- మానసిక, శారీరక ఉపశమనాన్ని ప్రసాదించిన బాబా
- ప్రతి కష్టం నుండి ప్రేమతో ఉపశమనం ప్రసాదిస్తున్న బాబా
మానసిక, శారీరక ఉపశమనాన్ని ప్రసాదించిన బాబా
సాయిబంధువులందరికీ సాయిరాం! ముందుగా ఏమీ ఆశించకుండా ఈ బ్లాగును నిర్వహిస్తూ సాయిభక్తులందరికీ ప్రతిరోజూ సాయిలీలామృతాన్ని ఆస్వాదించే సువర్ణ అవకాశాన్ని ఇస్తున్న అన్నయ్యకు ధన్యవాదాలు. 'బాబా అనుగ్రహం మీపై పూర్ణంగా ఉన్నందువలనే ఇంతటి ఘనమైన కార్యాన్ని మీరు చేయగలుగుతున్నారు. బాబా ఆశీస్సులు మీకు సదా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్యా!'
నా పేరు మంగళ. నేను బాబా భక్తురాలిని. నాకు బాబా చాలా అనుభవాలు ప్రసాదించారు. నాకు బాబా అంటే చాలా చాలా ఇష్టం. నా వరకు నాకు అంతా బాబానే. ఈ ప్రపంచంలో నాది అంటూ ఏమైనా ఉంటే అది బాబానే. ఆయనతో అనుబంధం ముందు వేరే బంధాలన్నీ నాకు శూన్యం. ఆయనను తలచుకోని క్షణం నాకు వ్యర్థం. ఆయన కన్నా అద్భుతం, ఆయన కన్నా అమూల్యం ఈ సృష్టిలో ఏమీ లేదు. సముద్రం యొక్క లోతునైనా కనుక్కోవచ్చు కానీ, బాబా ప్రేమను వివరించడం అసాధ్యం. ఆయన ద్వారకామాయిలో కొలువైన మాతృసాయి. ఆయన మనల్ని ప్రేమించినంతగా ఎవరూ ప్రేమించలేరు. ప్రేమకు ప్రతిరూపమే నా సాయి. నా కోపాన్ని, ప్రేమని తల్లిలా భరించేది నా బాబానే. ఆయన ప్రేమలో, నీడలో ప్రశాంతమైన జీవనాన్ని ప్రసాదించిన బాబాకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. బాబా జననమరణాలకు అతీతుడు. ఎవరైతే బాబాను హృదయపూర్వకంగా ప్రేమిస్తారో వారెక్కడ ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి సమయం, సందర్భం అయినా బాబా సమాధానాన్ని పొందుతారు. ఏదో ఒక రూపంలో దర్శనమిచ్చి తన భక్తుల ప్రశ్నలకు సమాధానమిచ్చి వారి కోరికలు నెరవేరుస్తారు బాబా. అలా ఎల్లప్పుడూ ఆయన తన ఉనికిని చాటుతూనే ఉంటారు. కానీ, మనం మన అజ్ఞానం వల్ల గుర్తించలేకపోతున్నాము. "నేను నీతోనే ఉన్నాను, భయపడకు!" అని ఆయన ఇచ్చే సూచనలను గ్రహించలేకపోతున్నాము. బాబాకి ఇచ్చిన మాటననుసరించి అలాంటి అనుభవాన్ని నేను ఇప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. "బాబా! ఇదే నేను ఈ బ్లాగులో పంచుకుంటున్న మొదటి అనుభవం. కావున, నా భావాన్ని సరిగ్గా వ్యక్తపరిచేలా అనుగ్రహించండి తండ్రీ!"
2020, ఆగస్టు 17న ఉదయం గం. 9:30 నిమిషాల సమయంలో నేను వంటింట్లో పని చేస్తుండగా ఆకస్మాత్తుగా నా కాళ్ళుచేతులు, తొడభాగాలలో నొప్పులు మొదలయ్యాయి. ఆ నొప్పి భరించలేక, "ఏంటి బాబా! ఉన్నట్టుండి ఇలా అయిపోతోంది?" అనుకుంటూ వెళ్లి పడుకున్నాను. కాస్త జ్వరంగా కూడా అనిపించి, డోలో-650 టాబ్లెట్ వేసుకున్నాను. ధర్మామీటర్ కోసం వెతికాను కానీ, అది ఎక్కడా దొరకలేదు. రాత్రి పడుకునేముందు మళ్ళీ వెతికితే దొరికింది. అప్పుడు చెక్ చేసుకుంటే 101 డిగ్రీల జ్వరం ఉంది. అంత జ్వరం ఉన్నా నాకు ఎలాంటి భయం లేదు. ఎందుకంటే, బాబా నాతో ఉన్నారనే ధైర్యం. అయితే మరుసటిరోజు టాబ్లెట్ వేసుకున్నాక కూడా 101 డిగ్రీల జ్వరం ఉండటంతో నా మనసున కలవరం మొదలైంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో హాస్పిటల్‌కి వెళ్లి చూపించుకునేలా లేదు. ఎందుకంటే, నార్మల్ జలుబు, జ్వరాలను కూడా కోవిడ్ అంటారేమోనని భయం. ఆరోజు రాత్రి భయంతో, "బాబా! నాకు కరోనా వచ్చిందేమోనని మనసంతా చాలా ఆందోళనగా ఉంది. నాకు కరోనా కాకుంటే మీరు స్వప్నదర్శనమిచ్చి కరోనా లేదని ఏదైనా నిదర్శనం చూపించమ"ని బాబాని అడిగాను. ఆ రాత్రి సుమారు రెండున్నర తర్వాత నాకొక కల వచ్చింది. కలలో నేను, నా స్నేహితురాలు బాబా గుడిలో ఉన్నాము. మేము ఆరతిలో పాల్గొని, బాబాకు ఆరతికి ఇస్తున్నాము. ఆ ఆరతి దర్శనంతో నాకే ఆపదా లేదని బాబా నిదర్శనమిచ్చినట్లుగా అనిపించింది. అయినప్పటికీ నా మనసులో ఏదో తెలియని భయం. కారణం, తర్వాత రోజు కూడా జ్వరం తగ్గలేదు. పైగా నా శరీరం డీహైడ్రేషన్‌కి లోనవుతోందని తెలుస్తోంది.
తన బిడ్డ బాధలో ఉంటే బాబా చూస్తూ ఊరుకుంటారా? ఏదో ఒక రూపంలో ఆ బాధను తీసేస్తారు. సరిగ్గా అదే జరిగింది. నేను బాధపడుతున్న సమయంలో, ఒక సాయిబంధువు శిరిడీలోని బాబా మ్యూజియంకి సంబంధించిన వీడియో పంపించారు. అది చూడగానే నా దిగులంతా పోయి నా మనసు తేలికపడి చాలా సంతోషంగా అనిపించింది. వెంటనే ఆ సాయిబంధువుతో మాట్లాడాను. తన మాటలు నాకెంతో ఓదార్పునిచ్చాయి. తను, "డీహైడ్రేషన్ పోవడానికి బాబా ఊదీ నీటిలో వేసుకుని, బాబా తీర్థంగా భావించి రెండురోజులు త్రాగండి. అంతా బాబా చూసుకుంటార"ని చెప్పింది. ఆరోజునుండి బాబాను తలచుకొని ఊదీనీళ్లు త్రాగడం మొదలుపెట్టాను. ఊదీ ప్రభావంతో రోజురోజుకీ జ్వరం తగ్గుతూ నా శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి చేరుకొని జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. బాబా నాకు కలలో (ని)దర్శనం ఇవ్వడమే కాకండా, ఒక భక్తురాలిని మిషగా చేసుకొని ఊదీతీర్థాన్ని సేవించమని సూచించారు. ఆవిధంగా తమ సహాయాన్ని అందించి నాకు మానసిక, శారీరక ఉపశమనాన్ని ప్రసాదించారు బాబా. సాయిలీలలు ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడే అద్భుతాలుగా జరగవు. మన చుట్టూ ఉన్న వ్యక్తుల, సంఘటనల ద్వారానే బాబా యొక్క దయ, కరుణ, రక్షణ అత్యంత సహజంగా మనకి అందుతుంది. ఆయన లీల ఎందుకు అలా ఉంటుందంటే, అన్నింటిలోనూ, అందరిలోనూ ఉండేది, మాట్లాడేది తామేనని గుర్తింపు మనకు కలగజేయడానికే. "థాంక్యూ బాబా! మీ సహాయానికి నా పాదాభివందనాలు. నేను సదా మీ స్మరణలోనే ఉండేలా అనుగ్రహించండి బాబా! నా కుటుంబ బాధ్యత మీదే. ఈ కరోనా బారినుండి మమ్మల్ని, ఇంకా అందరినీ రక్షించండి సాయీ!"
ఓం సాయిరాం!
ప్రతి కష్టం నుండి ప్రేమతో ఉపశమనం ప్రసాదిస్తున్న బాబా
సాయిభక్తురాలు లలిత ఇటీవల బాబా తనకు ప్రసాదించిన అనుభవాలను ఇలా పంచుకుంటున్నారు:
ఓం సాయిరామ్! సాయిబంధువులకు నా శతకోటి వందనాలు. బాబా నాకు ఎన్నో అనుభవాలను ప్రసాదించారు. ఇటీవల నాకు గుండె నరాలలో చాలా నొప్పి కలిగింది. అప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, "ఈ బాధనుండి విముక్తి కలిగించండి బాబా, ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. మరుసటిరోజు ఉదయానికల్లా నా భాధ తగ్గిపోయింది.
మరోసారి తలనొప్పి మరియు కడుపునొప్పితో నేను చాలా ఇబ్బందిపడ్డాను. అప్పుడు కూడా బాబాను తలచుకొని కొద్దిగా ఊదీ నుదుటన పెట్టుకొని, మరికొంత ఊదీని నీటిలో కలుపుకొని త్రాగాను. అంతే, కొద్దిసేపటిలో నాకు ఆ బాధనుండి ఉపశమనం లభించింది. అంతా బాబా దయ. ఆయన కరుణ అపారమైనది. "ఎప్పుడూ మాతోనే ఉంటూ మమ్మల్ని ఆశీర్వదించండి బాబా. ఐ లవ్ యు బాబా".
om sai ram i liked mangala gari experiences.she neratted very nicely.her dreams also very nice.i too love baba hearthfully.om sai ram.
ReplyDeleteBaba,corona నుండి మమ్మల్లీ , అందరిని కాపాడండి. పాహిమాం పాహిమాం శరణు.
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏
🌺🙏🌺🌟 Om Sri SaiRam 🌟🌺🙏🌺
ReplyDelete