సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 550వ భాగం.....


ఈ భాగంలో అనుభవాలు:

  1. దయగల సాయి నా మనోభీష్టాన్ని నెరవేర్చారు
  2. కోవిడ్ పరీక్ష రిపోర్టులు నెగిటివ్ వచ్చేలా అనుగ్రహించిన బాబా

దయగల సాయి నా మనోభీష్టాన్ని నెరవేర్చారు

సాయిబంధువులకు నమస్కారం. నా పేరు శ్రీనివాసరావు. నేను ఒక సామాన్య సాయిభక్తుడిని. నేను మార్కాపురంలో నివసిస్తున్నాను. సుమారు 20 ఏళ్ళుగా నేను బాబా భక్తుడిని. గత నాలుగు నెలల నుండి ఈ బ్లాగులో వస్తున్న అనుభవాలను ప్రతిరోజూ చదువుతున్నాను. బాబా తన భక్తులకు ప్రసాదించిన అనుభవాలను చదువుతున్నప్పుడు ‘బాబా ఎంత ప్రేమగా తన బిడ్డల బాధలను తీర్చి, వారి కోరికలను నెరవేరుస్తున్నారో!’ అని అనుకున్నాను. అందరి అనుభవాలు చదివిన తరువాత నేను కూడా నా అనుభవాన్ని సాటి సాయిభక్తులతో పంచుకోవాలనుకున్నాను. గతంలో కూడా నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను ఇప్పుడు మీతో పంచుకుంటాను.

బాబా దయవల్ల నా కూతురు, అల్లుడు, నా కుమారుడు అంతా కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. 2020, జులై నెలలో మా అల్లుడికి ఆరోగ్యం బాగలేకపోతే తనను పరీక్షించిన డాక్టరు తనకు కరోనా వచ్చిందని చెప్పాడు. మా అల్లుడికి కరోనా తగ్గిపోయి తన ఆరోగ్యం బాగుండాలని నేను దీనార్తితో బాబాను శరణు వేడుకుని, ‘బాబాను ప్రార్థిస్తూ ఉండమని, బాబా ఊదీని నీళ్లల్లో కలిపి త్రాగుతూ ఉండమని’ మా అల్లుడికి చెప్పాను. నా కూతురికి, కొడుకుకి కూడా కోవిడ్ పరీక్ష చేయిస్తే బాబా దయవల్ల వాళ్ళకు కరోనా లేదని వచ్చింది. 14 రోజుల తరువాత మా అల్లుడికి మళ్ళీ పరీక్ష చేయిస్తే బాబా దయవల్ల అందులో నెగిటివ్ వచ్చింది. బాబా ఎంతో దయతో మా కుటుంబాన్ని ఈ గండం నుండి కాపాడారు.

ఇదే సమయంలో నా భార్యకి జ్వరము, దగ్గు వచ్చాయి. ఏమి చేయాలో మాకు తోచలేదు. ఆసుపత్రికి వెళ్లే ధైర్యం లేక బాబాను నమ్ముకొని, ఊదీ నీళ్ళు త్రాగిస్తూ, బాబా చరిత్ర పారాయణ చేస్తూ ఉన్నాము. అలా వారం రోజులు చేశాక బాబా అనుగ్రహంతో నా భార్యకు జ్వరం, దగ్గు తగ్గిపోయాయి. అందరికీ ఆరోగ్యం బాగుంటే ఈ అనుభవాలను బ్లాగులో పంచుకుంటానని అనుకున్నాను. బాబా దయవల్ల అందరి ఆరోగ్యం బాగుంది. బాబాను నమ్ముకొని శ్రద్ధ, సబూరి(ఓర్పు, సహనం)తో బాబాను ప్రార్థిస్తే ఎటువంటి కష్టాన్నయినా బాబా తీరుస్తారు. ఈ కరోనా మహమ్మారి నుండి తన బిడ్డలను కాపాడమని బాబాను ప్రార్థిస్తున్నాను. 

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!

కోవిడ్ పరీక్ష రిపోర్టులు నెగిటివ్ వచ్చేలా అనుగ్రహించిన బాబా

నా పేరు దేవి. నా చిన్నప్పుడు మా తాతగారు బాబాను పూజించేవారు. అప్పటినుండి నాకు బాబా అంటే చాలా ఇష్టం. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మా పట్టణంలో కరోనా చాలా ఎక్కువగా ఉంది. ఒకరోజు మా బాబుకి జ్వరం వచ్చింది. మూడు రోజులైనా జ్వరం తగ్గలేదు. ఏ డాక్టర్ దగ్గరకు వెళ్ళినా, “ముందు కోవిడ్ పరీక్ష చేయించుకోండి. అందులో నెగిటివ్ వస్తే వేరే పరీక్ష చేస్తాము” అన్నారు. దాంతో మా బాబు, మావారు ఇద్దరూ కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు. టెస్ట్ చేయించుకున్న మూడవరోజు ఎవరో మావారికి ఫోన్ చేసి, “మీ ఇద్దరిలో ఒకరికి పాజిటివ్ వచ్చింది. రిపోర్టులు సాయంత్రం పంపిస్తాము” అన్నారు. అది విని నాకు చాలా భయమేసి బాబాకు నమస్కరించుకుని, “బాబా! ఇద్దరికీ నెగిటివ్ వచ్చేలా చెయ్యి. ‘రిపోర్టులు పొరపాటున తప్పు చెప్పాము’ అని నువ్వే ఎలాగైనా వారిచేత చెప్పించు” అని బాబాను ఆర్తిగా ప్రార్థించాను. ఆ సాయంత్రం రిపోర్టులు వచ్చాయి. అందులో మా బాబుకి, మావారికి ఇద్దరికీ నెగిటివ్ అని ఉంది. అది చూసి నాకు ఎంతో ఆనందంగా అనిపించి మనస్ఫూర్తిగా బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. 

సాయివంటి దైవం లేడోయి, లేడోయి!
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై! 
సద్గురు శ్రీ సాయినాథుని శరత్‌బాబూజీ కీ జై!!


9 comments:

  1. om sai ram today is my hubbys birth day please bless him with long life with health baba

    ReplyDelete
  2. May Saibaba bless you and your hubby with lots of happiness on the occasion of his birthday
    Jai sairam

    ReplyDelete
  3. నిజమే! బాబా వంటి దేవుడు లేరనేది నిజంగా నిజం.

    ReplyDelete
  4. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!

    ReplyDelete
  5. Baba ni namukunte adhi tapaka neravertundi sai thandri kapadu mamalini

    ReplyDelete
  6. అంతా సాయి బాబా మహిమ

    ReplyDelete
  7. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo