ఈ భాగంలో అనుభవాలు:
- మంత్రాన్నిచ్చి జీవిత గమ్యానికి చేరుస్తానని వాగ్దానం చేసిన బాబా
- బాబా కృపతో నయమైన మా బాబు కంటి సమస్య
- బాబా అనుగ్రహించిన ధునిలో ఊదీ
మంత్రాన్నిచ్చి జీవిత గమ్యానికి చేరుస్తానని వాగ్దానం చేసిన బాబా
సాయిభక్తురాలు మాధవి తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
సాయికుటుంబానికి సాయిరామ్! నేను ఇటీవల బాబా నాకు ప్రసాదించిన అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 2020, సెప్టెంబరు 10, గురువారంనాడు నేను సాయిసచ్చరిత్రలో 26, 27 అధ్యాయాలు పారాయణ చేశాను. పారాయణ ప్రారంభించే ముందు నేను సాయిని ఒక ప్రశ్న అడిగాను. సాయి నాకు, 'రాజారామ్' అని సమాధానం ఇచ్చి, నా జీవిత గమ్యాన్ని చేరుకోవడానికి సహాయం చేస్తానని వాగ్దానం చేశారు. ఆ తరువాత మధ్యాహ్నం అనుకోకుండా నేను ప్రేమసాయి మందిరానికి వెళ్ళాను. అక్కడ కూడా బాబా నన్ను ఆశీర్వదించారు. మరుసటిరోజు (11-09-2020) శుక్రవారంనాడు నేను నా మురళీధరుడు ప్రసాదించిన పనిచేసే చోటకి వెళ్లి, సాయి పరివార్ వాట్సాప్ గ్రూపు తెరిచి చాలా సంతోషానికి లోనయ్యాను. ఎందుకంటే, ముందురోజు బాబా చేసిన వాగ్దానాన్ని గుర్తుచేస్తూ పారాయణలో నాకు బహుమతిగా లభించిన 'రాజారామ్' మంత్రం కనిపించింది. తద్వారా నా ప్రతి కదలికను సంతోషంగా మలచడానికి బాబా నాతో ఉన్నానని తెలియజేశారు. ఈ అద్భుతమైన అనుభవాన్ని నా సాయి పరివార్(కుటుంబం)తో పంచుకోవడం ఆనందంగా ఉంది.
సాయిరామ్!
బాబా కృపతో నయమైన మా బాబు కంటి సమస్య
సాయిభక్తురాలు శ్రీమతి రూప తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
ఓం సాయిరామ్!
అందరికీ నమస్కారం. నా పేరు రూప. నేను ఇప్పుడు బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను. ఇటీవల మా బాబు కన్ను ఎర్రబడి దురద, వాపుతో చాలా ఇబ్బందిపెట్టింది. ఈ కరోనా సమయంలో వాడిని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్లాలంటే నాకు చాలా భయమేసింది. అప్పుడు సర్వవేళలా భక్తులకు కొండంత అండగా నిలిచే బాబాను తలచుకొని, "బాబుకి త్వరగా తగ్గిపోయేలా చూడండి బాబా. మీ దయవల్ల బాబుకి నయమైతే, నా అనుభవాన్ని బ్లాగు ద్వారా అందరితో పంచుకుంటాన"ని బాబాకు చెప్పుకున్నాను. బాబా ప్రేమతో బాబుకి నయమయ్యేలా చేశారు. ఆనందంగా నేను వారికి ధన్యవాదాలు తెలుపుకున్నాను. బాబాను నమ్ముకుంటే, ఆయన మన వెంటే ఉంటారని నా నమ్మకము. తొందర్లోనే మరో అనుభవంతో మీ ముందుకు వస్తాను.
జై సాయిరామ్!
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
బాబా అనుగ్రహించిన ధునిలో ఊదీ
సాయిభక్తుడు మహేశ్వర తనకి బాబా ఇటీవల ప్రసాదించిన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
సాయి భక్తులందరికీ హాయ్. నేను హైదరాబాద్ నుండి మహేశ్వర. నేను నా జీవితంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. నా చెడు కర్మ కారణంగా మొదటి భార్యకి విడాకులు ఇవ్వాల్సి వచ్చింది, తరువాత నేను నా ఉద్యోగాన్ని కోల్పోయాను. అయినప్పటికీ బాబా ఆశీస్సులతో 32 ఏళ్ళ వయస్సులో నేను రెండో పెళ్లి చేసుకున్నాను. ఆ వివాహం వలన కూడా నేను చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. కేవలం బాబా ఆశీస్సుల వల్లే నేను మనశాంతితో ఉన్నాను. నాకు జరిగిన ఒక చిన్న అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ఊదీ కావాలని నేను జూన్ 13న శిరిడీ వెళ్ళాను. బాబాని ప్రార్థించి ఊదీకోసం ధుని ఉండే ద్వారకామాయికి వెళ్ళాను. అక్కడ తాళాలు వేసి ఉన్నాయి. దాంతో నేను, "బాబా! నేను మీ ఊదీకోసం ఇక్కడికి వచ్చాను. కాని ఇక్కడ తాళాలు వేసి ఉన్నాయి. ఇప్పుడు నేనేమి చేయాలి?" అని బాబాతో చెప్పుకుంటూ ఉన్నాను. అంతలో అకస్మాత్తుగా ఒక వ్యక్తి వచ్చి ధుని తాళాలు తీసాడు. నేను ఆశ్చర్యపోతూ నాతోపాటు తీసుకుని వెళ్లిన బాక్స్ చూపించి, "ఇందులో కొంత ఊదీ ఇవ్వమ"ని అడిగాను. అతను కాదనకుండా వెంటనే ఊదీ ఇచ్చాడు. నిజంగా ఇది సాయిబాబా చేసిన అద్భుతం. ఆయన అనుగ్రహానికి ఆనందంతో పరవశించిపోయాను. హృదయపూర్వకంగా ఆయనకు కృతఙ్ఞతలు తెలుపుకుని ఆనందంగా తిరిగి వచ్చాను.
ఓం సాయిరామ్.
Om sai ram! 🙏🙏🙏🌹🌹🌹🌹🌹
ReplyDeleteOm Sai ram
ReplyDeleteOm sai ram
ReplyDeleteOm srisairam
ReplyDeleteOm sairam
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః
ReplyDeleteఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయిణే నమః
🙏 🌹🙏🌹🙏🌹🙏🌹🙏