- బాబా సందేశం ఖచ్చితంగా నిజమవుతుంది
- బాబా దయవల్ల ఎలాంటి సమస్యా ఎదురవలేదు
బాబా సందేశం ఖచ్చితంగా నిజమవుతుంది
సాయిభక్తులకు నమస్కారం. నా పేరు సునీత. నేను ఈ మధ్యనే 'శ్రీ సాయి సన్నిధి' వాట్సాప్ గ్రూపులో చేరాను. అందులో 'సాయి మహారాజ్ సన్నిధి’ బ్లాగ్ వారు ప్రతిరోజూ షేర్ చేసే సాయిభక్తుల అనుభవాలు చదువుతూ తోటి భక్తుల సమస్యలను బాబా ఎలా తీరుస్తున్నారో తెలుసుకొంటూ ఎంతో ఆనందిస్తున్నాను. ఇలాంటి అనుభవాలు నాకు కూడా బాబా ఎన్నో ప్రసాదించారు. వాటిలోనుండి ఒక అనుభవాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.
నా చిన్నతనంనుంచే నేను బాబా భక్తురాలిని. కానీ అప్పట్లో బాబాను పూజించేదాన్ని కాదు. పదవ తరగతి చదువుతున్నప్పుడు బాబాపట్ల ఇష్టము, ప్రేమ కలిగాయి. అప్పటినుంచి ఆయనను పూజించడం మొదలుపెట్టాను. పూజ అయితే చేసేదాన్ని గానీ పెద్దగా బాబాతో అనుబంధం ఏర్పడలేదు, నా అనుభవాలను కూడా ఎప్పుడూ ఎవరితో పంచుకోలేదు. కొన్ని సంవత్సరాలకి “బాబా అంటేనే నా శ్వాస, ఆయన లేకపోతే నేను లేను” అన్న విధంగా అయిపోయింది. ఏదో ఒకటి జరిగితే, అది అనుభవం అవుతుందేమో గానీ నా ప్రతి అడుగులోనూ బాబానే, నేను ఏం చేసినా బాబానే. అలాంటి నాకు ప్రత్యేకంగా ఒక అనుభవం అని చెప్పడానికి కూడా ఏమీ తోచట్లేదు. కళ్ళు మూసినా, తెరచినా అంతా బాబానే అయిపోయినప్పుడు చెప్పుకోడానికి ప్రత్యేకంగా అనుభవాలంటూ ఎక్కడుంటాయి?
2020, ఆగస్టు 21, రాత్రి నాకొక కల వచ్చింది. కలలో బాబా నా ప్రక్కన కూర్చొని, నా తలమీద చేయిపెట్టి, "ఎందుకు అంత బాధపడిపోతున్నావ్? అంతా నేను చూసుకుంటాను కదా!" అన్నారు. బాబా నా ప్రక్కన కూర్చోవడమేమిటని నేను ఆశ్చర్యపోతూ, "బాబా! మీరు రావడం ఏమిటి?" అని అడిగాను. "ఏం, రాకూడదా?" అన్నారు బాబా. "అది కాదు బాబా. మనసు బాధతో ఉన్నప్పుడు మీరు పిలిచినా రాలేదు. కానీ ఇప్పుడు వచ్చారు. అది నేను నమ్మలేకపోతున్నాను" అన్నాను. అప్పుడు బాబా, "అప్పుడు నీ మనసంతా కన్నీళ్లతో నిండిపోయివుంది. కాబట్టి నేను కనిపించలేదు. ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉన్నావు కదా! అందులోనూ నిద్రలో ఉన్నావు, అందుకే నీకు నేను కనిపిస్తున్నాను" అన్నారు. తరువాత బాబా ఒక సంఘటన గురించి తెలిపారు. అదేమిటంటే, 'మా అమ్మాయివాళ్ళ బావగారు మరో రెండు రోజుల్లో చనిపోతారు' అని బాబా చెప్పారు. "అదేంటి, అలా ఎలా?" అని అన్నాను. అంతే, బాబా వెళ్లిపోయారు. ఆ విషయం నేను చెప్పినా నా కుటుంబసభ్యులెవరూ నమ్మరు. మా అమ్మాయి, అల్లుడితో కూడా చెప్పలేను. యూరప్‌లో ఉన్న నాకు ఏమీ అర్థం కాలేదు. 'అసలు ఏం జరిగింది? అతనికేమైనా అయిందా? విషయం ఎలా తెలుసుకోవాలి?' అని ఒకటే ఆలోచన. చివరికి ఇండియాలో ఉన్న వాళ్ళ ఇంటికి వాట్సాప్ కాల్ చేశాము. అప్పుడు వాళ్ళు, "అతని ఆరోగ్యం బాగాలేదని, హాస్పిటల్లో చేర్చామ"ని చెప్పారు. "అసలు విషయమేమిటి?" అని అడిగితే, "అతనికి కామెర్లు వచ్చి లివర్ చెడిపోయింది. పైగా కుక్క కరిచింది" అని చెప్పారు. అది విని నేను, "ఇదంతా నిజమా!" అని నిర్ఘాంతపోయాను. శనివారం గడిచింది. ఆదివారంనాడు డాక్టర్లు, "అతనింక బ్రతకడు" అని చెప్పేశారు. అప్పుడు, 'బాబా ఈ విషయం గురించి ముందే చెప్పారు' అని చెప్పాలనుకున్నాను కానీ, ఎలా చెప్పాలో తెలియక ఊరుకున్నాను. మా అల్లుడు అతన్ని వేరే హాస్పిటల్‌కి తీసుకెళ్లడానికి చాలా ప్రయత్నాలు చేశారు. హైదరాబాదులోని అపోలో హాస్పిటల్‌కి ఫోన్ చేసి మాట్లాడితే, అక్కడ డాక్టర్, "తీసుకొని రండి, కానీ చాలా ఖర్చవుతుంద"ని అన్నారు. అప్పుడు కూడా చెపుదామని అనుకున్నాను, కానీ ఎలా చెప్పాలో అర్థంకాక చెప్పలేకపోయాను. ఒకసారి ఫోన్ చేస్తే, "అపోలోలో తెలిసిన అతనుంటే రిపోర్టులు పంపించి పరిశీలించమని చెప్పాము. అతను రిపోర్టులు చూసి, 'ఇక లాభం లేదు, అతనిని తీసుకొని రావద్ద'న్నారు" అని చెప్పారు. అప్పుడు కూడా చెప్పాలని నోటివరకు వచ్చి ఆగిపోయాను. అంతే, ఆ రాత్రి అతను చనిపోయాడు. బాబా చెప్పినట్లే జరిగింది. ఈ అనుభవాన్ని ఇప్పటికీ నేను ఎవరితోనూ చెప్పలేదు. మీరు బ్లాగులో ఎలా చెప్తారో కూడా నాకు తెలియదు, ఖచ్చితంగా దీన్ని ప్రచురించాలని కూడా నేను చెప్పట్లేదు. కానీ నేను చెప్పదలుచుకున్నది ఒకటే, 'చనిపోతాడ'ని బాబా చెప్పినట్లే అతను చనిపోయాడు. అందరి బాధలు తీర్చే బాబా అతని బాధ ఎందుకు తీర్చలేదని మనకు అనిపిస్తుంది. అందరి విషయంలో ఈ విధంగా బాధ తీర్చకుండా ఉంటారా అంటే అది కూడా కాదు. అందుకు నిదర్శనం మనం పొందిన అనుభవాలే. ఆయన ఎన్నోసార్లు, ఎన్నో కష్టాల నుండి మనల్ని కాపాడారు. చివరి నిమిషంలో సైతం కాపాడిన అనుభవాలెన్నో, ఎన్నెన్నో! అయితే, కర్మానుసారం ఎవరికి ఏది చేస్తే శ్రేయస్కరమో అది బాబాకు తెలుసు, కాబట్టి ఆయన అది చేస్తారని మనం గుర్తుంచుకోవాలి.
బహుశా ఇలాంటి అనుభవం ఎవరూ చెప్పి ఉండరేమో, కానీ నేను చెప్తున్నాను. ఎందుకంటే, బాబా మనకు ఇచ్చే సందేశం ఖచ్చితంగా నిజమవుతుంది. ఆయన సందేశంతో ఎన్నో బాధలు తీరిపోతాయి, సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కానీ ‘బాబా సందేశాన్ని చదివి, విని వదిలేస్తున్నామా? లేదా ఆచరిస్తున్నామా?’ అన్నదే ప్రశ్న. ఆచరిస్తే మన జీవితాలు బాగుపడతాయి. అందుకే చెప్తున్నాను, సాయి సందేశాలను చదివి ఊరుకోకుండా, చదివినదాన్ని అందరం ఆచరిద్దాం. కనీసం మనవంతు ప్రయత్నం చేద్దాం. కుటుంబంలో ఒక్కరు మారితే, కుటుంబం మొత్తం మారుతుంది. అలాగే బాబా భక్తులమైన మనలో చిన్న ఆవగింజంత ఈ మార్పు రావాలి. ప్లీజ్.. మారదాం, బాబా తత్వంలోకి వెళ్దాం, బాబా దారిలో నడుద్దాం, ప్రతి ఒక్కరం శ్రద్ధ, సబూరీ పాటిద్దాం. మనం మారుదాం, మన చుట్టుపక్కల వాళ్ళని మారుద్దాం. ఇది నా చిన్న విన్నపం. జై సాయిరామ్!
బాబా దయవల్ల ఎలాంటి సమస్యా ఎదురవలేదు
సాయిభక్తురాలు శ్రీమతి జ్యోతిరెడ్డి తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
ఓం సాయిరాం! సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ప్రత్యేకించి ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయిబంధువులకి నా కృతజ్ఞతలు. నా పేరు జ్యోతి. నేను గత 8 సంవత్సరాల నుండి బాబా భక్తురాలిని. ఈరోజు మొదటిసారిగా మీ అందరితో నా అనుభవాన్ని పంచుకుంటున్నాను.
2020, ఆగస్టు 5వ తేదీన మావారు తన ఆఫీసులో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగారు. ఆఫీసు నుండి ఇంటికి వచ్చాక మావారు నాకు ఈ విషయాన్ని వివరించారు. నాకు చాలా ఆందోళన కలిగింది. వెంటనే నేను బాబాకు నమస్కరించి, “బాబా! మీరే మావారిని రక్షించండి” అని మనసారా వేడుకుని, బాబా ఊదీని మావారి నుదుటన పెట్టాను. మావారికి ఎలాంటి సమస్యా లేకపోతే నేను నా అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటానని అనుకున్నాను. బాబా దయవల్ల మావారికి ఎలాంటి సమస్యా ఎదురవలేదు. నేను సంతోషంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. వీలైనంత త్వరలో ఇతర అనుభవాలను పంచుకునేలా సహాయం చేయమని బాబాను అభ్యర్థిస్తున్నాను.
ఓం శ్రీ సాయినాథాయ నమః
om sai ram nice experiences.sai came in dream and told her about the dreath he knows every thing.om sai ram
ReplyDeleteOm Sai nadha Maharaj Raaaaaaaj ki jai nannu problems nudi rakhinchu Sai naa thandriiiii.
ReplyDeleteSai s dream exp is true ,, that's not possible to everyone..💯👍
ReplyDeleteOn Sai ram,baba pls bless me with saburi pls show your miracle in my life Deva,love u so much sai
ReplyDeleteజై సాయిరామ్!
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః
ReplyDelete🙏🌺🙏ఓం సాయిరాం🙏🌺🙏
ReplyDeleteBaba please maku help cheyandi baba sai sai sai ani manasutho pillustuna ravayya ekada vunnavaya ra thandri madaggariki pleaseeeee
ReplyDeleteబాబా మార్గం లో మనం నడవాలి.జై సాయిరాం
ReplyDeleteBaba please kapadu thandri
ReplyDeleteఓం సాయిరాం... శ్రద్ధ _సబూరి 🌹🙏🏻🌹
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏
Baba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu vadini bless cheyandi
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDelete