సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 549వ భాగం.....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా దయే అసలైన ఔషధం
  2. బాబా దయతో పూర్తైన బయోమెట్రిక్ పని

బాబా దయే అసలైన ఔషధం
 
సాయిభక్తురాలు శ్రీమతి శిరీష తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

సాయిభక్తులందరికీ, ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా నమస్కారములు. నా పేరు శిరీష. ఇదివరకు బాబా ప్రసాదించిన కొన్ని అనుభవాలను ఈ బ్లాగులో మీతో పంచుకున్నాను. ఈమధ్య జరిగిన అనుభవాలను ఇప్పుడు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ముందుగా ‘సాయిభక్తుల అనుభవమాలిక’లో ఈమధ్య భక్తుల అనుభవాలకు ముందుగా ప్రచురిస్తున్న బాబా ఫోటో, బాబా వచనాలు చాలా బాగుంటున్నాయి. ఆ ఫోటోల్లో బాబాను చూస్తుంటే శిరిడీలోని బాబాను చూస్తున్న అనుభూతి కలుగుతోంది. ఇంత మంచి ఆలోచన కలిగి బాబా ఫోటోలను ప్రచురిస్తున్న సాయికి నా ధన్యవాదాలు.

ఇక నా అనుభవంలోకి వస్తే... ఈమధ్య మా నాన్నగారు ఒకరి అంత్యక్రియలలో పాల్గొనటానికి వెళ్ళారు. చనిపోయిన వ్యక్తి తండ్రి మా నాన్నగారికి అన్ని విషయాల్లోనూ సహాయంగా ఉంటారు. అందువల్ల తప్పనిసరై, కరోనా పరిస్థితిలే అయినప్పటికీ ఆయనకి తోడుగా ఉండాలని మా నాన్నగారు అక్కడికి వెళ్ళారు. ఆ తరువాత నాలుగు రోజులకు చనిపోయిన వ్యక్తి తండ్రి వచ్చి, తన భార్యకు, వాళ్ళ పెద్దబ్బాయికి, కోడలికి కరోనా సోకిందని చెప్పారట. ఆ సంగతి తెలిస్తే నేను భయపడతానని మా నాన్నగారు ఆ విషయం నాకు చెప్పలేదు. ఆ తరువాత మా తమ్ముడు నాకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఆ సంగతి తెలియగానే నాకు ఒంట్లో వణుకుపుట్టి కాసేపటివరకు ఏమి చెయ్యాలో తోచలేదు. ఎందుకంటే, వాళ్ళందరితో మా నాన్నగారు చాలా దగ్గరగా మెలిగారు. కాసేపటి తరువాత నేను మా నాన్నగారికి ఫోన్ చేసి, మిరియాల కషాయం, నిమ్మకాయరసం త్రాగుతుండమని, ఆవిరిపట్టడం వంటివి చేయమని చెప్పాను. కానీ దైవకృప లేనిదే ఏదీ మనకు సాధ్యం కాదు. నేను ఆ సాయితండ్రినే నమ్ముకున్నాను. “బాబా! వీటన్నింటినీ మించిన ఔషధం మీ దయే తండ్రీ! మీ దయతో మా నాన్నగారికి ఏ విధమైన అనారోగ్యం లేకుండా చేయి తండ్రీ! అలా జరిగితే మా నాన్నగారితో కోవా నైవేద్యం ఇప్పించి, నా అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అని ఆ సాయితండ్రిని వేడుకున్నాను. ఇది జరిగి ఇప్పటికి నెలరోజులు దాటింది. ఎటువంటి అనారోగ్యమూ మా నాన్నగారి దరిచేరలేదు. ఎన్ని మందులు వాడినప్పటికీ కేవలం ఆ సాయి దయవల్లనే మా నాన్నగారు ఎటువంటి ఆరోగ్య సమస్యా లేకుండా క్షేమంగా ఉన్నారు. తనను నమ్ముకున్నవారి చేయిని బాబా ఎన్నటికీ విడిచిపెట్టరు. ఇటువంటి అనుభవాలను బాబా నాకు ఎన్నో ప్రసాదించారు. బాబా మా కుటుంబానికి అడుగడుగునా సహాయంగా ఉంటూ అన్నివిధాలా మమ్మల్ని కాపాడుతున్నారు. “బాబా! ఇలాగే సాయిభక్తులందరి మీద నీ కృపను చూపు తండ్రీ! ఈ ప్రపంచానికి కరోనా నుండి విముక్తిని కలిగించు తండ్రీ!”

మరో చిన్న అనుభవం: 

మావారు మెడికల్ డిపార్టుమెంటులో పనిచేయడం వల్ల ఆయనకు కొద్ది రోజుల క్రితం కరోనా పరీక్ష చేశారు. అప్పటినుండి నేను బాబానే స్మరించుకుంటూ, “బాబా! రిపోర్టు నార్మల్‌గా వచ్చేలా చూడు తండ్రీ!” అని వేడుకున్నాను. ఎందుకంటే, ఈమధ్య ఎటువంటి లక్షణాలు లేకపోయినా పరీక్ష చేసిన తరువాత పాజిటివ్ అని వస్తోంది. అందుకని నాకు చాలా భయమేసింది. కానీ మన బాబా మన దగ్గర ఉండగా ఎటువంటి అనారోగ్యాన్నీ మన దరి చేరనివ్వరు. అంతా ఆయనే చూసుకుంటారు. మావారికి నెగిటివ్ అని రిపోర్టు వచ్చింది. అంతా ఆ సాయినాథుడి దయే! ఆ సాయినాథుడి దయవలనే మా కుటుంబం క్షేమంగా ఉంది.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

బాబా దయతో పూర్తైన బయోమెట్రిక్ పని
  
సాయిభక్తురాలు ప్రియ తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

ఓం శ్రీ సాయినాథాయ నమః. 

ఉద్యోగరీత్యా మేము చెన్నైలో ఉంటున్నాము. ఈమధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంవారు ఏదో కారణం చేత బయోమెట్రిక్ చేయించాలని డ్వాక్రా మహిళలందరినీ మన రాష్ట్రానికి రమ్మన్నారు. కానీ ఈ కరోనా వైరస్ కారణంగా మేము రాష్ట్రం దాటి వెళ్ళలేని పరిస్థితి. అందువల్ల, ప్రభుత్వం ఇచ్చే డబ్బులు వదులుకుందామని అనుకొన్నాము. కానీ మేము బయోమెట్రిక్ చేయించుకోకపోతే మా బృందంలోని మిగిలినవారికి కూడా లోన్ ఇవ్వటం కుదరదని చెప్పారు. దాంతో, మాకోసం కాకపోయినా మా బృందంలోని వారికోసమైనా ఊరికి వెళ్లాల్సిన పరిస్థితి. ఇంక మేము సాయిబాబాను నమ్ముకొని ఊరికి వెళ్ళే మార్గాలు వెతికాము. ఇంతలో వేరేచోట నుండి కూడా బయోమెట్రిక్ చేయించుకోవచ్చని ఒక వ్యక్తి ద్వారా తెలిసింది. దాంతో అన్నీ వివరాలు తెలుసుకొని బయోమెట్రిక్ చేయించుకోవడానికి ఒకచోటికి వెళితే, మేము వేరే ప్రాంతంలో ఉంటున్నందువల్ల మా బయోమెట్రిక్ ని కంప్యూటర్ యాక్సెప్ట్ చేయలేదు. అప్పుడు మేము బాబాను తలచుకొంటూ, “ఏదైనా అద్భుతం చేస్తే నువ్వే చేయాలి బాబా!” అని ప్రార్థించి, మరలా మరోసారి ప్రయత్నించాము. బాబా దయవల్ల ఉన్నట్టుండి కంప్యూటర్ మా బయోమెట్రిక్ ‌ని యాక్సెప్ట్ చేసింది. ఎంతో ఆనందంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకుని, ఇంటికి వెళ్లగానే ఈ అనుభవాన్ని మన బ్లాగులో పంచుకుంటామని చెప్పుకున్నాము.


6 comments:

  1. అంతా సాయి దయ.ఓం srisairam.

    ReplyDelete
  2. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  3. Baba please help me sai thandri

    ReplyDelete
  4. ఓం సాయిరాం...🌹🙏🌹

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo