ఈ భాగంలో అనుభవాలు:
- బాబా ప్రసాదించిన మూడు మంచి అనుభవాలు
- మరుక్షణమే బాధను తీసేసిన బాబా
బాబా ప్రసాదించిన మూడు మంచి అనుభవాలు
ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.
నేను హైదరాబాద్ నివాసిని. కొన్ని కారణాల వలన నేను నా పేరు వెల్లడించదలుచుకోవడం లేదు. కానీ ఇటీవల కలిగిన మూడు మంచి అనుభవాలను మీతో పంచుకుంటున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. "అనుభవాలు పంచుకోవడంలో ఆలస్యం అయినందుకు నన్ను క్షమించండి బాబా!"
మొదటి అనుభవం - బాబా కృపతో ప్లాటు అమ్మకంలో లభించిన మంచి మొత్తం
నేను ఒక ఇంటిని కొన్నాను. ఆ ఇంటి బకాయిలు చెల్లించేందుకు నాకున్న ఒక ప్లాటు అమ్మాలనుకున్నాను. సంవత్సరంపాటు వేచి ఉన్నప్పటికీ ఆ ప్లాటు అమ్ముడుపోలేదు. 2020, జూన్ మొదటివారంలో ఆ ప్లాటు కొనేందుకు ఒక కొనుగోలుదారుడు వచ్చాడు. కానీ అతను తక్కువ మొత్తం చెల్లించి, ప్లాటు కొనుక్కునేందుకు ఆసక్తి కనబరిచాడు. అప్పుడు నేను బాబాను తలచుకొని, "నేను ఈ ధరలో నా ప్లాటు అమ్మాలా? లేక ఇంతకన్నా ఎక్కువ మొత్తాన్ని పొందడానికి ఇంకొంత సమయం వేచి ఉండాలా?" అని అడిగాను. "కొంతసమయం వేచి ఉండమ"ని బాబా సమాధానం వచ్చింది. బాబాపై విశ్వాసంతో నేను అలాగే చేశాను. బాబా దయవల్ల నెలలోపు మరో కొనుగోలుదారుడు వచ్చి ఎక్కువ మొత్తాన్ని చెల్లించి ఆ ప్లాటు తీసుకున్నాడు. బాబా కృపవలన నాకు దాదాపు 80 వేల రూపాయల నుండి లక్షరూపాయల వరకు అదనంగా లభించింది.
రెండవ అనుభవం - అగ్రిమెంట్ కంటే ముందే ముట్టిన కొంత మొత్తం
ప్లాట్ కొనుగోలుదారుడు డబ్బు ఇవ్వడానికి 3 నెలల సమయం తీసుకున్నారు. కానీ ఆలోపే మాకు ఇల్లు అమ్మినవాళ్ళు డబ్బు ఇవ్వమని మమ్మల్ని ఒత్తిడి చేయసాగారు. అందువలన నేను రోజూ, "బాబా! కొనుగోలుదారుని వద్దనుండి మాకు రావాల్సిన మొత్తాన్ని అగ్రిమెంట్ ప్రకారం అదేరోజు లేదా అంతకంటే ముందు మాకు అందేలా చేయండి"ని బాబాని అడుగుతూ ఉండేదాన్ని. 2020, ఆగష్టు 30న కొనుగోలుదారుడు కొంత మొత్తాన్ని నా సోదరికి అందజేసినట్లు నాకు సమాచారం అందింది. అంతా బాబా దయ.
మూడవ అనుభవం - కరోనా నుండి రక్షణ:
2020, జూలై 29న నాకు, నా భర్తకు జ్వరం వచ్చింది. ఒక్కరోజు వ్యవధిలో మా ఇద్దరు పిల్లలకు కూడా జ్వరం వచ్చింది. వాళ్ళు జ్వరంతోపాటు దగ్గు, జలుబుతో బాధపడ్డారు. నేను చాలా ఆందోళనపడ్డాను. ఆరోజు నా పుట్టినరోజు కూడా. కానీ ఆ పరిస్థితుల కారణంగా పుట్టినరోజు జరుపుకోలేకపోయాను. అసలే కరోనా సమయం. నా భర్త తన వృత్తిరీత్యా రోజూ ఎంతోమందిని కలుస్తుంటారు. పైగా ఆయన చాలా తక్కువ నివారణచర్యలు పాటిస్తారు. అందువలన నేను చాలా ఆందోళనచెందాను. దానికితోడు మెడికల్ షాపువాళ్ళు ఐడి కార్డు లేకుండా మందులు ఇవ్వకపోవటంతో మందులు కూడా దొరకని పరిస్థితి. ఏమి చేయడానికీ తోచక నేను, "బాబా! ఒక్కరోజులో మా అందరికీ నయం కావాలి. కరోనా మాపై ప్రభావం చూపకూడదు" అని బాబాను ప్రార్థించాను. తరువాత నా భర్త హాస్పిటల్‌కి వెళ్లి రక్తపరీక్ష చేయించుకున్నారు. ఆ పరీక్షలో తనకు వచ్చింది సాధారణ జ్వరమని నిర్ధారణ అయ్యింది. బాబా దయవలన నాకు, నా పిల్లలకు ఒక్కరోజులో నయమైంది. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీ అనుగ్రహం మీ బిడ్డలందరిపై ఉండాలని మనసారా కోరుకుంటున్నాను".
మరుక్షణమే బాధను తీసేసిన బాబా
ఓం సాయిరామ్! 'సాయి మహారాజ్ సన్నిధి'కి వందనాలు. నా పేరు లలిత. ఇదివరకు నేను కొన్ని అనుభవాలను ఈ బ్లాగ ద్వారా మీతో పంచుకున్నాను. ఇటీవల జరిగిన ఒక చిన్న అనుభవం గురించి నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ఈమధ్య గ్యాస్ లాగా ఫార్మ్ అయి నా పొట్టంతా పట్టేసింది. అందువల్ల నేను చాలా ఇబ్బందిపడ్డాను. అప్పుడు బాబాను తలచుకొని, "బాబా! ఈ బాధనుండి నాకు విముక్తిని ప్రసాదించండి. నా కష్టం తీరితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించి, కొద్దిగా ఊదీ తీసుకొని పొట్టపై రాసుకున్నాను. మరికొంత ఊదీని నీళ్లలో కలుపుకొని త్రాగాను. బాబా ఎంత అద్భుతం చేశారంటే, మరుక్షణమే ఆయన నా బాధని తీసేశారు. పట్టలేని ఆనందంతో ఆయనకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. "ఎప్పుడూ నాతోనే ఉండండి బాబా. ఐ లవ్ సో మచ్ బాబా".
Om Sairam
ReplyDeleteSai always be with me
ఓం శ్రీ సాయి సమర్థ
ReplyDelete🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏
ReplyDeleteఅఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరమ్ |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః
Srisainadha శరణం శరణం
ReplyDeleteBaba please help us
ReplyDeleteOm sri Sairam🙏🌺🙏🌺🙏🌺
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏