సాయి వచనం:-
'ఖాళీ కడుపుతో ప్రయాణించవద్దు. భోజనం చేసి వెళ్ళండి.'

'ఊదీ బాబా కృపకు గుర్తు. ఊదీ సాయి అవ్యాజ కరుణకు వాహకం. అది నా సద్గురు స్పర్శ' - శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 554వ భాగం.....


ఈ భాగంలో అనుభవం:
  • సాయి ప్రేమ అనంతం - రెండవ భాగం

నిన్నటి తరువాయి భాగం...

ఏనుగు నోటినుండి బయటికి వచ్చిన దంతము తిరిగి లోపలికి ఎలా వెళ్ళదో అలానే బాబా ఇచ్చన మాటకు తిరుగుండదు(నిన్నటి భాగంలో, "మీ ఇద్దరినీ నేను చూసుకుంటాను. మీరిద్దరూ డాక్టర్లు అవుతారు" అని బాబా చెప్పారని చెప్పను కదా! ఆ వివరాలు ఎవరైనా చదవని వారుంటే వారికోసం ఇక్కడ లింక్ ఇస్తున్నాను- https://saimaharajsannidhi.blogspot.com/2020/10/553.html). అది ప్రస్తుతం మా పెద్దబ్బాయి విషయంలో జరిగింది. బై.పి.సి తీసుకున్న మా పెద్దబ్బాయి ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు కాలేజీవాళ్లు ఉదయం నుంచి రాత్రి వరకు ఇచ్చే కోచింగుతో చాలా అలసిపోయాడు. ఆ రెండు సంవత్సరాలు వాడితోపాటు మేము చాలా స్ట్రగుల్ అయ్యాము. బాగా చదివే పిల్లవాడు ఒత్తిడికి తట్టుకోలేక పూర్తిగా డీలాపడ్డాడు. చదువులో వాడి పెర్ ఫార్మెన్స్ చూసి “వీడికసలు ‘నీట్’లో ఫ్రీ సీటు రాదు, బి.క్యాటగిరీలో ఫీజులు కట్టాల్సిందే”నని చాలా సందేహపడ్డాము. ఒకవైపు, ‘పిల్లలిద్దరూ డాక్టర్లవుతారని బాబా చెప్పారు కదా!’ అని మనస్సులో అనుకున్నా, మరోవైపు మనిషికుండే సహజస్వభావంతో ‘బాబా చెప్పింది నిజంగా జరుగుతుందా?’ అనే అనుమానంతో అటూ ఇటూ నలిగిపోయేదాన్ని. బాబాను పూజించటం, ఆయన్ని ప్రార్థించటం, భయంతో ఇంకా ఎక్కువగా బాబాతో రోజంతా మాట్లాడుతూ, విసిగిస్తూ ఉండేదాన్ని. ఇది తప్పో, ఒప్పో నాకు తెలియదు. నేను ఎప్పుడూ పనిచేసుకుంటూ బాబాతో మాట్లాడుతుంటాను. నాకు ఏం కావాలో అన్నీ బాబాకు చెబుతాను. అన్నీ చెప్పాక, “మీరు ఏది ఇవ్వాలనుకుంటున్నారో అదే ద బెస్ట్ కాబట్టి దానినే నాకు నచ్చేటట్టు ఇవ్వండి బాబా” అని అడుగుతాను.

మా పెద్దబ్బాయి ‘నీట్’ పరీక్ష వ్రాసేరోజున మేము వాడిని పరీక్షా కేంద్రం వద్దకు తీసుకువెళ్ళాము. తను లోపలికి వెళ్ళాక నేను ఫోన్ ఆన్ చేశాను. ఆశ్చర్యకరమైనరీతిలో నా ఫోన్ స్క్రీన్ మీద బాబా ఫోటో కనిపించింది. అది ఎలా వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. బాబా ఫోటో చూడగానే నాకు నా మనస్సులో ఎవరో, “అబ్బాయి పరీక్ష వ్రాసి బయటకు వచ్చేదాకా సాయినామస్మరణ చేయి” అన్నట్లు అనిపించింది. వెంటనే నేను మావారితో ఈ విషయం చెప్పి అక్కడే ఒక చెట్టు క్రింద కూర్చుని మా అబ్బాయి పరీక్ష హాలు నుండి బయటకు వచ్చేదాకా సాయిస్మరణ చేస్తూనే ఉన్నాను. అద్భుతం ఏమిటంటే, బాబా అనుగ్రహంతో మా అబ్బాయికి మేము అనుకున్నదానికంటే మార్కులు బాగా వచ్చాయి. కానీ అంతకుముందు సంవత్సరం నీట్ పరీక్షలో అవే మార్కులు వచ్చిన విద్యార్థులకు చాలా పెద్ద ర్యాంకులు వచ్చాయి. ఇప్పుడు కూడా అంత పెద్ద ర్యాంకు వస్తే మా అబ్బాయికి మంచి కాలేజీలో సీటు దొరకదు. వేరే ఏ కాలేజీలో సీటు వస్తే అక్కడే చదువుకోవాలి. కనీసం 3వ కౌన్సిల్లో అయినా మేము అనుకున్న కాలేజీలో సీటు దొరికితే అదే బాబా దయ అనుకున్నాము. కానీ బాబా లీల చూడండి. మా అబ్బాయి నీట్ వ్రాసిన సంవత్సరం ప్రశ్నాపత్రం చాలా క్లిష్టంగా రావటం వల్ల మా అబ్బాయికి మేము ఊహించని మంచి స్టేట్ ర్యాంక్ వచ్చింది. అదే అద్భుతం అనుకుంటే, మేము ఏ కాలేజీలో అయితే 3వ కౌన్సిల్లో అయినా సీటు వస్తే బాగుండుననుకున్నామో అది బాబా దయవల్ల మొదటి కౌన్సిల్లోనే కేటాయించారు. ఆ కాలేజీలో మా అబ్బాయిని చేర్పించాము. ఇక్కడితో బాబా కృప ఆగలేదు. 

మా అబ్బాయి ఒక కాలేజీలో (ఆ కాలేజీ పేరు ప్రస్తావించట్లేదు) ఎం.బి.బి.ఎస్ చదవాలని నా ప్రగాఢ కోరిక. నా కోరికను మావారికి ఎప్పుడు చెప్పినా, నన్ను వింతగా చూసి, “అసలు మనబ్బాయికి వచ్చిన ర్యాంకుకి భూమి, ఆకాశం కలిసినా ఆ కాలేజీలో సీటు రాదు. నువ్వు మరీ వింతగా ఆలోచిస్తున్నావు” అని కొట్టిపారేసేవారు. కానీ, నేను మాత్రం ఆశను కోల్పోలేదు. 2వ కౌన్సిలింగులో ఆ కాలేజీకి దరఖాస్తు చేశాము. కానీ అందులో మా అబ్బాయికి సీటు రాలేదు. ఇంక మేము ఆ సంగతి వదిలేశాము. ఆ సంవత్సరం కోర్టు కేసుల వల్ల 3వ కౌన్సిలింగుకి చాలా గ్యాప్ రావటం జరిగింది. అన్ని కాలేజీలు ప్రారంభమైన ఒక నెలరోజులకి 3వ కౌన్సిలింగ్ జరిగింది. ఈలోపు మా అబ్బాయి తను చేరిన కాలేజీలో బాగానే సెటిల్ అయ్యాడు. ఆ సమయంలోనే మేము బాబా కృపతో ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో త్రిబుల్ బెడ్రూం ఫ్లాట్ కొనుక్కున్నాము. మా అబ్బాయి హాస్టల్లో కాకుండా ఆ క్రొత్త ఇంట్లో మాతో పాటు ఉంటూ ఇంటి నుంచి కాలేజీకి వెళ్ళాలని నా కోరిక. 3వ కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పుడు మావారు ఏం చేద్దామని నన్నడిగారు. నేను బాబాకు నా కోరికను చెప్పుకుని, ఏదైతే మావారు అస్సలు ఆలోచించవద్దని చెప్పారో ఆ కాలేజీ పేరు ఒక్కటే విష్ లిస్ట్ లో పెట్టమని, వేరే ఏ కాలేజీ పేరూ వ్రాయవద్దని మావారితో చెప్పాను. మావారు నవ్వుతూ, “ఆ కాలేజీలో సీటు రాదని చెబుతున్నా నీ కోరిక పోవడం లేదు కదా?” అని ఆ కాలేజీ పేరు మాత్రమే విష్ లిస్టులో పెట్టారు. ఆ తరువాత ఒకరోజు మా అబ్బాయిని కాలేజీ హాస్టల్లో దింపాలని అన్నీ సిద్ధం చేస్తూ, ఆరోజే 3వ కౌన్సిలింగ్ ఫలితాలు వస్తాయన్న విషయమే అందరమూ మర్చిపోయాము. ముఖ్యంగా, ఆ కాలేజీకి దరఖాస్తు చేశామేగానీ, అది ఎలాగూ జరిగేపని కాదని వదిలేశాము. ఆ సాయంకాలం మావారికెందుకో ‘మెసేజ్ చూడు’ అని ఎవరో అన్నట్టుగా అనిపించిందట. మావారు ఫోన్లో మెసేజెస్ ఓపెన్ చేయగానే మొదటి మెసేజీలో - ఏ కాలేజీలో అయితే మా అబ్బాయికి సీటు రావటం అసాధ్యమనుకున్నామో ఆ కాలేజీలో సీటు కన్ఫర్మ్ అయిందని, మరుసటిరోజే జాయినవ్వాలని ఉంది. ఆ క్షణం ఇప్పటికీ నాకు గుర్తు, ఆ వార్తని నిజమని నమ్మటానికి, బాబా చూపిన కరుణకు సంతోషంతో ఉప్పొంగిపోయి తిరిగి మామూలుస్థితికి రావటానికి మాకు చాలా సమయం పట్టింది. ఆ కాలేజీలో మా అబ్బాయి సీటు కేవలం బాబా కృప, అంతే! 

ఇప్పటికీ ప్రతి విషయంలోనూ బాబా మాకు తోడై ఉన్నారు. ఒక్కటి మాత్రం నిజం, మనం ఎంత కంగారుపడినా, ఇక ఈ పని ఈ జన్మకు జరగదు అనుకున్నా, మనకు ఏం కావాలో బాబాను ఎన్ని అడిగినా, ఎలా అడిగినా, ఇంకా ఇవ్వటంలేదని గోల పెట్టినా, ఆఖరులో ఆయనతో, “మీరు నాకు ఏది మంచి అనుకుంటారో అదే చేయండి బాబా” అని అడగండి, అలా బాబాతో మాట్లాడుతూనే ఉండండి. అప్పుడు చూడండి, బాబా మనకు ఏది మంచి అనుకున్నారో, ఆ మంచిని మనకు నచ్చేరీతిలో చేసి మనల్ని సంతోషపెడతారు. తిరిగి చూసుకుంటే, అంతకుమించిన గొప్ప మంచి మన జీవితంలో వేరొకటి ఉండదు. అలాంటి సంఘటనలు బాబా కృపతో నా జీవితంలో ఎన్నో జరిగాయి. “నాకు ఇది జరిగితే చాలా మంచిగా ఉంటుంది బాబా” అని బాబాను అడుగుతూనే, “మీకు ఏది మంచిదనిపిస్తే అది చేయండి” అని బాబాకు చెప్పుకుంటాను. అప్పుడు నా ప్రియమైన తండ్రి నామీద ప్రేమతో ఏది చేస్తే నాకు మంచి అనుకున్నారో ఆ పనిని నాకు అమితంగా నచ్చేరీతిలో చేసిపెడతారు. ఆ తండ్రి కృప ఇలాగే అన్ని జన్మలలో మనందరిమీదా ఉండాలని కోరుకుంటున్నాను.

సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


10 comments:

  1. Om Sai Ram������

    ReplyDelete
  2. ఎంత దయామయుడు సాయి.మాలో మీ పట్ల విశ్వాసాన్ని పోనివ్వకం డి.

    ReplyDelete
  3. Baba ma mother ki ayyasam taggi poyela chudu thandri ne krupa ki eduru chustunamu sai

    ReplyDelete
  4. జై సాయిరామ్! జై గురుదత్త!

    ReplyDelete
  5. సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  6. అంతా సాయి మహిమ! ఓం సాయిరాం... మీరు నిజంగా ధన్యులు

    ReplyDelete
  7. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  8. Sai ram tamil language. Im favourite fan

    ReplyDelete
  9. Enaku en kanavil daily sai charit ham padi na unkitta appa amma vai vida unmel anbhu vaipen

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo