సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 565వ భాగం.....


ఈ భాగంలో అనుభవాలు:
  1. "బాబా! నాన్న గుండె నీ చేతులలో ఉంది. దానిని కాపాడు తండ్రీ!"
  2. బాబా దయవలన అమ్మకు చేకూరిన ఆరోగ్యం
  3. బాబాని తలచుకొని అడగగానే నా డబ్బు నాకొచ్చింది

"బాబా! నాన్న గుండె నీ చేతులలో ఉంది. దానిని కాపాడు తండ్రీ!"

సాయిభక్తురాలు ఇందిర తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు ఇందిర. ముందుగా నా అనుభవాన్ని ఆలస్యంగా పంచుకుంటున్నందుకు బాబాకు నా క్షమాపణలు. ఇక నా అనుభవవానికి వస్తే...

మా నాన్నగారికి మేమిద్దరం ఆడపిల్లలమే, మగపిల్లలు లేరు. ఆయనకున్న గుండె సమస్యకు కొంతకాలంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని మేమంతా సంతోషించాం. కానీ హఠాత్తుగా పదిరోజుల క్రితం మైల్డ్ స్ట్రోక్ రావడంతో ఆయనని విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రిలో చేర్పించారని మా చెల్లెలు ఫోన్ చేసి చెప్పింది. అసలే కరోనా కారణంగా అందరినీ ఆసుపత్రి లోపలికి అనుమతించని పరిస్థితి. అందువలన కాస్త ఆందోళనగా అనిపించింది. వెంటనే నేను వెళ్లలేక, ఆయనకి ఎలా ఉందో తెలియక చాలా బాధపడ్డాను. దిక్కుతోచని స్థితిలో మనస్పూర్తిగా ఆ సాయినాథునితో నేను ఇలా చెప్పుకున్నాను: "బాబా! నాన్న గుండె నీ చేతులలో ఉంది. దానిని కాపాడు తండ్రీ" అని. నాన్నకి ఎప్పుడు ఆపద వచ్చినా నేను బాబానే నమ్ముకుంటాను. ఆ రాత్రంతా నేను బాబాని స్మరిస్తూ, "నాన్న పరిస్థితి నిలకడగా ఉండేలా అనుగ్రహించు బాబా! మీ దయవల్ల నాన్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంటే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. తరువాత రాత్రి పదిగంటలకి మా అమ్మ ఫోన్ చేసి నాన్నతో మాట్లాడించింది. ఆయన మాట విన్నాక నాకు సంతోషంగా అనిపించినా, దుఃఖం కూడా ఆగలేదు. ఎందుకంటే, "నాన్న హార్ట్ ప్రాబ్లెమ్‌కి చికిత్స లేదు. ఆయన గుండె ఎప్పుడు ఆగిపోతుందో చెప్పలేమ"ని డాక్టర్స్ తేల్చి చెప్పేశారు. దాంతో మేము ఎంతగానో ఆందోళనచెందినప్పటికీ ఆ  సాయినాథునిపై భారం వేసి రోజులు గడుపుతున్నాం. నాకు నమ్మకం ఉంది, 'మా నాన్నని బాబా మాకు దూరం చెయ్యర'ని. నా అనుభవాన్ని మీ అందరితో పంచుకొనే అవకాశం ఇవ్వడమే కాక, మీ అందరి అనుభవాల ద్వారా నాలో ధైర్యాన్ని నింపుతున్న ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా ప్రత్యేక ధన్యవాదములు.

శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై!

బాబా దయవలన అమ్మకు చేకూరిన ఆరోగ్యం

సాయిభక్తురాలు పద్మజ తనకు బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు:
.
నేను సాయిభక్తురాలిని. మా అమ్మగారి వయస్సు 80 సంవత్సరాలు. ఆగస్టు నెల చివరివారంలో ఆమె 99.5 డిగ్రీల జ్వరంతో, విరోచనాలతో బాధపడ్డారు. రెండు రోజులపాటు తన పరిస్థితి అలానే ఉంది. అసలే ఇప్పుడు కరోనా సమయం. పైగా మా ప్రాంతంలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నందున మేమంతా చాలా భయపడ్డాము. తనకు ఆరోగ్యం బాగాలేనప్పటినుండి అమ్మ సాయిబాబా నామస్మరణ చేస్తూ, బాబా ఊదీ పెట్టుకుంటుండేది. కానీ తన ఆరోగ్యం మెరుగుపడలేదు. చివరికి కరోనా రాపిడ్ టెస్ట్, ఫుల్ టెస్ట్ చేయించాము. బాబా దయవల్ల రిపోర్టులు నెగటివ్ వచ్చాయి. అప్పుడే అమ్మ అనారోగ్యానికి కారణం 'అజీర్తి' అని తెలిసింది. తరువాత బాబా దయవల్ల తన ఆరోగ్యం కుదుటపడింది. ఇప్పుడు అమ్మకు జ్వరం పూర్తిగా తగ్గిపోయింది, మళ్ళీ రాలేదు. ఇదంతా బాబా దయవల్లే. మనము బాబాను పూర్తిగా నమ్మి సర్వస్యశరణగతి చేస్తే ఆయన మనల్ని తప్పక కాపాడుతారు.

ఓం సాయిరామ్!

బాబాని తలచుకొని అడగగానే నా డబ్బు నాకొచ్చింది

పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

సాయిభక్తులందరికీ నమస్కారం. ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి శతకోటి నమస్కారాలు. 2020, సెప్టెంబరు 11న బాబా నాకు చేసిన చిన్న సహాయం గురించి నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

నాకున్న ఒక బిజినెస్‌కి సంబంధించి కొంత అమౌంట్ వేరే వాళ్ల దగ్గర ఆగిపోయింది. డబ్బు ఇవ్వమని ఎప్పుడు అడిగినా, వాళ్ళు 'ఇస్తాము, ఇస్తాము' అని రోజులు గడిపేస్తున్నారు. ఆ స్థితిలో నేను, "బాబా! నాకు ఆ అమౌంట్ ఇప్పించండి" అని బాధతో బాబాకి మొరపెట్టుకున్నాను. తరువాత ఒక గురువారంనాడు వాళ్లని అమౌంట్ అడిగితే, ఎప్పటిలాగే 'ఇస్తామ'ని చెప్పారు. అప్పుడు నేను బాబాను తలచుకొని వాళ్లతో, "నా డబ్బు నాకిప్పుడు ఇవ్వకపోతే పైఅధికారులకు ఫిర్యాదు చేయాల్సి వస్తుంద"ని చెప్పాను. 5 నిమిషాలలో వాళ్ళు నా అమౌంట్ నా అకౌంట్లో జమ చేశారు. అన్ని రోజుల నుంచి ఇవ్వనివాళ్ళు, బాబాను తలచుకొని అడగగానే ఇచ్చేశారు. అంతా బాబా దయ. "శతకోటి వందనాలు బాబా".


6 comments:

  1. om sai ram baba bless all the world from corona virues.all are living in fear only.when will this virues goes away.om sai ram

    ReplyDelete
  2. 🙏🌺🙏ఓం సాయిరాం🙏🌺🙏
    ఇందిరమ్మ గారు..మీ తండ్రిగారు పరిపూర్ణ ఆరోగ్యం పొందాలని సాయినాథుని కరుణ కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మన సాయి కుటుంబ సభ్యులందరి తరపున సవినయ ప్రార్థన
    🙏🌺🙏ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయిణే నమః🙏🌺🙏
    🙏🌺🙏రక్ష రక్ష సాయి రక్ష🙏🌺🙏

    ReplyDelete
  3. Baba maku nevve dikku thandri andarini kapadandi baba OM SAI RAM

    ReplyDelete
  4. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo