సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 498వ భాగం....




ఈ భాగంలో అనుభవాలు:

  1. విచారకరమైన స్థితిలో బాబా చూపిన కృప
  2. అంగవైకల్యం నుండి తప్పించిన బాబా

తల్లి, తండ్రి, గురువు, దైవం అయిన సాయినాథునికి నా పాదాభివందనాలు. నా పేరు నాగార్జున. నేను పంచుకోబోయేదాన్ని అనుభవం అనడం కన్నా ఒక విచారకరమైన స్థితిలో బాబా చూపిన కృప, కరుణ అని చెప్పవచ్చు. 2020, జూలై 8వ తేదీన నా స్నేహితుడు అదృశ్యమయ్యాడు. ఆరోజు రాత్రి మా చుట్టుప్రక్కలవారిని, నా స్నేహితులని, బంధువులందరినీ తన గురించి వాకబు చేశాము. అతను తమ వద్దకు రాలేదని వారందరూ చెప్పడంతో తనకోసం చుట్టుప్రక్కల తెలిసిన ప్రదేశాలలో వెతకటం ప్రారంభించారు. అయితే కొంతసేపటికి భారీవర్షం కారణంగా అందరూ తమ తమ ఇళ్ళకు తిరిగి వచ్చేశారు. మరుసటిరోజు కూడా వర్షం పడుతున్నప్పటికీ నా స్నేహితుడిని వెతకడానికి అందరూ నాలుగువైపులా వెళ్లారు. ఇంతలో ఒక దారిలో వెళ్ళినవారికి అక్కడున్న పోలీస్ స్టేషన్ దగ్గర ఒక బైక్ కనిపించింది. అది నా స్నేహితుడి బైకులా అనిపించడంతో దగ్గరకు వెళ్లి చూశారు. అది వాడి బైక్ కాదు. అది తన బైక్ కాకపోయినా, వాళ్ళకు ఆ స్టేషన్లోనే మరోవైపు నా స్నేహితుడి బైక్ కనిపించింది. ఇది బాబా కరుణ. నా స్నేహితుడి గురించి చిన్న ఆచూకీ లభించేలా చేశారు.

వెంటనే పోలీసులను అడిగితే వాళ్ళు, “ఈ బైక్ గోదావరి బ్రిడ్జి మీద నిన్న రాత్రి కనపడింది. మరలా ఈరోజు ఉదయం మేము రౌండ్స్‌కి వెళ్ళినప్పుడు కూడా అక్కడే ఉండడంతో అనుమానంతో దగ్గరకు వెళ్ళి చూడగా బైకులో మొబైల్, బైక్ ప్రక్కన చెప్పులు ఉన్నాయి. వెంటనే వాటిని స్టేషనుకి తీసుకొని వచ్చాము” అని చెప్పారు. ఆ విషయం తెలిసి ఒక్కసారిగా మేమంతా నిర్ఘాంతపోయాము. ఆ వార్త వినగానే నేను, “బాబా! ఏమిటిది తండ్రీ? ఒక దారి కనిపించిందని అనుకునేలోపే ఇలా జరిగిందేమిటి తండ్రీ?” అని ఎంతో బాధపడి, నా స్నేహితుడి కోసం బాబాను వేడుకుని స్తవనమంజరి, సచ్చరిత్ర పారాయణ చెయ్యడం మొదలుపెట్టాను. ఒకవైపు చిన్న ఆశ, మరోవైపు నిరాశతో బాబాని వేడుకుంటూ ఉన్నాను. భారీవర్షం కారణంగా పోలీసులు మా స్నేహితుడి కోసం వెతకడానికి నిరాకరించారు. అయినా గోదావరినది కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నది. 

ఆరోజు (జులై 9వ తేదీ) నేను, “బాబా! మాకు ఏదైనా ఒక దారి చూపించు తండ్రీ!” అని బాబాను ప్రార్థిస్తూ ఉండగా యూట్యూబ్‌లో సాయి సర్వస్వం ఛానల్లో ఒక అనుభవం వచ్చింది. అందులో, “ఏదైనా మీకు కావాల్సింది కనపడని పక్షంలో బాబాను ప్రార్థించి “ఓం శ్రీ సాయిసూక్ష్మాయ నమః” అనే నామాన్ని 108 సార్లు జపించండి” అని చెప్పడం విన్నాను. వెంటనే నేను ఆ నామాన్ని జపించడం ప్రారంభించాను. అలాగే స్తవనమంజరి, సచ్చరిత్ర పారాయణ కూడా చేసుకుంటూ ఉన్నాను. ఆరాత్రి, మరుసటిరోజు కూడా ఆ నామాన్ని జపించాను.

మరుసటిరోజు ఉదయం పడవల ద్వారా వెతకడం ప్రారంభించారు. ఉదయం 10 గంటల సమయంలో నేను పూజగదిలోకి వెళ్లి, “బాబా! దయతో నా స్నేహితుడి విషయంలో దారిచూపండి” అని కన్నీటితో బాబాను వేడుకున్నాను. బాబాను ప్రార్థించిన 5 నిమిషాల్లో, అంటే 10:05 నిమిషాలకి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. మరొక స్నేహితుడి ద్వారా వెళ్ళిన పడవలవాళ్ళకి గోదావరిలో ఒక డెడ్ బాడీ దొరికిందని తెలియజేశారు. “చివరికి ఈ విధంగా దారి చూపించావా తండ్రీ!” అని బాబా ముందు ఎంతగానో బాధపడ్డాను. అది బాధాకరమైన విషయమైనప్పటికీ, గోదావరి అంత ఉధృతంగా ప్రవహిస్తున్నా, భారీవర్షం కురుస్తున్నా అంత్యక్రియలు నిర్వహించడానికి బాబా కృపతో నా స్నేహితుడి శరీరం లభ్యమైంది. వాడు ఎందుకు ఆ పని చేశాడో ఎవరికీ అంతుపట్టలేదు. అందరూ పలురకాలుగా అనుకున్నప్పటికీ వాడు చాలా మంచివాడు. ఎప్పటికీ తిరిగిరాని లోకాలకు వాడు వెళ్ళిపోయాడు. మేము ఒక మంచి స్నేహితుడిని కోల్పోయాము. వాడు ఏ లోకంలో ఉన్నా తనపై బాబా ఆశీస్సులు ఉండాలని, వాడి ఆత్మకు బాబా శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. “ధన్యవాదాలు సాయిబాబా!”

మరొక అనుభవం - అంగవైకల్యం నుండి తప్పించిన బాబా 

కొంతకాలం క్రితం ఒకటి రెండుచోట్ల నేను నా జాతకాన్ని చూపించినప్పుడు, ‘జాతకరీత్యా 2020లో అంగవైకల్యం వచ్చే అవకాశం ఉంది’ అని చెప్పారు. నేను భయపడి, “బాబా! జాతకాలు మార్చే శక్తి మీకు ఉంది తండ్రీ. దయచేసి నన్ను కాపాడండి” అని బాబాను వేడుకున్నాను. 2020 వచ్చింది. జూన్ నెలలో ఒకరోజు బాబా ఆలయానికి వెళ్ళినప్పుడు ఆలయంలో ఉండే గురువుగారు నన్ను పిలిచి, "ఆరోగ్యరీత్యా జాగ్రత్తగా ఉండమ"ని చెప్పారు. 'ఇదేమిటి? గురువుగారు ఎప్పుడూ ఇలా చెప్పలేదే!' అనుకుని, నా బాబానే గురువుగారి రూపంలో జాగ్రత్తలు చెప్పారని భావించి బాబాకు నమస్కారం చేసుకుని ఇంటికి తిరిగి వచ్చేశాను. తరువాత ఒకరోజు నేను ఒక షాపుకి వెళ్ళాను. అక్కడ మెట్లు ఎక్కుతుండగా నేను జారిపడ్డాను. కాలు మడతపడింది. వెంటనే అక్కడ ఉండేవాళ్ళు నీళ్ళతో కడిగి జండుబామ్ రాశారు. ఏమీ కాదులే అని బాబాపై భారం వేసి ఆ రాత్రి కాలికి బాబా ఊదీ రాసుకొని పడుకున్నాను. మరుసటిరోజుకి కాలు వాచి నొప్పిగా అనిపించింది. వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్తే, ఎక్స్-రే తీయించమని చెప్పారు. నేను రాజమండ్రి వెళ్లి ఎక్స్-రే తీయించుకొని, "అందులో ఏ సమస్యా లేకుండా చూడమ"ని బాబాని కోరుకున్నాను. ఎక్స్-రే రిపోర్ట్ చూసిన డాక్టర్ పది రోజులకి మందులు రాసిచ్చి, కదలకుండా జాగ్రత్తగా ఉండమన్నారు. ఇంటికి వచ్చిన తరువాత సచ్చరిత్ర చదువుతుండగా, “గత జన్మ పాపములను నీవు అనుభవించక తప్పదు. కర్మానుభవం పూర్తికాకున్నచో కొంతకాలం ఆ కర్మని అనుభవించాలి” అని వచ్చింది. బాబా ఇచ్చిన అనుభవాలలో ఇది ఒకటి. డాక్టర్ ఇచ్చిన మందులు వేసుకుంటున్నప్పటికీ 10 రోజులైనా కాలినొప్పి తగ్గలేదు. మరలా హాస్పిటల్‌కి వెళ్తే, ఈసారి సిమెంట్ కట్టు వెయ్యాలని చెప్పి డాక్టర్ కట్టు వేసారు. ఆరోజు రాత్రి స్వప్నంలో ఒక తాతగారు నా కాళ్ళవద్ద కూర్చొని,కొన్నాళ్ళు నువ్వు ఇంటిలో ఉండరా, నీ కర్మ ఇక పోతుంది” అని చెప్పారు. ఉలిక్కిపడి లేచి చూస్తే అక్కడ ఎవరూ లేరు. అప్పుడు నాకు అర్థమైంది, 'కలలో కనిపించింది మరెవరో కాదు, బాబానే!' అని. నా జాతకరీత్యా ఉన్న అంగవైకల్యాన్ని బాబా ఇలా కొన్ని రోజులు కట్టు రూపంలో కదలకుండా చేసి తీసేస్తున్నారని ఎంతో సంతోషించి బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. నిజమైన ప్రేమతో పిలిస్తే బాబా ఎప్పటికీ మన దగ్గరే ఉంటారు. “నాకు మంచి ఉద్యోగం ప్రసాదించు బాబా!”



10 comments:

  1. అనన్య చింతన.. అపురూప దివ్య నందన
    కారుణ్య నిలయ... కరుణా సముద్ర!!
    భక్త హృదయ విహారి..భయా నివారి
    లీలా విశ్వంభర దిగంబర.. శిరిడీశా సాయేశ
    పాహమాం రక్ష రక్ష 🙏🌷🙏
    🙏🌷🙏 ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి🙏🌷🙏
    🙏🌷🙏 ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి🙏🌷🙏
    🙏🌷🙏 ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి🙏🌷🙏

    ReplyDelete
  2. Om Sai Ram, ma babu ni kapadau

    ReplyDelete
  3. ఓం శ్రీ సాయిరాం!

    ReplyDelete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  5. ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️
    🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸
    ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️
    ఓం సాయిరాం!!ఓం సాయిరాం!!ఓం సాయిరాం
    ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️
    🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸
    ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

    ReplyDelete
  6. Sai tandri bhakthula manasu lo sajeevanga untaru

    ReplyDelete
  7. 🌸🙏Om Sairam 🙏🌸 sarvasyasaranagathi Sainadha, mee bakthulanandharini kapadandi 🌸🙏

    ReplyDelete
  8. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  9. Sainadha! Naku istamaina technical job ivvu tandri ! Intha kalam dani gurincheyy eduru chustunna . Inka enni years ila undali tandri!

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo