- సంబంధాలన్నీ చెడగొడుతూ వస్తున్న బాబా నా ప్రేమను గెలిపిస్తారని ఆశగా చూస్తున్నా!
- బాబా నాకు తోడుగా ఉంటూనే ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు
సంబంధాలన్నీ చెడగొడుతూ వస్తున్న బాబా నా ప్రేమను గెలిపిస్తారని ఆశగా చూస్తున్నా!
పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.
సాయిభక్తులకు నమస్కారం. నేనిప్పుడు బాబా నా జీవితంలో చేస్తున్న సహాయాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. నా వయసు 30 సంవత్సరాలు. నాకింకా పెళ్లి కాలేదు. నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను. తనకి కూడా నేనంటే ఇష్టం. మా ఇద్దరి విషయం మా ఇళ్లల్లో తెలుసు. అబ్బాయి తల్లిదండ్రులకి ఎటువంటి ఇబ్బందీ లేదు. కానీ మా ఇంట్లో ఒప్పుకోవడం లేదు. వాళ్ళు అంత మొండిపట్టుపట్టడానికి నేను ఇష్టపడిన అబ్బాయి ఏమైనా తక్కువ స్థితిలో ఉన్నాడా అంటే అదేమీ కాదు, తను సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తూ మంచి పోజిషన్లో ఉన్నాడు. కానీ మావాళ్లు కేవలం కులాలు వేరన్న కారణంతో మా పెళ్ళికి ఒప్పుకోవడం లేదు. ఎన్నిసార్లు, ఎంతగా నచ్చజెప్పినా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. "మా మాట కాదని నువ్వు ఏదైనా చేస్తే మేము కులంలోవాళ్లకి మొహం చూపించుకోలేము, మేము చచ్చిపోతాము" అని చెప్తూ(బెదిరిస్తూ) వస్తున్నారు. ఇదంతా గత 5 సంవత్సరాలుగా సాగుతోంది. ఈ ఐదేళ్ళలో మావాళ్ళు నాకోసం ఎన్నో సంబంధాలు చూశారు, చూస్తూనే ఉన్నారు. కానీ బాబా దయవలన ఒక్క సంబంధం కూడా కుదరలేదు. రెండుసార్లు పెళ్లిచూపులు జరిగినప్పటికీ చివరి నిమిషంలో కుదరలేదు. నేను ఎంత ఏడ్చినా మావాళ్ళు అర్థం చేసుకోకపోవడంతో ఒకానొక స్థితిలో ఇక నా పని అయిపోయింది అనుకున్నాను. అంతలో ఒకేసారి మూడు సంబంధాలు వచ్చాయి. ఏం చేయాలో దిక్కుతోచని స్థితి. ఎప్పటిలాగానే బాబా మీద నమ్మకం పెట్టుకున్నాను. కానీ ఇంట్లో పరిస్థితి మరీ ఘోరంగా ఉండటంతో నా మనసంతా అల్లకల్లోలంగా ఉంది. అప్పుడు, "బాబా! ఆ మూడు సంబంధాలు ఏదో ఒకలా నువ్వే చెడగొట్టు. అలా జరిగితే నేను నా అనుభవాలను బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. వెంటనే రెండు సంబంధాలు చెడిపోయాయి. మిగిలిన ఆ ఒక్క సంబంధం అదివరకు వచ్చిందే. అది మా ఇంట్లోవాళ్లకి బాగా నచ్చి, అతణ్ణి పెళ్ళి చేసుకోమని నాపై చాలా ఒత్తిడి చేశారు. ఏం చేయాలో అర్థంకాక అయోమయ స్థితిలో ఉండిపోయాను. అంతలో ఏమయిందో తెలీదుగాని, హఠాత్తుగా ఆ సంబంధం గురించి ఇంట్లోవాళ్ళు మాట్లాడడం మానేశారు. అంతా బాబా దయ. కానీ, వచ్చిన పెళ్లి సంబంధాలన్నీ చెడగొడుతూ వస్తున్న బాబా, ఇంట్లోవాళ్ళని మాత్రం నేనిష్టపడ్డ వ్యక్తిని పెళ్ళిచేసుకోవటానికి ఒప్పుకునేలా చేయట్లేదు.
"బాబా! మీరు 'మనుషులు అందరూ ఒకటే. కులం, మతం అనే భేదభావం చూపొద్దు' అని చెప్తారు. కానీ జనాలు మాత్రం కులం, మతం అని కొట్టుకు చస్తున్నారు. బాహ్యానికి మీ భక్తులమని కూడా చెప్పుకుంటూ లోపల వేరే కులం, వేరే మతమని భేదం చూపిస్తూ ఉన్నారు. నేను ఇటు ఇంట్లోవాళ్ళనీ వదులుకోలేను, అలాగని నేను ఇష్టపడ్డ అబ్బాయినీ వదులుకోలేను. ఏం చేయాలో తెలియక మానసికంగా క్రుంగిపోయి ఉన్నాను. మరణమొకటే మార్గంలా కనిపిస్తుంది. నేను తెలిసీ తెలియక ఏమైనా తప్పులు చేసివుంటే దయచేసి నన్ను క్షమించి నా ప్రేమను గెలిపించండి. మా ఇద్దరినీ కలపండి బాబా".
చివరిగా, రోజూ ఈ బ్లాగు చదివే భక్తులకు నాదో విన్నపం. దయచేసి నా గురించి బాబాను ప్రార్థించండి. మీ అందరి ప్రార్థనలు విని బాబా తప్పక మా ఇద్దర్నీ కలుపుతారని ఆశిస్తున్నాను. మీ అందరికీ నా ధన్యవాదాలు.
బాబా నాకు తోడుగా ఉంటూనే ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు
పేరు వెల్లడించని ఒక సాయిభక్తుడు తన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.
సాయిభక్తులకు నమస్కారం. నా పేరు చెప్పటం 'నేను' అనే అహంకారానికి హేతువు అవుతుంది కాబట్టి నేను పేరు వెల్లడించదలుచుకోలేదు. ఈ శరీరం సాయిది, కాబట్టి ఆయనే ఈ బ్లాగ్ ద్వారా నా అనుభవాన్ని పంచుకోమని నన్ను ప్రోత్సహించినట్లుగా భావించి నేను మొదటిసారి మీ ముందుకు వచ్చాను.
రెండు మూడు సంవత్సరాలుగా నాకు బాబాపట్ల భక్తి ఏర్పడింది. కానీ సరిగ్గా ఆలోచిస్తే, నా చిన్నవయస్సులో సత్యసాయి సంస్థ నడిపే స్కూల్లో చదువుతున్నప్పుడే స్కూల్లో జరిగే సాయి భజనలు, కీర్తనలలో నేను పాల్గొంటుండేవాడిని. సరిగా ఊహతెలియని ఆ వయస్సులో నాకు తెలియకుండానే నేను మా నాన్నతో కలిసి బాబా గుడికి వెళ్తుండేవాడిని. చిన్నవాడిని కదా! అలా వెళ్లడం నాకొక షికారులా ఉండేది. అప్పట్లో నాకేం తెలుసు, బాబా పిచ్చుక కాలికి దారం కట్టి తమ వద్దకు లాక్కున్నట్లు నన్ను తమ వైపుకు లాక్కుంటున్నారని. అయితే 2-3 సంవత్సరాల నుండే నాలో ప్రచండంగా భక్తి పెరిగింది. రెండు సంవత్సరాల క్రితం 'బాబాను గురువుగా నమ్మి, అన్నీ ఆయనకు అప్పగిస్తే, అంతా ఆయనే చూసుకుంటారు' అని సాయి సర్వస్వం అనే యూట్యూబ్ ఛానెల్ లోని ఒక వీడియో చూసి తెలుసుకున్నాను. ఆ క్షణం అనుకున్నాను, "బాబా! నా జీవితభారాన్ని నీపై వేస్తున్నాను తండ్రీ" అని. అలా అనుకున్నప్పటినుండి 2-3 రోజులపాటు విభూతి వాసన వస్తుండేది. 'ఎందుకు ఇలా వస్తోంది' అని ఆలోచిస్తుండేవాడిని. తరువాత తెలిసింది, 'బాబా తన ఉనికిని ఆవిధంగా తెలుపుతార'ని.
చెప్పాలంటే, నా జీవితంలో బాబా ప్రసాదించిన అనుభవాల జాబితా చాలానే ఉంటుంది. అందులో ఒకటి: మరో రెండు సంవత్సరాలలో మా నాన్నగారు రిటైర్ అవుతారనగా బదిలీలు అయ్యే సమయం వచ్చింది. అప్పటిదాకా ఆయన రోజూ 70 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తుండేవారు. కనీసం ఇప్పుడైనా ఆఫీస్ ఇంటికి దగ్గరలో ఉండేలా బదిలీ అయితే బాగుంటుంది అనుకున్నాము. కానీ దూరప్రాంతానికి బదిలీ కావొచ్చన్న సమాచారం మాకు అందింది. అది తెలిసి నేను, "బాబా! నాన్న బదిలీ విషయం నువ్వే చూసుకో! అంతా మంచిగా జరిగితే, నీ గుడిలో ప్రసాదం ఇస్తాను" అని బాబాకు మ్రొక్కుకున్నాను. బాబా కృపవలన కొద్దిరోజుల్లో నాన్నకి దగ్గరలో ఉన్న ఊరికి బదిలీ అయింది.
ఒకసారి మా అమ్మ అనారోగ్యం పాలైతే, బాబా ఊదీని నీళ్ళల్లో వేసి ఆమెకిస్తూ రోజూ ఆరతి పాడి, అష్టోత్తరం చదివేవాడిని. బాబా అనుగ్రహం వలన అమ్మకి చాలా త్వరగా నయమైంది. ఇలా బాబా నాకు తోడుగా ఉంటూనే ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు అనే నమ్మకం కూడా ఉంది. కాకపోతే ఈ మధ్య నాలో కలి ప్రభావం ఎక్కువైందో ఏమోగాని బాబాపై ధ్యానం కుదరటం లేదు. చాలా బాధగా ఉంటోంది. కానీ కొద్దిరోజుల్లో దాన్ని బాబా సరిచేస్తారని ఆశిస్తున్నాను. నా ఈ అనుభవాల ద్వారా తోటి భక్తుల మనసులో బాబాపట్ల కాస్త ప్రేమ పెరిగినా చాలు, నా ఈ జన్మ ధన్యమైనట్లే.
ఓం సాయిరామ్!
ఓం సాయిరామ్!
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Sai baba!I hope you always with me.🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm Sai ram
ReplyDeleteBaba మార్గంలో నుండి తప్పిపోకుండ బాబా వారే మనల్ని రక్షించాలని కోరుకొంటూ
ReplyDeleteBaba niku anukunna Jodi sarinadhe itye ayanee antha sarichesi kaluputharu.om sadguru sai nadha Maharaj Raaaaaaaj ki jai
ReplyDeleteDon't worry,sai may make u r work delay but he will never leave u,if he suits u sai will definitely make him as your jodi.God is Love,Love is Sai.Om sairam
ReplyDeleteBaba mamulani tondarga anugrahinchu sai
ReplyDelete
ReplyDeleteఓం సాయిరాం...🌹🙏🏻🌹
Om Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏
⚘🙏🙏🙏🙏⚘
ReplyDeleteOm Sai Ram 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌸🌸
ReplyDelete