సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 496వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • నా ప్రార్థనలు వింటానని & కరోనా వైరస్ నిర్మూలనకు సామూహిక నామజపం చేయమని బాబా ఇచ్చిన సూచనలు

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

ఓం సాయిరామ్! "బాబా! కృతజ్ఞతలు అన్నది చాలా చిన్న పదం అయినప్పటికీ మీరు నాకు ప్రసాదించిన ప్రతిదానికీ నా కృతజ్ఞతలు. దయచేసి ఈ జీవితంలో మీ సేవ చేసుకునేలా నన్ను అనుగ్రహించండి. ఈ జన్మలో మాత్రమే కాకుండా ప్రతి జన్మలోనూ మీరు నాకు తోడుగా ఉండండి". బాబా నాకు చాలా అనుభవాలు ప్రసాదించారు. వాటిని మీతో పంచుకుంటూ బాబా ప్రేమను మళ్ళీ గుర్తుచేసుకుంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నేనిప్పుడు మీతో రెండు అనుభవాలను పంచుకోవాలనుకుంటున్నాను.

ఒకరోజు నాకు, నా భర్తకు మధ్య పెద్ద గొడవ జరిగింది. తరువాత నేను చాలా బాధపడుతూ 'మేమెప్పుడు మంచి జంటగా ఉంటామో' అని అనుకున్నాను. ఆ బాధలో, "బాబా ఈ విషయాలన్నీ చూస్తున్నారా, లేదా? ఆయన నా ప్రార్థనలు వింటున్నారా, లేదా?" అని బాబాపై కోపగించుకున్నాను. మరుసటిరోజు గురువారం. ఆరోజు నేను పూజ చేస్తూ బాబాతో, "మీరు నా బాధలను చూస్తున్నట్లైతే, నా వేదనను వింటున్నట్లైతే మీరు నీలం లేదా గులాబీ రంగు దుస్తుల్లో దర్శనం ఇవ్వండి" అని వేడుకున్నాను. పూజ ముగించుకుని బాబా మందిరానికి వెళదామని బయలుదేరాను. దారంతా 'బాబా నేను కోరుకున్నట్లు నీలం లేదా గులాబీ రంగు దుస్తుల్లో దర్శనం ఇస్తారా, లేదా' అని టెన్షన్ పడుతూ వెళ్ళాను. ఇవే ఆలోచనలతో నేను మందిరం తలుపులు తెరచి ఆశ్చర్యపోయాను. బాబా నీలం, గులాబీ రంగులు సమ్మిళితమైన వస్త్రాలు ధరించి ఉన్నారు. బాబా నా ప్రార్థనలు వింటున్నారని సంతోషంతో నాకు కన్నీళ్లు ఆగలేదు. బాబాపై నేను చూపించిన కోపానికి బాధపడి, "నన్ను క్షమించండి బాబా, దయచేసి నన్ను క్షమించండి" అని చెప్పుకున్నాను. ఆ క్షణం నుండి బాబా నా సమస్యలన్నీ పరిష్కరిస్తారని అనుకున్నాను.

మరో అనుభవం:

ఒకరోజు నేను పూజ చేస్తున్నప్పుడు, "బాబా! కరోనా వైరస్‌ను నిర్మూలించండి" అని  బాబాను ప్రార్థిస్తున్నాను. అంతలో నా హృదయం లోపలి నుండి, "సామూహిక నామజపం చేయండి. ఫలితాన్ని చూడండి" అని ఒక స్వరం వినిపించినట్లైంది. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నాకంతా అయోమయంగా తోచి, 'నిజంగా ఇది బాబా ఆలోచన అయితే ముందుకు సాగుతుంది, లేకపోతే లేదు' అని అనుకున్నాను. ఇలా అనుకుంటూ నాకు తెలిసిన బాబా భక్తులలో ఒకరికి ఆ విషయం గురించి తెలియజేస్తూ ఒక సందేశం పంపాను. వెంటనే ఆమె ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. బాబా కృపతో ఒక సంవత్సరం పాటు ప్రతి గురువారం నామజపం చేయాలని మేము నిశ్చయించుకున్నాము. మేము కరోనా వైరస్ నిర్మూలన గురించే కాకుండా ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్న ప్రతి ఒక్కరి కోసం కూడా ఈ నామజపం చేయ సంకల్పించాము. ఈ బాబా సేవ చేయడం వల్ల నా ఆనందానికి హద్దులు లేవు. మరో విషయం, ఈ నామజపం ప్రారంభించడానికి ముందు నా భర్త వీసా ఆమోదం పొందిందన్న శుభవార్త వచ్చింది. "అన్నిటికీ మీకు ధన్యవాదాలు బాబా. మీరే నాకు తల్లి, తండ్రి, గురువు, అన్నీ. దయచేసి మీ బిడ్డలందరినీ మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండేలా ఆశీర్వదించండి. దయచేసి మీ పవిత్రనామాన్ని నేను ఎల్లప్పుడూ ఉచ్ఛరించేలా అనుగ్రహించండి. ఏమైనా తప్పులుంటే దయచేసి నన్ను క్షమించండి బాబా!"

ఓం సాయిరామ్!

సాయి స్మరణం - సంకట హరణం
బాబా శరణం - భవభయ హరణం.

ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

గమనిక: ఈ అనుభవాన్ని ఇంగ్లీష్ బ్లాగు నుండి సేకరించి అనువదించినందువల్ల, ఆమె ప్రస్తావించిన నామజపానికి సంబంధించిన బృందం గురించి తెలిసే అవకాశం లేదు.



6 comments:

  1. 🙏🌷🙏ఓం సాయిరాం🙏🌷🙏

    ReplyDelete
  2. Om Sri Sai Ram thaatha 🙏🙏
    Bhavya sree

    ReplyDelete
  3. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  4. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  5. ఓం సాయిరాం...🌹🙏🏻🌹

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo