సాయి వచనం:-
'నన్ను నిజంగా కోరితే ఎప్పుడైనా తీర్చకుండా ఉన్నానా? ఏమీ తెలియనివాడిలా మాట్లాడతావేం? వీరు నన్నేమీ అడగలేదు. వీరికి కొడుకును ప్రసాదించినా ఒక్క తరం కంటే వంశం నిలవదు. అంతకంటే, కలకాలం కొనసాగే వంశప్రతిష్ఠను ప్రసాదిస్తాను.'

'బాబా కృపకు కృతజ్ఞుడవై ఉండు!' - శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 556వ భాగం.....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా ఉండగా భయమేల?
  2. తెల్లవారేసరికి వెన్నునొప్పి పూర్తిగా తగ్గించిన బాబా

బాబా ఉండగా భయమేల?

సాయిబంధువులకు నమస్కారం. నా పేరు శ్రీనివాసరావు. మాది గుంటూరు జిల్లా. నేను కానిస్టేబుల్గా ఉద్యోగం చేస్తున్నాను. ఉద్యోగ నిర్వహణలో భాగంగా ఒకరోజు ఉదయాన్నే మూడు గంటలకు ఇంటి దగ్గర బయలుదేరి గుంటూరుకి వెళ్ళవలసి వచ్చింది. నేనుండే ఊరు గుంటూరుకు వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఉదయం ఆరుగంటలకల్లా గుంటూరు ఖచ్చితంగా వెళ్లాలి. అందుకని నేను రెండు గంటల ముప్ఫై నిమిషాలకు నిద్ర లేచాను. అప్పటికే వర్షం విపరీతంగా కురుస్తూ ఉంది. ఆ వర్షంలో గుంటూరు ఎలా వెళ్లాలా అనే భయం నాకేమీ కలగలేదు. కారణం, 'బాబా ఏదో రకంగా నాకు మార్గం చూపిస్తారు' అన్న ధైర్యం. మూడున్నర గంటలకు కూడా వర్షం తగ్గలేదు. అప్పుడు నేను బాబా పటం ముందు 'నాకు దారి చూపించు బాబా' అని ప్రార్థించాను. ఆశ్చర్యం! అకస్మాత్తుగా వర్షం తగ్గిపోయింది. నేను వెహికల్స్ కోసం రోడ్డు మీదకు వెళ్ళాను, కానీ ఆ సమయంలో ఏ వెహికల్స్ రావడం లేదు. సమయం నాలుగు గంటలు దాటింది. ఇంక నేను గుంటూరుకు ఆరుగంటలకల్లా చేరుకోలేనని అనుకుంటూ మరలా బాబా సహాయాన్ని అర్థించాను. ఆ సమయంలో నాకు 'నా తోటి కానిస్టేబుల్కి ఫోన్ చేయాలి' అనే బుద్ధి పుట్టింది. వెంటనే నేను అతనికి ఫోన్ చేసి విషయం చెప్పాను. నేనుండే ప్రాంతం నుంచి ఒక కిలోమీటర్ దూరం వెళితే అక్కడి నుంచి గుంటూరుకి వెళ్లే బస్సు ఒకటి ఉందని చెప్పాడతను. వెంటనే బయలుదేరి తను చెప్పిన చోటికి నడుచుకుంటూ వెళ్ళాను. బాబా దయతో ఆ బస్సు నాకు అందడంతో అనుకున్న సమయానికి నేను గుంటూరు చేరుకున్నాను

ఒకరోజు నేను ఇంట్లో ఉండగా సాయంత్రం ఆరుగంటలకి వాట్సాప్ గ్రూపులో, "ఎనిమిది గంటలకల్లా మీటింగ్ ఉంది, రావాలి" అని మెసేజ్ పెట్టారు. నేను బైక్ మీద ప్రయాణం చేసి గుంటూరు వెళ్ళడానికి కనీసం రెండున్నర గంటల సమయం పడుతుంది. నేను అంత సాహసం చేసి వెళ్లలేక బాబాపై భారం వేసి ఇంట్లోనే ఉన్నాను. ఎనిమిది గంటల సమయంలో బాబా పటం ముందు సాయినామస్మరణ చేస్తూ ఉన్నాను. ఆశ్చర్యకరంగా ఎనిమిది గంటలకు ఆఫీస్‌వాళ్ళు నాకు ఫోన్ చేసి, "మీటింగ్ క్యాన్సిల్ అయింది, రేపు ఉదయం రావాలి" అని చెప్పారు. ఎంతో సంతోషంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. 

ఈ అనుభవం మా అమ్మగారికి సంబంధించినది. ఆమెకు ఈమధ్యకాలంలో కడుపులో నొప్పి వచ్చింది. డాక్టరుకి చూపిస్తే స్కానింగ్ చేసి "లివర్ కొంచెం పెరిగింది, పైగా గ్యాస్ట్రిక్ సమస్య కూడా ఉంది. దాంతో కడుపునొప్పి దేనివలన వస్తోందనేది స్పష్టంగా తెలియలేదు. పదిరోజుల పాటు గ్యాస్ట్రిక్ సమస్యకి మందులు వాడి మరలా రమ్మ"ని చెప్పారు డాక్టర్. నేను బాబాని ప్రార్థించి, అమ్మకు వస్తున్న కడుపునొప్పి లివర్ సమస్య వల్ల వచ్చే నొప్పి కాకుండా గ్యాస్ట్రిక్ సమస్య వల్ల వచ్చే నొప్పిగా ఉండేటట్టు చేసి సమస్యను తేలికగా తీసివేయమని వేడుకున్నాను. కొద్దిరోజుల్లో మా అమ్మకి కడుపునొప్పి పూర్తిగా తగ్గిపోయింది. 'అది గ్యాస్ట్రిక్ సమస్య వల్ల వచ్చే నొప్పే'నని డాక్టర్ నిర్ధారించారు. ఈ అనుభవాలను మీతో పంచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.  "ధన్యవాదాలు బాబా".

తెల్లవారేసరికి వెన్నునొప్పి పూర్తిగా తగ్గించిన బాబా

సాయిబంధువులకు నమస్కారం. నా పేరు కనకదుర్గ. మాది ఖమ్మం. నేను ప్రతిరోజూ ఈ బ్లాగులో ప్రచురిస్తున్న సాయిభక్తుల అనుభవాలను చదువుతూ ఉంటాను. బాబా తన భక్తుల మీద ఎంతో ప్రేమ చూపిస్తారు. నాకు కొద్దిరోజులనుండి వెన్నునొప్పి వస్తోంది. మందులు వేసుకున్నా నొప్పి తగ్గట్లేదు. ఒకరోజు రాత్రి నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! నేను ఈ నొప్పి భరించలేకపోతున్నాను. నాకు ఈ నొప్పి నుంచి పూర్తి ఉపశమనాన్ని కలిగించండి” అని వేడుకున్నాను. తర్వాత కూడా ‘తెల్లవారేసరికల్లా ఈ నొప్పినుంచి పూర్తి ఉపశమనాన్ని ఇవ్వమ’ని బాబాను ప్రార్థించుకుంటూ బాబా ఊదీని వెన్నుకు రాసుకుని, కొద్దిగా ఊదీని నీళ్ళలో కలుపుకుని త్రాగాను. నా మీద ఎంతో దయ చూపారు బాబా. మరుసటిరోజు తెల్లవారేసరికి నా వెన్నునొప్పి పూర్తిగా తగ్గిపోయింది. “మీ దయ నా మీద ఎప్పుడూ ఇలానే ఉండాలి బాబా! ప్రతి క్షణం, ప్రతి విషయంలో మీరు నాకు తోడుగా ఉండాలి. మీకు శతకోటి వందనాలు బాబా!”


10 comments:

  1. om sai ram please cure my iching problem baba.i am suffering this from long time

    ReplyDelete
  2. Baba! Bless me with Job.🙏🙏🙏🙏

    ReplyDelete
  3. Om sai ram,deva pls help me in sharing my experience in this blog,pls baba bless me with guru nama smarana all the time deva,love u so much papa

    ReplyDelete
  4. ఓం సాయిరాం! నన్ను ఈ ఋణబాధల నుండి విముక్తి చెయ్యండి బాబా! నాకు మీరు గురువు లా మార్గదర్శం చూపించండి బాబా!

    ReplyDelete
  5. Baba ma mother ki health problem tondarga cure cheyi baba nenu tondarga ee anubhavani sai bhaktula tho panchukuntanu sai please help us baba

    ReplyDelete
  6. నేను ఈ రోజు సాయిబాబా ను ఇలా మొక్కు తీర్చుకునేందుకు ఇలా మొక్కు తున్నాను.
    * ఒక వ్యాపారం లో నేను పోగొట్టుకున్న డబ్బు నేను తిరిగి సంపాదించే అవకాశం కల్పిస్తే నేను నాకిష్టమైన ఆహార పదార్థాలను షిరిడీ లో మీ దర్శనం పొందేవరకు ముట్టనని ప్రమాణం చేస్తున్నాను. ఇలా బాబా కరుణిస్తే ఇది సాయి బాబా భక్తుల బ్లాగ్ లో తప్పక పంచుకుంటాను.*

    ఓం సాయిరాం🙏

    ReplyDelete
  7. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  8. Baba Kalyan ki marriage chai thandi meku.sathakoti vandanalu vadini.bless chaindi house.lo problem solve cheyandi pl marriage.urgent baba

    ReplyDelete
  9. ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయాయ నమః 🙏🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo