ఈ భాగంలో అనుభవాలు:
- ఆటంకాన్ని తొలగించి పెళ్లి జరిపించిన బాబా
- 'నువ్వంటే నాకు పిచ్చి సాయిఅమ్మ'
ఆటంకాన్ని తొలగించి పెళ్లి జరిపించిన బాబా
విజయనగరం నుండి ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
నా సమస్య తీరిన వెంటనే నేను బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటానని బాబాకు మ్రొక్కుకున్న ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీ అందరితో పంచుకుంటాను.
2020, ఆగష్టు 5న బాబా నా పెళ్లి చేశారు. 'సాయి సర్వస్వం' ఛానల్లో చెప్పినట్లు సంబంధం రావడం, ఒకరికి ఒకరం నచ్చడం, పెళ్లి నిశ్చయం కావడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అంతా బాబా దయ. అయితే సరిగ్గా వివాహమనుకున్న రోజే నా నెలసరి తేదీ కావడంతో చాలా ఆందోళనపడ్డాము. కరోనా పరిస్థితులు, ముహుర్తాలు లేకపోవడం వలన పెళ్లి ఆరోజే నిశ్చయించారు. మందులు వాడదామంటే అన్నీ హఠాత్తుగా జరగడం వలన సమయం తక్కువగా ఉంది. అటువంటి స్థితిలో భారమంతా బాబా మీదే వేసి, జులై 28న నేను మందులు వేసుకున్నాను. బాబా దయతో ఒక వారం ముందుగా నెలసరి వచ్చింది. నేను వాడిన మందుల వల్ల నెలసరి ముందుగా వచ్చిందంటే అది ఖచ్చితంగా బాబా కృపే. సమస్య ముందే తేలిపోవడం వల్ల మాకున్న పెద్ద బెంగ తీరిపోయింది. బాబా దయ, వారి ఆశీస్సులతో పెళ్లి, తరువాత అమ్మవారి పూజ, వ్రతము సవ్యంగా జరిగాయి. ఆ సమస్య తీరకుంటే నేను చాలా ఇబ్బందిపడేదాన్ని. ఒకవేళ పెళ్లి దాటినా పూజలకోసం మందులు వాడాల్సి వచ్చేది. కానీ ఏ ఇబ్బంది లేకుండా ముందుగానే సమస్యను తీర్చి నన్ను ఆదుకున్నారు బాబా. "బాబా! మీకు ధన్యవాదాలు. ఇప్పుడు ఆదుకున్నట్లే, ఇకపై కూడా ప్రతి విషయంలోనూ అండగా ఉండి చూసుకోవాలి బాబా. మాకు రక్షణనిచ్చే బాధ్యత మీదే కదా తండ్రీ. నాకు సంబంధించి అన్నీ సవ్యంగా జరిగేలా దగ్గరుండి చూసుకోవాలి బాబా. మా తప్పులు ఏవైనా ఉంటే మన్నించి మమ్మల్ని ఆశీర్వదించండి. ఇదే నా ప్రార్థన. బాబా! నీవే దిక్కు. శరణు దత్త సాయీశ్వర దేవా!"
'నువ్వంటే నాకు పిచ్చి సాయిఅమ్మ'
క్రోసూరు నుండి సాయిభక్తురాలు సాయిలక్ష్మి తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.
బాబా తన పరీక్షలో భాగంగా మొదట్లో నన్ను ఎన్నో కష్టాలు పెట్టారు. ఆ కష్టాలలో కూడా నేను సాయినే స్మరించేదానిని. సాయి స్మరణలో భాగంగా నేను సాయికోటి రాసేదాన్ని, సాయి చరిత్ర పారాయణ చేసేదాన్ని, సాయి దివ్యపూజ చేసేదాన్ని. ఎప్పుడు దివ్యపూజ చేసినా మొదటిరోజునే కోరిన కోరిక తీరడం ద్వారా బాబా మహిమను చవిచూసేదాన్ని. అలాగే సాయి సత్సంగాలు చేసుకునేదాన్ని. అంటే, సాయి గురించి, సాయి లీలల గురించి మాట్లాడడం, వినడం చేసేదాన్ని. ఆ సమయంలో కొంతమంది సాయిభక్తులకు పుస్తకాలను పంచే అవకాశం కూడా బాబా నాకు కలిగించారు. ఇలా సదా సాయి ధ్యాసలోనే ఉంటుండేదాన్ని.
ప్రతి సంవత్సరమూ బాబా నన్ను శిరిడీ పిలిపించుకునేవారు. మొట్టమొదటిసారి మా కుటుంబంలోని నలుగురం శిరిడీ వెళ్ళాము. మరుసటి సంవత్సరం నుండి మా కుటుంబంతో పాటు ఇద్దరు, నలుగురు, ఆరుగురు చొప్పున ప్రతి సంవత్సరం సాయిభక్తులను శిరిడీ తీసుకువెళ్ళే భాగ్యం కల్పించారు బాబా. శిరిడీలో సమాధిమందిరానికి వెళ్ళగానే, ‘వచ్చావా!’ అంటూ నవ్వుతూ పలకరించి, నా భారాలన్నిటినీ తాము తీసుకొని నన్ను చల్లని చూపులతో ఆశీర్వదించి, ఆనందకరమైన దర్శనంతోపాటు పువ్వులు, పూలగుచ్ఛాలు, స్వీట్లు, వస్త్రాలు, వేపాకు, అభిషేక జలాలతో బాబా మమ్మల్ని ఆశీర్వదించి పంపుతుంటారు. శిరిడీ నుండి ఒక క్రొత్త ఉత్సాహంతో ఇంటికి తిరిగి వస్తుంటాం.
శిరిడీ వెళ్ళిన ప్రతిసారీ క్రొత్తవాళ్ళు పరిచయం అవుతుంటారు. వాళ్ళు, "నీతోపాటు మమ్మల్ని దర్శనానికి తీసుకెళ్లవా?" అని అడుగుతుంటారు. ఇలా ఎన్నోసార్లు అడిగారు. అది మా గొప్పతనం కాదు. అదంతా బాబా దయ. సాయి మహిమ అంతటి అద్భుతమైనది. నమ్మరేమోగానీ, కళ్ళల్లో ఎప్పుడూ సాయే మెదులుతూ ఉంటారు. నిత్యమూ బాబా చెప్పినట్లు నడుచుకుంటూ ఉంటాను.
ఒక గురువారంరోజున బాబా నాతో, 'సాయినిలయం-సాయిభక్తులు' అనే పేరుతో ఒక గ్రూప్ క్రియేట్ చేయించారు. ఆ గ్రూపులో నిత్యమూ సాయి మాటలు, సాయి ఆరతులు, సాయి సందేశాలు పంచుకుంటూ ఉంటాము. అలాగే, బాబా నన్ను మహాపారాయణ గ్రూపులో సభ్యురాలిగా చేసి, మరో పదిమంది సాయిభక్తులను ఆ గ్రూపులో చేర్చే భాగ్యాన్ని కల్పించారు.
"సాయిఅమ్మా! నువ్వంటే నాకు పిచ్చి. ఎంతలా అంటే, క్రొత్తవాళ్ళు ఎవరైనా 'నీ పేరేంటి?' అని అడిగితే శ్రీలక్ష్మి అని కాకుండా 'సాయిలక్ష్మి' అని చెప్తున్నాను. 'సాయి, సాయి, సాయి' - ఇదే నా ప్రపంచం. నేను మీ సేవ చేస్తూ మీ పాదాల దగ్గరే మరణించాలి సాయీ!"
రేపటి భాగంలో మరికొన్ని అనుభవాలు పంచుకుంటాను...
Jai sairam
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Sai ram
ReplyDeleteOm sai Ram
ReplyDeleteఎ పుడు ఇలాగే బ్లాగ్ భక్తుల అనుభవాలను చదువుతూ మననం చేసుకుంటూ వుండే అవకాశాన్ని నాకు ఆ బాబా వారు ప్రసా దించాలని కోరుకుంటున్నాను.ఓం srisairam.
ReplyDelete🙏🌺🙏ఓం సాయిరాం🙏🌺🙏
ReplyDeleteJai Sairam Jaigurudatta.
ReplyDeleteWow,your experience was really great sai Lakshmi garu,baba ni antala gurtu pettukovadam mee poorva janma adrustam,om sai ram,baba pls bless me with good thoughts sainatha,love u baba,tq for blessing me with Sai Sannidhi book today.
ReplyDeleteS,sai..nenu chese prathidi sai kea arpisthanu..bcz idi saimma naaku ichina jeevitham..love u saimma.nee paadala deggara chanipoyi nee vadilo seda theerithea chaalu naa janma neekea ankitham..nee sai baby.
DeleteOm Sairam🙏🌻🌻🌷🌷❤️😊
ReplyDeleteOm sai sree sai jaya jaya sai
ReplyDeleteఓం శ్రీ సాయి సమర్థ
ReplyDeleteBaba please kapadu baba nuvve chusulovali baba maku dikku nuvve baba manchi vartha vinali baba
ReplyDeleteBaba anta nyamu ayala chusukovali thandri ne mede baram vesamu thandri ne bidda ni kapadu thandri
ReplyDeleteBaba e blog nadipistundi nuvve ani naku telusu thandri rogam nayam cheyi thandri doctor la ravvaya pleaseeeeeeeee
ReplyDeleteSaimma already vachesadu..mimmallni kapadathunea vunnadu..vibhudi dharinchandi..sai namanni japinchandi..
DeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏
🙏🌺🌼🌺Om Sairam🌺🌼🌺🙏
ReplyDelete