా సంతోషం బాబా!"
"చాలా చాలా ధన్యవాదాలు బాబా! మీరు ఇలాగే ఎప్పుడూ నా కుటుంబాన్ని కాపాడండి తండ్రీ! మీరు నా జీవితంలో ఉన్నారు కాబట్టే నేనింకా బ్రతికి ఉన్నాను. మీరు లేని నేను లేను. నా తప్పులను క్షమించండి. నన్ను మీ బిడ్డగా మీ పాదాల వద్దనే ఎల్లప్పుడూ ఉండనివ్వండి".
ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
om sai ram nice leelas.i love u baba.be with us.bless us.i like this blog it is mordern satcharitra.baba blesses all
ReplyDeleteథాంక్యూ సో మచ్ సాయి
Delete🙏🌺🙏ఓం సాయిరాం🙏🌺🙏
ReplyDeleteOm Sai ram
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏
Om sai Ram,,,,plz prayer chese group link pettandi Sai
ReplyDeleteఆ గ్రూప్ నేను రన్ చెయ్యట్లేదు సాయి.
Deleteఓం సాయిరామ్!
ReplyDeleteఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
ReplyDeleteఓం సాయిరాం...🌹🙏🏻🌹
ReplyDelete