ఈ భాగంలో అనుభవాలు:
- బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటారు సాయితండ్రి
- సాయితండ్రి ఇచ్చిన ఆనందం
బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటారు సాయితండ్రి
సాయిబంధువులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు సాయి. సాయితండ్రి నన్ను, మా అమ్మానాన్నలను ప్రతిక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. ఇటీవల బాబా మాకు ప్రసాదించిన అనుభవాలను ఇప్పుడు మీతో పంచుకుంటాను.
ఒక వారంరోజుల ముందు నాకు అనుకోకుండా కొద్దిగా జ్వరం వచ్చింది. ఇప్పుడున్న కోవిడ్ పరిస్థితుల్లో జ్వరం రావడమంటే మామూలే అనుకునే పరిస్థితి లేదు. నాకు చాలా భయమేసింది. బాబాను స్మరించుకుని, జ్వరం తగ్గేలా చేయమని ప్రార్థించి, బాబా ఊదీని నీటిలో కలుపుకుని త్రాగాను. అలాగే జ్వరం తగ్గడానికి ఒక టాబ్లెట్ కూడా వేసుకున్నాను. అలా ఒక రెండు రోజులు చేశాక కూడా పరిస్థితిలో ఎటువంటి మార్పూ లేదు. జ్వరం తగ్గించమని సాయిబాబాను స్మరిస్తూనే ఉన్నాను. తరువాత ‘క్వశ్చన్ అండ్ ఆన్సర్’ వెబ్‌సైట్ ద్వారా బాబాను అడుగుదామని ఆ వెబ్‌సైట్ ఓపెన్ చేసి బాబాను అడిగాను. అప్పుడు, “బాబాకు ఒక టెంకాయను సమర్పించండి” అని సమాధానం వచ్చింది. మరుసటిరోజు అందులో చెప్పినట్టే చేశాను. ఆరోజు సాయంత్రానికి నా ఆరోగ్య పరిస్థితిలో కొద్దిగా మార్పు కనిపించింది. ఇంక నేను బాబా మీద విశ్వాసంతో ఆయన పైనే భారం వేశాను. బాబా అనుగ్రహంతో నా ఆరోగ్యం నెమ్మదిగా మామూలు స్థితికి వచ్చేసింది. నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించిన బాబాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకున్నాను.
ఆ తరువాత ఒకరోజు రాత్రి మా నాన్న ఆఫీసు నుండి వచ్చాక ఒళ్ళునొప్పులుగా ఉన్నాయన్నారు. ఒళ్ళునొప్పులతో పాటు కాస్త జ్వరం కూడా ఉంది. నాన్న పరిస్థితి చూసి నాకు కన్నీళ్లు ఆగలేదు. బాబాను స్మరించుకుని కొద్దిగా ఊదీ తీసుకుని నాన్న నుదుటి మీద పెట్టాను. అలానే ఆయన ప్రక్కనే కూర్చుని కన్నీళ్లతో బాబాను ఆర్తిగా ప్రార్థించుకుంటూ, ‘ఓం సాయి రక్షక్ శరణం’ అని 108 సార్లు జపించాను. మెల్లిగా నాలో కొంత ధైర్యం వచ్చింది. బాబా విగ్రహాన్ని చూస్తూ, “నువ్వు మాతోనే ఉన్నావుగా బాబా, మాకు ఎలాంటి హానీ జరగదు” అని బాబాతో చెప్పుకున్నాను. “నాపై విశ్వాసముంచు!” అన్న బాబా మాటలు గుర్తుకొచ్చి, బాబా పైనే భారం వేసి, “అంతా బాబానే చూసుకుంటారు, ఉదయానికల్లా నాన్న మళ్ళీ ఆరోగ్యంగా అవుతారు” అనే నమ్మకంతో బాబాను స్మరించుకుంటూ పడుకున్నాను. ఉదయం లేచాక చూస్తే నాన్న ఎప్పటిలాగే హుషారుగా ఉన్నారు. ఎంతో సంతోషంతో బాబాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకున్నాను.
బాబా మన చేయి ఎన్నటికీ వదలరు, తప్పకుండా ప్రతిక్షణం మనతోనే ఉండి అన్ని ఆపదల నుండి గట్టెక్కిస్తారు. ఆయన మీద విశ్వాసం ఉండాలి, తప్పక రక్షిస్తారు. బాబాను స్మరించండి, ఆయనను జ్ఞాపకముంచుకోండి. సాయి శరణం! “నీ ప్రేమని పొదగలగడం మా అదృష్టం బాబా! నీ భక్తులమైన మమ్మల్ని కరుణించు, కాపాడు. నీ మీద దృఢమైన భక్తివిశ్వాసాలు చెక్కుచెదరకుండా ఉండేలా అనుగ్రహించు బాబా!”

సాయితండ్రి ఇచ్చిన ఆనందం
సాయిబంధువులందరికీ నా నమస్కారములు. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. నా పేరు మాలతీరెడ్డి. నేను ఇంతకుముందు రెండు అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా సాటి సాయిబంధువులతో పంచుకున్నాను. ఇప్పుడు సాయితండ్రి చేసిన మరో అద్భుతాన్ని సాయిబంధువులందరితో పంచుకోవాలని మళ్ళీ మీ ముందుకు వచ్చాను.
2019 సంక్రాంతి పండుగరోజున బాబా దర్శనం కోసం మేము శిరిడీ వెళ్ళాము. బాబా దర్శనం చేసుకొని ఆనందంగా రూముకి వెళ్లిన నేను నా ఫోన్ చూసి ఆనందాశ్చర్యాలకు లోనయ్యాను. అప్పటికి కొద్దిరోజుల క్రితం మా బాబు ఐఐటీ సీట్ విషయంలో బాబా చేసిన అద్భుతం గురించి ఈ బ్లాగులో పంచుకోవాలనిపించి, బ్లాగు నిర్వహిస్తున్న సాయికి ఆ అనుభవాన్ని పంపించాను. 'అది ఈరోజు బ్లాగులో పబ్లిష్ చేస్తున్నాం' అంటూ సాయి నా మొబైల్‌కి మెసేజ్ పెట్టారు. అప్పటికే సాయితండ్రి దర్శనం చాలా బాగా జరిగిందన్న ఆనందంలో ఉన్న నేను ఆ మెసేజ్ చూసి అవధులు లేని ఆనందంలో మునిగిపోయాను. ఎంత సంతోషించానో మాటల్లో చెప్పలేను. మనసారా సాయితండ్రికి కృతజ్ఞతలు తెలుపుకొని, వెంటనే సాయికి ఫోన్ చేసి నా ఆనందాన్ని పంచుకున్నాను. తను కూడా చాలా సంతోషిస్తూ, "అవేనండీ మన సాయితండ్రి లీలలు, అలానే ఉంటాయి" అని చెప్పారు. అంతటితో ఆగలేక నా ఆనందాన్ని సాయి ఫ్రెండ్స్ అందరితో పంచుకున్నాను. ఎంత అద్భుతమో కదా! ఇది జరిగి చాలారోజులైనప్పటికీ శిరిడీలో నా సాయితండ్రి ఇచ్చిన ఆనందాన్ని, ఇంత మంచి అనుభవాన్ని సాయిబంధువులతో పంచుకోవాలని ఈమధ్య బలంగా అనిపించింది. ఈవిధంగా మరొక్కమారు మీ ముందుకు వచ్చే అవకాశం నాకు కలిగింది. బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి మరొక్కమారు ధన్యవాదములు తెలుపుకుంటూ, సాయితండ్రి ఆశీస్సులు తన బిడ్డలమైన మన అందరిమీదా ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ....
ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి.

om sai ram om sai baba
ReplyDelete🙏🌹🙏 ఓం సాయిరాం 🙏🌹🙏
ReplyDeleteOm Sri Sai Ram thaatha 🙏🙏
ReplyDeleteBhavya sree
ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి
ReplyDeleteom sairam
ReplyDeletesai always be with me
Om SaiRam💐🙏🙏🙏
ReplyDeleteఓం సాయిరాం...🌹🙏🏻🌹
ReplyDeleteIs there really sai to listen out problems
ReplyDelete