సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శ్రీమతి లోండే




1912వ సంవత్సరంలో శ్రీమతి లోండే (దురదృష్టవశాత్తు ఆమె పూర్తి పేరు తెలియలేదు) తన 11వ ఏట మొట్టమొదటిసారి శిరిడీ సందర్శించింది. బాబా దగ్గరకు వెళ్ళటానికి భయపడి ఆమె దూరంగానే ఉంటుండేది. బాబా అలవాటుగా మసీదులోని కఠడా దగ్గర కూర్చునేవారు. భక్తులు పేడా మొదలైన మిఠాయిలు, పండ్లు పెద్ద మొత్తంలో తీసుకొచ్చి బాబాకు సమర్పించేవారు. వాటిని బాబా తమ పిడికిళ్లనిండా తీసుకుని అక్కడున్న పిల్లలందరికీ పంచిపెట్టేవారు. శ్రీమతి లోండే కూడా కొన్ని మిఠాయిలను అందుకుని పరుగున సభామండపం చివరికి వెళ్లి, అక్కడ నిలబడి ఆ మిఠాయిలను తింటూండేది.

శ్రీమతి లోండే అక్కకి శ్యామా మేనల్లుడితో వివాహం జరిగింది. ఆమెని పెళ్లికూతురుగా నిశ్చయించకముందు శ్యామా ఒకరోజు బాబాతో, "వివాహానికి ఒక అమ్మాయిని ఎంపిక చేయమ"ని అడిగాడు. బాబా నవ్వుతూ, "శ్యామా! నీ కోసం అమ్మాయిని చూసుకుంటున్నావా?" అని తమాషాగా అన్నారు. తరువాత బాబా శ్రీమతి లోండే అక్కని ఎంపిక చేసి, "ఏడు చీరలు, ఏడు పైలీల(49 కేజీలు) ధాన్యం, 70 రూపాయలు మాత్రమే తీసుకోండి, ఎక్కువ కట్నం కావాలని అడగొద్దు" అన్నారు. అయితే శ్యామా మేనల్లుడు అందుకు ఇష్టపడకపోవడమే కాకుండా ఆ అమ్మాయిని పెళ్ళిచేసుకోవడానికి కూడా అంగీకరించలేదు. అప్పుడు బాబా, "వాళ్ళకి ముగ్గురు కూతుళ్ళు" అని అన్నారు. చివరకు బాబా ఆశీర్వాదంతో ఆ అబ్బాయి వివాహానికి అంగీకరించాడు. వివాహానంతరం వధూవరులు బాబా ఆశీస్సుల కోసం వచ్చారు. బాబా ఆ వధువుని తమ ఒడిలో కూర్చుండబెట్టుకుని, ఆమెను ఆశీర్వదించి, ఒక వెండినాణేన్ని, ఊదీని ప్రసాదించారు. శ్యామా మేనల్లుడు నీంగాఁవ్‌లో ఆఫీసరుగా పనిచేస్తుండేవాడు. అందువలన వాళ్ళు అక్కడే నివాసం ఉంటుండేవాళ్ళు.

ద్వారకామాయిలో ఒక పెద్ద డ్రమ్ము ఉండేది. దానిపై ఒక్కసారి మ్రోగిస్తే వచ్చే శబ్దం శిరిడీ గ్రామమంతా వినపడేది. ఆ శబ్దం వినపడగానే బాబా ఎక్కడికో ఊరేగింపుగా వెళ్తున్నారని గ్రహించి లోండే అక్కడకు చేరేది. బాబా తరచూ నీంగాఁవ్ వెళ్తుండేవారు. ఆయన నీంగాఁవ్ వెళ్తున్నట్లైతే ఆమె కూడా వారితో బయలుదేరేది. నీంగాఁవ్ చేరుకోగానే ఆమె పరుగున తన అక్క ఇంటికి వెళ్ళేది. అక్కడ ఆమె ఏదైనా తిన్నాక బాబా ఆమెని తమతోపాటు తిరిగి శిరిడీ తీసుకుని వస్తుండేవారు.

ఒకనాడు శ్రీమతి లోండే అక్క యొక్క అత్తగారు చనిపోయారు. సోదరి మరణంతో శ్యామా ఎంతో బాధపడ్డాడు. అతను ద్వారకామాయికి వెళ్లి మౌనంగా కూర్చున్నాడు. బాబా అతనిని "ఇంటికి వెళ్ళమ"ని చెప్పారు. "నేను ఎందుకు వెళ్ళాలి?" అని శ్యామా బదులిచ్చాడు, కానీ బాబా మాటకి తలొగ్గి ఇంటికి తిరిగి వెళ్ళాడు. తన్నుకొస్తున్న దుఃఖాన్ని అణచుకోలేక అతను మూడుసార్లు బిగ్గరగా అరచి స్పృహతప్పి నేలమీద పడిపోయాడు. చాలాసేపటికిగానీ అతను తిరిగి స్పృహలోకి రాలేదు. చిత్రమేమిటంటే, స్పృహలేని స్థితిలో కూడా అతను బాబా స్మరణ చేస్తూనే ఉన్నాడు. 

శ్రీమతి లోండే ఇలా చెప్పారు: "పవిత్రమైన బాబా పాదాలను దర్శించుకుందాం. బాబా పేదలకు చొక్కాలు, టోపీలు పంపిణీ చేయడం నేను చాలాసార్లు చూశాను. ఎవరైనా తమ ముందు టోపీని తొలగిస్తే బాబాకు అస్సలు నచ్చేదికాదు. ఆయన వాళ్లతో, 'అంతిమ ప్రయాణ సమయంలోనే టోపీ తీయాలి' అని అనేవారు. నా అదృష్టవశాత్తు నేను బాబాను దర్శించగలిగాను, వారి ఆశీస్సులు పొందగలిగాను. వారి ఆశీస్సులతో నేను సంతోషకరమైన, సంతృప్తికరమైన జీవితాన్ని గడిపాను".

 సమాప్తం .......

రెఫ్: సాయి ప్రసాద్ పత్రిక; 1987 (దీపావళి సంచిక)
సోర్స్: బాబాస్ డివైన్ సింఫనీ బై విన్నీ చిట్లూరి.


7 comments:

  1. 🙏🌺🙏 ఓం సాయిరాం 🙏🌺🙏

    ReplyDelete
  2. this is new devotee today only we heard about her. nice leela of baba

    ReplyDelete
  3. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  4. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  5. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  6. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo